Apr 5, 2020

సుదతి

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా
సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును మరుల విరులు కురియగ
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
- సినారె

కొంచెం విచిత్రమైన ఆలోచన ఇది. సాధారణంగా అతను ఆమె శరీరాకృతినో కురులనో కళ్ళనో లేక చెవులనో పొగుడుతాడు. సదరు విషయాలన్ని శృంగార విశేషాలు. కొందరు చెవి ఝుంకాలను నడుముకున్న ఆభరణాలను చేతికున్న వంకీలను కూడా జత చేస్తారు
కాని ఇక్కడ సినారె సుదతి తనువు మదన ధనువు అంటాడు. ఆమె శరీరం మదనుడి విల్లు అన్నాడు కానీ ముందు సుదతి అని వాడాడు.
సుదతి - చక్కని పలువరుస కలది
అప్పుడే డెంటల్ డాక్ దగ్గరకెళ్ళి డీప్ క్లీనింగ్ చేయించుకొచ్చింది.


దీనికి మూలం బహుశా సంస్కృత సాహిత్యం అయుండచ్చు.

ప్రియే చారుశీలే.. ప్రియే చారుశీలే..
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
హరతి దర తిమిరమతిఘోరం

జయదేవ అష్టపది
వదసి
యది
కించిత్
అపి
దంత
రుచి
కౌముది
హరతి
దర
తిమిరం
అతి
ఘోరం

ఎలా అర్థం చేస్కోవాలో - ప్రియా మూతి బిగించుకుని  కూర్చున్నావు, ఒక్క మాట పలకటానికి నోరుతెరువు. తెల్లని నీ పలువరుస నుంచి వచ్చే కాంతి ఈ ఘోర తిమిరాన్ని హరించనీ.

No comments:

Post a Comment