Apr 24, 2020

ఆర్ణబ్ గోస్వామి

భారతీయ వార్తా మాధ్యమ జగత్తులో ఓ కొత్త ఒరవడి సృష్టించింది ప్రణయ్ రాయ్. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ౧౯౮౦ చివరి దశలో వర్ల్డ్ దిస్ వీక్ అంటూ ముప్పావుగంట ప్రోగ్రామ్ ద్వారా ఆ ఒరవడికి పదును పెట్టాడు రాయ్. కొంతకాలానికి యన్.డి.టి.వి ని తెరమీదకు తెచ్చాడు. యన్.డి.టీ.వి మొట్టమొదటి *నిరంతర వార్తా స్రవంతి*. సదరు స్రవంతిలో మొట్టమొదటి/రెండో తరం వార్తాహరులు వార్తా పాఠకులలో పేరు తెచ్చుకున్నవాళ్ళలో శ్రీనివాసన్ జైన్/ బర్ఖా (క్షమించాలి) దత్/ రాజ్ దీప్ సర్దేశాయ్/ ఆర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు అనేకులు. బర్ఖా/శ్రీనివాసన్ జైన్ లాంటివాళ్ళు ఇంక అందులోనే ఉన్నారు. రాజ్ దీప్ సర్దేశాయి బయటకి వెళ్ళిపోయాడు.

ఆర్ణబ్ గోస్వామి యన్.డి.టి.వి లో ఉన్నంత కాలం ఉన్మాదాన్ని ప్రధానంగా నమ్ముకున్నాడు. అతను ఏరోజు శాంతంగా మాట్టాడిన సందర్భం నాకు కనిపించలేదు యన్.డి.టి.వి లో ఉన్నన్ని రోజులు. ప్రతీ ప్రశ్నని ఉన్మాదిలా అడిగేవాడు. ఇండియా వాంట్స్ టు నో అంటూ గొంతు చించుకునేవాడు.

మొన్నీమధ్య ఒక దృశ్యమాలిక సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. ఆర్ణబ్ ఓ విమానంలో ప్రయణిస్తుండగా కునాల్ కర్మ (క్షమించాలి. ఇతనికీ ప్రవీణ్ కర్మకీ స్నేహితం ఉందా అనడిగితే కాకిరిగుమ్మ గుఱ్ఱపు బండిలో తీసుకెళ్ళి వదిలేసి రాబడును, గుఱ్ఱానికి గుగ్గుళ్ళు మీఖర్చే) అనే ఓ దౌర్భాగ్యుడు వ్యక్తిగత స్థాయికన్నా దగ్గరగా వీడియో తీయటం మొదలెట్టాడు. అతను ముఖమ్లో ముఖం పెట్టి అతన్నే వీడియో తీయటం. ఒకరకంగా ఇది వ్యక్తి స్వేచ్ఛను కాలరాయటం. మానవత్వాన్ని మర్చిపోవటం. ఇదీ వ్యక్తిగత స్థాయిలో హింస. వ్యక్తి సహనాన్ని పరీక్శించటం. సరే వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయటం. దీన్ని అద్భుతమైన కార్యంలా పొగిడిన నట్*యిజనులూ ఉన్నారు. తిట్టిన నెటిజనులూ ఉన్నారు.

ఈ మొత్తం కాండలో ఆర్ణబ్ గోస్వామి ఎంతో హుందాగా శాంతగా తన ఉన్మాద నైజాన్ని దాదాపుగా అధిగమించేసి ఒక అడుగు పైకే వేశాడు. సదరు కర్మకి అది చెంపపెట్టు.

అదే రాజ్ దీప్ సర్దేశాయ్ ఎలా పబ్లిక్ మీద ఉన్మాదాన్ని ప్రదర్శించాడో చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో తిరిగింది. వేరే కథ.

కలక్రమంలో ఆర్ణబ్ రిపబ్లిక్ టివి అనే ఓ వార్తా ఛానల్లో మేనేజింగ్ డైరెక్టర్ గా వెళ్ళటం జరిగింది. ఈ మధ్య సదరు వార్తా ఛానల్ని చూట్టం జరిగింది కూడా. ఆర్ణబ్ తన స్వభావాన్ని ఏంచేతనో మెరుగుపరుచుకున్నాడాని చెప్పక తప్పదు. దురుసుతనాన్ని ఉన్మాదాన్ని వదిలేసినట్టుగా అనిపించింది.

