May 18, 2009

చిరంజీవి!! కిం కర్తవ్యం?

నా దృష్టిలో -
పిఆర్పి ఓటమి చిరంజీవి ఓటమి కాదు. పీఆర్పి ఓటమికి ముఖ్యకారణలు - వలసవాదులు. తెదెపా నుండి, కాంగ్రెస్ నుండి పిఆర్పి లోకి దూకిన వాళ్ళపై జనాలు "క్రెడిబిలిటి" ముద్రవేసి ఇంటికి పంపారు. తర్వాత, ఏ పార్టీకైనా ముఖ్యం, ఆ పార్టీ పిరమిడ్ లో కనీసం ఒక వరస పటిష్టత. చిరంజీవి, తన క్రింది వరసల్లో ఏదో ఒక వరసని గట్టి చేస్కోవాల్సింది. పరకాల లాంటి వాళ్ళు ఓటి చేసిపొయ్యారు ఆ పార్టీ ముఖ్య శ్రేణుల్ని. పార్టీకోసం అన్నింటినీ త్యాగంచేసే శ్రేణిని నిర్మించుకోలేక పోవటం చిరంజీవి అనుభవ రాహిత్యం.
ఇక ఇప్పుడు చిరంజీవి పీకల్దాకా మునిగి ఉన్నాడు రాజకీయ సముద్రంలో, వెనక్కివెళ్ళే సమస్య ఉండకూదదు. ఈదటమే. ఈదాలంటె అంత సుళువు కాదు. అతనికి ఇప్పుడు కిం కర్తవ్యం? ఏమి చెయ్యాలి?
నా ఉద్దేశంలో - టిఆర్యస్ మరియూ లెఫ్ట్ ల ఘోరపరాజయాల్ని అతను, సమర్ధవంతంగా తనవైపుకి తిప్పుకోవటం అతనికి ఉత్తమం. అదును దొరికినప్పుడు నెమ్మదిగా తెదెపాని అణగదొక్కగలిగితే కాంగ్రేస్ కి ప్రధానమైన ప్రతిపక్షంగా అవతరించవచ్చు. అలానే తెదెపా ఓటమి ఆ పార్టీని కొంత ఒడుదుడుకులకు దారితీయవచ్చు. ఆ అవకాశాన్నికూడా చిరంజీవి సద్వినియోగం చేస్కోగలగాలి. అలానే, అదృష్టమో ఏమో, ఏమైనా ఓ ఐదు సంవత్సరాల సమయం అతనికి లభించింది. ఇప్పుడు నెమ్మదిగా, బలంగా కోటని నిర్మించుకుంటే ఈ సారి విజయం అతనిదే కావచ్చు. ఐతే ఇది అంత వీజీ వ్యవహరం కాదు అని అతనికి ఈ పాటికే అర్ధం అయి ఉండలి.

కొందరు అంటారు - ఓయబ్బా తొంభై శాతం సీట్లు కొట్టేస్తాం అని చెప్పుకున్నాడు అని. నాకైతే చిరు పార్టీకి పద్దెనిమిది సీట్లు రావటం ఒక పెద్ద మైల్ స్టోన్ అనిపిస్తుంది. కాంగ్రేస్ వ్యతిరేక వోట్ ని చిరు చేజిక్కించుకోగలిగాడు. అది అతని విజయమే. కానీ తెదెపా వోటుని అంతగా చీల్చలేక పొయ్యాడు. అది అతని బ్యాడ్లక్.

ఏమైనా - చిరంజీవి - సాగిపో ముందుకి...

