Sep 17, 2009

ఏడ్చే మనసులు

పరీస్థితుల సంకెళ్ళు
నడకలునేర్చిన కాళ్ళు
అక్కరకురాని వాళ్ళు
కళ్ళల్లో నీళ్ళు
కాదని దూరంలాక్కెళ్ళే రోడ్లు
పాడైపోయిన గూళ్ళు
ఎండిపోతున్న చిగుళ్ళు
ఒంటరైపోతున్న బతుకులు
నవ్వుకుంటున్న స్వార్ధం
బిక్కచచ్చిపోతున్న అభిమానం
ఇదేనా జీవితానికి అర్ధం?
ఇది అర్ధంచేస్కోలేని మన బతుకులు వ్యర్ధం!!

19 comments:

  1. ఎందుకీ ఉరుకులు
    ఎక్కడికీ పరుగులు
    ఏమిటి మనలక్ష్యం
    ఎటువైపు పయనం
    వీటిమద్య
    విరిగిన మనసులు
    నలిగిన మమతలు
    దూరమౌతున్న బంధం
    తడికోల్పోతున్న పాశం
    ఆపిచ్చోళ్లని పట్టించుకోనిమనం

    ReplyDelete
  2. ఇది కాక ఇంకేముంది?

    లక్షలున్నా లక్షమున్నా
    మూన్నాళ్ళ బ్రతుకుకు
    ముప్పూటలా పరుగులు

    అర్థమైనా కాకున్న
    మనిషి బ్రతుకంతే.

    ReplyDelete
  3. ఏమైంది సర్ ! సడన్ గా ఈ మార్పుకు కారణం ?
    కానీ చాలా బాగా రాశారు !

    ReplyDelete
  4. అప్పుడప్పుడూ....అంతర్మధనం , మంచిదేలెండి.
    అక్కరకురానివాళ్ళా....అక్కరకురాలేనివాళ్ళా నాన్నగారు.

    ReplyDelete
  5. భావం చాలా బావుంది. పదాల అమరిక కొన్ని చోట్ల అర్ధం కాలేదు :(

    ReplyDelete
  6. స్వార్ధం మనిషిని నిలువునా దోచేస్కుంటుంది. అది నెమ్మదిగా నెత్తికెక్కి మనుషుల్ని పాషాణాల్ని చెసేస్తుంది. అప్పుడు మనిషికి స్వార్ధం అనే కళ్ళజోడు వస్తుంది. ఇక చెప్పేదేముంది. ప్రతీదాంట్లో స్వార్ధం ఉంటేనే చేస్తాడు, కేవలం స్వార్ధంకోసమే చేస్తాడు ఏదైనా.
    మనం ఇంతదూరం వచ్చాం, గానుగెద్దులు ఐపోతాం. మన రూట్స్ని, మనం ఇంతదాకా వచ్చేందుకు మనవాళ్ళు పడే శ్రమని మర్చిపోతాం, స్వార్ధపరులం ఐపోతాం.
    అదీ కధ.
    వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.
    లలిత గారూ -
    నిజమే. అక్కరకు రాలేనివాళ్లు.

    ReplyDelete
  7. నడకలునేర్చిన కాళ్ళు -
    పిల్లలు పెద్దోళ్ళై తమ కాళ్ళ మీదతాము నిలబట్టమే కాదు నడకలు కూడా నేర్చుకుంటారు
    అక్కరకురాని వాళ్ళు -
    కష్టాల్లో ఉన్నవాళ్ళకు నేనున్నా అని అండగా నిలిచేవాళ్ళు ఎవరు ఇలా కాళ్ళొచ్చి వెళ్ళిపోతే?
    కళ్ళల్లో నీళ్ళు -
    మరి ఇక మిగిలేది ఇదేగా?
    కాదని దూరంలాక్కెళ్ళే రోడ్లు
    కొత్త కొత్త అవకాశాలు. అమెరికాలు, ఇంగ్లాండులు
    పాడైపోయిన గూళ్ళు
    పిల్లలు ఎగిరిపోతే, గూళ్ళు బూజుపట్టి పాడైపోక మిగిలేదేంటి?
    ఎండిపోతున్న చిగుళ్ళు
    నీళ్ళుపోసేవాళ్ళు ఎవరు? ఎందుకులే అనే నైరాశ్యం.
    ఒంటరైపోతున్న బతుకులు
    నవ్వుకుంటున్న స్వార్ధం
    బిక్కచచ్చిపోతున్న అభిమానం
    ఇదేనా జీవితానికి అర్ధం?
    ఇది అర్ధంచేస్కోలేని మన బతుకులు వ్యర్ధం!!

    ReplyDelete
  8. ఇప్పుడు అర్ధమయ్యిందోచ్...

    కాదని దూరంలాక్కెళ్ళే రోడ్లు....

    ఈ లైన్ దగ్గర చాలా ఆలోచించాల్సి వచ్చింది. మీరు చెప్తేగానీ అర్ధం కాలేదు. :(

    ReplyDelete
  9. chala bhadhaga ,hrudyamga vundhi ...adekada 'jeevitam'...tarataraluga intekada!

    ReplyDelete
  10. అర్ధం చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో వ్యర్ధమవ్వదు జీవితం
    ఒక్క కన్నీటి చుక్కని తుడిచినా అవుతుంది అర్ధవంతం..

    ReplyDelete