నిన్నటి ఓ వార్త - ఆర్ణబ్ లేట్ నైట్ కొలువు ముగించుకుని భార్యతో కలిసి ఇంటికి వస్తుండగా కొందరు వారి కరోలా కారుని వెంబడించటం, దురుసుగా కారు పక్కగా వచ్చి కారుని ఆపే ప్రయత్నం చేయటం, అద్దాల్ని పగలగొట్టి గంగాజల్ పొయ్యటానికి ప్రయత్నించటం అంతలో ఆర్ణబ్ ఇంటి సెక్యూరిటి సిబ్బంది చూట్టం పరుగెత్తుకుంటూ రావటం దాడి చేస్తున్న దుండగుల్ని అడ్డుకోవటం జరిగాయి. ఆర్ణబ్ అతని భార్యతో క్షేమంగా ఇంటికి చేరుకోటం సీక్వెన్షియల్ ఈవెంట్స్ జరిగిపోయాయి.

సదరు దుండగులు యూత్ కాంగ్రేస్ అని తేలటం. ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే కాంగ్రేస్ నేతలు సెలబ్రేట్ (అల్క లాంబా) చేసుకోటం - రాజకీయ కోణాన్ని ఆవిష్కరించాయి.

ఇలాంటివి కొత్తేంకాదు భారత ఆమాటకొస్తే ప్రపంచానికి. ఎన్ని చూడలేదూ?

౨౧వ శతాబ్దంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మన రాజకీయ వ్యవస్థ ఏస్థాయికి వెళ్ళిపోయిందో అర్థం చేస్కోవచ్చు.
ఏవైనా ఈదాడిని అన్ని వర్గాలవారూ ఖండించాలి.

తప్పు ఎవరిదైనా కావచ్చు - జర్నలిస్టుల మీద దాడి చేయకూడదు.
కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

మహారాష్ట్రలో కాంగ్రేస్ కొయిలేషన్ పాలన నడుస్తున్నది. (సోనియా గాంధీ కనుసనల్లో)

రెండ్రోజుల క్రితం ముగ్గురు వ్యక్తుల్ని దారుణంగా చంపిన రక్త చరిత్ర కళ్ళ ముందే తిరుగాడుతున్నది.

రక్తం మరిగిన ఒక జర్నలిస్టుగా ఆర్ణబ్ గోస్వామి సోనియా గాంధీని సూటిగా ప్రశ్నించాడు.


"పులీస్ వాలోంనె సంతోంకో భీడ్ కో సీంపాఁ. క్యా ఉన్‌పర్ రాజనీతిక్ దబావ్ థా?"
"సంతోఁ కె శరీర్ పర్ గెరువా కపడే థే, ఇసీలియే ఉన్‌కీ హత్యా కీ గయీ?"
"ఇంసాఫ్ కె సవాల్ పర్ అపరాధియోంకా ధర్మ్ క్యోం మతారహా హై మహారాష్ట్ర సర్కార్?"
"సోనియా గంధీ సే సవాల్ పూఛ్‌నా అపరాధ్ కబ్‌సే హో గయా?"
"సోనియాగాంధీ! దో సంతోఁ కో మార్ డాలా ఆప్ కి పోలీస్ నే ఆప్‌కో యే సాంప్రదాయక్ ఘటనా క్యోం నహీ కహా థా?"
 
ఇవి తప్పు ప్రశ్నలు అని నేననుకోటంలేదు. ఆమాటకొస్తే అడిగే హక్కు ఎవరికైనా ఉంది.


చివరగా ఈ దాడి కాంగ్రేస్ ధోరణిని మళ్ళీ తెరమీదకు తెచ్చింది. గాంధీల భజన. సోనియా గాంధీ త్యాగమూర్తి అనీ, ఆమె భారత్ మాత అని ప్రొజెక్ట్ చేయటం దౌర్భాగ్యం.

21 comments:

  1. ఈ గోస్వామి NDTV లో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు. Times now లోకి వచ్చాక అరవడం మొదలు పెట్టాడు. సొంత ఛానల్ republic tv లోకి వచ్చాక పిచ్చి పీక్స్ కి వెళ్లి పోయింది. ఇలాంటి వారిని జర్నలిస్టు అనడం తప్పు.
    తెలుగు లో సాక్షి, ఆంధ్ర జ్యోతి ఎలాగో ఇంగ్లీషు లో రిపబ్లిక్ అలాగ. న్యూట్రల్ గా ఉండేవాళ్ళు చూడలేరు. ఈయనేదో న్యాయమూర్తి లా తీర్పులు ఇచ్చేస్తాడు.
    ఆ అరుపులు, కేకలు వింటే బిపి పెరుగుతుంది.
    అయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు చెయ్యడం తప్పే.

