మా వైపు స్వాతంత్రదినోత్సవ వేడుకలు అంగరంగవైభోగంగా జరిగినై.
ఏటి కొత్తా!! సరే ఇనుకో.
మా ఊళ్ళో పండగలు పబ్బాలు సొతంత్రదినాలు అన్నీ మేంచేసుకున్నప్పుడే. అంటే వారాంతానికే ఏదైనా. పంద్రా గస్టైనా, దసరా ఐనా, దసరా ఏషం గట్టినా, దీపావళి ఐనా ఏదైనా. కానీ కానీ, కొన్ని చోద్యాలు జరుగుతుంటై. ఎందుకు అని మాత్రం అడక్కూడదు. అదంతే.
ఊళ్ళో అంటే ఊళ్ళో కాదులేండి, మా వైపు అని. మాకు ఇక్కడ సెలబ్రిటీ రీజియన్ అంటే న్యూయార్క్/జెర్సి అన్నమాట.
ఆగస్టు మదిహేను, శనివారం అయ్యిందా? మేము ఆరోజు జెయ్యం. ఆగస్టు తొమ్మిదిన కొందరు జేసారు. దానికి గ్రాండ్ మార్షల్ అబ్బో చాలాపెద్ద సంఘ సంస్కర్త, పేదల పాలిట పెన్నిధి, నిజమైన సాఘీక సేవకురాలు ఐన శ్రీమతి మందిరా బేడీ గారు భారతదేశం నుండి వేంచేసారు. ఇంకో గుంపు ఆగస్టు పదహారున చేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన పెరేడ్ *వరల్డ్స్ లార్జెస్త్ ఇండియా డే పెరేడ్* అట ఇది, దీనికి గ్రాండ్ మార్షల్, ఈమె అతిరధి మాహారధి దురంధరురాలు. ముంబై నగరంలో స్లం డ్వెల్లర్స్ కి బంగారు గొలుసులు చేయించింది. పేదలకు గుడ్డ పంచటం కోసం ఈమె పాపం తన బట్టల సైజు తగ్గించేస్కుంది. ఆమెపేరే షిల్పాషెట్టి.
ఇక ఇంకో గుంపు ఆగస్టు పదిహేను రాత్రికి ఒక బ్యాష్ ని నిర్వహించినట్టున్నారు. దానిపేరు డ్యాన్సింగ్ దివా నైట్. దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ [అంటే రికార్డు డ్యాన్సర్లు] గా నల్గురు అతివలు వేంచేసారు. ఆ నల్గురూకూడా భయంకరమైన ప్రజాసేవ చేస్తున్నారు. అలాంటివారు న్యూజెర్సీ న్యూయార్క్ వైపుకి అడుగెట్టడం మా ట్రైసిటీ జనాల అదృష్టం. వారే *కొయినా మిత్ర* *ప్రీతి ఝింగ్యాని* *రాఖీ సావన్త్* మరియూ *తనూశ్రీ దత్తా*.
Description:
Bollywood Divas Nite with Rakhi Sawant, Koena Mitra, Tanushree Dutta and Preeti Jhangiani performing live in New York
When:
Saturday, August 15, 2009
@ 8:00 PM
Where:
Colden Center
65-30 Kissena Blvd
Flushing, NY 11367
Admission:
$25, $35 and VIP (100)
Aug 19, 2009
Subscribe to:
Post Comments (Atom)
నవ్వాగటం లేదండీ మీరు రాసింది చదివి..
