అడ్డం
1. మంచానికి కిందకాళ్ళకట్ట - మరి పైన
3.కర్ణాటకలో ఖ్యాతిగాంచిన ఓ ఊరు. ఆంగ్ల ఆమెతో మొదలు.
5. అడవిలో అగ్గి అటునుంచి రాసుకుంది
6. మట్టిని కాల్చి ఇల్లుకట్టేది కాస్త ఉల్టాపల్టా అయ్యింది.
8. కొంకణ్ గా పిలువబడే ఈ చిన్న రాష్ట్రం బీచ్ లకు ఖ్యాతి గాంచింది
10. తడబడ్డ నెఱ్ఱె
12. తినేదాంట్లో ఇది ఉంటే మధుమేహం చెప్పుచేతల్లో ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు
14. ఔన్సులు - తెలుగు కొలమనంలో
15. ఇంట్లో వండటానికి ఏమీ లేవని ఆమె అంటే, బయట పచ్చగా ఉన్నదాంతోనే వండమన్నాట్ట ఓ పెద్దాయన
16. చివర్ని కోల్పోయిన అందమైన యువతి
17. జంటపదంలో మొదటిసగం=రెండోసగం అయితే ఒక సగమే మిగిలింది.
18. స్థిరంగా ఉంటాన్ని ఇలా కూడా అంటారట
19. అవినీతిని అంటగట్టే శాఖ, చివర్ని కోల్పోయింది.
20. అటునుంచి ఇందులో పెరిగిన తాడిచెట్టు.
21. తిరగబడ్డ బండితోలువాఁడు
నిలువు
1. మిట్టమధ్యానం ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఈతకెళ్ళొచ్చి పట్టుబడ్డప్పుడు నాన్న పోసేది?
2. క్రిమిసంహారకాలు విచ్చలవిడిగా వాట్టం వల్ల బలి అయిన చిన్న పక్షి, అంతరించేస్తాయికి వచ్చినై
3. ఈ ఊరిని 8గాలి ఉరు* అంటారుట ఇంగ్లిషులో
4. దిన్ని బక్కెట్ల మీద బక్కెట్లతో నింపితేనే వాడుకోటానికి నీళ్ళు.
7. ఎప్పుడూ వేపుడు కూరేనా? మన నలభీమ పాకంలో రాంములక్కాయ ... చేసేవిధానం రాసుకొచ్చాడు. అలా చేయొచ్చుగా?
9. చెఱువు/బావి/లంకెబిందెలతో సహితంగా ఇంటిని రాసిచ్చాట్ట ఒకతను
11. భార్యాభర్తలు కొబ్బరికాయ కొని ...కొట్టుకుని తింటారు, మనకెందుకుటా
13. రాజకీయ వినయకులు తరచుగా కరుచుకుంటుంటారు. సదరు *కరుచు*కుంటాన్ని ఇలా కూడ అనొచ్చుట - తలక్రిందులుగా
14. సేవకుడే కాస్త అచ్చుతప్పుతో స బదులు శ
(చిన్న ప్రయత్నం మాత్రమే. సలహాలు సూచనలు ఎల్లప్పుడూ స్వాగతిస్తా )
అడ్డం :
ReplyDelete1. త ల్ల పి
3. షి మో గా
5. చ్చు ర్చి కా
6. టు (టి) ఇ క
8. గో వా
10. గు లు ప
12. మి తం
14. శే రు
15. 🤔
16. చె ల ?
17. 🤔
18. కు దు రు
19. అ ని
20. వు రే
21. త సూ
==========
నిలువు :
1. త లం టు (టి)
2. పి చ్చు క లు
3. షి కా గో
4. గా బు
7. ఇ గు రు
9. 🤔
11. ప గ ల
13. 🤔
14. శే వ కు డు
16. చె రు వు
=============
15. గడ్డికూర
ReplyDelete13. కరచు
ReplyDelete9. వాపీకూపనిధి
17. పక(పక)
ReplyDelete1. తలాపి
ReplyDeleteమీ ప్రయత్నం బాగుంది 👌.
ReplyDeleteఈ సీరీస్ ను కొనసాగించదలిస్తే ... టైటిల్ కు సీరియల్ నెంబర్ ఇవ్వడం వలన (“పద వినోదం” అనే పేరు ప్రక్కన) తరువాత తరువాత రిఫరెన్స్ కు సులువుగా ఉంటుంది.
Of course క్రాస్-వర్డ్ తయారు చెయ్యడం సులభమేమీ కాదని తెలుసుననుకోండి, అయినప్పటికీ “తిరగబడింది”, “అటునుంచి”, “తల్లక్రిందులుగా” లాంటివి లేకపోతే క్రాస్-వర్జ్ లు మరింత పటిష్టంగా, సొగసుగా ఉంటాయని నా వ్యక్తిగత అభిప్రాయం.
All the best 👍.
ఔనండీ
ReplyDeleteపద వినోదం అంత సులభం కాదు తయ్యారు చేయటం