Sep 21, 2009

ఎట్టెట్టా!!

పెదానమంత్రి మనూరొత్తన్నాడంటే -
బ్యారికేడ్లు
మైకులు
పాటలు
బిర్యాని
సారాయి
లారీలు
ట్రాకటేర్లు
పందిళ్ళు
తాటాకుల చప్పుళ్ళు
సర్విబాదులు
తాడిచెట్లమానులు
రంగురంగుల త్రికోణాకార కాయితకాలు
నులక తాళ్ళు
గుండిగలకొద్ది ఉడకబెట్టే మైదా
వాల్పోస్టర్లు
పెద్దపోస్టర్లు
నిలువెత్తు బొమ్మలు
గులాబీదండలు
కొండకచ్చో పాలాభిషేకాలు
గోడలనిండా రాతలు
ఆవులు బఱ్ఱెలనిండా గీతలు
హెలీకాప్టర్ ధనధనలు
పోలీసుల పహారాలు
సెక్కింగులు
ట్రాపిక్కు జాములు
ఓ!! ప్రతీ స్థానిక నాయకుడి బలిమి ప్రదర్శన
నిరసన ప్రదర్శనలు
అలిగేవాళ్ళు
బుజ్జగించేవాళ్ళు
.....ఉఫ్!!!

ఇయ్యాల మా ఊరికి అమెరికా ప్రెసిడెంటు పుల్లయ్య అదేనయ్యా, బారక్ ఒబామా వస్తండు
హడ్సన్ వ్యాలీ కమ్యూనిటీ కాలేజి లో ఏదో ఓపెనింగు
అయ్యాక
ఏయండి వాడి చిప్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఓపెనెంగు

ఎక్కడా ఆ ఊసేలేదు
బ్యారికేడ్లు లేవు
పోలీసుల బూట్ల చప్పుడు లేదు
మందు లేదు లేరీల్లేవు ట్రాక్టర్లమీన జనాల్ని తోలించండంలేదు
చివరాకరికి బిర్యానీపొట్లాకూడా లేవు
జెండా రెపరెపల్లేవు
కాయితకాల కట్టింగుల్లేవ్
నిలువెత్తు బొమ్మలేవు
ఆటికి దండల్లేవు

అలిగే వాళ్ళు అలుగుతున్నారు
ఏడ్చేవాళ్ళూ ఏడుత్తున్నారు
నవ్వేవాళ్ళు హెపీస్ గా నవ్వుకుంటన్నారు..

మనలాటి జనం ఇలా బ్లాగుల్రాస్కున్టన్నారు
అదీ కధ


ఇప్పుడే అందిన వార్త -
హడ్సన్ వ్యాలీ కం। కా॥ లో ఇచ్చే స్పీచ్ అందరికీ కాదని, కేవలం ఆహ్వానితులకి మాత్రమే అని విశ్వసనీయవర్గాల భోగట్టా.
కొందరు కుళ్ళేవాళ్ళు ఇలా కుళ్ళుతున్నారనిన్నిన్నిన్ని కూడా భోగట్టా *ఆహ్వానాలను* ఈబే లో పెద్ద మొత్తాలకు అమ్ముతున్నారటటట.

పెసిడేంటుని *యూ ఈడియట్* అనేసి పేరు ప్రఖ్యాతులు పొందగోరేవాళ్ళు కూడా ముసుగులో ఉన్నారని జనాలు జుట్లలో పేలు పీక్కుంటూన్నారు [చెవులు కొరుక్కోటం రోటీను, మనం ఎప్పటిలాగే రొటీనుకి భిన్నంగా].

13 comments:

 1. మీరు బాగా మిస్సవుతున్నారా ఆ సందండి ?:)

  ReplyDelete
 2. అలా ఏంకాదు, కానీ, నన్ను పిలవలేదు ప్రసిడెంటు అని అక్కసు :):)

  ReplyDelete
 3. మీ ఫొటోతో ఒబామాకు స్వాగతం.. అంటూ బ్యానర్ కట్టండి ;)

  ReplyDelete
 4. చైతన్య అవిడియా బాగున్నట్లుంది సోదరా :-)

  ReplyDelete
 5. జనాలు జుట్లలో పేలు పీక్కుంటూన్నారు . hahahahaa..

  ReplyDelete
 6. మీరు ఉద్యమి౦చ౦డీ నా మద్దత్తు మీకే!!!!!!మిమ్మల్ని పిలవకు౦డా ప్రోగ్రామా?????అవసర౦ అయితే మన మీడియ కుడా సపోర్ట్ చేస్తు౦ది.ఈ రొజు పెద్ద బ్రెకి౦గ్ న్యూస్ ఏమి లేక చర్చలు అవి లేక అన్ని చానల్స్ చెప్పిన న్యూస్ చెప్పి ఉరుకున్నారు.

  ReplyDelete
 7. అబ్బ! మరలా మీ ఒరిజినల్ స్టైలులో కోచ్చేసారు. గత టపా చూసి బెంగొచ్చేసింది.వారంతటివారు వారు, మనంతటి వారిమి మనము,భవిష్యత్తులో ఓట్ల కోసం రాకపోతాడా! ఓ చూపు చూడక పోతామా!!!

  ReplyDelete
 8. లిస్టులొంచి "బ్లీచింగ్ పౌడర్" మిస్సయినట్టుంది.. :)

  శీర్షిక బాగుంది మీ స్టైల్లో :) , విషయం కూడా ....:)

  ReplyDelete
 9. :):) ఉమాశంకర్!! కెవ్వు కేక. కిందపడి దొర్లా!!!

  ReplyDelete
 10. బ్లీచింగ్ పౌడర్" ,endukoo????

  ReplyDelete
 11. అయ్యో సునీత గారు లాభం లేదండి మీరు మర్చిపోయారు :) ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇలాంటి సందర్భాలలో రోడ్ల అంచున (ప్రత్యేకం గా చిన్న మురుగు కాలువల పక్కన ) బోర్డర్ లాగా పోస్తారు కదా ?

  ReplyDelete
 12. హడావిడిగా మురికి పిల్లల్ని పోగేసే అధికారులు? మరి ఆ పిల్లల ముక్కులు తుడుస్తూ పెదాని గారు పోటో దిగొద్దూ? సునీత గారు చెప్పినట్టు.. ఓటు కోసం రాకపోతాడా? అప్పుడు చూసుకోవచ్చు...

  ReplyDelete