రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.యస్.రాజశెఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ చిత్తూరు వెళ్తూ మార్గమధ్యంలో గల్లంతయ్యింది. నల్లమల అడవుల మీదుగా వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
లేట్ చేసారు వార్త బయటికి రాకుండా, వాతావరణం అనుకూలంగా లేదు, ఒక వేళ నక్సలైట్లకి చిక్కి ఉండవచ్చు, లేక హెలీకాప్టర్ ఘోరప్రమాదానికి దారితీసి ఉండవచ్చు(శుభం పలుకుదాం, ఆయన ఏ ఆపదా కలుగకుండా బయటపడాలని కోరుకుందాం) బ్లా బ్లా బ్లా.
ఐతే, తర్వాత ఏంటీ?
ఒకవేళ అనుకోని ఘోరమే జరిగితే - తర్వాతి పరిణామాలు ఏంటీ?
తె.దె.పా సంస్థల మీద దాడులు జరగవచ్చు.
ఆర్టీసీ బస్సులు తత్క్షణమే డిపోల్లో నిలిపివేయటం మంచిది.
మత సంస్థలమీద కూడా దాడులు జరగవచ్చేమో.
ఈ సారి రంగా/రామారావ్/ లాంటి వాళ్ళు పోయినప్పడు జరిగిన దానికన్నా ఎక్కువ లూటిలు జరిగే ప్రమాదం ఉంది.
కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.
Subscribe to:
Post Comments (Atom)
ఈ రోజుల్లో కూడా ఇంత technology ఉన్నా కూడా ఇల జరగడం కడు సోచనీయం. hopefullly ఏమీ కాకుండా నల్లమల నుండి చెంగు చెంగు అని గెంతుకుంటూ వస్తాడని ఆశిద్దాం. ఎమైన తేడా జరిగితే next ఎవరు అని తెలీదు.
ReplyDeleteటెక్నలజీ అనేది మానవ నిర్మితం. దాన్ని ట్యంపర్ చేసే ప్రతిభ మనిషికి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, టెక్నాలజీ ఉన్నా, దాని నియంత్రించే స్తానంలో *నియంత్రణా విధులు* * నియంత్రణా విధానాలు* తప్పకుండా ఉండాలి.
ReplyDeleteఏమయినా జరిగితే తదనంతర పరిణామాల మీద జాగ్రత్తలు అవసరమే. వై ఎస్ నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి విషాద సమయంలో కూడా కొందరు జోకులేస్తున్నారు (ఈ టపాలో ఇంకా కాదు). అదింకా విషాదంగా అనిపిస్తోంది.
ReplyDeleteరంగా మరణించినప్పుడు సూర్యాపేటలో జరిగిన విధ్వంసాన్ని మా ఇంటి డాబా మీది నుండి ప్రత్యక్షంగా చూసాను. మా ఇల్లు కొత్త బస్ స్టాండుకి, హైవేకి చాలా దగ్గరగా వుండేది. ఎన్నో బస్సులు ధ్వంసం చేసారు, తగలబెట్టారు.
ReplyDeleteఈనాడు జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టునట్లున్నది. గ్రేట్ ఆంధ్రా న్యూస్ ఇది:
ReplyDeleteLady employees in Ramoji Film City, Eenadu News Daily and ETV offices were asked to leave the office by 5PM itself. Only gents were allowed to sit expecting some tension filled situations rising to the news of YSR.
Hopefully nothing bad should happen.
ReplyDeleteI have a couple saying that this is just a political drama and above all if something like this happens, I thought we always monitor the route of CM , so it shouldnt be a prob at all ..
Anyways hope hez ok
update .. hez safe @ kurnool Guest house
ReplyDeleteఆయన ప్రయాణించే హెలీకాప్టర్ మూడేళ్ళనుండి తనిఖీకి నోచుకోలేదని అంటున్నారు ఎవరో.
ReplyDeleteఇది మరీ ఘోరం.
ప్రభుత్వ పాలనా నియంత్రణలోనే ఎన్నో లోపాలు. ఆలోపాలు ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు బట్టబయలౌతాయ్. ఐతే లెస్సన్స్ లెరన్డ్ అనేది ఉండదు. మళ్ళీ ఇదే తంతు కొనసాగుతుంది.
ప్రభుత్వపాలనికి కూడా ఐ.యస్.ఓ క్వాలిటి మెట్రిక్స్ ని అమలుచెయ్యాలి, ప్రభుత్వాలు తమ పాలనా విధి విధానాలకు ఐ.యస్.ఒ క్వాలిటి కంట్రోల్ ని అమలుచెయ్యాలి.
రామారావు మరణించినపుడు నాకు తెలిసి లూటిలు ఏవీ జరగలేదు.
ReplyDeleteరామారవ్ మరణించినప్పుడు లూటిలు జరిఉండకపోవచ్చు, ఆస్థినష్టం జరిగింది. బస్సులు పగలగొట్టారు. కూడళ్ళలో విద్వంసం చేసారు. కొంచమే జరిగి ఉండవచ్చు. పెద్ద నష్టం జరిగి ఉండకపోవచ్చు. కానీ, ఒక బస్సు బస్సే కదా.
ReplyDeleteippuDu 8.31PM intavarakoo eamee teliyalaedu. inkaa gaalimpu jarugutonae undi.
ReplyDeleteరామారావు గారు అప్పుడు అధికారంలో లేరు. సహజ పరిస్థితుల్లో, వయస్సు వల్లనూ మరణించారు.
