Apr 18, 2020

ఆంగ్లమాధ్యమం గొడవ

కొన్ని ముందస్తు ప్రశ్నలు

1. ఎందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని తాము పని చేస్తున్న పాఠశాలలోనే చదివిస్తున్నారు?

2. ఎందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

3. ఎందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

4. ఎందరు ప్రభుత్వ పాలకులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

5. మీలో ఎందమంది మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశలకి పంపిస్తున్నారూ?

6. మీలో ఎందరు పపిద్దాం అనుకుంటున్నారూ?

అనుబంధ ప్రశ్నలు:

ప్రభుత్వ పాఠశాలకి పంపిద్దాం అనుకుంటే - ఎందుకు అనుకునే దగ్గరే ఆగిపోయారూ?
పంపించమూ అంటే - పంపించకపోటానికి ప్రతిబంధకాలు ఏవిటీ?

ఇవే ప్రశ్నలు నన్ను అడిగితే - నా సమాధానాలు/ఆలోచనలు -

నేను జిల్లాపరిషత్ ప్రధమికోన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య అయ్యాక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశలలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేస్కున్నాను.

మా నాన్న పని చేసిన స్కూల్లో చదువుకునే అవకాశం కలిగింది. లెక్కలకు ఆంగ్లానికి మా నాన్నే వచ్చేవారు.

అయితే ఇప్పుడు, ఒకవేళ నేను భారతదేశంలో ఉండి ఉంటే మా పిల్లల్ని జిల్లా పరిషత్ పాఠశాలకి పంపించుండేవాడినా అని అడిగితే పంపించుండేవాడ్ని కాదేమో.

ఎందుకుటా అంటే మాధ్యమాం అని చెప్పక తప్పదు.

నావరకు నాకు కేవలం మాధ్యమం అనేదే ప్రతిబంధకం.

ప్రభుత్వపాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారు. క్వాలిఫైడ్ విద్యావిధానం ఉంటుంది. వ్యక్తిత్వ వికాశం ఉంటుంది. ఆట స్థలం ఉంటుంది. డ్రిల్ మాష్టారు ఉంటారు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో కుక్కి కూర్చోబెడతారు. వ్యక్తిత్వ వికాశం ఉండదు. మార్కులే గీటురాళ్ళు. ఆట స్థలం మృగ్యం. ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ అవునా కాదా చెప్పలేం. విద్యావిధానం ఎవరు నిర్ణయిస్తారో తెలియదు.

బాడ్ యాపిల్స్ ఎక్కడైనా ఉంటాయి. వాటిని పక్కన పెడితే, నాణ్యమైన విద్య అనేది ప్రభుత్వ పాఠశలల్లోనే అని నా ప్రగాఢ విశ్వాసం. ఇది నేను ఒక జిల్లాపరిషత్ పాఠశాలలో పని చేసిన ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా చెబుతున్నా.

ఇప్పట్లోకి వస్తే - నా పిల్లల్ని తెలుగు మీడియంకి పంపలేను. ప్రభుత్వ పాఠశలలో ఆంగ్ల మీడియం ఉంటే పంపించటానికి నాకేమాత్రం సంశయం లేదు.

అమెరికా లాంటి దేశాలల్లో ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళే వారి సంఖ్య ప్రైవేటు పాఠశాలకి వెళ్ళే వారి సంఖ్యతో పోలిస్తే పదిరెట్లకన్న ఎక్కువ.

అమెరికాలో 46 మిలియన్ పిల్లలు పబ్లిక్ విద్యావిధానంలో ఉండగా 4 మిలియన్ విద్యార్థులు మాత్రమే ప్రైవేటు విద్యావిధానంలో ఉన్నారు

భారత దేశంలో ప్రైవేటు పాఠశాలలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నదని నా అభిప్రాయం.

