May 11, 2009

సూరీడు - మాతృదినోత్సవం - ఓ కార్డ్

మావాడికి ఈ రోజు మాతృదినోత్సవం అని తెల్సిపోయింది. ఎలా అంటే టీవీలో ఎక్కడ చూసినా అదే హేలకదా. అవిచూడంగనే వీడూ, ఓహ్ నువ్వూ మదర్ వే కదా ఉండూ కార్డ్ ఇస్తా అని, వెంటనే ఓ కార్డ్ బెరికి ఇచ్చాడు వాళ్ళ అమ్మకి.
ఓ కాయితకం ముక్క మీద బెరికాడు. దాన్ని స్కాన్ తీద్దాం అని స్కానర్లో పెట్టా కాయితకాన్ని. ఇలా వచ్చింది.
From mothers_day

డాకటేరు మర్సిపోయిన కత్తులు ఎక్స్-రే లో బయటపడ్డట్టు, వాళ్ళ అమ్మ సైడుపక్క పిన్నులు స్కానర్ లోంచి బయటపడ్డై ( వాడుదాచిపెట్టినవే).
ఇక వాడి కార్డ్ -
From mothers_day

ఏ రన్ త్రు :
HAPPY అని రాయంగనే పురుగుకుట్టింది. పక్కనబెట్టాడు మిగతాది. HAPPY పక్కనే ఉన్నది వాడే. వాడికి రెండు లేజర్ బీమ్స్ వచ్చాయ్. దేనికో అర్ధం కాలా. HAPPY కింద వాడి చెల్లాయ్. HAPPY చివర్న ఓ చెట్టుకూడా ఉందండోయ్.

ఇది కేక -
From mothers_day

ఏ రన్ త్రు -
వాళ్లమ్మ. వాళ్ళమ్మ బొట్టు - వాడు దానికిచ్చిన పేరు - ముక్కు బొట్టు.
కింద నేను. నా కళ్ళాజోడు వెయ్యటామికి ప్లేస్ లేదు అని ఎక్కడో ఎడం పక్కన వేసాడు.
ఓ పువ్వు కూడా ఇచ్చాడు మా ఇద్దరికి.
వాళ్ళ అమ్మకి పొద్దున్నే వచ్చి చెవిలో చెప్పాట్టా మాతృదినోత్సవం అని.

14 comments:

  1. హరితగారిని భద్రంగా దాచుకోమనండి.తరువాతెప్పుడో తీరిగ్గా చూసుకొన్నపుడు అవెంత విలువ కట్టలేనివో తెలుస్తాయి.మా చిన్నది కూడా ఇచ్చింది. ఒక కాగితప్పూల బొకేల కార్డ్.

    ReplyDelete
  2. నిజ్జంగా మీ సూరీడు భవిష్యత్తులో పేద్ద చిత్రకారుడైపోతాడనిపిస్తోంది :)
    ఈసారి మాతృదినోత్సవ సందర్భంగా మీకు అపురూపమైన కానుక దక్కిందన్నమాట.!

    ReplyDelete
  3. Anna,

    Last year, google announced a soft of contest with the name What is your gmail story? and people responded with many touching ones...

    One such story is this: A guy created a brand new gmail id for his new born son and kept sending emails to it every now and then. He would email his feelings, his thoughts on many things, his dreams for his son... how happy he was with his son etc., Think about it, when the boy grows up and receives this gift from his father, wouldn't it be fabulous? I was touched by that story!!

    Why am I writing this here? I see that Suri is very talented. You might wanna chronical everything he does, add your comments. Convey your ideas... and one fine day, gift it to him. He will love it :)

    ReplyDelete
  4. చైతన్య, సునీత గారు, పానీపూరి ఫ్రం గుంటూర్, మధురవాణి, దీపు - ధన్యవాదాలు.
    యోగయ్య - మంచి సూచన. పాటిస్తాం. ఏంజేస్తాం? పాటిస్తాం. అరే, పాటిస్తాం అన్జెప్పినాగా...వారీ...:):)
    కొత్తపాళీ అన్నగారు - అవును అన్నగారు ఎట్ ది సేం టైం, childhood is precious too. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. Surya is very talented .Keep encouraging him

    ReplyDelete
  6. నా అబ్జర్వేషన్ ఇదీ -
    ౧. వాడు, వాణ్ణి, వాడి చెల్లాయ్ ని ఒకే పేజ్ లో వెయ్యటం అత్భుతం.
    ౨. అమ్మనీ నన్నూ ఇంకోపేజీలోకి నెట్టటం వాడి ఊహకి అందకపోయినా అదొక మెచ్యూర్డ్ ధింకింగ్.
    ౩. అమ్మా నాన్నా బొమ్మ వేసి, పువ్వు వాళ్ళ పేజీలో వెయ్యటం కూడా. వాడి వైపునుండి అది కేవలం యాదృఛికం కావచ్చు కానీ ఆలోచించాల్సిన విషయమే.

    ReplyDelete
  7. చాలా చాలా బాగున్నాయ్.. మా సూరిబాబా మజాకా..

    ReplyDelete
  8. సూరీడు గీసిన కళాఖండాలు ఇప్పుడే కాస్త లేట్‌గా చూశాను.very nice! తొందర్లో ఓ ఆర్ట్ టీచర్ని చూడాలి మీరు :)
    Way to go surya!

    ReplyDelete
  9. తెరెసా గారూ - :):):) లేట్ గా అయినా లేటేస్ట్ గా వ్యాఖ్యానించారు...ఇంకో టీచర్ దేనికండీ, నేను, వాళ్ళ అమ్మ, పిల్ల ముగ్గురం ఉన్నాం :):)

    ReplyDelete
  10. :) హ హ బావున్నాయ్.
    మీ ఆబ్బాయీ మా పిల్లాడిలాగే! మావాడూ నాకు ఇచ్చాడు ఓ కార్డ్ :)

    మావాడి బొమ్మల వెనక ఉన్న కథలు అర్ధం చేసుకోలేక.. కథ చెప్పి బొమ్మ గీయమని చెప్పేదాన్ని. కథకు బొమ్మ గీయడం మొదలెట్టి ఇప్పుడు ఎక్కడ ఏ బొమ్మ చూసినా కథ అల్లడం మొదలెట్టేసాడు. కూర్చోబెట్టి చెపుతూ ఉంటాడు :( :( విన్న వాళ్ళకు విన్నంత...

    ReplyDelete
  11. హ హ హ కళ్ళజోడుకు ప్లేస్ లేదని ఎక్కడో వేసాడా :) :) ముక్కుబొట్టు బావుంది :)
    చిన్న పిల్లలందరిలో అమ్మ బొట్టు, గాజులు, గొలుసు వీటిమీదే ఆసక్తి. మావాడికి సూత్రాల గొలుసంటే పెద్ద క్రేజ్ ఉండేది బొమ్మేసాడంటే అదీ ఉండేది. దాన్ని నాన్నపెళ్ళి గొలుసు అనేవాడు :)

    ReplyDelete