Mar 4, 2011

బ్లాగ్ సహాయనిరాకరణ

తెలంగాణ గావాల అని గోలెబెట్టే తెలంగాణ వాదులు, దస్కం ఇరజిమ్మి మూకల్నెగేసి రోడ్లెమ్మట తోలి రాష్ట్ర రాజధాన్నే నిర్భంధించి, అదిరించి, బెదిరించి, *సహాయ నిరాకరణ* అని పేరెట్టి ప్రజానీకం నోట్లో మట్టిపెడ్డలు కొడతన్నారు, రోడ్లెమ్మట నడిచేటోళ్ళ మీద పేడముద్దలు కొడతా ఉన్నారు. ఇట్టా గావాల్సిందే. కానీ, హైదరబాదులో పెట్టుబళ్ళు పెట్టిన తెలంగాణేతరుల ఇష్యం తేలకుండా సహాయనిరాకరణ జేస్తే ఏమౌద్దీ? అని ఎవురికైనా అనుమానం రావొచ్చు. ఏమౌద్దీ? మర్సిపో సిన్నా అని జెప్పు అంటాడు ముక్కోడు. ఆడిదేం బోయింది.
ఇంక పై సంత గాళ్ళ పక్కన డప్పుగొట్టుకుంటా తిరిగే సెంచా గాళ్ళకి ఇదేగా సందు. తెగ వాయిస్తా ఉన్నారు ఢమాఢమా అని. అందులో ఓ మోత *తెలుగు సాహిత్య సహాయ నిరాకరణ*.
ఓర్నీయమ్మ అట్టా సేయమాకండ్రా, ఓఐపు ముక్కోడు పెట్టిన మంటతో నోట్టోకి రెండేళ్ళెల్లటమే కష్టంగుంటే, మూలిగే నక్కమీన తాటికాయ పడ్డట్టు, *సాహిత్య సహాయ నిరాకరణా* సేస్తే మా పొట్టలు నిండాల్నా వద్దా?
మడుసుల పైనుండి ముక్కోళ్ళు
కిందనుండి ఇట్టా సాహిత్య రంగపోళ్ళు ఎనకమాలనుండి మిగతా కుంకలు దాడి సేస్తాఉంటే జీవితాలు ఎళ్ళేదెట్టా? బతుకులు తెల్లారేదెట్టా?
సందట్లో సడేమియా నేనూ ఓ కేక పెడతాఉన్నా, ఓ రంకె ఏస్తాఉన్నా.
ఇట్టా అగుపించిన ప్రతీఓడు నిరాకరణ అంటాఉంటే తెరమీనకి కొన్ని నిరాకరణల్ని లాక్కొస్తాఉన్నా.
౧. *లంచం* (అ)*సహాయ* నిరాకరణ -
ఇంక ఎప్పుడైనా, ఎవుడన్నా లంచం అడిగితే నిరాకరణ సేయ్యాల. లంచం అడిగోఓళ్ళన్నా కనీసం ముక్కోణ్ణి సూసి లంచం అందుకునేంటందుకు నిరాకరించాల.
౨. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నంత కాలం నిరాకరణ సేసే ఓళ్ళు, యావత్ రాష్ట్ర ప్రజల పన్నుతో ఇచ్చే జీతాలు నిరాకరించాల. అందాకెందుకు నిరాకరణ సేసేవోళ్ళు అస్సలు ఉగ్యోగాలకు రాజీనామాలిచ్చి నిరాకరణ సెయ్యాల
౩. నా తరఫున, బ్లాగు సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నా. ఎట్టా?
మరో బ్లాగు సదవను
యాడా వ్యాఖ్య బెట్టను
మాలిక కూడలి మావిడితాండ్ర హారం ఏట్నీ తెరవను
తలో సెయ్యి కాలు బ్లాగు సహాయ నిరాకరణలో ఎయ్యాలని గుంపులు గుంపులుగా పాలు కొనాలనీ పెరుగట్టుకెళ్ళాలనీ కేక రంకె అరుపు అరుస్తా ఉన్నా.

జై పోరాటం
జై జై పోరాటం

గమనిక - హేటుగాళ్ళా కామెంట్లు నిర్దాచ్చిన్యంగా నరికేయబదతై. సహాయ నిరాకరణ. అరదం సేస్కోవాల. కావాలంటే ఎవురి బ్లాగులో ఆళ్ళు హేటు టపాలు కుమ్ముకోండహే. సహాయ నిరాకరణ, గురుతుకు బెట్టుకోవాల.

6 comments:

 1. $భాస్కర రామరాజు గారు
  ఇంతకీ మీ డిమాండ్లు యేటో సెప్లా!!!

  #మాలిక కూడలి మావిడితాండ్ర హారం ఏట్నీ తెరవను
  :)) ఈ మావిడితాండ్ర అప్పయగారెట్టిన సంకలిని పేరా? :))

  ReplyDelete
 2. కాదులేబ్బా
  పాపం అప్పి, శ్రమపడి తెరకెక్కించాడు. ఊర్క ఫ్లోలో వచ్చిందా మాట :):) మిగతా సంకలినులు.
  మాలిక కూడలి హారం కాకుండా అప్పి గారిది కూడా కాకుండా ఇంకేం ఉన్నై? బుర్ర ఏటి బుర్రెట్టి ఆలోసించు సిన్న

  ReplyDelete
 3. #..పాపం అప్పి, శ్రమపడి తెరకెక్కించాడు..
  అవ్ పాపం మంచి మడిసి తెగకష్టపడతాడు.. నే యేదో సరదాకి :) ఆ వంకతో అప్పయగారి సంకలినికి పెచారం.

  అన్నట్లు బొప్పయ గారు యేడున్నారో, ....కల్లొత్తుకుంటూ!

  ఇంతకీ ఈ సాహిత్య సహాయ నిరాకరణ అని మొదలెట్టిన మేతావి ఎవరు? వినాశ గుబేనా?

  ReplyDelete
 4. బ్లాగర్ల జెఎసి మీకు మద్దతు ప్రకటిస్తోంది
  మిలీనియం ఏప్రిల్ కి కూడా పిలుపు ఇచ్చేయండి

  ReplyDelete
 5. రాజేశా
  ఇంకెవురు జేస్చారబ్బా?
  *మేల్కొని ఉండు రేత్తిరి* గారు మొదలుబెట్టినారు.

  శంకర్ - కెవ్వు. బ్లాగర్ల జెఏసి.

  ReplyDelete