Apr 1, 2011

ఎవడబ్బ సొమ్మని కూలస్తారు

ఎవడబ్బ సొమ్మని కూలస్తారు
మా జాతి విగ్రహాలు
ఎవడబ్బ సొమ్మని కూలుస్తారు
మా జాతి సౌధాలు
మా కాయకష్టపు పెట్టుబడులు
ఎవడబ్బ సొమ్మని కూల్సుస్తారు
ప్రజల డబ్బుతో కట్టిన సౌధాలను
ఎవడబ్బ సొమ్మని కూలస్తారు
లేచిన గడ్డపారలను
ప్రజలసొమ్ము తినే
రాజకీయ రాక్షసుల గుండెల్లో
దింపలేని కుజాతి మీది
రాజకీయ నాయకులను
నిలదీయలేని దైన్యత్వం మీది
అవినీతిమీద పోరాటం చేయలేని
పిరికితనం మీది
కొత్త రాజ్యాన్ని నిర్మించాలంటే
ఉన్నవాట్ని కూలగొట్టుడు
ఆనాడు చెల్లిందేమో
ఉన్నవాటిను కూలగొట్టి
ఉన్న రాజ్యాలను మట్టుపెట్టి
అణువణువూ కాజేసి
ప్రాణాలు తోడేసి
మడిసి దట్టాలపై
ఎముకల బజారులో
కట్టిన తురుష్క సామ్రాజ్యపు
దుర్గంధం ఇంకా కొడుతోంది నీ ఆలోచనలో
నీ దిగజారిపోయిన ఆలోచనలో
నీ మతిలేని ఛాందసవాదంలో
పసలేని నీ కవితా ఇదిలింపులో
లేపిన పలుగులు నీ గుండెల్లో దింపే రోజు
అవి నీ గుండెల్లో దిగేరోజు
ఎంతో దూరంలో లేదు
ఎత్తిన పలుగుకు
గమ్యం ఒక్కటే తెలుసు
చేపకన్ను ఒక్కటే అగుపిచ్చి
ఆ కన్నులోన పలుగు నాటినరోజున
కన్నులోనుంచి గుండెలోకి దిగబడే
ఒకే పోటు............................
ఒకే పోటు వేసే సమయం వచ్చింది
వేసే చేతులు
వెయ్యగలిగే గుండెలు
గుండెల్లో మంటలు
రగుల్కొన్నాయ్
మంటలు రగుల్కొన్నాయ్
ఖపడ్దార్ కొడకా
రగతం మరుగుతా ఉది
గుండెలు ఎగసి పడతా ఉన్నాయ్
పలుగులు సేతిలో ఉన్నాయ్
ఖపడ్దార్

9 comments:

  1. $భాస్కర్ గారు

    మీరు చెప్పాలనుకుంది చాల తక్కువ పదాల్లో అర్థవంతంగా చెప్పారు. అధ్బుతం.

    #కొత్త రాజ్యాన్ని నిర్మించాలంటే.. ఉన్నవాట్ని కూలగొట్టుడు

    దోచుకొని మరీ కూలగొట్టుడు!

    #ప్రాణాలు తోడేసి..మడిసి దట్టాలపై..ఎముకల బజారులో.. కట్టిన తురుష్క సామ్రాజ్యపు..దుర్గంధం ఇంకా కొడుతోంది నీ ఆలోచనలో

    అది మతిమాలిన "హింసరచన" కి పునాది.

    #నీ మతిలేని ఛాందసవాదంలో.. పసలేని నీ కవితా ఇదిలింపులో
    అధ్బుతం!

    #మంటలు రగుల్కొన్నాయ్..ఖపడ్దార్ కొడకా..రగతం మరుగుతా ఉది

    ఖబడ్దార్!

    ReplyDelete
  2. మాంచి కసి మీద వ్రాసినట్లున్నారు సెటైర్ అదిరింది :).

    కావాలంటే వాళ్ల నెత్తిన కాసిని పెట్రొల్ పోసుకొని బతకలేక బలహీన గుండెలతోనో, తాత్కాలిక భావోద్వెగాలతోనో చస్తే చావాలి కాని, ఊరి సొమ్ము ద్వంసం చేయటానికి వీళ్ళెవరు?
    హైద్రాబాద్ ఏమయినా ఈ "సమైక్య తెలబానులు" దా?

    ReplyDelete
  3. 'ఆ' కవిత చదివిన వెంటనే ఆవేశం పట్టలేక నరనరాల్లోనూ మరుగుతున్న ఆగ్రహం తో రాసినట్టు ఉన్నారు. అక్షరాలు ఇంకా నిప్పులు కక్కుతున్నాయి.


    శబాష్.ధీటైన జవాబు

    ReplyDelete
  4. Super ....Ke ka ...But dont do same mistake what others did...

    ReplyDelete
  5. #బాగా నచ్చినవి
    "

    నీ దిగజారిపోయిన ఆలోచనలో
    నీ మతిలేని ఛాందసవాదంలో
    పసలేని నీ కవితా ఇదిలింపులో

    "

    #మరికొన్ని..

    ప్రజలసొమ్ము తినే
    రాజకీయ రాక్షసుల గుండెల్లో
    దింపలేని కుజాతి మీది

    రాజకీయ నాయకులను
    నిలదీయలేని దైన్యత్వం మీది
    అవినీతిమీద పోరాటం చేయలేని
    పిరికితనం మీది

    ..
    బుర్ కే లూజ్... నువ్వు మస్తు కామెడీవోయ్ ;)

    ReplyDelete
  6. మీరు చెయ్యాల్సింది
    విగ్రహాలను పట్టి
    విరవటం కాదు
    మాట పలుకూ లేని
    వేమి చేస్తాయి?
    పర్లమేంటూ లోన
    అసెంబ్లీ లోన
    మాట పలుకూ ఉన్న
    పవురు లున్నారు
    దమ్ముంటే వారిని
    గెలుచుకో వయ్య
    మీకు కావాల్సింది
    వెంటనే వచ్చు.

    ReplyDelete
  7. $Rao S Lakkaraju గారు

    చక్కగా చెప్పారు. "ఆయనే ఉంటే .." అన్న చందాన ఆ దమ్ములేకనే కదా.. "నల్లగొర్రె" టపాలు రాసుకుంటూ బతికేస్తున్నాడు.

    ReplyDelete
  8. http://mottikaayalu.blogspot.com/2011/04/blog-post.html

    ReplyDelete