Aug 7, 2009

చెల్లెమ్మా!!!!!!

ఆ రోజు (మొన్న) రక్షా బంధన్!!
మావిడాయ్ ముందుగానే ఓ రక్షాబంధనం తెచ్చిపెట్టింది.
పిల్ల దాన్నిచూసి సూరిగాడివైపు చూసి కిచకిచ అంది.
సూరిగాడు అడిగాడు అదేంటి అని.
దీన్ని రాఖీ అంటారు బ్లాబ్లాబ్లా అని చెప్పింది వాళ్ళ అమ్మ.
నే ఆపీస్ నుండి ఇంటికెళ్ళంగనే ప్రతీరోజు, దాన్నితెచ్చి, నాన్న ఇది కీరా, చెల్లి నాకు నిన్న కడుతుంది అని రోజు సొద పెడుతున్నాడు. [మనం రివర్సు గేరు, అన్నీ వెనకనుండి ముందుకి]
పౌర్ణమి రానే వచ్చింది.
మనం కార్యాలయం నుండి ఇంటికెళ్ళేప్పటికి కట్టించుకున్నాడు.
చూపించాడు. బ్లాబ్లాబ్లా.
వాడు అది కట్టించుకున్నప్పటి డయలాగు -
"అమ్మా!! పెద్దయ్యాక నీకు చెల్లికి చీర కొనిపెడతా"
ఆ తల్లి సెంటీ అయి, తర్వాత ఏమైందో మీ ఊహకే వదిలేస్తున్నా!!!

9 comments:

  1. మీ పిల్లల్లిద్దరికీ నా ఆశీస్సులు.
    'అబ్బ,చీమ కుట్టేసిందే' అంటే...'అమ్మా, ఈసారి అది కనిపిస్తే చెప్పు దాన్ని చంపేస్తా'...అని మా అమ్మాయి అన్నప్పుడు నేను అదే సెంటీ డైలాగు.. !!

    ReplyDelete
  2. నాకు కూడా ఒక చెల్లి ఉండివుంటే మీ సూరిగాడి కంటే ఇంకా ఎక్కువే చేసేవాడిని. అదృష్టవంతుడు మీ వాడు.

    ReplyDelete
  3. అంతా బాగుంది కానీ పిల్లేమిటో ఎప్పుడూ 'కిచకిచ' అనే అంటోంది.. ఆడియో పెట్టాల్సిందే...

    ReplyDelete
  4. మరి డాడ్ కి ఏమీ లేదా ?:)

    ReplyDelete
  5. వేణు భాయ్- :):)
    తృష్ణ గారు - :):)
    ప్రవీణ్ - ఏంపర్లేదు.. భారతదేసము నా మాతృభూమి..భారతీయులందరూ *సోదరులు, వారివారి సోడరీమణులు* :):)
    సైతన్య - :):)
    మురళి - తెగ వచ్చేస్తున్నాయ్ మాటలు. నవ్వటం మాత్రం కాల్గేట్ యాడ్ లో సచిన్ లా నవ్వుతోంది.
    సునీత గారూ - :):) ఎలా ఉన్నారూ?
    శ్రావ్యా - డాడ్ కి ఏమీలేదు. మరి అప్పుడు ఆపీస్లో ఉన్నాడు కదా!! అందుకు

    ReplyDelete
  6. హ ..హ్హ ...మావాడూ అంతే చిన్నప్పట్నించీ వాళ్ళక్క కిచ్చినవి రాసి పెట్టుకోమంటాడు .సంపాదించాక ఇచ్చేస్తాడట !

    ReplyDelete