Aug 4, 2009

అన్వర్ గారికో లేఖ

అద్దెచ్చా!! (ఛీ ఛీ - స్టడీ)
అయ్యా అన్వర్ గారూ (వై.యస్.ఆర్ స్టైల్లో)
నేనూ రంగుల ట్యూబులు కొన్నా
నేనూ ఓ ఇడ్లీ ప్లేటు కొన్నా
రంగుల ట్యూబులకి బొక్కలెట్టా
ఇడ్లీ ప్లేటులో పోసా
నీళ్ళు పోసా
ఓ కుంచె కొన్నా
కుంచెతో ఆ రంగుల్ని నీళ్ళలో కలిపా కాదు కాదు రంగులో నీళ్ళని కలిపా
కుంచెని ముంచా
తెల్ల కాయితకం మీన రంగు కుంచెని కదిపా
రంగుని పులిమా
కింద గడ్డి
పైన మబ్బులు
From కుంచె

From కుంచె

From కుంచె

From కుంచె


మరినన్ను మీ శిష్యుడిగా ఎప్పుడు తీస్కుంటారూ?
- నా పేరు సూర్యా
నాకు నాలుగెళ్ళు. నాకు ఫోర్ ఇయర్స్ (చెవులు పట్టుకున్నా మీకు కనిపించట్లా). ఐతే టూ ఇయర్స్ (చెవులు) మాత్రమే కనిపిస్తున్నాయ్.
బాయ్!!
అన్వర్ అంటే ఎవరూ అని అడగవచ్చు!!
క్లుప్తంగా ఆయన బ్లాగు ఇది
దిస్ ఈజ్ అన్వర్

24 comments:

 1. సూర్య కి,
  నాన్న నువ్వు మ౦చి పెయి౦టర్ కావాలి.

  ReplyDelete
 2. సూర్యా బాబూ..అంతా బాగుంది..ఈ అన్వర్ ఎవరు.నాలుగేళ్ళకే నిన్ను ప్రభావితం చేసిన వారా?

  ReplyDelete
 3. హ... హ... హా........... :)

  మంచి గురువు గారిని ఎచుకున్నావు.... ఆయన శిస్యరికం ఇచ్చేదాకా వదలకు.............

  all the best:)

  ReplyDelete
 4. సుభద్ర - ధన్యవాదాలు
  శ్రావ్యా - :):)
  భ.రా.రె - http://thisisanwar.blogspot.com
  విశ్వప్రేమికుడు - వదల్నంటే వదల్ను.

  ReplyDelete
 5. సూరిగా మీ నాయన జైలు కడ్డీలెనకాల ఉన్న్యట్టు ఒక బొమ్మేయ్ రాదూ? ;)

  ReplyDelete
 6. సూరిగా మీ నాయన జైలు కడ్డీలెనకాల ఉన్న్యట్టు ఒక బొమ్మేయ్ రాదూ? ;) >>
  బొమ్మెమి ఖర్మ ఫొటొ నే తీసినట్లున్నాడు మీరు మిస్సయ్యారు:)

  ReplyDelete
 7. నీ చెవులొదిలేసి గురువుగారి చెవులట్టుకో. తప్పక శిష్యుడిగా స్వీకరిస్తారు.

  ReplyDelete
 8. నీ చెవులొదిలేసి గురువుగారి చెవులట్టుకో. తప్పక శిష్యుడిగా స్వీకరిస్తారు.
  _______________________________________________

  LOL - Thats a good idea!

  ReplyDelete
 9. పసివాడిలొనూ కసిరేపిన "అన్వర్ " గారికి కళాభివందనాలు !

  ReplyDelete
 10. ధరణీ గారూ, హః హ , మంచి ప్రాసతో చెప్పారు.మీ మాట నాదీ !

  సూర్యా మోడ్రన్ ఆర్ట్ వేస్తున్నట్టున్నాడే ! ఎంత శ్రద్దో !

  ReplyDelete
 11. బాగుంది మీ అబ్బాయి మోడర్న్ ఆర్ట్! మా అమ్మాయి ఏకంగా గోడల నిండుగా వేసేసింది మోడర్న్ ఆర్ట్!! చార్ట్ ,వాటర్ కలర్స్ ఇచ్చినప్పుడు నేను కూడా అలానే న్యూస్ పేపర్ పెడతానండి.

  ReplyDelete
 12. ఇంత హాయిగా నవ్వుకుని ఎన్నాల్లయిందొ, భగవంతుడు బిడ్దని చల్లగా చూడాలి.

  ReplyDelete
 13. కాలనేమి - నీ ఆరాటం చూస్తుంటే *ముచ్చటేస్తోంది*. సూరిగాడికి నే పాద్రీని, అది చాలు నీ మీద కేసెయ్యటనికి. కొన్ని నెలలుగా నా మీద కుట్ర జరుగుతోంది నన్ను జైల్లో పెట్టాలని, పెట్టించాలని.
  మలక్ లాంటివాళ్ళకి అంటగట్టని కేసు నీమీదే పెట్టాలనుకుంటున్నా అంటే, ప్రత్యేక కారణం ఉందాలేదా? ఆలోచించు.
  కొత్తపాళి అన్నగారు - :):)
  మలక్ - అన్వర్ గారితో మాట్టాడి ఇక జేర్పించాల్సిందె.
  ధరణీరాయ్ చౌదరి - ధన్యవాదాలు
  చందా - :):)
  వేణూ భాయ్ - ఎలా ఉన్నారూ? అంతా మంచేనా?
  తృష్ణ గారూ - అవన్ని అయిపొయ్యాయి ఇక్కడ. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. గోడలు అత్యంతదారుణంగా గెలికనందుకు లీజు రెన్యూ చెయ్యం అనిచెప్తేనే ఇల్లుమారాం. దానిమీదో పోష్టు వేస్తాలేండి.
  జీడిపప్పు - :):)
  మురళి - :):)
  అన్వర్ గారు - స్వాగతం. నవ్వుకున్నారు సరే, శిష్యునిగా స్వీకరించారా లేక మావాడిచేత చెవులు పట్టించమంటారా?? :):) ధన్యవాదాలు సార్.
  చైతు - ఏదో నీ అభిమానం తమ్మీ.

  ReplyDelete
 14. హహ ! హ హ!
  >>మంచి గురువు గారిని ఎ0చుకున్నావు.... ఆయన శిస్యరికం ఇచ్చేదాకా వదలకు.
  >>నీ చెవులొదిలేసి గురువుగారి చెవులట్టుకో. తప్పక శిష్యుడిగా స్వీకరిస్తారు.

  ReplyDelete
 15. ముందు నన్ను నేర్చుకొనివ్వండి . తరువాత తప్పకుండా.

  ReplyDelete
 16. సునీతగారూ - ధన్యవాదాలు
  అన్వర్ గారూ -
  మీకు పాదాభివందనం చేస్తున్నా.
  చాలా చక్కగా చెప్పారు. ఈరోజున ప్రతీ మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఇది.
  జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది. జీవితం అనే పాఠశాలలో మనమెప్పుడూ విద్యార్ధులమే అనే విషయాన్ని విస్మరిస్తున్నాం.
  ధన్యవాదాలు.

  ReplyDelete
 17. అవునా ! మీవాడికి ఇప్పటినుండి మొదలెడితే చతుష్షష్ఠి కళలేంటి ఇంకా ఎక్కువేనేర్చుకునేట్టున్నాడు.శుభం

  ReplyDelete
 18. ఎప్పుడో మీ సూరి బాబు బ్లాగ్ మొదలెట్టేస్తాడు ....మీకు చెప్పకుండానే

  ReplyDelete