http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_10.html
పోయినేడాది, ఇదే రోజున, అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి, శ్రవణా నక్షత్రంలో ఈ పిల్ల పుట్టింది. అనఘ అని పేరు పెట్టాం. అనఘ అనగా అనగనగా, దత్తాత్రేయస్వామి వారి సతి, మరియూ *సిన్లెస్* అని అర్ధం. అప్పుడే సంవత్సరం అయింది.
అన్న అన్నా అంటోంది. ఒరేయ్ ఒరేయ్ అంటోంది. బుడిబుడి అడుగులు వేస్తోంది. మమ్మల్ని ఆనందసాగరంలో ముంచెస్తోంది.
విజయదశమి, మాకు జంట ధమాక. అమ్మవారు సకల గుణాలనూ హరించిన వేళ, విజయకేళ!! మరియూ పిల్లపుట్టినరోజు వేడుక.
ఈరోజు పూజలు పునఃస్కారాలు మరియూ పుట్టినరోజు సంబరాలతో తేలియాడుతాం మేము. మీరూ ఈ విజయదశమి అమ్మవారిని పూజించి ఆనందంతోపాటు అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ విజయదుర్గ కృపకు పాతృలౌవ్వాలనీ కోరుకుంటాం -
భాస్కర్, హరిత, సూర్య మరియూ అనఘ.
ఇక మా ఊళ్ళో ఓ పడుచుంది, పాట అంటే ఇష్టమన్నది. నిజం!!
నిన్న మా ఊళ్ళో సునీత, శ్రీకృష్ణల బృందం వారి సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి నేనూ ఓ కార్యకర్తను, స్పాన్సర్ని కూడా.
ఆ వివరాలు -
ఆల్బనీలోని హిందూ దేవాలయం వారి హిందూ కల్చెరల్ సెంటర్ నందు, ఆల్బనీ తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో నిన్న (సెప్టెంబర్ 27) శ్రీమతి సునీత గారి "సంగీత విభావరి" వీక్షకులకు సంగీత విందునందించింది.
మహార్ణవమి మధ్యానం 2 గంటలకు మొదలైన కార్యక్రమం 3.30 గంటలపాటు ఆధ్యంతం ఉర్రూతలూగించింది. కేరింతలు కొట్టించింది. పిన్నలనుండి పెద్దలవరకూ అందరిచేతా నాట్యం చేయించింది. కార్యక్రమానికి వేంచేసిన దాదాపు 400 మంది సునీత శ్రీకృష్ణల గానాంమృతపు జడివానలో తడిసిముద్దైయ్యారు.
గణేశస్తుతి తో మొదలైన కార్యక్రమం, సునీత పాడిన సోలోలనుండి, శ్రీకృష్ణతో కలిపిన యుగళాగీతాలు, ఆపాత మధురాలు, కొత్తసింగారాలతో కలిసి, ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో నుండి తకిటతధిమి తకిటతధిమి థిల్లానా లను తాకుతూ,
సిరిసిరిమువ్వ లోని ఘుమ్మంది నాదం నుండి సిరివెన్నెలలోని విధాత తలపున వరకూ, నేటి యమదొంగ నుండి జల్సా, మగధీర చిరుతల నుండి గోదావరి, ఆనంద్ ల వరకూ ప్రేక్షకులకు వీనులకు విందు చేసింది.
http://albanyandhra.com/
Sep 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
మీ చిన్ని దుర్గమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteఅనఘ కు జన్మదిన శుభాకాంక్షలు మరియు భాస్కర్, హరిత, సూర్య , అనఘ లకు విజయదశమి శుభాకాంక్షలు!
ReplyDeleteమీ పాపకు జన్మదిన శుభాకాంక్షలు, మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు.
ReplyDeleteఅనఘకు జన్మదిన శుభాకాంక్షలు, మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు.
