Aug 23, 2009

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కలాధరావతంసకం విలాసి లోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ||1||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||2||

సమస్త లోక శఙ్కరం నిరస్త దైత్య కున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ||3||

అకిఞ్చనార్తి మర్జనం చిరన్తనోక్తి భాజనం
పురారిపూర్వనన్దనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపఞ్చనాశ భీషణం ధనఞ్జయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ||4||

నితాన్త కాన్త దన్తకాన్తిమన్తకాన్తకాత్మజం
అచిన్త్యరూపమన్తహీనమన్తరాయ కృన్తనమ్ |
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం
తమేకదన్తమేకమేవ చిన్తయామి సన్తతమ్ ||5||

మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రగాయతి ప్రభాతకే హృదిస్మరన్ గణేస్వరం |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ ||6||

జయగణేశ జయగణేశ జయగణేశ పాహిమాం
జయగణేశ జయగణేశ జయగణేశ రక్షమాం
జయగణేశ జయగణేశ జయగణేశ పాహిమాం
జయగణేశ జయగణేశ జయగణేశ రక్షమాం




అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

- భాస్కర్, హరి, సూర్యా మరియూ అనఘ

"ముదాకరాత్త మోదకం" ఇక్కడ వీక్షిస్తూ వినండి


అలానే నా పోస్టెరస్ లో శ్రీ సిద్దివినాయక స్తోత్రం ఆడియో పెట్టా విని ఆనందించండి -
http://bhaskar.posterous.com/2427226
http://nalabhima.posterous.com/2441686

9 comments:

  1. భాస్కర్,హరి,సూర్యా మరియూ అనఘలకు వినాయకచవితి శుభాకాంక్షలు మేము కూడా అందజేస్తున్నాం

    ReplyDelete
  2. మీ పూజమందిరం చాల చాల బాగుంది! మీ నలుగురికి వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. ఇక్కడ ఎఫ్ ఎమ్ రేడియో మిర్చిలో అనుకుంటా పాట పాడమని ఒకణ్నడిగి... వాడు అంతా పాడాక ‘ఇందులో పాటేదిరా బుజ్జే....’ అంటాడు పరమ సీరియస్గా. అలాగే మీ మందిరం పూజ అన్నీ బాగా కనిపిస్తున్నాయిగానీ, ‘మీ వినాయకుడేడ్రా బుజ్జే’? :) ఈ ఏడాది నీలాపనిందలు రాకుండా పూజాక్షతలు వేసుకున్నారా? :P

    ReplyDelete
  4. అన్నాయ్!, ఈ పాలి మేనేజర్ అయ్యి, డామేజ్ చేసేద్దామనే ! "Head First PMP" పెట్టేసావు. హమ్మా! ఎంత పెద్ద కుట్ర !

    ReplyDelete
  5. మీ పూజమందిరం చాల బాగుంది! పై స్తోత్రం నాకు వినాయక వ్రత కల్పం పుస్తకం లో చూసిన గుర్తు లేదు. మీరు రోజూ గణపతిని ఇలా స్తుతిస్తారా?భాస్కర్,హరిత ,సూర్యా మరియూ అనఘలకు వినాయకచవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు :)
    మందిరం బాగా అలంకరించారు.

    ReplyDelete
  7. సునీత గారూ- ధన్యవాదాలు.
    పైన చెప్పింది గణేశపంచరత్నం!!
    తప్పనిసరిగా చదవాలి అనేమీ లేదు. పుస్తకంలో లేకపోతే లేకపోవచ్చు.
    అరుణపప్పు గారు - సంగతేంటంటే, పత్రితో గణేశ్ మహరాజ్ ని పూర్తిగా నింపేయాలి అని అంటారుకదా.
    శ్రావ్యా - ధన్యవాదాలు. మరే నేను, సూరిగాడు అలంకారం చేసాం. చివరకి తను ఫినిషింగ్ తచ్చస్ ఇచ్చింది.
    విజయమోహన్ గారూ - ధన్యవాదాలు
    వెనకటగణేశా - :):) కుమ్మేద్దాం అని రెండేళ్ళాయ తెచ్చి. పుస్తకం సెక్కుసెదర్లా
    రాణీగారూ - మీకూనూ!! ధన్యవాదాలు.

    ReplyDelete
  8. వినాయక చవితి శుభాకాంక్షలు..

    ReplyDelete
  9. ee ganeshapancharatnam link nu maatrame ne pettaanamdi.mIkulaa raasemta opika kurchukOlekapoyaanu.naaku chaalaa ishtam idi.
    aalasyamgaa ivaale chUstunnaa.... aa vinaayakuni aasiissulu mii kutumbaaniki amdaalani praardhana.

    ReplyDelete