Jul 31, 2009

అమ్మా అమ్మా నువ్వు నాకు కనిపించట్లేదు

"ఆంటీ, సూర్యా లాక్డ్ హింసెల్ఫ్ ఇన్ ది రెస్ట్ రూం"
"ఓహ్ రియల్లీ..లెట్స్ గో"
"కిచకిచ (పిల్ల)"
రెస్ట్ రూం దగ్గర సీన్
"టక్ టక్.. సూర్యా ఏంజేసావ్ రా!! లాక్ తీ"
"అమ్మా రావట్లేదు..రెస్క్యూ మీ."
"నీ మొహం ఇంగ్లీషు [మనసులో - ఎలా ఇప్పుడు]"
"హరితా నేను మెన్టెనెన్సు వాడికి కాల్ చేస్తా"
"అమ్మా అమ్మా నువ్వు నాకు కనిపించట్లేదు రెక్యూ మి. హెల్ప్ హెల్ప్"
"ఒరేయ్ అరవకుండా కాం గా కూర్చూ నాన్నా"
"ఏమండి నేను ప్రయత్నిస్తా ఉండండి!! సూర్యా లాక్ ని నమ్మదిగా నెట్టు"
"రావట్లా"
"ఆంటీ, కెన్ ఐ ప్లేయ్ విత్ అనఘ"
"కిచకిచ"
"వాట్స్ గోయింగ్ ఆన్"
"హీలాక్డ్ ఫ్రం ఇన్సైడ్"
"ఓహ్కే"
"ఆంటీ కెన ఇ టేక్ ది బేబీ"
"అమ్మా మార్బుల్ జేబులోంచి కిందపడింది"
"ఒరేయ్ అరవమాక!! కూర్చో. లాక్ తీయమ్మా"
"డూ యూ నో విచ్ సైడ్ ద లాక్ ఈజ్"
"ఇట్స్ దట్ సైడ్"
"నో, దిస్ సైడ్"
"గాడ్, సూర్యా లాక్ నెమ్మదిగా తీయమ్మా"
"మేం, లేట్ మీ ట్రై"
"నేను భోజనం చేసి వస్తా"
పుష్ పుష్, హమ్మయ్యా తలుపు తెరుచుకుంది.
"అమ్మా!! "
"సూర్యా ఎలారా ఇలా లాక్ వేస్కుంటే!! తప్పురా"
"సరే ఇక నువ్వు వెళ్ళు నేను ఆడుకుంటా."
"కిచకిచ"
"ఆంటీ కెన్ ఐ ప్లే విత్ ది బేబీ"

-----
సాయంత్రం ఇంటికి వచ్చాక మా ఆవిడ మైమరచి ఈ స్టోరీ విశదీకరించి చెప్పింది
"ఏరా!!"
"ఔవును!! అమ్మాఅమ్మా నువ్వు నాకంపిచట్లేదు అంటున్నా లోపల్నుంచి"
"ఏడిసావ్"
"పెద్దైయ్యాక నేను ఫైర్ ఫైటర్ అవుతా!! రెస్క్యూ చెస్తా"


ఇంతలో చంటిది పాక్కుంటూ నా ఈప్మీదకేస్కునే సంచీ సైడుపక్క జేబులోంచి నా నల్ల కళ్ళద్దాలు పీకి ఇరగ్గొట్టింది.


ఒక్కసారి రెండు రెళ్ళు ఆరు సినిమాలో శోభనం సీను గుర్తుకుతెచ్చుకోండి. చంద్రమోహన్, రజనీ జంపు అవుతారు, బయట రాళ్ళపల్లి, పి.యల్ నారాయణ, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, పొట్టి ప్రసాద్, సుత్తివేలు, శ్రీ పుఛ్చా పూర్ణానందం వీళ్ళంతా మాట్లాడుకుంటుంటారు హడావిడిగా.

8 comments:

  1. మొత్తానికి మీ సూర్య మీకు నవరసాలు చూపిస్తున్నాడు గా డబ్బు ఖర్చు లేకుండా :)

    ReplyDelete
  2. మాకు రెండు కళ్లజోళ్ళయ్యాయి.మూడోది రెడీగా ఉంది :)

    ReplyDelete
  3. ఇలాంటివి చాలా చూశాం, చూస్తున్నాం, చూస్తునే ఉంటాం!!! హిహిహీ

    ReplyDelete
  4. naenu kooDaa aruNa gaaritoe eakeebhavistunnaanu!

    ReplyDelete
  5. మొన్న మా చెల్లిగారి బుడ్డీ గాడు ఇలాగే లోపల గెడియ వేసేసుకున్నాడు తీయటం రాలేదు మూడు గంటలు లోపలే ఉండి తలుపుక్రింద ఖాళీ లోంచి బిస్కెట్లూ , చాక్లెట్లూ పంపిస్తుంటే భోంచేసి హాయిగా నేలమీదపడి నిద్రపోయాడు .ఇవతల టెన్షన్ పడి ఆఫీస్ నుండి వాళ్ల నాన్నొచ్చి తలుపు బోల్టులు తీయించారు .ఇంతకూ వాడి వయసు పదిహేను నెలలు ! మీ టపా చదవగానే వాడే గుర్తొచ్చాడు . సూర్య లాగే మా వాడూ బిజీ బీ అయిపోతాడు :) :)

    ReplyDelete
  6. హ హ బాగుంది మీ వాడి రెస్క్యూ గేం :-)

    ReplyDelete