ReplyDelete'Josh' release postponed due to this situation. Greatandhra news.
ReplyDeleteBBC News:
ReplyDeletehttp://news.bbc.co.uk/2/hi/south_asia/8233815.stm
రాజకీయనాయకుల ముఠాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సామాన్యప్రజల జీవితాలు ఏరకంగానూ తక్కువ కాదని తెలుసుకోవాలి.
ReplyDeleteఒక ఊళ్ళో రెండువేల గడప ఉంటే, ఆ ఊరి సర్పంచో ఎవరో మరణిస్తే, ఆ ఊరు జనాలు ఆయన్ని సూట్టానికెళ్ళి తమతమ విధులకు హాజరౌతారు. కనీసం తొంభైశాతం మంది. మరి లూటీలు ఎట్రాసిటీలు జరగవేం? కారణం, సామాన్య ప్రజానీకం ఒక వర్క్ ఫ్లో కి కట్తుబడి ఉంటారు. ఆ వర్క్ ఫ్లో బ్రేక్ ఐతే తీవ్ర నష్టాలు కూడా సంభవించవచ్చు.
ఈ మిగత శాతంలో అత్యధిక శాతం పోరంబోకులు. వీళ్ళు డబ్బుకోసం ఏమైనా చేస్తారు. అందుకే వారుంది.
కేవలం రాజకీయ మదం, బలం, అహంకారం, పగ, కక్ష్య, కార్పణ్యం, *రంగు*
సహజ పరిస్థితుల్లో, వయస్సు వల్లనూ, లక్ష్మి పార్వతి వల్లనూ కాలం చేసినా ఆస్తినస్టం మాత్రం జరిగింది. నేను ప్రాయాణించే బస్ నే కాల్చేసారు.
ReplyDeleteవై.యస్. కేమీ కాదు.. హిరొ లా వస్తాడు చూడంది. I pray for him.
ఆయనకి ఏమీ కాకూడదని నేనీ కోరుకుంటున్నా. ప్రార్ధిస్తున్నా
ReplyDeletepAlaka prabhuthvaM kAbatti, Dhurghatanalu prabhuthvAnikE machcha. kAbatti ekkuvagA jaragavanE anukuMtunnAnu.
ReplyDeleteFrom Times of India
ReplyDeleteThe sacred Tirumala is carelessly talked about by everyone in the government. The slap on the wrist of administration through missing-CM-jitters is an indication by almighty balaji
http://timesofindia.indiatimes.com/news/india/Andhra-CMs-chopper-still-missing-anxiety-grows/articleshow/4963420.cms
వ్యక్తిగతంగా ఎలా ఉన్నా .. నాకు పెద్దగ నచ్చడు. అది వేరే విషయం. కాని ఇలా జరగడం సోచనీయం. అసలు సీ.యం వెళ్తున్న దానికే దిక్కులేదంటే ..
ReplyDeleteచెడుఏమైన జరిగితే మాత్రం ఆర్.టీ.సీ బస్సుల్ని బయటకి తీయకూడదు. దానికి నాకో ఉపాయం తోచింది.. ఓ 10-20 సార్లు అల తగలెట్టేవాళ్ళని పట్టుకొని వాళ్ళ తో కట్టించాలి బస్ కాస్ట్. అల కొద్దికాలం చేస్తే బస్సుల్ని కాలిస్తే మనం తేరుకోలేని అప్పుల్లో పడతాం అన్నభయం ఉంటే ఈ చండలమైన అలవాటు ఆగుతుందేమో.
తగలబెట్టె వాళ్ళతొ బస్ కాస్ట్ కట్టించాలనేది అల్రేడి ఇప్పుడె వుంది. (ఇండివిడూల్స్ కాదు.. ఆ పార్టి బాద్యత వహించాలి). కానీ మనకున్న స్లొ జస్టిస్ సిస్టం లొ ఎప్పటికి ప్రూవ్ అవుతుంది.
ReplyDeleteఅయితే ఎప్పళ్ళాగే, మనం ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ని ఎంత లేట్ గా గుర్తిస్తామో, ఎంత లేట్ గా రెస్పాండ్ అవుతామో తెలియజెప్పేందుకు ఇది ఇంకో ఉదాహరణ. ఇపుడు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ని, సుఖొయ్ ఫ్లీట్ నీ కాంటాక్ట్ చేసారు. ఇదేదో, పగలే చేసుండాల్సింది. ఇస్రో ఈ మధ్య కొన్న (ఒప్పుకోని) గూఢచారి సాటిలైట్ ని ఏ అర్ధరాత్రి కో రంగంలోకి దించుతారేమో ! ఇందులో ఏదో కాన్స్పిరసీ ఉండొచ్చు కూడా ! ఈ తప్పిపోయింది ఏ సోనియా నో అయితే ? ఘాతక్ టీం లూ, గ్రే హౌండ్సూ - పాత నక్సలైట్లూ - ఇలా అన్నీ వార్తల్లో వినిపిస్తున్నాయి. ఏమయినా గానీ, ఇంత ఆలస్యం చెయడం తో, మితిమీరిన పాసిటివ్ స్పిరిట్ తో (దొరుకుతాళ్ళే అని నిర్లక్షంతో) ఇండియా ఫెయిల్ అయింది. What a Shame ?
ReplyDeleteపర్టీలతో అంటే అది మంచిదే. కంపల్సరి కట్టించేయాలి. మీరన్నట్టు అందరు దొంగలే..
ReplyDeleteఎమయినా తెలిసిందా?
