ఆచార్య NG రంగాకీ శ్రీశ్రీకి సైద్ధంతిక వ్యతిరేకత ఉండేదేమో. ఒకరు కాంగ్రేసు మరొకరు కమ్యూనిస్టు.
శ్రీశ్రీ రంగా మీద కొన్ని ఘోరమైన మాటలు రాసుకొచ్చాడు. కొన్ని(అన్నీ) నిజం అయుండచ్చు కూడా.
కాంగ్రేస్ అనే కప్పల తక్కెడలో అవకాశావాదులే ఎక్కువ గాంధేయవాదులకన్నా అని ఒక అపవాదు ఉండనే ఉంది.
ఈ వ్యంగ్యాలు చిన్న చిన్న స్నిప్పెట్స్. ఇవి వ్యంగ్యాలు అనేకన్నా కిక్ రియాక్షన్స్ అంటే బాగుంటుంది. ఈ విషయంలో నాకు శ్రీశ్రీయే స్పూర్తి అనుకోవచ్చు. వార్తాపుత్రికని చూట్టం ఉడికిపోయి ఒక టపా వేయతం - శ్రీశ్రీ నేర్పిన విద్య.
విషయంలోకొస్తే -

*ఆంధ్రదేశంలో సైనిక పాలన అవసరం* - శ్రీ రంగా 30-04-1950, ఆనందవాణి
శ్రీశ్రీ వ్యాఖ్య -
ఘోరంగా
క్రూరంగా
ఛీరంగా
థూరంగా
*అఖిల భారత చేనేత కాంగ్రేసు మహాసభ - రంగాగారి అధ్యక్షతన* - విజయప్రభ పత్రిక
శ్రీశ్రీ వ్యాఖ్య:
రామప్ప పంతులు పప్పు లేని పులగం లేదనట్లు
రామప్ప పంతులు పప్పు లేని పులగం లేదనట్లు
అఖిల భారత - ఏదైనా సరే ఆచార్య రంగా ఉండాల్సిందే
*ఒరుగులుగా, పొరుగులుగా, ఊరగాయలుగా! పొడిగా ఉప్పుతో నానవేయడం ద్వారా, రసరూపేణా పండ్లను నిల్వ చేసే విధానాలను కనిపెట్టాలి* - ఆచార్య రంగా
శ్రీశ్రీ వ్యాఖ్య:
ఇంత మధురమైన గేయానికి ఎవరైనా సంగీత దర్శకుడు స్వరం అవీ వేసి ఆర్కెష్ట్రాతో పాడిస్తే ఎంత బాగుండును!
*కొందరు కాంగ్రేసువారే, శాసనసభ్యులే సేవాదళమును రజాకార్లవలె రంగాకార్లనుచున్నారట, ఇది ఎంత సిగ్గుచేటు* - రంగా
శ్రీశ్రీ వ్యాఖ్య:
సిగ్గూచేటు కాదు, గర్వించదగ్గ విషయం. చరిత్రలో కాకపోతే కనీసం నిఘంటువులో అయినా మన పేరెక్కుతుంది ప్రొఫెసర్ జీ!
సిగ్గూచేటు కాదు, గర్వించదగ్గ విషయం. చరిత్రలో కాకపోతే కనీసం నిఘంటువులో అయినా మన పేరెక్కుతుంది ప్రొఫెసర్ జీ!
(ఆంధ్ర ప్రాంతంలో రంగా అనుకూలురు హోంగార్డ్స్ వలె సేవాదళంలా ఏర్పడి కమ్యూనిస్టులను పట్టివ్వడంలో పోలీసులకు తోడ్పడేవారు కనుక వారిని అపట్లో రంగాకార్లు అని పిలిచేవారు)
*ఆచార్య రంగ గారి రాజకీయాలకు, తిరునాళ్ళలో తిరిగే రంగుల రాట్నాలకు ఎలాంటి బేధం లేదు* - నవయుగం పత్రిక
శ్రీశ్రీ వ్యాఖ్య:
ఉంది. అది రంగుల రాట్నం, ఇది రంకుల రాట్నం
ఆనందవాణి ముద్రణ, 04-06-1950
No comments:
Post a Comment