ReplyDelete'అంగ' 'రంగ' వై 'భోగం' గా జరిగాయా.. ఇంతమంది సంఘ సేవకురాళ్ళ మద్య.... చ చ .. న్యూయార్క్ / జెర్సి లొ సెటిలవాల్సిందే (:-
ReplyDeleteWill be back soon.can't write detail comment:;)
ReplyDeleteబట్టలు లేనివారికి బట్టలిచ్చేందుకు వీళ్ళు బట్టల్లేకుండా ఎగరడాలూ, దాన్ని మనం చూడ్డానికి రుసుమూనూ.. బాగుంది పెజాసేవ
ReplyDeleteన్యూయార్క్ లో రోజూ ఫ్రీ రికార్డింగ్ డాన్స్లే గందా.. ? ఇంతలేసి దానికి టికెట్ గూడానా? ;)
ReplyDelete>>>>>
ReplyDeleteనిజమైన సాఘీక సేవకురాలు ఐన శ్రీమతి మందిరా బేడీ గారు భారతదేశం నుండి వేంచేసారు.
>>>>>
మందిరా బేడీ సంఘ సేవకురాలైతే పెద్దాపురం భోగం వీధిలో ఉండే స్త్రీలు కూడా సంఘ సేవకురాళ్ళే. మామూలు వీధి వ్యభిచారుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు కానీ ఒంటి మీద సఘం బట్టలు వేసుకుని వీధి వ్యభిచారులలాగ బిహేవ్ చేసే సిటీ ఎలైట్ క్లాస్ స్త్రీలని మాత్రం అరెస్ట్ చెయ్యరు. బ్రిటిష్ వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళకి జరిమానాలు విధించే చట్టాలు తయారు చేశారు. మనమేమో స్వాతంత్ర్య దినోత్సవ వేదుకలకి కూడా ఎలైట్ వ్యభిచారుల్ని వాడే లెవెల్ లో ఉన్నాము.
నాన్న గారూ ఈ నిజం ఆరుద్ర గారు ఎప్పుడో సెలవిచ్చారు.
ReplyDelete"సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి ఫలానా పండుగ
పదిమందీ కలిసి జరుపుకుంటే ఆనందం మెండుగ
రావచ్చు ఆ పర్వదినం ఇండియాలో ఏదైనా ఒకవారం
అమెరికాంధ్రులు దాన్ని రప్పించేది మాత్రం శనివారం "
"పేదలకు గుడ్డ పంచటం కోసం ఈమె పాపం తన బట్టల సైజు తగ్గించేస్కుంది. ఆమెపేరే షిల్పాషెట్టి." :-) :-)
ReplyDeleteభయంకరమైన ప్రజాసేవ .. LOL!
ReplyDeleteసుజ్జి గారి కామెంటే నాది కూడా :)
ReplyDeleteLOL hehehehe ...
ReplyDeleteకామెంటుజేసిన పెద్దలందరికీ వందనాలు, తకిట తందనాలు.
ReplyDeleteఈ టపాలో పోర్కొనిన అతిరధ మహారధిలను తల్చుకుంటుంటే, నాకు కాలేజిలో అలవాటైన సంస్కృత భాష తన్నుకుంటూ వస్తున్నది. ఆ భాషను నేను వాడడం ఆపి చాల్రోజులైనా, మన జెండా పండుగను జరుపుకొనే తీరును గమనిస్తుంటే, నాలుక నుంచి ఒక పెద్ద ప్రవాహంలా బయటకు వచ్చేస్తున్నది. క్షమించాలి.
ReplyDeleteBaagundi!!!
ReplyDeleteఅంతమంది పెజా సేవకులు ఉండ బట్టే ఇంత గ్రాండుగా జరిగింది పండుగ... :)
ReplyDeleteఆద్యంతం నవ్వించారు :)
ఎవురక్కడ మా యక్కల సేవల్ని ఎక్కిరించేది..ఆయ్. వోళ్లే లేకుంటే ఈడ అర్దరాత్రి సొతంత్రాన్ని అనుభవించేందుకు మేల్కొనేది ఎట్టా? అయినా భాస్కరన్నా వొదినకి మస్కా కొట్టి రికార్డుదాన్సులేసి తెల్లరేసరికే ప్లేటుపిరాయించేశావే. రేత్రి ఎల్లొచ్చినట్టున్నావ్... పిల్లాట.
ReplyDelete