ReplyDelete@Sujata
ReplyDeleteనిజమే. మనవాళ్ళు కీడెంచి మేలెంచరు - మేలెంచి కీడెంచుతారనుకుంటా.
@సుజాత - ఇంక లేదండి. TV5 లో హెలికాప్టర్ లో ejectable seats ఎందుకు ఉండవో అని చర్చిస్తున్నారు. ఇప్పుడు అది అవసరమా?
ReplyDeleteసారీ - సుజాత కాదు.. మంచు.
ReplyDelete@Sujata
ReplyDeleteబాలయొగి లాంటి కాన్స్పిరసీ లెకుండా వుంటే బాగుండును. అప్పుడు ఇదే ప్లాట్.
@శరత్ - మేలెంచి కీడెంచడం వై. ఎస్. కూడా ఫాలొ అయ్యివుండవచ్చు.. అందుకే వాతావరణం బాగొపొయినా బయలుదేరాడు.
పుకారో, నిజమో తెలియదు.
ReplyDeleteIndia TV: CM Found Safe By Adivasis In Nallamala
http://www.greatandhra.com/ganews/viewnews.php?id=15849&scat=16
మీడియా మాత్రం పండగచేస్కుంటోంది అని జనాలు చెప్పుకుంటున్నారు. పదిసాతాన్ని వెయ్యిశాతం లా చేసి ఊదరకొడుతున్నట్టు ఉంది.
ReplyDeleteఐతే, ఇంత బాధ్యతా రాహిత్యం ఎలా?
ఏ సంఘటన జరిగినా దానిచుట్టు కధలు అల్లే సోకాల్డ్ మీడియా, ఎందుకు ఫాలోఅప్ ఇవ్వదు? నవంబరు దాడులు అయ్యాక, ఇదిగో మనం ఇలా బలపడ్డాం, లేక ఇంకా బలహీనపడ్డాం. సామాజిక చైతన్యం ఇదిగో. జనాల్లో ఇలా కదలిక వచ్చింది ఇదిగో అని...
ఇప్పుడు - అసలు హెలీకాప్టర్లలో ప్రయాణించడం మంచిదా అని ఓ డిస్కషన్ నడుస్తోంది యన్.డి.టి.వీ లో. మరి కొన్ని వేలమంది ప్రయాణిస్తున్నారు కదా. ప్రధానమంత్రి దగ్గరనుండి కే.సి.ఆర్ వరకూ అందరూ తిరిగేటోళ్ళే కదా? ఎందుకు చెప్పలేదు? అంటే, అది ఫోకస్ కాదు, సమస్యలే ఫోకస్ అని చెప్పావచ్చు, కానీ కనీసం ఆ సమస్యలనైనా సక్రమంగా లీడ్ చేస్తున్నారా అంటే అదీలేదు.
*బ్రేకింగ్ న్యూస్* కావాలి ఏ ఛానల్ కైనా.
దానికోసం ఎంతమాయకైనా సిద్ధం.
http://www.sakshi.com
ReplyDeleteServer is too busy
I News: Helicopter Crashes In Sreesailam Neriganga?
ReplyDeletehttp://www.greatandhra.com/ganews/viewnews.php?id=15853&cat=15&scat=16
అనేక పనికిమాలిన చర్చలొక పక్క జరుగుతూండగానే టీవీ9 వాడు ఒక మాజీ నక్సలైటుతో మాట్టాడాడు. ఎంత అర్థవంతంగా మాట్టాడాడో అతడు! ఇలా అన్నాడతడు..
ReplyDelete* 10 గంటల పాటు మనిషేమయ్యాడో తెలీలేదుగదాని కంగారేమీ పడనక్కరలేదు. అడవిలో ఎక్కడో దిగాక అక్కడినుండి బయటపడాలంటే సుశిక్షితులకే ఎంతో సమయం పడుతుంది. దిక్కూ దరీ తెలీక తిరిగిన చోటనే తిరుగుతూ ఉండే అవకాశం ఎంతో ఉంది.పది పన్నెండు గంటలు నడిచాక బయలుదేరిన చోటికే మళ్ళి వచ్చే అవకాశం ఉంది. మాకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
* వాళ్ళు క్షేమంగా దిగి ఉంటే ఎటూ కదలకుండా ఉన్నచోటే ఉంటే బాగుంటుంది. అది సరైన పద్ద్ధతి.
* నల్లమల ప్రాంతం రాళ్లతో కూడుకుని ఉంటుంది, అక్కడ నడవడం చాలా కష్టం.
* వందలాది ఆవుల స్థావరాలు అడవుల్లో అక్కడక్కడా కొన్ని ఉంటాయి. ఆ స్థలాలు చెట్లు లేకుండా చదునుగా ఉండి, హెలి. అత్యవసరంగా దిగడానికి అవకాశం ఉంటుంది.
* వెతకడానికి హెలి., విమానాలు కాకుండా గ్రేహౌండ్ల లాంటి కాల్బలమే మంచిది.
* అడవుల్లోని చెంచు గ్రామాల దాపులలో దిగి ఉంటే అదృష్టమే.
ఇంకో సంగతి..
శ్రీశైలం జలాశయం వెనక ఓ 30 కి.మీ దూరంలో ఏదో పెద్ద శబ్దం వచ్చిందని, నీళ్ళపై ఆయిలు తెట్టు కనబడిందని అక్కడి ప్రజలు చెప్పారని ఐన్యూస్ వాడు రాస్తున్నాడు.
