ఒక ప్రసంగం
ఒక మాట
ఒక పాట
ఒక బాట
మడుసుల్ని గుడ్డోళ్ళను సేస్తాయంటే
నే నమ్మలా
తెలంగాణా వచ్చుడుకీ
పంట బీడుపోటానికీ
మోకాలుకీ
బోడిగుండుకీ
యాడా సంబందం?
పోరాడాలె
నిజ్జం
పోరాడకపోతే
మెత్కుదొర్కని
దినాలు
ఆ మెత్కులు
దోసే రాజకీయ నాయకులు
రాజకీయ నాకొడ్కులు
నిన్ను కరెంటు బుగ్గకి
ఏల్లాడదీస్చాన్నారు
రాజకీయ బలిమితో
రాజకీయ సొర్థంతో
రాజకీయ కుట్రలతో
రాజకీయం కోసరం
ఆవేశపు
ప్రసంగం
మాట
పాట
బాట
రాపిస్చన్నారు
లెగు లెగు, పోరాడు
సొర్థపు రాజకీయ నాకొడుకుని
సంపేసేయ్
నీలోని
సమాజామ్లోని
మడిసిలోని
సోర్థపు రాజకీయనాయకున్ని
సంపేసేయ్
వెయ్యి తెలంగాణాలు ఒస్తై
వెయ్యి భారతదేశాలు ఒస్తై
అవే ఒస్తై
ఏ తమ్ముళ్ళానూ బలిచ్చే పనిలా
ఏ అన్నలనూ సంపేసే పనిలా
ఏ బస్సులనూ తగలనూకే పనిలా
ఏ జీవితాలనూ కాలరాచే పనిలా
లెగు లెగు.......
Subscribe to:
Post Comments (Atom)
నీ కవిత ఏమీ అర్థం కాలేదు. స్వార్థ రాజకీయాలంటే అది కోస్తా ఆంధ్ర నాయకులకీ వర్తిస్తుంది. 2009 డిసెంబర్‌కి ముందు తెలంగాణా నిజంగా రాదనుకుని తాము తెలంగాణాకి అనుకూలం అని చెప్పుకున్న నాయకులే మాట మార్చేశారు. ఇక్కడ తెలంగాణా నాయకులే మోసం చేస్తున్నారనడానికి లేదు.
ReplyDeleteఅయ్యా ప్రవీణు శరమ
ReplyDeleteమా కరమ
>>స్వార్థ రాజకీయాలంటే అది కోస్తా ఆంధ్ర నాయకులకీ వర్తిస్తుంది.<<
నిజవే. భారతదేశం పైనుండి కిందదాకా యాడా స్వార్థ రాజకీయనాయకులు లేరు కేవలం ఆంధ్రాలో తక్క. ఒకేళ ఉన్నారంటే ఇతర రాష్ట్రాల్లో కూడక స్వార్థరాజకీయన నాయకులు, ఆంధ్రావాళ్ళే.
మా అన్నాయిని పట్టుకొని "ప్రవీణు "శరమ"
ReplyDeleteమా కరమ" అంటారా, హన్నా, ఇదేమీ బాలేదు.
నా హృదయం విలవిల్లాడింది, కీబోర్డు వణికింది కూడా. కానీ విధి బలీయమైంది నాయనా..బలీయమైంది.
ReplyDeleteప్రవీణు మరమ... అన్నాయి మాట్లాడే మరమం అన్నాయికే తెలియాలి.
ReplyDeleteతెలంగాణా రాజకీయనాయకులు ఒకరిని ఒకరు తిట్టుకున్నా, ఆంధ్రా వాళ్ళదే తప్పు. తెలంగాణా రాజకీయనాయకులు సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు దండుకుని వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నా, కారణం ఆంధ్రా వాళ్ళ స్వార్థమే.
ఈ మర్మాలేంటో మా అన్నాయికే తెలియాలి.
మొదటి వ్యాఖ్యే అసంబద్దమైనది అవడం వల్ల మీ టపా గురించి వ్యాఖ్య రాయడం కుదరలేదు, క్షమించాలి.
ReplyDeleteరాజకీయనాయకుల స్వార్థానికి బలైపోతున్న చాలా మంది గుండెమంట ఇదే. మీరు చెప్పింది అక్షరాలా నిజం, మొదట పోరాడాల్సింది ఈ స్వార్థ రాజకీయనాయకుల మీద.
"నీలోని
ReplyDeleteసమాజామ్లోని
మడిసిలోని
సోర్థపు రాజకీయనాయకున్ని
సంపేసేయ్"
మంచిమాట
ఇది జరిగిన నాడు అంతా,అంతటా,అందరూ క్షేమమే
చాలా బావుంది.. కాని సాటి తెలంగాణా బ్లాగర్లకి ఇది ఎంతవరకూ అర్ధం అయింటుంది? కామెంట్లు కూడా చాలా బావున్నాయి..
ReplyDeleteచంపేయ్ మంటే నిజం గా మర్డర్లు చేయ్యమంటున్నారని కేసులు వేస్తారేమో :)))))))))))))))
ReplyDeleteనా హృదయం విలవిల్లాడింది, కీబోర్డు వణికింది కూడా. కానీ విధి బలీయమైంది నాయనా..బలీయమైంది.
------------------------------
హ హ ఇది మాత్రం సూపర్ :))))
యజ్ఞ గారూ - ధన్యవాదాలు.
ReplyDeleteవిజయ్ అన్నాయ్ - ఔను. మడిసి గొఱ్ఱెలకు అది అర్థమవ్వదుగా. పొలోమని ఎందుకు పోరాడుతున్నామో కూడా తెలియదు గాని పోరాడుతారు.
వోలేటి గారూ - అర్థం అయినవారికి అర్థమైనంత :) ధన్యవదాలు
శ్రావ్యా - కేసులు గోల ఏవొటో నన్నొదలటంల్యా. ఏవొటోనమ్మా నిజవే. పుసుక్కున ఎవరోకడు మళ్ళా కేసంటాడేమో !!!!
పెవీను
ReplyDelete>>>"స్వార్థ రాజకీయాలంటే అది కోస్తా ఆంధ్ర నాయకులకీ వర్తిస్తుంది"
మమ్మల్ని ఏమన్నా అను మా కోస్తా రాజకీయ నాయకులని ఏమీ అనమాక
మా కోస్తా రాజకీయ నాయకులు మాకు దేవుళ్ళు
వెర్రి నాయాళ్ళు పెట్టుబడులు అన్నీ బాగ్య నగరం లో పెట్టారు
ఇప్పుడు లాక్కోలేక పీక్కో లేక సస్తున్నారు
@భారారే: కవిత తెలంగాణ మీద వ్రాశారు కాబట్టి..ప్రవీణ్ శర్మ అన్న దాన్లో తప్పేముంది.. మీరు మీ కామెంటు లో ఇంత వెకిలిగా ప్రవర్తించటం బాగా లేదు..
ReplyDeleteబాబూ ప్రవీణ్ కరమ
ReplyDeleteనీ కచ్చ అక్కడ సూపించు, ఇక్కడ కాదు.
@కిరణ్
నేను ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీరెలా నిర్ణయిస్తారూ?
పరవీణు
ReplyDeleteనీ కామెంట్లు కత్తింపబడ్డాయి.
Good post..... sri sri ni gurthukutecharu
ReplyDelete