9 comments:

  1. ఒక కేక స్టేట్మెంట్ -
    మీడియా స్వేఛ అంటే యాజమాన్య స్వేఛ కాదు, యాజమాన్యం జర్నలిస్టులకు ఇవ్వాల్సిన స్వేఛ - వై.యస్.ఆర్

    ReplyDelete
  2. యెప్. కేక స్టేట్మెంట్ :)

    ReplyDelete
  3. chiranjeevi andarikanna baagaa laabha paddaadu, okko ticket ki 2 kotlu vasool chesi

    ReplyDelete
  4. అదును దొరికినప్పుడు నెమ్మదిగా తెదెపాని అణగదొక్కగలిగితే కాంగ్రేస్ కి ప్రధానమైన ప్రతిపక్షంగా అవతరించవచ్చు >>ఎంత దురాలోచన !
    తెదెపా ఓటమి ఆ పార్టీని కొంత ఒడుదుడుకులకు దారితీయవచ్చు>>ఇది ప్రరాప కూడ వర్తిస్తుంది :)

    ఇప్పుడు నెమ్మదిగా, బలంగా కోటని నిర్మించుకుంటే ఈ సారి విజయం అతనిదే కావచ్చు>>అంత లేదు ఈసారి బాబుదే ఆ కుర్చీ ఖచ్చితం గా :)5 సంవత్సరాలు ఎప్పుడు అవుతాయాని waiting ఇక్కడ :)

    ReplyDelete
  5. haaaa......elections ayipoyi 5dys kaaledu appude 5 years avvalani eduruchoostunnaru okaru ikkada................

    tdp ki anta ledu...........Y.s.r vunnanta varaku evarikina kashtame..........tanu manchi politician

    ReplyDelete
  6. నా ఉద్దేశ్యం, చిరంజీవికి, అతని చుట్టూ ఉన్న వాళ్లకి ఉన్న 'రికార్డుల' తాపత్రయం కూడా ఈ పరిస్థితికి కొంత కారణం. తక్కువ టైం లో పార్టీ పెట్టి అధికారం లోకి వచ్చి రికార్డు బద్దలు కొట్టాలని ఆలోచించారు తప్ప, పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టలేదు. ఎన్నికలకి కనీసం యేడాది ముందుగా పార్టీ పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో.. ప్రభుత్వం పై రాబోయే వ్యతిరేకతని టీడీపీ, పీఆర్పీలు ఏ మేరకు సొమ్ము చేసుకోగాలవో చూడాలి.. అన్నట్టు వైఎస్ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన హావభావాలు గమనించారా? నేనైతే వీడియో రికార్డు చేయలేకపోయినందుకు చింతిస్తున్నాను..

    ReplyDelete
  7. మురళి భాయ్!! మీరన్నది నిజమే. ఏమైన, నేను అండర్లైన్ చేసినట్టు, కనీసం ఒక లేయర్ గట్టిది ఉండలి ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా, ఏ ప్రభుత్వ యంత్రాంగానికైనా. ఆ గట్టి లేయర్ లేకపోవడమే ఈ రోజున ఇంత లంచగోండి యాజమాన్యాలు రాజ్యాలేలుతున్నాయ్, ఏలాలని తహతహ లాడుతున్నాయ్. నా దృష్టిలో పోలీసు వ్యవస్థ ఈ రకమైన గట్టితనాన్ని ఏర్పర్చుకుని ఉండాల్సింది.
    వైయ్యస్ ఆ స్టేట్మెంట్ అనేప్పుడు ఎలాంటి హావభావాలు ప్రదర్శించాడూ? ఒక్కసారి చెప్పండి ప్లీజ్.

    యోగయ్య - :)
    నరహరి - సార్!! ఈ మాటకి నేను వ్యతిరేకిని. మీరు ఇలా అంటే నేను మీతో ఏకీభవించి ఉండేవాడిని "చిరంజీవి అందరిలాగానే సీటుకి ఇంత అని తీస్కున్నాడు".
    శ్రావ్యా - దురాలోచన కాదు, దూఋఆలోచన :):) నా దృష్టిలో, బాబు ఇక ఇంకో ఛార్మింగ్ మొహం కోసం వెతుకుతాడేమో అని. రాబోఏ ఎన్నికలకి బాబు సుపుత్రుడు తెరపైకి వస్తాడేమో అని అనిపిస్తోంది.
    వినాయక చక్రవర్తి - నిజమే.

    ReplyDelete