మీడియా పండగ.. సహజమే ననుకుంటాను. సహజంగానే ఈ వార్త తప్ప మరోటి కనబడదు. కాకపోతే చర్చలే.. హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒక చానెల్లో మాత్రం ఒక పైలటుతో - మనవాడే - మాట్టాడించారు. రేపు నరసింహారావు ప్రశ్నలు అడుగుతూంటే సమాధానాలు చెప్పాడు. చక్కటి తెలుగులో చాలా పద్ధతిగా చెప్పాడు. సాంకేతిక విషయాలు కొన్ని చెప్పాడు.
ReplyDeleteసుఖోయ్ లాంటి విమానం అంత ఉసీగా పోతూ హెలి. జాడలు ఎలా కనిపెడుతుందని అనుకున్నాను. ఏదో ఒక చానెల్లో వివరంగా చెప్పాడు.
ReplyDeleteబేగంపేట విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచిన ముఖ్యమంత్రి కాన్వాయిని వెనక్కి పంపించారని ఒక చానెల్లో చెప్పారు.
ReplyDeleteముఖ్యమంత్రి బావమరిది అనుకుంటా తెగ ఏడుస్తున్నాడు. చుట్టూ ఆడాళ్ళు చేరి ఓదారుస్తున్నారు. మొన్న ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వలేదని కూడా అలాగే ఏడ్చాడతడు.
ReplyDeleteచదువరి గారు
ReplyDeleteముఖ్యమంత్రి కాన్వాయిని వెనక్కి పంపించడం గురించి నాకు అర్ధం కాలేదు.
ఆత్మకూరు దగ్గర్లోని ఒక 20 చ.కి.మీ ప్రాంతం హెలి. ఉండవచ్చనే ప్రదేశంగా భావించి గుర్తించినట్టున్నారు. (రోశయ్య చెబుతుండగా సగంలో విన్నాను. ఇది సరైన సమాచారం కాకపోవచ్చు)
ReplyDeleteపరిస్థితి మొత్తం రోశయ్య చేతుల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. రోశయ్య రమాకాంతరెడ్డిల విలేకరుల సమావేశం చూస్తే మనవాళ్ళు బాగానే పనిచేస్తున్నట్టు నాకు విశ్వాసం కలిగింది. ఫలానా కారణం అని కాదుగానీ, వాళ్ళు మాట్టాడిన విధానం నాకా అభిప్రాయం కలిగించింది. రోశయ్య నాయకత్వం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు.
ReplyDeleteమంచుపల్లకీ: ఆ టీవీ వాడు ఏమంటాడంటే.. కారణమేమీ చెప్పకుండా వెనక్కి పిలిపిస్తే వాళ్ళకు సందేహాలు కలిగి విషణ్ణవదనాలతో వెనక్కి వెళ్ళారని అన్నాడు. అయితే మనం ఇలాంటి విషయాల్లో ఎక్కువ లోతుకు పోకూడదు కాబట్టి నేను రాయలేదు. ఈ మాధ్యమాల వాళ్ళు కొన్ని అతి చేసే అవకాశం ఉంది కదా!
ReplyDeleteఏవరేజిన గంటకి 100 మైళ్ళచొప్పున హెలీకాప్టర్ వెళ్తే, వై.యస్.ఆర్ 8.35 కి బయలుదేరితే, 9.12 కి కర్నూల్ కి దగ్గర్లో కనెక్స్తన్ తెగిపోతే, కర్నూల్, శ్రీశైలం మరియూ మాల్యాల/ఆత్మకూరు దరిదాపుల్లో ఎక్కడో ల్యండ్ అయి ఉండాలి. ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఐతే, ఆ ప్రాంతం అంతా రాయి, కొండలమయం కాబట్టి ల్యాండింగ్ అంత స్మూత్ కాదు అని నాకనిపిస్తోంది. తక్కువ ఎత్తులో ఒకవేళ ప్రాణాలు కాపాడుకోటం కోశం దూకినా, ఒక దరికి చేరటం అంత ఈజీకాదేమో అనిపిస్తోంది. కారణం, ఆ కొండలు క్లిఫ్స్ లాగా ఎరోజ్షన్స్ కి గురైనట్టుగా ఉంటాయ్. స్లిప్ ఐతే పది ఇరవై లేక అంతకన్నా ఎక్కువ అడుగుల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది.
ReplyDeleteహెలి.లో ఈయెల్టీ అనే పరికరం ఉంటుందట. క్రాష్ ల్యాండింగులో అది దానంతటదే యాక్టివేటవుతుందట. ఎమర్జెన్సీ లాండింగు సందర్భంలో పైలటు దాన్ని యాక్టివేటు చేస్తాడు. వెతికే విమానాలు ఆ సిగ్నళ్ళు దాన్ని పట్టుకుంటాయి. ప్రస్తుతం వెతుకుతున్న విమానాలు, హెలి. లకు ఈయెల్టీ సిగ్నళ్ళు దొరకలేదు.
ReplyDeleteనీళ్లలో పడితే ఆ ఈయెల్టీ నుండి సిగ్నళ్ళు అందవట. (ఇది ఐన్యూసు వాడి కబురు)
రేపు సోనియా హై. వస్తదంట. ఎందుకూ.., ఇక్కడివాళ్ళకి తలకాయనెప్పి కాకపోతే, ఇంటో కూచ్చోవచ్చు కదా!
ReplyDeleteHOW FAST CAN A HELICOPTER GO?