మౌళిక ప్రశ్న ఈ విషయానికి సంబంధించి -
ప్రభుత్వ పాఠశలలని పునరుద్ధరించాలంటే ప్రభుతం ఏం చేయాలీ?
ప్రజలు ఏంచేయాలీ?

ప్రభుత్వం పాఠశాల వ్యవస్థని పునరుద్ధరించాలి. గట్టి చేయాలి. జెడ్.పి.టి.సి లాంటి రాజకీయ వ్యవస్థని పాఠశల నుంచి వేరు చేయాలి. ఉపాధ్యాయులని ప్రేరేపించాలి. జవజీవాల్ని నింపాలి.

ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం మత్రమే అనే నిర్ణయం సరైంది కాకపోవచ్చు కానీ ఆంగ్ల మాధ్యమం అనేది తప్పుకాదు.

వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా వ్యవస్థని పునర్మించకుండా గుడ్డిగా ఆంగ్లమాధ్యమం అనటం సరైంది కాదని న అభిప్రాయం.

ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో కూడా కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని నా అభిప్రాయం

24 comments:

  1. Good Post. My thought on it.

    ఆంగ్లమాధ్యమం మాత్రమే అనే నిర్బంద మాద్యమాన్ని G.O. ద్వార తీసుకొచ్చి, అది ఎటూ కోర్టులలో వీగి పోద్ది అని తెలిసి, ఇప్పుడు ఈ ఏడుపులు ఏడవటం ఎందుకండి. రాంబొట్ల గారిమీదో, తె.దె. లేదా బి.జె.పి. మీదో.
    అవును కచ్చితం గా ఆంగ్ల మాద్యమ చాయిస్ ప్రబుత్వ పాఠశాలలో ఉండటం లో తప్పే లేదు.

    ఇక ఓ ప్రబుత్వ జిల్ల పరిషత్ పాఠశాలలోనే, తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ ను అర్ధాంతరం గా వదిలి మరీ చదువుకొన్నవాడిగా, అందులోనూ, ఓ లెక్కల మాష్టారి అబ్బాయి గానే, నేను ఇండియా లో ఉండి ఉంటే ఏమాత్రం అవకాశం ఉన్నా నా పిల్లలను ఇప్పుడు 8 వ తరగతి వరకు తెలుగు మీడియం స్కూల్లో (U.S. middle school equivalent), అక్కడనుండి ఇంగ్లీష్ మీడియం లో science and technologies ప్రిఫర్ చేస్తాను. చరిత్ర మాత్రం తెలుగులో బోధించటానికే ప్రిఫర్ చేస్తాను.

    ఇక తెలుగు మీడియం లో, ప్రబుత్వ పాఠశాలలో చదువుకొన్న పిల్లలకు ఇంగ్లీష్ రాకపోవటానికి కారణం, తెలుగు మీడియం కంటే, dedicated English Teachers లేకపోవటమే, తెలుగు, హింది లకు ఆయా భాషా పండితులు (నేను చదువుకొనేటప్పుడు తెలుగు పండిత్, హింది పండిత్ అనే పిలిచేవారు) ఉన్నట్లు, ఇంగ్లీష్ కు ఎందుకనో లేకపోవటం, లెక్కల మాస్టారో, సైన్స్, సోషల్ మాష్టాలే ఇంగ్లీష్ బోధించవలసి రావటం, వాళ్ళు B.A./M.A. ఇంగ్లిష్ కాకపోయినా. అదే తాడికొండలో అయిదవ తరగతినుండె, M.A. ఇంగ్లిష్ చేసిన వారు ఇంగ్లిష్ బోధించేవారు, మా గురువు గారు అక్కడ సోమసుందరం గారని నా ఫేవరెట్ టీచర్.

    medium, language, education standards కు తేడా తెలియకుండా వాటి మూడిటిని మిక్సి లో వేసి రుబ్బి, ఆ పైన వాళ్ల వాళ్ల అజెండా లతో పోపు పెట్టి, TV డిబేట్ లలో వాగుతున్న వాళ్లను చూస్తుంటే మాత్రం కరోనా టైం లో మాంచి కాలక్షేపం అవుతుంది అనుకొండి. వాటిల్లో ఏ ప్రబుత్వ టీచర్ లు లేకపోవటం మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

