Jan 13, 2021

భోగభాగ్యాల భోగి

భోగభాగ్యాల భోగి
ఈదేశం వచ్చాక భోగమూ లేదు భాగ్యము లేదు అని గునిసేవాళ్ళు ఉన్నా
భోగం అంటే మానసిక వై-భోగం అనుకుంటే
అదే మహాభోగం వైభోగం భాగ్యం
ఈవేళ్ళటి రోజున అన్నిటి కన్నా బాగ్యం వైభోగం - ఆరోగ్యం
మీరు ఆరోగ్యంగా ఉండండి
మీ చుట్టుపక్కల వాళ్ళని ఆరోగ్యంగా ఉండనివ్వండి
మిత్రులందరికీ భోగి మేలుతలపులు శుభాకాంక్షలు
కళ్ళం కాడినుంచి బండి నిండా కొత్త బియ్యాన్ని ముందిట్లోకి దింపి
వచ్చే దారిలో కనిపించిన చెఱుకు గడలు నాలుగు కొట్టుకొచ్చి
పొద్దున్నే అడవికి వెళ్ళి అడవిరేగి పండ్ల చెట్టుని దులిపి
రాలిన పండు రేగులు తెచ్చి
అంతలో పనికిరాని చెత్తని ఏరుకొచ్చి
ముంగిట మంటవేసి
అంతలో చిక్కుడు ఆకులతో రెండు బొక్కెనలు నెత్తికి పోసుకుని
అప్పుడే పేడతో అలికిన పొయ్యి మీద
దొడ్లోని గొడ్డుపాలతో పరమాన్నం చేసుకుని
నివేదనలు కరపి
మూడురోజుల సంక్రాంతిని ఆహ్వానించటానికీ
మనమేమీ పల్లెలోనో లేము
ఆసామి తనమూ లేదు
చేయతగ్గదల్లా
సంక్రాంతి లక్ష్మికి చేతనైనకాడికి దండమెట్టుకిని
ఎవురి ల్యాపుటపుల్లోకి ఆళ్ళు తలలు కాళ్ళు చేతులు దూర్చేసి
పనిచేస్కోటమే

No comments:

Post a Comment