Oct 28, 2020

కోవిడ్ గోప్యత


"ఎవరితో అనవాకు గానీ, పలానీ వాళ్ళకు కోవిడ్ వచ్చిందట. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నదట. వాళ్ళు ఎవరికీ చెప్పటం లేదు" అన్నది అమ్మ.
"అమ్మా! నువ్వు జాగ్రత్త! ఎక్కడకీ పోవాకు, ఎవర్నీ రానివ్వవాకు" అని సర్ది చెప్పాను.
"భయంగనే ఉంటున్నదిరా!" అంటుంది అమ్మ.


ఒక నిమిషం ఏం చెప్పలో పాలుపోలేదు.
కొవిడ్ సోకిన వాళ్ళు ఎందుకు దాచిపెడుతున్నారు వచ్చిందనీ?
దాని వల్ల కలిగే లాభం ఏంటీ?
కోవిడ్ వస్తే వచ్చిందీ అని చెప్పుకుంటే జరిగే నష్టం ఏంటీ?
పలు ప్రశ్నలు మనసులో. 
కోవిడ్ వస్తే వచ్చిందని చెప్పుకుంటే పక్కన వాళ్ళు కాస్త జాగ్రత్త పడతారు కదా?
అది కనీస బాధ్యత కదా అని నా అభిప్రాయం.
దాచిపెట్టటం వల్ల లాభం నాకు అవగతం అవ్వటం లేదు.
ఎందుకు దాచాలీ? వచ్చిందీ అని చెప్పుకుంటే జరిగే నష్టం ఏంటీ? ఇదిమిద్ధంగా జవాబు తట్ట లేదు. 

మా పక్క సందులో ఓ దేశీ. గత రెండు నెలలుగా అతను కనిపించలేదు. ఆమె పిల్లాడిని బైకింగుకి గట్రా తీసుకెళ్తున్నది. ఓ నెలన్నర క్రితం ఆమె ఎదురై బాగున్నారా అని పలకరించింది. క్షేమసమాచరం అయ్యాక చెప్పింది వాళ్ళ మామ గారు పోయారు, ఆమె భర్త అంత్యేష్ఠికి కోయంబత్తూరు వెళ్ళాడని చెప్పుకొచ్చింది. ఆమె మామగారు కోవిడ్ వల్ల పోయారని చెప్పింది.

మా అమ్మ గారు హ్యుస్టన్ వచ్చినప్పుడు రోజూ 15000 అడుగులు వేసేది/నడిచేది. పొద్దున కొంచెంసేపు, సాయంత్రం కొంచెం సేపు. సాయంత్రపు నడకలో సదరు మామగారు మామీ గారు మ అమ్మగారికి నడక మిత్రులు. వాళ్ళు వచ్చీరాని తమిళతెలుగులో మాట్టాడటం మా అమ్మ తెలుగులో దంచికొట్టడం. మంచి మిత్రులు. ఆయన పోయారని వినటం బాధగా అనిపించింది.

అమ్మకి చెబితే తనూ కాసేపు బాధపడి భయపడింది కూడా.

రెండ్రోజుల క్రితం అతను కనిపించాడు. నాన్నగారు కాలం చేశారని తెలిసింది, వారి అత్మ శాంతి అన్నాను నా ధోరణిలో. అవును బాధగా ఉందీ. అసలు ఏంజరిగిందంటే - కోయంబత్తూరులో వీళ్ళ నానగారి ఇంటి ముందు ఓ డాక్టరు. ఓరోజు స్దరు డాక్టరు వీళ్ళ నాన్న ఏదో రచ్చబండ దగ్గర చర్చ, రెండు గంటలపాటు. ఇంటికొచ్చాక డాక్టరు ఫోన్ - కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి, టెస్ట్ పాజిటివ్, మీరూ చేయించుకోండీ అని. ముసలాయన చేయించుకున్నాడు - పాజిటివ్ అని తేలింది.

ముసలాయన భయపడ్డాడు. ఆశుపత్రికి వెళ్ళాడు. వాళ్ళు చేర్చుకుని మూడు రోజులుంచుకుని మందులు అవి ఇవీ ఇచ్చి డిస్ఛార్జ్ చెసి పంపించారు. కోయంబత్తూరులో కోవిడ్ డిస్ఛార్జ్ విధానం ప్రకారం - రోగి ఇంటికి వెళ్ళి సెల్ఫ్ క్యారెంటీన్ అవటానికి అల్యూమినం షేట్ తో గది కట్టి, దాని మీద పోస్టర్ వేస్తారట. జాగ్రత్తలు రాస్తారట. ఇంటి బయట పోస్టర్ - ఈ ఇంట్లో కోవిడ్ సోకిన వ్యక్తి ఉన్నాడు అని. సరే - డిస్ఛార్జ్ అయ్యాక ఇంటికొచ్చి మందులేసుకుంటున్నాడు. ఇంతలో ఎవో కొన్ని కాంప్లికేషన్స్. క్యారెంటీన్ లో ఉంటంవల్ల సరైన డాక్టర్ సదుపాయం అందకపోవడం వల్ల 13 రోజున పోయాట్ట. అటాప్సీలో ఆర్గాన్ ఫైల్యూర్/ లంగ్ ఫైల్యూర్ అని రాసారట.