ReplyDeleteThe normal cruising speed of a helicopter varies on the amount of power available and the type of rotor system, but the typical CRUISE speed of the formentioned two seat trainer style is about 90-105Mph. and the five seat turbine is about 130-145Mph. (as far as MAX speed, someone touched to about 155Mph in a Bell 206).
WHAT HAPPENS IF THE ENGINE FAILS?
ReplyDeleteTo many people, there is a misconseption that the main rotor blades will stop turning.... THEN WHAT???
NO - the main rotor does not stop turning
YES - a helicopter can be safely landed if the engine quits.
During an engine failure, the engine will automatically disengage from the rotor system. With the proper control inputs by the pilot, The rotor blades will continue to turn at NORMAL operating speeds, allowing the pilot to make a Fully Controlled landing. This procedure is called an Autorotation. Unlike a conventional airplane, which can't fly at much below 50 Mph, a helicopter that has had an engine failure is able to touch down with little or no forward movement, and in a relatively small amount of space. Usually, a parking lot or a side street should be able to do just fine.
http://en.wikipedia.org/wiki/Bell_430
ReplyDeleteవై.ఎస్ జగన్ ఆత్మకూరు చేరుకుంటున్నాడంట.
ReplyDeleteEmergency Locator Transmitter
ReplyDeletepointer 4000
The ELT installation provides an automatic locator beacon, which in the event of a crash, sends a radio signal on the internationally assigned VHF and UHF distress frequency. The pointer 4000 is specifically designed for helicopter use. It activates at 6+ G loads 360 degree in azimuth as well as full vertical components. Mounted inside the baggage compartment the ELT is a completely self contained, battery powered unit with antenna connections which attach to an external fuselage mounted antenna. The ELT has a switch for manual operation and testing. The battery has a three year shelf life, and provides the transmitter with a range up to 480 kilometers (260 Nautical Miles) for eight days.
సోనియా ఇంత త్వరగా రేపే హైదరాబాద్ వస్తున్నదంటే ...?
ReplyDeleteశరత్ - ఆమె రావటంలో ఆశ్చర్యం ఏముంది. వై.యస్ ఆమెకి నమ్మిన బంటు. ఆమె ముఖ్యమైన కోటరీలో వైయస్ ప్రధముడు. మరి అతను మిస్ అవుతున్నాడూ అంటే ఆమె వచ్చితీరాలి. అది ఆమె *రెస్పాన్సిబిలిటీ* ని ప్రతిబింబిస్తుంది పార్టీ శ్రేణుల్లో, ఓటర్లలో.
ReplyDeleteనల్లమల అడవులపై మంచిపట్టున్న ఎర్రచందనం స్మగ్లర సహాయాన్ని వెతుకులాటలో ఉపయోగించుకుంటున్నాం - అటవీశాఖ.
ReplyDeleteఇస్రో వాళ్ళ విమానమొకటి వెతుకులాటలో పాల్గొని 41 ఫోటోలు తీసిందట. వటిని హై. ఎన్నారెస్యేలో విశ్లేషిస్తున్నారు. దాని సంగతి రెండు మూడు గంటల్లో తెలుస్తుందని రెండు మూడు గంటల కిందట చెప్పారు.
ReplyDeleteఆకాశం మేఘావృతమైనప్పుడు, వాన తీవ్రత ఉన్నప్పుడు రిమోట్ సెన్సింగ్ వాళ్ళు ఏ రకంగా పోటోలు తీయగలరు? ఇన్ఫ్రారెడ్? అవి మూల మూల కోణకోణాన్ని చూపలేవేమో? స్మోక్ ని మాత్రం పట్టగలవేమో? ఆరకంగా చూస్తే స్మోక్ వచ్చినా? ఆయిల్ తెట్టు చూసినా ఈ పాటికి వాటీ ఆనవాళ్ళూ ప్రశ్నార్ధకమే కదా?
ReplyDeleteవిషయంలో స్పష్టత రావడానికి ముందే అధినాయకులు వస్తే అనవసరంగా ఫోకస్ అటు మళ్ళుతుందని ఇలాంటి సందర్భాల్లో ఒక స్పష్టత వచ్చేదాకా రారు. ఆ వార్త నిజమయ్యి నిజంగానే వస్తున్నదంటే ఏదో... అనిపిస్తోంది.
ReplyDeleteఆ 41 ఫోటోల్లో హెలి. సంగతేమీ కనబడలేదంట.
ReplyDeleteఅయిల్ తెట్టు గురించి మళ్ళా ఎమయినా చెప్పరా?
ReplyDeleteమంచుపల్లకీ: లేదండి, ఇంకా ఏమీ చెప్పలేదు.
ReplyDeleteఖచ్చితంగా చెప్పదం లేదుగానీ, నేననుకోవడం వెతకడం ఆపేసినట్టున్నారు.. రేపుదయం నుండి ముమ్మరంగా వెతుకుతాం అని చెబుతోంది ప్రభుత్వం.
ReplyDeleteSafe ga land ayithe inta time ayyaka kuda ELT nundi signals pampakunda untara
ReplyDeleteపోయారేమో! ఊహించడం కూడా కష్టతరమే...
ReplyDelete౧. ELT signaling start అవ్వాలంటే క్రాష్ (అయిఉంటే)లో ఆ ఈ.యల్.టి సర్వైవ్ అయిఉండాలి.
ReplyDelete౨. దాంట్లోని బ్యాటెరీల లైఫ్టైం ఉండాలి. బ్యాటరీ లైఫ్ టైం కేవలం మూడేళ్ళు. మాత్రమే. మార్చి ఉండాలి కదా? మార్చినా నిన్నటిరోజున రెండేళ్ళు నిండి మూడొందల అరవైనాలుగు రోజులా ఇరవి మూడు గంటలు ఐఉంటే? ఒక గంట మాత్రమే పని చేసే స్థితి కదా?
