May 30, 2009

ఓ వర్గం గోడు

"అన్నయ్యా!!"
"తమ్ముడూ!!"
"అన్నయ్యా! బజార్లో మనం ఇద్దరం పక్కపక్కనే ఉన్నామా, మళ్ళీ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా హ్యాప్పీగా ఉంది"
"ఔను తమ్ముడూ!! నాక్కూడా. మరి రెడీయా పనికి"
"నేన్రెడీ అన్నయ్యా"
"బండబరువులు మొయ్యాలిగా. చొక్కాలు, ప్యాంటులు, డాయర్లు, బియ్యం కందిపప్పు, చెత్త చెదారం"
"ఔను అన్నయ్యా!! అంతే కాదు, మోస్తున్నప్పుడు ఇసిరిసిరి కొడ్తారా, మనం అంటే గౌరవమే ఉండదా, మళ్ళీ చలని లేదు, మంచని లేదు, వేడని లేదు ఎండని లేదు, జాలే లేదు మనమీన."
"అంతేకాదు తమ్మీ!! ప్రపంచం మొత్తం తిరుగుతామా, ఎక్కడకిపోయినా ఓ మూల ఇస్సిర్నూకుతారా. మనకంటూ మిగిలే జ్ఞాపకాలు, మొహానికి కట్టిన తెల్ల కాయితకాలు, అక్కడక్కడా సెర్మం సినిగిన బొక్కలు"
"ఓను అన్నయ్యా!! అంతేనా, ఓ ఇంటోళ్ళైనాక, యాడ్నో ఓ అటకమీనబడేస్తారా, దుమ్ము, ధూళి, మట్టి, బూజు పేరుకుపోయినా కనీసం ఒక్కసారి ఓదార్చరు, మళ్ళీ అవసరం వచ్చేదాక"
"తమ్మీ!! ఏమనిచెప్పను, మొట్టమొదట కేవలం మనతో మొదలెడతారా జీవితాన్ని. అటకెక్కించినాక ఆ అటకమీన నుండి చూత్తాఉంటే, సెత్త సెదారాలు కొంటారా, అన్నీ సామాన్లు పేరుకుపోతా ఉంటాయా, ఓరినాయనో ఈళ్ళు ఇల్లు మారితే ఇన్ని మోయాలా అని గుండెలు బదబద లాడతంటయి."
"ఏంచేస్తాం అన్నయ్యా!! మనబతుకు ఇంతే"
......
ఈ ఇద్దరు అన్నా తమ్ములు - పెద్ద వి.ఐ.పి సూట్కేసులు.
మా మిత్రుడు, ఇల్లుమారుతున్నాం, చెత్త చెదారాలు అనవసరమైన సామాన్లు ఎక్కువైనై, ఈడకి వచ్చేప్పుడు రెండు సూట్కేస్ లతో వొస్తాం, ఇంతింతై వటుడింతైలా సామాను పెరిగిపోతుంది అని మాట్లాడుకున్న సందర్భంలోంచి పుట్టిన పోస్టు ఇది.

6 comments:

  1. హ హ హ ! బాగుంది :)

    ReplyDelete
  2. పాపం వీళ్ళిద్దరికీ చక్రాలున్నాయో, లేవో? పొట్టపగలా కూరి, పైకెక్కి కూర్చుని మరీ నొక్కి మూతేసి, బర బరా ఈడుస్తున్నారో? అడిగినోళ్ళకీ అడగనోళ్ళకీ అరువుగా ఇస్తున్నారో? ;)

    ReplyDelete
  3. ఈరోజే జీర్ణావస్థలో ఉన్న మా వి.ఐ.పి. సూట్కేసులు కిందకు దిగాయి.. మళ్ళీ వాటిని ఆదివారానికల్లా అటకెక్కిస్తా. ;)

    ReplyDelete
  4. కామెంటెట్టిన అందరికీ ధన్యవాద్

    ReplyDelete