Apr 9, 2024

ఉగాదికి స్వాగతం

 లేని వసంతాల వెంట
కానరాని వనాల మధ్య
లేని మామిడి చిగుళ్ళుతినే
వినిపించని కోయిలగొంతు కోసం
ఊహల్లో విహరిస్తూ
లేని కలంలో
కనిపించని సిరా నింపి
ఊహాజనిత కాయితం మీద
రాసే కవిత సాక్షిగా
గతేడాది ఇదేరోజున
పంచాగం వెతికి
రాశీఫలాలు శోధించి
ఛీ ఎప్పట్లానేనా అనుకుని
ఉసూరుమన్న జ్ఞాపకానికి
అప్పుడే ఏడాదయ్యిందనుకుంటూ 
కొత్త ఫలాల కోసం శోధిస్తూ
ఆశతో .... 
ఉగాదిగి స్వాగతం చెప్తూ ...

2 comments:

  1. ఇంకా నయం. మామిడి కాయలు, వేప పువ్వు, ఇప్పటికీ దొరుకుతున్నాయి. ప్రతి ఏడు ఉగాది పచ్చడి తింటున్నాము అంటే మనం భాగ్యశాలులమని అనుకోవాలి.
    ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. అదీ నిజమే

    ReplyDelete