Aug 12, 2009

నా నడక

ఈ మధ్య నా నడకని జి.పి.యస్ ద్వారా లాగ్ చేస్తున్నా. నా ఐ.ఫోన్ లో ఒక ఉచిత అప్లికేషన్ ఉంది. దానిపేరు మ్యాప్ మై రన్. ఇది, మన నడకని జి.పి.యస్ ద్వారా ట్రాక్ చేస్తుంది. అంటే కూకట్పల్లి నుండి వివేకానందనగర్ వరకూ నడిచాం అనుకోండి, ఏరోడ్డుమీద, ఎంత వేగంతో, లాంటి విషయాలని పట్టేస్తుందన్నమాట.


<-------------------<<<<<<
ఒక్కసారి పై బాణం చివరాకి చూడండి. నా నడక. ఇక్కడ నా నడక మ్యాపులని పెడుతున్నా. సరదాకి మాత్రమే. ఎవరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని.
ఈ అప్లికేషన్ ని జూన్ 17 న నా ఫోన్ లోకి ఎక్కించా. అప్పటినుండి దాదాపు నడచిన ప్రతీసారి ట్రాక్ చేసా దాదాపు. కొన్ని కొన్ని సార్లు చెయ్యలేకపొయ్యా అనుకోండి అది వేరే విషయం.
నా నడక గణాంకాలు -

Stats

Member Since: 06/17/2009
Total Maps: 26
Total Workouts: 23
Total Distance: 72.98 mi.
Total Burned: 0 (kcal)

Workout Summary
Walk: 23
Green Stats
Total Workout Days: 23
Distance Traveled: 72.98 mi.
Gas Saved: 4.05 gallons
Money Saved: $14.11
Carbon Offset: 78.5 lbs. of CO2
Recent Workouts
08/11/2009 - iMapMyRun Aug 11, 2009 10:11 PM
Walk: Regular Walk
Regular Walk | 3.54 mi.

08/10/2009
- iMapMyRun Aug 10, 2009 10:34 PM
Walk: Regular Walk
Regular Walk | 4.01 mi.

08/09/2009 - iMapMyRun Aug 9, 2009 10:05 PM
Walk: Regular Walk
Regular Walk | 4.44 mi.

08/08/2009 - iMapMyRun Aug 8, 2009 9:43 PM
Walk: Regular Walk
Regular Walk | 1.99 mi.

08/07/2009 - iMapMyRun Aug 7, 2009 10:49 PM
Walk: Regular Walk
Regular Walk | 4.47 mi.


నోట్ -
mi = మైళ్ళు.
ఒక మైలు = 1.6 కిలోమీటర్లు.
ఇప్పటికి 72.98 మైళ్ళు అనగా 117.449 కిలోమీటర్లు నడిచా.
అదేదో కధ గుర్తొస్తుందా? మధురాంతకం రాజారాం గారి తపాళా బంట్రోతు కధ. అదేం కధ అంటే, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, గుర్తున్నంతవరకూ ఇది - ఒక టీచరు, అతని విద్యార్ధులతో అతని చిన్ననాటి జ్ఞాపకాలని పంచుకుంటూ ఇలా చెప్తాడు - మా ఊళ్ళో ఓ తపాళా బంట్రోతు. అతను ప్రతీరోజు దగ్గర్లో ఉన్న పట్టణానికి వెళ్ళి వాళ్ళ ఊరికి, ఆ ఊరి తపాలా కార్యాలయ పరిధిలోకి వచ్చే అన్నీ ఊళ్ళ ఉత్తరాలను తెచ్చేవాడు. వచ్చిన ఆ టపాలను ఊరూరు తిరిగి ఇచ్చి, తిరుగుటపాలను కలెక్టు చేస్కుని, మర్రోజు వెళ్ళినప్పుడు అవి ఇచ్చి ఇలా...అతని జీవితంలో ముఫైమూడు సంవత్సరాలు తపాళా బంట్రోతుగా పనిచేస్తే ఎన్ని కిలోమీటర్లు తిరుంటాడో తెలుసా - సమచ్చరానికి 280 పనిదినాలు వేస్కుంటే
33 (అతని సర్వీసు కాలం) * 280 * 10 (సరాసరి 10 కిలోమీటర్లు రోజుకి అనుకుంటే) = 92400 కిలోమీటర్లు. ఇది కేవలం అతని పనికి సంబంధించి. ఇంటికి వెళ్ళుట, వచ్చుట, పొలానికి వెళ్ళుట వచ్చుట, ఇవి కలపకుండా.
చాలా బాగుంటుంది ఆ కధ

6 comments:

  1. సమాజ్ గాలే :(
    అంటే అక్కడ మైల్స్ మైల్స్ నడిసినట్టు కనపడుతుంది గాని మరి ౦ cals ఏమిటి ? ౦ cals ఐతే లాభమేమిటి ?

    ReplyDelete
  2. ౦ cals - అది నేను ఇంకో పెరామీటర్ యాడ్ చెయ్యాలి.
    యావరేజిన, 450-500 cals ఖర్చుచెసినట్టు.

    ReplyDelete
  3. abboe!!gandaragoelhamgaa undi lekka.mari manam lekkalloe goppa kadaa:)

    ReplyDelete
  4. లెక్కల్లో నేనూ సునీత గారిలాగే...

    ReplyDelete
  5. అయ్య బాబోయ్!!!! మీకు ఇలాంటి ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తాయండి??!! నావరకైతే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా!! మీకు ఒక విన్నపం, comment as లో గూగుల్ అకౌంట్‌తో మాత్రమే comment చేసే వీలు కల్పించారు, దానికి తోడు wordpress అకౌంటుతో కూడా comment చేసే సౌలభ్యం కల్పించాల్సిందింగా కోరుకుంటున్నాను.

    ReplyDelete