౩. అక్కడి క్లిఫ్స్ లో ఎక్కడో జారిపోయి ఉంటే, మడ్ లో ఇరుక్కుని ఉంటే ఆ తరంగాలు ఎలా ప్రసారం అవుతాయ్.
౪. మనకి తెలుసు తుంగభద్ర లేక కృష్ణానదీ పరీవాహంలో ఎంత ఎత్తైన కొండలు ఉన్నాయో. ఆతరంగాలు ఆ కొండల్లోంచి ఎకో అయ్యి ఎకో అయ్యి ఎకో అయ్యి అప్పుడు రావాలి కదా.
ఇలాంటి ప్రశ్నలకి సమాధానం వెతకాలి మరి.
An Emergency Locator Transmitter (ELT) is a device that can be manually or automatically activated to transmit a distress signal to a satellite. ELTs that activate automatically use a “G-Switch” (gravity switch) that triggers the ELT when it senses that a crash has occurred.
ReplyDeleteSo manual ga start cheyavachu annamata. but ilaanti situation lo enduku start cheyyaledo mari????
ఇది రోజా లెగ్గు మహిమేమో!!!
ReplyDeleteపాపం బాబు ఓడిపోయి బతికిపొయ్యాడు
[జోక్]
Evening nundi naaku kuda Roja mahimonemo anipistundi. 9 years babu ki daridram pattindi. ippudu CM ni pattukundi
ReplyDeleteమంత్రులు ఇళ్ళకి వెళ్ళారు.
ReplyDeleteఇంక రేపటి వరకు ఎమీ అప్ డేట్స్ వుండవేమో... ఎక్కడున్నడొ YSR .. నిన్నటి వరకు కింగ్.. ఇప్పుడు ఎక్కడొ మారుమూల అడువుల్లొ ..అదే రాత..
ReplyDeleteచదువరి గారూ!!
ReplyDeleteరేపటికి అనగా 3 september పొద్దునకల్లా ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా?
నాకెందుకో రాంగ్ ప్లేస్ లో వెతుకుతున్నారేమో అనిపిస్తోంది.
కర్నూల్ శ్రీశైలం ల మధ్య వెతుకుతున్నారు. కర్నూల్ నుండి ఆత్మకూరు కు ఒక గీతగీస్తే పైన ఉండేది శ్రీశైలం అడవులు గట్రా. ఇవి వందకిలోమీటర్ల రెంజి హై. నుండి.
కింద (గీతకి కిందవైపు) నందికొట్కూర్ నుండి నంద్యాల వైపుగా ఏమైనా గాలిస్తున్నారా?
కారణం ఏంటంటే
ReplyDeleteకొందరు తొమ్మిదీ పన్నెండు కి రాడార్ లోంచి మాయం అన్నారు. అది వంద కిలోమీటర్ల రేంజి.
కొందరు తొమ్మిదీ ముఫై ఐదుకి అన్నారు. అది నూట అరవై కిలోమీటర్ల రేంజి అయ్యింది.
చెంచులకీ, వై.యస్ కి చాలా ప్రెండ్షిప్ ఉందని నా అభిప్రాయం. అతనికి ఈ అడవుల గురించి కొద్దో గొప్పో తెలిసే ఉండాలి అని నా నమ్మకం. చూద్దాం
ReplyDeleteతిరిగొస్తాడనీ, ఈ అనుభవంతో మారిన మనిషౌతాడనీ ఆశిద్దాం.
ReplyDeleteమంచి సమాచారం అందిస్తున్నారు. ధన్యవాదాలు.
ఎవరూ గొణగక ముందే ...
ReplyDeleteనేను 'మంచి సమాచారం' అన్నది హెలికాప్టర్ల సాంకేతిక సమాచారం గురించి. రెడ్డి అదృశ్య వార్త గురించి కాదు.
ప్రస్తుతం వర్షం లేకుండా బాగానే ఉందంటున్నారు. 5 కిమీ. వ్యాసార్థపు వృత్త వైశాల్యంలో వెతుకుతామని రాత్రి పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పాడు. వెతుకులాటకు ఆత్మకూరు కేంద్రం.
ReplyDeleteఒకదానికొకటి సంబంధం లేని వార్తలొస్తున్నాయి. 41 ఫోటోలు తీసింది ఇస్రో విమానమని రాత్రి చెప్పారు, పొద్దున టీవీ9 రజనీకాంతు సుఖోయ్ అని చెబుతున్నాడు. ముందే తయారు చేసుకుని చేస్తున్న వ్యాఖ్యానాలు కాకుండా అప్పటికప్పుడు (ఎక్స్టెంపోర్) చెప్పేస్తున్న వ్యాఖ్యానాల కారణంగా ఇలాంటివి కనిపిస్తున్నాయి.
ReplyDeleteఅంటే నే విన్నదే నిజమా?
