గ్రీసు/టర్కీ దేశాలల్లో భూకంపం
"జర్మనీలో భూకం వచ్చిందటరా. సునామి వచ్చిందట. గ్రీస్ అనే దేశంలో కూడా వచ్చిందట" అంటూ అమ్మ ఫోన్.
సర్ది చెప్పటానికి ప్రయత్నించాను. టెన్షన్ పడకూ అని.
గ్రీస్ తో నా అనుబంధం మనసులో మెదిలంది.
2000 సంవత్సరంలో ఓ సారి గ్రీస్ వెళ్ళాను. హోలార్గోస్ అనే ఊళ్ళో బస ఇచ్చారు. నేను ఉన్న ఇంటి ఓనర్ పేరు దిమిత్రి. అతను కొంత కాలం కొత్త డిల్లీలో ఉన్నాట్ట. భారతీయులంటే అదొక అనుబంధం అని చెప్పుకొచ్చాడు.
నేను పని చెసిన ఆఫీసు కిఫిసీస్ ఎవెన్యూలో ఉండేది. బస్సులో వెళ్ళి, మైలు దూరంలో దిగి నడుచుకుంటూ వెళ్ళేవాణ్ణి.
గ్రీస్ లో కొందరు పరిచయం అవ్వటం వాళ్ళతో సాంస్కృతిక చర్చలు జరగటం - ఓ జ్ఞాపకం.
అక్కడ పరిచయం అయిన మిత్రులు ఆక్రొపొలి దగ్గర్లో ఉన్న ఒక గ్రీక్ ట్రడిషన్ల్ బుజీకి క్లబ్ కి తీసుకెళ్ళటం, క్లబ్బులో గ్రీక్ పాటలు బుజూకి సంగీతం ఆశ్వాదించటం, పాట నచ్చితే పింగాణి ప్లేట్లు నేలకేసి పగలగొట్టి ఆనందాన్ని సంతోషాన్ని వెలిబుచ్చాలనే విషయం తెలిసి తెల్లబోవటం ఓ జ్ఞాపకం.
గ్రీకులు తమ సంస్కృతిని తమ పురాణ ఐతిహాసాలని గొప్పగా చెప్పుకోవటం, కొత్తతరం పాతతరం సంస్కృతిని ఎలా మిళితం చేసుకున్నాయో చూసి ఆశ్చర్యపోవటం - జ్ఞాపకం.
గ్రీకు భాషకి, సంస్కృతానికి సంబంధాలు - మాత్రోస్/మాతా, పిత్రోస్/పితా లాంటి పదాల సారూప్యత. గ్రీకు దేవుళ్ళు/హిందూ దేవుళ్ళు ఇత్యాది అనేక సారూప్యతల గురించి చర్చలు - ఒక జ్ఞాపకం.
అనేక జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.
అక్కడి జనుల క్షేమం కోరుతాను.
మొన్నే కోర లో ఒక సమాధానం చదివాను , భారతీయుల డ్రెస్ చీర ఆధునికత సంతరించుకుని , ఆఫీస్ లో ఫార్మల్ మీటింగ్ లకి కూడా వేసుకునే డ్రెస్ లా తయారయింది కానీ , గ్రీకుల సంప్రదాయ డ్రెస్ అలా ఎందుకు అవలేదు అని . ?? ఎవరో బాగా రాశారు .
ReplyDeleteShare the link
ReplyDeletehttps://www.quora.com/What-are-some-pretty-traditional-Turkish-clothes-Why-arent-Turkish-clothes-getting-modernized-like-the-Japanese-traditional-clothes.
ReplyDeletesorry, the question was Turkey vs Japanese , someone answered it by comparing with Indian attire.