Sep 4, 2009

నే ఊహించింది కరెక్టే అన్నమాట

మొన్నటి నా పోస్టు వై.యస్.ఆర్ మిస్సింగ్, ఆతర్వాత ఏంటీ? లో
నా కామెంట్లు -
బాస్కర్ రామరాజు said...
ఏవరేజిన గంటకి 100 మైళ్ళచొప్పున హెలీకాప్టర్ వెళ్తే, వై.యస్.ఆర్ 8.35 కి బయలుదేరితే, 9.12 కి కర్నూల్ కి దగ్గర్లో కనెక్స్తన్ తెగిపోతే, కర్నూల్, శ్రీశైలం మరియూ మాల్యాల/ఆత్మకూరు దరిదాపుల్లో ఎక్కడో ల్యండ్ అయి ఉండాలి. ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఐతే, ఆ ప్రాంతం అంతా రాయి, కొండలమయం కాబట్టి ల్యాండింగ్ అంత స్మూత్ కాదు అని నాకనిపిస్తోంది. తక్కువ ఎత్తులో ఒకవేళ ప్రాణాలు కాపాడుకోటం కోశం దూకినా, ఒక దరికి చేరటం అంత ఈజీకాదేమో అనిపిస్తోంది. కారణం, ఆ కొండలు క్లిఫ్స్ లాగా ఎరోజ్షన్స్ కి గురైనట్టుగా ఉంటాయ్. స్లిప్ ఐతే పది ఇరవై లేక అంతకన్నా ఎక్కువ అడుగుల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది.
......................
భాస్కర్ రామరాజు said...
చదువరి గారూ!!
రేపటికి అనగా 3 september పొద్దునకల్లా ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా?
నాకెందుకో రాంగ్ ప్లేస్ లో వెతుకుతున్నారేమో అనిపిస్తోంది.
కర్నూల్ శ్రీశైలం ల మధ్య వెతుకుతున్నారు. కర్నూల్ నుండి ఆత్మకూరు కు ఒక గీతగీస్తే పైన ఉండేది శ్రీశైలం అడవులు గట్రా. ఇవి వందకిలోమీటర్ల రెంజి హై. నుండి.
కింద (గీతకి కిందవైపు) నందికొట్కూర్ నుండి నంద్యాల వైపుగా ఏమైనా గాలిస్తున్నారా?
...................
భాస్కర్ రామరాజు said...

కారణం ఏంటంటే
కొందరు 9:12 కి రాడార్ లోంచి మాయం అన్నారు. అది వంద కిలోమీటర్ల రేంజి.
కొందరు 9:35 కి అన్నారు. అది నూట అరవై కిలోమీటర్ల రేంజి అయ్యింది.
..........

హైద్ నుండి వంద కిలోమీటర్ల రేంజ్ అంటే శ్రీశైలం
హైద్ నుండి 160 కిలోమీటర్ల రేంజ్ అంటా ఇంకా కిందకి.

నేనూహించిందే కరెక్టు అయ్యింది.
పావురాళ్ళగుట్ట అనేది ఆత్మకూరుకన్నా కిందకి ఉంది. వెలుగోడు ప్రాజక్టుకి దగ్గర్లో.



సరే!! పెద్దలకి నాదొక ప్రశ్న.
ఇది కొంచెం తిక్కగా ఉండొచ్చు, కానీ ఉత్సుకతతో అడుగుతున్నా.
ప్రయాణించే ప్రతీవారి జాతకాల్లో ఏదోక కామన్ పాయంట్, అన్నీ కలిపితే ఒకే సరళరేఖపైకి వస్తాయా? లేకపోతే ఇలా ఎలా జరుగుతుంది?

No comments:

Post a Comment