ReplyDeleteక్రాష్ అయ్యిందనీ, ఆయన గల్లంతైయ్యాడనీ, రూలింగ్ పార్టీ యం.అల్.ఏలందరికీ తెలుసనీ, కానీ ఈ రోజు గణేష్ నిమర్జనం కారణంగా ఈ రోజుకి నొక్కిపెట్టాలనీ, ఈ వార్తలని లీక్ చెయ్యొద్దని అందరికీ చెప్పారనీ - విన్నా
ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి సెక్యూరిటీ ఆఫీసరు వెస్లీకి ఎస్సెమ్మెస్సు పంపిస్తే వెళ్ళిందట. కానీ సమాధానం రాలేదు. ఇదొక ముఖ్య విశేషం. అయితే నేణు ఒక సెల్లును స్విచ్చాఫు చేసి, ఇంకోదానినుంచి ఎస్సెమ్మెస్సు పంపాను. వెళ్ళినట్టుగా చూపించింది. అంటే అక్కడ తెలిసేది.. పంపిన సంగతేగానీ అది చేరిన సంగతి తెలవదు. మరి వాళ్ళు సర్వీసు ప్రొవైడరు నుంచి నిర్ధారించుకున్నరో ఏంటో తెలవదు.
ReplyDeleteదట్స్ ఎ బ్యాడ్ టెస్ట్.
ReplyDeleteఈమెయిల్ లేక యస్.యం.యస్ అనేవి ఎసిన్క్రొనస్. పోస్ట్ చేసినట్టే. మెసేజీ వచ్చి పోస్టు డబ్బాలో పడినట్టే. [ప్రయారిటీ మెయిల్ వేరే అనుకోండి.]
భాస్కర్ రామరాజు: నేనది నిజమని అనుకోను. ఒకవేళ నిజమే అయితే ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కూడా అందరికీ తెలిసి ఉండేది కాదనుకుంటా. ఒకవేళ నిజమే అయితే అన్ని పనులూ చెయ్యొచ్చేమోగానీ, సుఖోయ్ తెచ్చెవాళ్ళా! (ఇవ్వాళ రెండు తిరుగుతున్నాయంట). ఏమో.. నమ్మకం కలగట్లేదు.
ReplyDeleteహెలికాప్టరు ఏదో కొండమీద కనబడినట్టు తెలుస్తోంది.
ReplyDeleteహెలికాప్టరు ఏదో కొండమీద కనబడినట్టు తెలుస్తోంది. కర్నూలుకు 40 నా. మైళ్ళ దూరంలో ఉందట. పరిస్థితి ఏంటో తెలీదంట. మరో 20 30 నిముషాల్లో వివరాలు తెలుస్తాయని గాలింపు చేస్తున్న అయిర్ కమోడోర్ చెప్పాడంట.
ReplyDeleteChaduvari garu! I am sleepy. Lets see what happens by tomorrow morning
ReplyDeletebhaskar thru iphone
హెలికాప్టరు కనబడిన సంగతి అందరికంటే మేమే ముందు చెప్పామని NTV ఘోషిస్తోంది/మొత్తుకుంటోంది. టీవీలో నేను కనబడాలంటే నేను కనబడాలని కెమెరా ముందు జనం ఎలా తోసుకుంటూంటారో.. ఈ టీవీల వాళ్ళు మా టీవీ చూడండంటే మా టీవీ చూడంటంటూ మన ముందు అలా తోసుకుంటున్నారు.
ReplyDeleteటీవీ9 కూడా సరిగ్గా ఇదే చెప్పుకుంటోంది!!
ReplyDeleteహెలికాప్టర్ క్రాష్ అయిందంటున్న కేంద్ర హోమ్‌శాఖ వర్గాలు -టీవీ9
ReplyDeletechaduvari gaaru any latest info?
ReplyDeleteకాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతోందట - ప్రధాని, సోనియా, చిదంబరం, ఆంటోనీ వగైరాలున్నారు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSravya Vattikuti: ఇంకొంత సేపట్లో తెలుస్తుందండి. ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్న పద్ధతి చూస్తూంటే వాళ్లకు సంగతి తెలిసినట్టే అనిపిస్తోంది.
ReplyDeleteoh !
ReplyDeleteIt seems it is crashed on top of the hill in poor visibility while trying to change its altitude from 2200 ft to 5000 ft.
ReplyDeleteబాగా దెబ్బతిన్న స్థితిలో హెలికాప్టర్ - కేంద్ర హోమ్‌శాఖ
ReplyDeleteపరిస్థితి చూస్తుంటే.. ఇక అధికారిక ప్రకటనే మిగిలి ఉంది అనిపిస్తోంది.
ReplyDeleteAyyo :(
ReplyDelete20 మంది పోలీసులను తీసుకుని కలెక్టరు కొండమీదకి వెళ్తున్నాడంట.
ReplyDelete5 మృతదేహాలను గుర్తించామని అహ్మద్ పటేల్ చెప్పాడు. ఇక ప్రభుత్వ అధికారిక ప్రకటన కూడా వచ్చేస్తుంది.
ReplyDeleteFive unknown dead bodies found .... NDTV.
ReplyDeleteconfirmed in TV9
ReplyDeleteconfirmed in NDTV too..
ReplyDeleteటీవీలనిండా ఎక్కెక్కి ఏడ్చేవాళ్ళే!
ReplyDeleteఆపత్థర్మ ముఖ్యమంత్రిగా రోశయ్య. రాష్ట్రంలో హై అలర్ట్!
ReplyDeleteAyyo so sad ! May his soul rest in peace!
ReplyDeleteకొద్దిసేపట్లో హై.లో ప్రధాని, సోనియా.
ReplyDeleteసాయంత్రం సీడబ్ల్యూసీ. రెండురోజుల్లో ముఖ్యమంత్రి ఎంపిక.
