Oct 17, 2020

పద వినోదం #2

 




అడ్డము:
1. నిజ ఆశ్వయుజ మాసంతో ఇవి మొదలు
5. ఇలా అడిగితేనే మీకు మాత్రమే చెబుతాను అనే సినిమా తీశారు 
7. ప్రాణి, జీవించువాడు
8. నల్లగుడ్డు
10. సారథి నడుపునది
12. పూర్ణచంద్రుడు గల పున్నమి
13. _ _ శాంభవి చంద్రమౌలిరబలా!
15. రేగిన కోరికలతో గాలులు వీచగా..
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా..
కాలము లేనిదై గగనము అందగా..
ఈ సినిమలోనిదే ఈ వేటూరి శృంగార రచన
16. సుక్ష్మము
21. దీనికి చక్కలిగింతలు పెట్టాట్ట వెనుకటికి ఎవడో

నిలువు:
2. మంత్రి
3. ఈ చెట్టు నారాయణుడితో సమానమే!
4. లూజైన మంచం ఇది ఆడిందట, కానీ ఒక్కసరేనండోయ్.
5. నాలుగు టంకముల ఎత్తు బియ్యము పట్టు పరిమాణము
6. మహాకవి కాళిదాసు సినిమాలో కాళిదాసు హనుమంతుడిని ఈ రాయుడు అనిపిలుస్తాడు చమత్కారంగా
9. మంగళహారతి
10. ఇదొకరకం తెలుగు పద్యం
11. కిం గోత్రమహమస్మి, అంబా! కిం గోత్రమహమస్మి? అంటా ఈ అబ్బాయి వాళ్ళమ్మ సత్యకామతో
13. కీలుగుఱ్ఱం సినిమలో ఈమె యక్ష రాక్షసి గుణసుందరిగా వేసింది
14. ఈయన్ని చూసిన కంట మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధేస్తుందట
18. కీర్తి లాంటిదే
19. ఉమామహేశ్వర రావు ఈ రూపం అంటూ ఓ సినిమా వచ్చిందీమధ్య
20. చేత్తో కొలిచే ఓ కొలత

9 comments:

  1. అడ్డము:-
    1. నవరాత్రులు
    5. మాతో ?
    7. జీవి
    8. కనీనిక
    10. తేరు
    12. రాక
    13. అంబా
    15. గీతాంజలి
    16.
    17. క్లూ ఇవ్వలేదు
    21.
    ———————

    నిలువు :-
    2. వజీరు
    3. రావి
    4. లక (టకటక లాడింది అంటే ఇంకా బాగుండేదేమో?)
    5. మానిక
    6. తోక ?
    9. నీరాజనము
    10. తేటగీతి
    11. జాబాలి
    13. అంజలి
    14. రాజుని
    18. ఖ్యాతి
    19. ఉగ్ర
    20. మూర
    =============
    Title కు సీరియల్ నెంబర్ ఇవ్వడం మొదలెట్టారే, బాగుంది.

    ReplyDelete
  2. లుకలుక లాట్టమే కరెక్ట్ కదండీ?

    ReplyDelete
    Replies
    1. అయ్యుండచ్చేమో లెండి. ఏదైనా ప్రాంతీయ వాడుక ఏమో?
      సాధారణంగా “లుకలుక(లు)” పదాన్ని పురుగులు తొలుస్తుండటం గురించి వాడతారు, కుటుంబంలో / గ్రూపులో బాహాటం అవని అభిప్రాయ భేదాల గురించి చెప్పడానికి వాడతారు ... నాకు తెలిసి.

      Delete
  3. 17 మిస్ అయ్యింది.
    సాము

    ReplyDelete
  4. 16 అడ్డం - నరుజు
    నరుజు [Tel.] n. An atom. అణువు. adj. Very small. సూక్ష్మము.

    ReplyDelete
  5. 21 (అడ్డం) సమాధానం ఏమిటో చెప్పలేదు.

    ReplyDelete
  6. రాతివిగ్రహమునకు చక్కలి గిలి పెట్తినట్టు అని సమెత

    ReplyDelete
    Replies
    1. అది గనక 21 (అడ్డం) అయితే ... 20(నిలువు) కు “మూర” అని నేను పూరించిన దాన్ని “జాన” అని మార్చండి. Thanks.

      Delete