    ReplyDelete
  2. డెడికేటెడ్ ఇంగ్లీష్ టీచర్స్ ఈ వ్యవస్థ నుంచి వచ్చినవాళ్ళే. ఆంగ్లం అంటే భయం ఉండేది ఒకప్పుడు. అది ఇంతింతై అని పెరిగింది. అదేకాక ఇంకోటి కూడా ఉంది. బి.యే ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన ఉపాధ్యాయుడు బహుశా ఉండడేమో. దొరకడేమో. డెడికేటెడ్ ఇంగ్లీష్ టీచర్ ఉన్నట్టు నాకు గుర్తు లేదు.

    ReplyDelete
    Replies
    1. ప్రయివేట్ స్కూల్స్ కి దొరుకుతున్నప్పుడు పాతికవేల జీతాల లోపే, దాదాపు 70 వేలు కు పైగా జీతాలు ఇచ్ఛే గవర్నమెంట్ స్కూల్స్ కు దొరకరంటారా? మేము రాబోయే సంవత్సరాలలో అన్ని హైస్కూల్స్ లలో తెలుగు టీచర్లు లాగానే ఇంగ్లీషుటీచర్లను పెట్టబోతున్నాము అంటే, ఒక అయిదు ఏళ్లలో రెడీ అవారంటారా? సైన్స్, సోషల్, లెక్కల మాష్టార్లు తెలుగు చెప్పటానికి పనికి రానప్పుడు, ఇంగ్లీష్ చెప్పటానికి ఎలా పనికివస్తారో నాకు ఎప్పుడూ అర్ధంకాదు?

      Delete
  3. >>medium, language, education standards కు తేడా తెలియకుండా వాటి మూడిటిని మిక్సి లో వేసి రుబ్బి, ఆ పైన వాళ్ల వాళ్ల అజెండా లతో పోపు పెట్టి, TV డిబేట్ లలో వాగుతున్న వాళ్లను చూస్తుంటే మాత్రం కరోనా టైం లో మాంచి కాలక్షేపం అవుతుంది అనుకొండి. వాటిల్లో ఏ ప్రబుత్వ టీచర్ లు లేకపోవటం మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.<<

    ఒక నిజమైన చర్చ, ఆ చర్చకి ఇన్-పుట్/ ఆచర్చ ఔట్-పుట్ - అది ఎవరికి ఉపయోగపడుతుంది - ఇవన్నీ వార్తాపుత్రికలకి మీడియా వ్యవస్థలకీ అనవసరం.
    వాళ్ళకి కావాల్సంది - అరుపులు కేకలు యుద్ధాలు క్రూసేడులు.
    ఎటూ దారి తీయవు సదరు చర్చలు - చూసేవాళ్ళకి ఉద్వేగం తప్ప

    ReplyDelete
  4. భాస్కర రామరాజు గారూ, మీరు ఆరు ప్రశ్నలు అడిగారు. ఎవరూ దీనికి సమాధానం ఇవ్వరని నా అనుమానం.

    వేరే వాళ్ళ పిల్లలు బలి బకరాలు కావాలని, తమ బడుద్దాయులు మాత్రం బాగుపడాలని ఇప్పటికే నిచ్చెన ఎక్కిన పెద్దలు కోరుకోవడం ఆధిపత్య వర్గ సహజ స్వభావం. తమ ప్రయోజనాలను కాపాడుకోవడం ఎంతకయినా దిగుతారు. ప్రజాశ్రేయస్సు కోరేవారు అప్రమత్తంగా ఉండాలి.

    అరవింద్ కేజ్రీవాల్ & జగన్ మొదలెట్టినవి game changer మార్పులు. అమలులో చిన్నాచితకా అరమరికలు వస్తుంటాయి, take it in stride & strengthen the system based on the learnings.

    ReplyDelete
  5. ఇది peer group కు కూడా సంబంధించిన విషయ మేమో అనిపిస్తుంది. ఏ ఆదాయ వర్గం చెందిన వాళ్ళు వారి వారి affordability అనుగుణంగా స్కూళ్లు ఎంచుకుంటున్నారు.

    వెనకటి రోజుల్లో ఈ అంతరాలు అంతగా లేవు.
    ప్రవేటు పాఠశాలలు కూడా తక్కువే.

    ప్రస్తుతం తక్కువ ఆదాయం గలవారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు ఎంచుకుంటున్నారు.

    ఆంగ్ల మాధ్యమం ఉంటూనే తెలుగులో పాఠాలు చెప్పడం మంచిది. మాకు ఇంటర్ మీడియట్ ఆంగ్ల విషయ పాఠాలు చక్కగా తెలుగులో వివరించి చెప్పారు. సమాధానాలు మటుకు ఆంగ్లం లో వ్రాశాము. డిగ్రీ స్థాయిలో పూర్తిగా ఆంగ్లంలో బోధించవచ్చు. అవసరమైన చోట తెలుగు లో కూడా చెప్పే వెసులుబాటు ఉండాలి.

    ReplyDelete
  6. >>ఇది peer group కు కూడా సంబంధించిన విషయ మేమో అనిపిస్తుంది. ఏ ఆదాయ వర్గం చెందిన వాళ్ళు వారి వారి affordability అనుగుణంగా స్కూళ్లు ఎంచుకుంటున్నారు.<<
    ఇదీ ఒకరకంగా కరెక్టే. కానీ 1980వ దశకం నుంచి ప్రబలిన ఒక వింత ధోరణి - సమాజంలో ఏ స్థానంలో ఉన్నవాడైనా ప్రైవేటు పాఠశలకు పంపించటం గొప్ప విషయంలా ప్రబలిపోయింది. డాడి మమ్మీ అనిపించుకోవటం గొప్ప విషయం అయికూర్చుంది.
    ప్రైవేటు యాజమాన్యం రాజకీయ వ్యవస్థతో సంబంధ బాంధవ్యాలని పెంచుకున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం - ఇంత జనాభాగల దేశంలో విద్యని వ్యాపారీకరణ చేస్తే ఎంత డబ్బో చెప్పాల్సిన పనిలేదు. దాన్ని వడిసిపట్టుకున్నాయి ప్రైవైటు సంస్థలు.

    ReplyDelete
  7. 1. సగటు మనిషి ఆదాయం పెరిగి, ఉచితంగా వచ్చే ప్రభుత్వ పాఠశాలల కంటే ఫీజులు కట్టే ప్రైవేటు పాఠశాలల్లో చదివించడం గొప్పగా అనుకుంటున్నారు.
    2. ప్రైవేటు పాఠశాలల్లో, ఇంగ్లీష్ మీడియం లో చదివితేనే మార్కులు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు.
    3. తమ పిల్లల ఆసక్తి, అర్హత అర్థం చేసుకోకుండా IT ఉద్యోగం ఎలాగైనా రావాలనుకుంటున్నారు.
    4. కనీసం ఫీజులు కూడ కట్టలేని వాళ్ళే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. >>3. తమ పిల్లల ఆసక్తి, అర్హత అర్థం చేసుకోకుండా IT ఉద్యోగం ఎలాగైనా రావాలనుకుంటున్నారు.<<
      This usual trend in many people.

      Delete
  8. 5. అసలు చదువు కోసం ఎవరూ చదువుకోవడం లేదు. మార్కులు, ర్యాంకులు, కేంపస్ ఉద్యోగాల కోసం మాత్రమే చదువుకుంటున్నారు.
    6. ఇతర రాష్ట్రాలకి, దేశాలకి వెళ్ళకుండా ఇక్కడే ఉండేవాళ్ళకి తెలుగు మీడియమే మంచిది.
    7. దిగువ స్థాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు తెలుగు మీడియం అభ్యర్థులకే కేటాయించాలి.
    8. 6వ తరగతి నుండి ఒక్కో ఏడాది, ఒక్కో తరగతి పెంచుకుంటూ ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇంగ్లీషు మీడియం లో బోధించాలి.

    ReplyDelete
  9. నేటి చదువులు ఉద్యోగం కోసమే కానీ జ్ఞానాన్ని ఇచ్చేవికావని టంగుటురి ప్రకాశం పంతులుగారి ఆత్మకథలో చదివాను

    ReplyDelete
  10. తల్లితండ్రుల అభిప్రాయం తెలుసుకునే విధంగా జీవో సవరించడమయినది. ఇకనయినా అడ్డంకులు తొలిగిపోవాలని, పుల్లలు పెట్టే వారికి చెక్ పడిందని ఆశిద్దాం.

    ReplyDelete
    Replies
    1. తల్లితండ్రుల అభిప్రాయం తెలుసుకోవడం అనే తంతు కూడా ముగిసింది. 17.86 లక్షలు పాల్గొన్న అభిప్రాయ సేకరణలో 96.2% ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపారు, కేవలం 3% మాత్రమే తెలుగు మీడియం అప్షన్ ఇచ్చారు.

      ముప్పవరపు & చెరుకూరి ముఠాలు ఇప్పుడేమంటాయో చూద్దాం.

      Delete
    2. మైనారిటీ (ఉర్దూ వగైరా) మాధ్యమ బడులు యథాతథం, మండలానికి ఒకటి చప్పున తెలుగు మీడియం బడి, తత్తిమ్మావి ఇంగిలీషు చేయాలని నిర్ణయిస్తూ జీవో విడుదల.

      తెలుగులో చదువులు కావాలని కోరుకున్న తల్లితండ్రుల పిల్లలకు నియమిత మండల తెలుగు విద్యాలయం దూరంగా ఉన్నట్టయితే రవాణా సౌకర్యం లేదా ఖర్చులు (max: 6,000/- pa) ఇవ్వడం జరుగుతుంది.

      All the best to the young boys & children of Andhra on this momentous occassion.

      Delete
    3. తెలుగు బడులు కూడా మైనారిటీ బడులే, బాగుంది, బాగుంది. ఇలా బండి నడిపిస్తే చచ్చినట్లు తెలుగు కూడా మైనార్టీ భాష అవుతుంది. జనం కోరిక కూడా ఆదేనేమో మరి.

      Delete
    4. మైనారిటీ బడులంటే ఆర్టికల్ 30 ప్రకారం అన్నమాట. Linguistic minorities like Urdu, Kannada, Tamil, Oriya.

      పెద్ద కులాలు ఎప్పుడో తెలుగు మాధ్యమాన్ని వదిలేసుకొని అమెరికా ఎనుకబడ్డారు. ఇప్పుడు భాషాభిమానం అంటూ లొల్లి చేయడం ఎందుకు?

      అంత ఉద్ధరిద్దామనుకుంటే ఇతరోళ్లను బలిపీఠం ఎక్కించే బదులు తమ సొంత పిల్లలకు తెలుగు నేర్పిస్తే పోలా.

      Delete
  11. పుల్లలు పెట్టువారు ఎప్పుడూ పెడుతూనే ఉంటారు

    ReplyDelete
  12. But I dont think it is a good or efficient solution.

    ReplyDelete
  13. Article 30 of Constitution of India బడులు నడుపుకోవడానుకి మైనారిటీలకు హక్కులను ప్రసాదిస్తుంది కరక్టే. కానీ linguistic minorities అంటూ మీరేమిటి కన్నడ, తమిళం కూడా చేర్చారు?

