శ్రీశ్రీ చమత్కారాలు కొన్ని బాగున్నా కొన్ని కాస్త ఇబ్బందిగా అనిపించాయి (నాకు)
అయన గొప్పతనన్ని ప్రశ్నించటం లెక వేలెత్తి చూపటం నా అభిమతం కాదు. కానీ ఆయన ఏవన్నా గొప్పే అనే మనస్తత్వం ఇబ్బందికరం.
ఉదాహరణకు -
మెదడుకు మేత -2
ఈసారి మెదడుకి మేత ఒకే ఒక విషయాన్ని గురించి, అ విషయం ఏమిటంటే: (ఔను. మీరు బాగా పోల్చారు) ఇండియా విదేశాంగ నీతి.
ఈసారి ప్రశ్నలకు జవబులివ్వబడవు. కారణం స్పష్టమే. వీటికి సరియైన జవాబు లివ్వడం మం తరం కాదు. ఏమో, మీరూ ప్రయత్నించి చూడండి. మీ జవాబులే రైటు కావచ్చు. అయితే వాటిని మాకు పంపించవద్దు, సరాసరి ఈ దిగువ చిరునామాకు పంపండి.
నెహ్రూ పాదుషా
కేరాఫ్ తాజ్‌మహల్, ఇండియా.
ప్రశ్న: కాశ్మీరు మధ్యవర్తిగా మిమ్మల్ని మిత్ర రాజ్యసమితి నియమిస్తే:
(అ) కాశ్మీరులో ఎన్ని నెలలు కులాసాగా తిరుగగలరు?
(ఆ) పాకిస్తాన్ నిర్దోషి అని ఎన్ని నిమిషాలలో ఋజువు చేయ్యగలరూ?
(ఇ) ఎన్ని టన్నుల ఆస్తిని మిత్రరాజ్య విమానాలలో పాకిస్తాన్‌కు చేరవెయ్యడనికి అనుమతించగలరు?
ముద్రణ: అరుణరేఖ మసపత్రిక, ఆగస్ట్ 1950.
పై వ్యంగ్యాన్ని బట్టి శ్రీశ్రీ అభిప్రాయం పాకిస్తాన్ చాలా మంచి దేశం. కాశ్మీర్ లో జరుగుతున్న మారణకాండకి పాకిస్తాన్ ని దోషిగా నిలబెట్టాల్సిన పని లేదు. అసలు పాకిస్తాన్‌కీ అక్కడ జరుగుతున్న దానికి సంబంధమే లేదు.
భావజాలానికి బానిసత్వం నిలువెత్తు ఉదాహరణ - పై వ్యంగ్యం.
కమ్యూనిస్టులు ఇప్పటికీ అదే భావదారిద్ర్యంలో కొట్టుకుంటున్నారు. దౌర్భాగ్యం.
ఈ ప్రశ్న బాగుంది
ReplyDeleteకామన్‌వెల్త్ అనగానేమీ?
(అ) ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ
(ఆ) పాత సామ్రాజ్యానికి కొత్త బురఖా
(ఇ) అమెరికా మామయ్య దగ్గర అడుక్కుతినే చుట్టాల కుటుంబం
వీళ్ళ ప్రాపగాండా కి , అబద్దాలు సోషల్ మీడియా వల్ల ముందుకు సాగడం లేదు . మీరు బాగా గమనిస్తే , 1990 తరువాత కాశ్మీర్ లో హింస చెలరేగింది కారణం ఏంటంటే ... రష్యా ఆఫ్గనిస్తాన్ వదిలేసి వెళ్లడం , పాకిస్తాన్ అక్కడ మిలిటెంట్స్ ని కాశ్మీర్ కి పంపడం . కానీ ఈ కమ్యూనిస్ట్ ఊసరవెల్లులు , జనాలకి చెప్పింది ఏంటంటే , పేదరికం వల్ల అక్కడ జనాలు గన్నులు పట్టుకుని పోరాడుతున్నారు , మతం అనే కాన్సెప్ట్ లేదు ఆ పోరు లో అని . కానీ పాకిస్తాన్ అనే మాట నోటంట వచ్చేది కాదు . సోషల్ మీడియా వలన చెడు జరిగినా , మంచి మాత్రం ఇలాంటి విషయాలు లో నిజం తెలియడం . ఇప్పుడు కూడా ఫేస్బుక్ లో కాశ్మీర్ స్వాతంత్య్రం అంటూ వాగే కమ్యూనిస్ట్ లు ఉన్నారు . 1990 కి ముందు ఎందుకు ఇది లేదు అంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు . ఇంకా ఎక్కువ మాట్లాడితే మహిళల ని వేధిస్తున్నాడు అంటూ మీ మీదకి రాళ్లు విసురుతారు .
ReplyDeleteఅయన గొప్పతనన్ని ప్రశ్నించటం లెక వేలెత్తి చూపటం నా అభిమతం కాదు. కానీ ఆయన ఏవన్నా గొప్పే అనే మనస్తత్వం ఇబ్బందికరం. - Totally agree with you భాస్కర్ గారు.
ReplyDeleteThe society has placed certain great personalities like Gandhi, Ambedkar, Nehru, Mother Teresa, etc. on a high pedestal. Honest discussion about their strengths and weaknesses is not wrong.
Leftists think that they can criticize everyone. And believe they themselves are above criticism. Self righteous and holier than thou attitude.
సందర్భం వచ్చింది కాబట్టి ఒకమాట. శ్రీశ్రీ (సరదాకంటూ తరువాత సమర్ధిచుకున్న) కవిత ఒకటి చూడండి.
ReplyDeleteప్రథాని కాగోరు టాగోరు
అయ్యాడు కొందరికి ఐసోరు
ఇలాంటివి చాలా ఉన్నాయండి
ReplyDeleteప్రకాశం పంతులుగారినీ
సంజీవరెడ్డినీ
బ్రహ్మానంద రెడ్డినీ
ఆచార్య రంగానీ
వ్యంగ్యంతో కొట్టాడు
సినారె గారిని కూడా వ్యంగ్యం గా హేళన చేశాడు. తాను సినీ గీతాలు వ్రాస్తే తప్పు లేదు కానీ సినారె సినీ రంగం లోకి వస్తే మాత్రం వెక్కిరించాలి. Arrogance and condescending attitude unbecoming of a great poet. Sri Sri wore his attitude on his sleeve.
DeleteTrue
Deleteమహాకవి అనే బిరుదు అతనికి సరిపడదని నా అభిప్రాయం.
ReplyDelete