Aug 3, 2009

సరటోగా ఆటోమొబైల్ సంగ్రహాలయం

నిన్నటి శనోరం, సూరిగాడి గోల తట్టుకోటానికి సులభమైన మార్గం ఏంటా అని ఆలోసించి, బయటకి తోల్కెళ్తే మస్తు అని నిర్ణయించాం. యాడికి? అని బుఱ్ఱగోక్కున్నాం. నేకొన్ని వెబ్ కాయితకాలు తిరగేసా. ఏదో ఓ లింకు తలిగింది. గేంద్వయా ముచ్చటీ అంటే మాఊరి దగ్గర్లోని గుఱ్ఱప్పందేల ఊరు సరటోగ స్ప్రింగ్స్ లో ఆటోమోబైల్ సంగ్రహాలయం ఉందనీ, అది ఇరవైమూడు నిమిషాల డ్రైవ్ అని, మనోడికి కార్లంటే తిక్క సమించండి పిచ్చి అని, ఆడకి తోలకెళ్తే మనోడానందిస్తాడానీ అనుకున్నాం. అన్నీ దులిపాం, కారు నింపికున్నాం. ఇస్టార్టు అయ్యాం. ఓ మైలు బోంగనే పిల్ల కేర్ కేర్ మని మొదలెట్టింది. మావిడ మీరెళ్ళండి, ఇంట్లో పిల్లని పడుకోబెడతా అని ఓ చారిత్రాత్మక నిర్ణయం తీస్కుంది.
నాయనా వెళ్ళాం బాబూ. ఇవిగో కొన్ని పుటోబులు ఇక్కడ పెడతన్నా. ఆనందించు.
ఒక అంతస్థులో కన్వర్టిబుల్స్ పెట్టారు. ఇంకో అంతస్థులో న్యూయార్క్ రేసింగ్ కి సంబంధించిన కొన్ని రేసింగ్ కార్లు పెట్టారు.
రోమాంచ కలిగించిన కార్లు రెండు - ఒకటి ఫెరారి, రెండు మసెరాతి (1921). 1901, 1902, 1910, 1920 ల కార్లు కూడా పెట్టారు.
ఆస్టిన్, లింకన్, బెంజ్, షెవి, లాంటి కన్వటిబుల్స్ అలరించాయి.
ఒక్కడ చూడండి -
మసెరాతి -
From Car_Museum

ఫెరారి
From Car_Museum

గ్రేట్ రేసర్ సూర్యా 2009 సీజన్
From Car_Museum

మిగతావి ఇక్కడ చూడండి -

సంగ్రహాలయం = మ్యూజియం

6 comments: