Apr 21, 2020
వార్తాపుత్రికల పైత్యం
ప్రపంచం అంతా ఓవైపు గడగడ లాందుతోంది. 200 పైగా దేశాల్లో కరోన జనాలని చంపుతోంది. వణికిస్తోంది. భారతదేశంలో సమర్థవంతమైన నాయకత్వం కరోన ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది/పడుతోంది - అంతే కట్టుదిట్టంగా అమలుచేయటానికి ప్రయత్నిస్తోంది కూడా.
బాగుంది. మోడిని మోసే పత్రికలు మోయచ్చు. మోడీని వ్యతిరేకించేవి మోడీ ఏ బ్రాండు కడ్రాయరు వేస్కున్నాట్టా ఈ నిర్ణయం తీసుకున్నప్పుడూ అని రాస్కోవచ్చు.
తప్పులేదు.
లోకల్ వార్తాపుత్రికలు తమ రంగుల్నీ వ్యక్తపరచుకోవచ్చు. జగన్ దొంగ అని లేక చంద్రబాబు కరోనాకన్నా డేంజరస్ అనీ.
తప్పులేదు.
కానీ వార్తాపుత్రికల దిక్కుమాలిన దౌర్భాగ్యానికి పరాకాష్ట -
అమెరికాలో శవాలు గుట్టలు గుట్టలుగా పోసారటా
ట్రంపుకి శవాలని ఏంచేయాలో తెలియట్లేదటా
గంటకి వందమంది పోతున్నారటా
టెక్సాసులో కూడా కరోనా వచ్చిందటా
పక్కనున్న న్యూ మెక్సికోలో కూడా కరోణా వచ్చిందటా
ట్రంపుకి వ్యాపారమే ముఖ్యంటా
జనాలు బిక్కుబిక్కుమంటున్నారటా
ఇలాంటి వార్తలు అక్కడున్న పెద్దవాళ్ళలో ఎలాంటి భయాందోళల్ని కలిగిస్తాయి గురిచేస్తాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే మా అమ్మ పొద్దున ఇలా అడిగింది -
అమెరికాలో కుక్కలు కూడ బిక్కుబిక్కుమంటున్నాయటగా అని
రాస్కోండయ్యా! లోకేశ్ గురించో బాబు గురించో జగన్ గురించో. వడ్డించండి కరోనా వార్తల్ని ప్రాసలతోటి. ఎవడొద్దన్నాడూ?
కానీ కుక్కలు బిక్కుబిక్కు మనటం ఏంటీ? దరిద్రుల్లారా!
జర్నలిజమా మీ పైత్యమా?
Labels:
తాజా వార్తల స్రవంతి,
నా దృష్టిలో,
పోకడ,
వార్తా పుత్రికలు,
సొద
Subscribe to:
Post Comments (Atom)
Correct గా చెప్పారు, news చూసి చూసి లేనివాళ్ళకి కూడా BP, sugar వస్తున్నాయి.
ReplyDelete