ReplyDeleteచంద్రబాబు ఇలా అన్నాడు:
ReplyDeleteఎవరికీ భయపడే వ్యక్తి కాదు. అనుకున్నది సాధించేవరకు పోరాడే వ్యక్తి. మామధ్య రాజకీయ విభేదాలున్నాయి తప్ప, మేమిద్దరం మంచి మిత్రులం. నేనో మంచి మిత్రుణ్ణి కోల్పోయాను. నాకిది వ్యక్తిగత నష్టం.
రాష్ట్రానికిది తీరని నష్టం. ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలి అనే పట్టుదలతో ముందుకుపోయారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలతో మరింత మమేకం కావాలని మందుకుపోయారు. ఈ సందర్భంలో ఆయన మరణం దురదృష్టకరం.
వారందరి ఆత్మశాంతికై ప్రార్ధిస్తూ....
ReplyDeleteఅడగకుండా ఉండలేకున్నాను..YS గారితో పాటు మరణించిన మిగతావారి File ఫోటోలుకూడ లేవా మీడియావారి దగ్గర?పదవికేనా విలువ? ప్రాణానికి లేదా?
సీపీఐ నారాయణ: రాజకీయాల్లోకి రాకముందే నాకాయన పరిచయం. నా కుటుంబసభ్యుడు పోయినట్టు నేను బాధపడుతున్నాను. అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాడు. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉన్నవాడు. ఈ సమయంలో ఆయన మరణం దురదృష్టకరం. ఆయన కుటుంబానికి నా సానుభూతి.
ReplyDeleteకోపైలట్ రెడ్డి, సెక్రెటరీ సుబ్రహ్మణ్యం ఫోటోలు చూసాను.
ReplyDeleteఉమాశంకర్: కోపైలట్ రెడ్డి, సెక్రెటరీ సుబ్రహ్మణ్యం ఫోటోలు చూసాను.
ReplyDeleteచిరంజీవి:
ReplyDeleteకోటి ఎకరాలకు నీరివ్వాలన్న తన ఆశ నెరవేరకుండానే ఆయన చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రజారాజ్యం ప్తరపున మా సానుభూతి.
ఇంకొన్ని నిముషాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన!
ReplyDeleteప్రభుత్వ ప్రకటన:
ReplyDeleteశవాలకు కర్నూల్లో పోస్ట్‌మార్టమ్. సాయంత్రానికి హై.కి తీసుకువస్తారు. రాజశేఖరరెడ్డి కాయాన్ని ఈ రాత్రికి ఆయన క్యాంపు ఆఫీసులో ఉంచుతారు. సెప్టెం. 4 పొద్దున 11 నుండి లాల్‌బహదూర్ స్టేడియమ్‌లో ఉంచుతారు. మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి ఆయన సొంతూరికి తీసుకెళ్ళి ఖననం చేస్తారు. మిగతా భౌతికకాయాలను వారివారి బంధువులకు అప్పజెబుతారు.
మృతదేహాలను వాళ్ల దుస్తులను బట్టి గుర్తించారట !!!! ప్రమాదం ఎంత బీభత్సంగా ఉండి ఉంటుందో ఊహించవచ్చు.
ReplyDeleteప్రభుత్వ ప్రకటన చేస్తూ రోశయ్య దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు.
ReplyDeleteఈ వార్త విని నేనే ఆపుకోలేకపోతున్నా. అయ్యో!!!
ReplyDeleteసెక్రెటరీ సుబ్రహ్మణ్యంది గుంటూరే.
ReplyDelete"టీవీలనిండా ఎక్కెక్కి ఏడ్చే వాళ్ళే"
ReplyDelete@చదువరి,
మీ అప్ డేట్స్ బాగున్నాయి, భావోద్వేగాలను ఎద్దేవా చేస్తూ!
చదువరి గారూ
ReplyDeleteధన్యవాదాలు. చాలా చక్కగా ఉపడేట్స్ ఇచ్చారు.
@ neelaanchala :ఈ updates లో మీకు కనుపించిన ఎద్దేవా ఏమిటి ? మీరు పొరపాటు పడుతున్నారేమో ఒకసారి చూడండి !
ReplyDelete@ neelaanchala :
ReplyDeleteమాకు ఈ updates చాలా ఉపయొగ పడ్డాయి. చదువరి గారు అయన ఎంతొ సమయం వెచ్చించి మన కొసం ఎప్పటికప్పుడు updates ఇచ్చారు. మీకు కనిపించిన ఎద్దేవా ఎమిటొ మాకు తెలీదు కానీ.. నేను మాత్రం చదువరి గారికి, రాజు గారికి థాంక్స్ చెబుతున్నను, వాళ్ళు వెచ్చించిన సమయానికి.
చదువరి గారూ, భాస్కర్ రామరాజు : ధన్యవాదాలు
నీలాంచల, భాస్కర్, శ్రావ్య, మంచుపల్లకీ గార్లకు నెనరులు. భస్కర్ గారికి మరీను, నన్ను రాయనిచ్చినందుకు. :)
ReplyDeleteనీలాంచల గారూ, ఎద్దేవా చెయ్యడం కాదుగానీ, మరీ గుండెలు బాదుకుంటూ ఏడవటం చూస్తే నాక్కాస్త వింతగా అనిపించినమాట వాస్తవం. మీరు మరోచోట అన్నట్టు నాకు గుండెలో తడి కాస్త తక్కువై ఉండొచ్చు. :)
indra, simhadri, narasimha naidu, samara simha reddy, nayudamma laantivi chooste gunde alaaane avuddi....chaduvari
ReplyDelete