ReplyDeleteAnna,
ReplyDeletegive my love to Anagha, and I wish she enjoys her childhood. :)
Yogi
అనఘ కు నా జన్మదిన శుభాకాంక్షలు చెవులో చెప్పు సోదరా.. లేకపోతే సూరిబాబు కూడా నా బర్త్ డే ఈ రోజేనని గొడవ చేస్తాడు.
ReplyDeleteఅనఘకు జన్మదిన శుభాకాంక్షలు, మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు.
ReplyDeleteఆదివ్య జనని ఆశీస్సులతో పుట్టిన చిన్నారి అనఘ మీకుటుంబానికి మాణిక్యమై మీవంశము పావనమయ్యే విధంగా జ్ఞాననిధిగా వెలగాలని జగజ్జననిని ప్రార్ధిస్తున్నాను.
ReplyDeleteఅనఘకు జన్మదిన శుభాకాంక్షలు, మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు.
ReplyDeleteఅనఘకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీకు దసరా శుభాకాంక్షలు :)
ReplyDeleteచాలా సంతోషం. చిన్నారి అనఘకి ఆశీస్సులు.
ReplyDeleteఇంతకీ మీ సంగీత విభావరిలో బ్లాగుల ప్రచారం చేశారా లేదా?
Many many happy returns of the day to Anagha.I wish happy Dasera to Anagha, Suribabu, Harita and Bhaskar.
ReplyDeleteఅనఘకు జన్మదిన శుభాకాంక్షలు. శమస్తు వః.
ReplyDeleteశుభాకాంక్షలు.. గుంటూరు అమ్మాయి, విజయవాడ అబ్బాయి కలిసి అమ్రికా శ్రోతలకి ఆనందం కలిగించారన్న మాట... ఫోటోలు బాగున్నై :-)
ReplyDeleteఅనఘకు జన్మదిన శుభాకాంక్షలు :)
ReplyDeleteఅనఘ ని దీవించిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteకొత్తపాళి అన్నగారు - ఈసారి కుదరలేదండీ. ఈ కార్యక్రమ పనులతో అసలు సమయం చిక్కలేదు. ఐనా ఓ పెద్ద తెలుగు, బ్లాగు అని గుర్తించే స్థాయిని దాటిపొయ్యారు *మన తెలుగు* వారు.
తెలుగు బ్లాగులు కోకొల్లలుగా వస్తున్నాయి - అదనపు ప్రచారం అవసరంలేదేమో అని భ్రమ కలిగించేంతగా. మీరు ప్రచారం చెయ్యలేకపోయాననే బాధ వలదు. ఒకప్పుడు అందరి బ్లాగర్ల ఊరు పేరూ తెలిసేవి. అన్ని బ్లాగులూ చదివే వాళ్లము. అసంఖ్యాకంగా ,ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఇన్ని బ్లాగులు చదవడం ఎవరితరం? ఝుమ్మందినాదం కార్యక్రమంలో (ఈ టివి) సునీత సంగీతస్వరాలు ప్రతి సోమవరం ఆనందిస్తున్నాము. చిన్నారి అనఘ కు ఆశిస్సులు.
ReplyDeleteతెలుగు బ్లాగులు కోకొల్లలుగా ఏం రావట్లేదు. మహా అంటే 2000 నుండి 2500 వరకు ఉన్నాయి. పది కోట్ల మందికి ఇది ఏపాటి నంబర్ ? కాని టపాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇంకా ఒకరు ఫాలో అవలేనన్ని విషయాలు వస్తున్నాయి, కానీ కోకొల్లలుగా ఏం రావట్లేదు. సెకన్ కో టపా వస్తే అప్పుడు అనుకోవచ్చు కోకొల్లలుగా వస్తున్నాయి అని :)
ReplyDeleteఅనఘకు జన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteమీ అమ్మాయికి జన్మ దిన శుభాకాంక్షలు!
ReplyDeleteఅనఘకు జన్మదిన శుభాకాంక్షలండీ... ముందు కన్ఫూజ్ అయ్యా బ్లాగ్ పుట్టినరోజేమోనని...
ReplyDelete