కోవిడ్ వల్ల మరణాలు సంభవించాయని చూశాం. కాని కోవిడ్ తగ్గినాక కూడా దాని ప్రభావం వల్ల మరణం సంభవించతం కాస్త భయం గొలిపిదిగా ఉంది. బాలసుబ్రహ్మణ్యం/ద్రోణంరాజు/ఈ ముసలాయన అంతా అలా పోయిన వాళ్ళే.

మొన్నోరోజు ఆకాశవాణిలో ఒక ముఖముఖీ విన్నాను. కోవిద్ వచ్చి ఇంటికి క్షేమంగా తిరిగివచ్చిన దాసరి నాగరాజు గారితో పరిచయం:
నాగరాజు గారూ మీకు కోవిద్ వచ్చిందని ఎలా తెలిసింది?
నాకు 105 జ్వరం వచ్చింది. డెంగు మలెరియా లాంటి పరిక్షలు నెగెటివ్ వచ్చాయి. అప్పుడు డాక్టరు కోవిడ్ పరీష చేయించుకోమన్నాడు. పాజితి వచ్చింది. ఆశుపత్రిలో చేతితే రోజుకి లక్ష ఖర్చు. ఈంట్లోనే సెల్ఫ్ క్యారెంటీన్ అవ్వండి అని డాక్టరు సలహా పాటించి ఇంట్లోనే ఒక గదిలో ఉండిపోయాను. డాక్టరు ఇచ్చిన మందులు తూచా తప్పకుండా పాటించాను.
"పారాసెట్మాల్ 650ంగ్, మల్టి విటమినులు, పొద్దునా సాయంత్రం కషాయం. 
పొద్దున 30 ప్రాణాయామం, 30 నిమిషలు యోగా"
డాక్టర్లు చెప్పింది చెప్పినట్లు పాటించాను 12 తగ్గింది 
ఇదీ దాసరి నాగరాజు చెప్పిన విషయం.


ఇక మా ఆఫీసులో కొందరు మిత్రులు. రెండు వారాలుగా కనిపించకపోవటం. కనిపించాక, ఏంటి గురూ అంటే కోలుకుంటున్నా అని అనటం. ఎక్కడనుంచీ ఏవైందీ అంటే కోవిడ్ నుంచి అని - నాలుగైదు కేసులు.
అందులో ఒకతనికి పాపం కాస్త ఇబ్బంది అయ్యింది. హాస్పిటలైజ్ అయ్యాడు కూడా. సారాంశం - కోవిడ్ శ్వాసకోశ వ్యవస్థని దెబ్బతీస్తుంది. పై నలుగురు చెప్పింది - జ్వరం రాక పోక పక్కన పెడితే లంగ్ లో ఇంఫెక్షన్ రావటం నలుగురికీ కామన్ విషయం. FAVIPIRAVIR/Amoxicillin/Paracetamol/Multivitamins ఇవీ అందరూ వేసుకున్న మందులు.

నవంబర్ వచ్చెసింది. కోవిడ్ మందు ఇక ఎంతో దూరంలో లేదు అని ఆశావహ ధృక్పథంతో అందరు పెద్దలూ ఉన్నారు.

3 comments:

  1. ఇంకా దాచిపెడుతున్నారా ?? జనం కోవిద్ ఉందన్న ఆలోచన కూడా లేకుండా తిరుగుతున్నారు అని మా ఫ్రెండ్ చెప్పాడు .
    వచ్చి పోతుందని బిందాస్ ఉంటున్నారంట

    ReplyDelete
  2. వచ్చిన వాళ్ళు దాచిపెడుతున్నరు (కోందరు అనుకుంటా)
    నేను కనీసం అరడజను కేసులు విన్నా అలా!

    ReplyDelete
    Replies
    1. వచ్చిందని తెలిస్తే పక్కనున్న పెదరాయుడులు ఎక్కడ వెలేస్తారో అని భయపడి చెప్పట్లేదేమో లెండి.

      Delete