    రాష్ట్ర ప్రాతిపదికన linguistic minority అంటే సదరు రాష్ట్రంలో majority జనాలు మాట్లాడే regional language కాకుండా వేరే తమదైన ప్రత్యేక / మాతృభాషను మాట్లాడే మైనారిటీలు అన్నమాట .... సదరు రాష్చ్రంలోని ఆదివాసీల లాంటి వారు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రలో సవర భాష మాట్లాడే వారు ఒక ఉదాహరణ. బహుశః కర్ణాటకాలో తుళు భాష మాట్లాడేవారు.

    ఆ, మీరు చెప్పినది ఒక రకంగా కరక్ట్ అనుకోవచ్చు. ఉదా:- కర్ణాటకేతర రాష్ట్రాలలో నివసిస్తున్న కన్నడిగులు ఆయా రాష్ట్రాల్లో linguistic minority అనచ్చేమో? వారు తమ బడులను స్ధాపించి నడుపుకుంటే వాటిని మైనారిటీ బడులు అనచ్చేమో .... ఈ రాష్ట్ర పరిధి వరకు ? అలాగే తమిళేతర ప్రాంతాల్లో నివసిస్తున్న తమిళులు, వారు నడుపుతున్న బడులు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారూ,

      2001 సెన్సస్ ప్రకారం కర్ణాటకలో కన్నడ మాట్లాడే వారు షుమారు 68.5%, అల్పసంఖ్యాక భాషీయులు (కొంకణి, తుళు, ఉర్దూ, తమిళం, మరాఠీ, తెలుగు, మలయాళం, హిందీ, గుజరాతీ వగైరా) దాదాపు 31.5%. లంబాడి, గోండీ భాషలు సెన్ససులో లెక్కించారా లేదా తెలీదు.

      (ఆర్టికల్ 30 ధార్మిక అల్పసముదాయాల లెక్కకు రాష్ట్రం ఒక యూనిట్ తీసుకోవడం లేదు, సంఘీయులకు ఈ విషయం పట్ల కాస్త గుర్రు ఎక్కువే)

      Jai GottimukkalaMay 3, 2020 at 6:37:00 PM GMT+5:30:

      "17.86 లక్షలు పాల్గొన్న అభిప్రాయ సేకరణలో 96.2% ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపారు, కేవలం 3% మాత్రమే తెలుగు మీడియం అప్షన్ ఇచ్చారు"

      Minority language medium preferred by ~ 0.8% (100- 96.2- 3) parents of school going children.

      ఈ సుత్తంతా లేకుండా మొత్తం ఇంగిలీషు అయుండుంటే ఇంకా బాగుండేది. Anyhow, the battle has been broadly won.

      Delete
    2. I think there are some deviations and mixtures here.
      >>2001 సెన్సస్ ప్రకారం కర్ణాటకలో కన్నడ మాట్లాడే వారు షుమారు 68.5%<<
      భాష మాట్లాడేవారు వేరే, ఆ భాషలో చదువుకునే వారు వేరే. కొంకిణి భాష కేవలం మాట్లాడేదే, దానికి లిపి లేదు.

      తెలుగు మాధ్యమంలో చదివినంత మాత్రాన ఉద్ధరించేది ఏమీ లేదు. తెలుగు రాష్ట్రాలల్లో పరిపాలనా భాష ఇంగ్లీషే. (ఇప్పుడు మారిపోయుండచ్చు).
      కైఫీయతులు గట్రా అంటే ఎవడికి అర్థం అవుతుంది.

      పైపెచ్చు ఈ రోజు ఈనాడు తెలుగు విశ్వవిస్యాలయం తనదైన స్టైల్లో తెలుగుని నానారకాలుగా హించపెడుతూనే ఉంది.
      జలజాలం అనీ మన్నూ మషాణం అని.

      పాతిక సంవత్సరాల తర్వాత తెలుగు ఎలా ఉంటుందో ఆలోచించండి.

      Delete