    ReplyDelete
    Replies
    1. రూపాయి ఖర్చు లేకుండా ఇంత చక్కటి వినోదం అందిస్తున్న "పాత్రికేయులను" మీరు నిందించడం భావ్యమా మిత్రమా. అసలే కలా పోసకులంతా "చోటీ సీ బాలికా వధ", బండ హీరో కొంగొత్త బ్లాకుబాస్టర్ పిచ్చిపాటల ఆవిష్కరణ మహోత్సవం, "ఓపెన్ బార్క్ విత్ జేకే" లాంటి కామెడీ షోలను మిస్ అవుతున్న ఈ క్లిష్ట పరిస్థితులలో "ఇండియా వాంట్స్ టు షౌట్" లాంటి ఆణిముత్యాలు కూడా కరువయితే ఎట్లా వేగేది.

      కావాలంటే కలిప్ శర్మ & వనజ్యోత్ సింధు లాంటి వారిని అదుపు చేయవచ్చు కానీ ఒర్రునౌ గోసామి లాంటి మేటి హాస్యనటుడిని మాత్రం ఒగ్గేయండి ప్లీస్. ఆయన నిండు నూరేళ్లు బాగుండాలని, టీవీ "రచ్చ" కార్యక్రమాలు ఇంకాఇంకా ఎగబడి "బాధే"యాలని మనసారా దీవించండి. పాకిస్తానీ జర్నలిస్టు పేరుతో వచ్చే పగటి వేషగాళ్ళు, భారత సైన్యాధికారుల దుస్తులు వేసుకొని దర్శనమిచ్చే "పెద్దలు": ఇటువంటి కళాకారుల పొట్ట కొట్టడం సబబు కాదు.

      సర్వే జనా సుఖినోభవంతు. శతకోటి గావు కేకలు కూటి కొరకే.

      Delete
    2. ఇలాంటి కమేడియన్లు తెలుగు న్యూస్ ఛానళ్ళలో కూడా ఉన్నారండీ.
      టీవీ9/టీవి5 లాంటివాటిల్లో. కొత్తగా 10టీవీలో *త్తి మొదలెట్టాడుగా!

      Delete
    3. గత్తరి నత్తి, జబర్దస్త్ లాంటివి ఎంత లేదన్నా ఇంటెన్షనల్ కామెడీ. గోసామి వంటోళ్లే నయం!

      Delete
  2. Even though arnab goswami's methods sometimes seem bellicose, he is one of the few voices of Hindus in the sea of pseudo sicular, anti Hindu , Leftist presstitute media and academia.

    Blatant lies and misinformation, anti India propaganda is being spread by BBC, WSJ, NYT etc in addition to the biased and anti Hindu reporting of rajdeep, burka, Shekhar,ravish, arundhati Roy, the Hindu paper etc. When they can be called journalists why not arnab. First time in MSM someone is standing for Hindus voice.

    There is a groundswell of support for arnab.

    ReplyDelete
    Replies
    1. NDTV is trash. For that matter - across the globe - most of the media is biased. Ranging from Fox/CNN to Tv5/TV9/ETV/Sakshi et al.

      Delete
    2. GKK గారు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇలాంటి సూడో హిందువులు అవసరం లేదని నా అభిప్రాయం. వీళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని పైకి రావాలని చూస్తారు కాని మతానికి వీళ్ళ వలన ఏమీ ఉపయోగం లేదు. వీళ్ళు అతి చెయ్యడం వల్ల ఒక్కోసారి సూడో సెక్యులరిస్టులు అపహాస్యం చేస్తున్నారు.

      Delete
    3. @GKK (జీ)April 12, 2020 at 8:49:00 PM GMT+5:30
      హీరోలను రాజకీయ నాయకులను అభిమాని స్తాము. నచ్చకపోతే తిడతాము. అది బ్లాగర్ల వ్యక్తిగత ద్వేషం స్థాయికి ఎందుకు వెళ్ళాలి.

      hari.S.babu
      మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదే!

      చంద్రబాబుని నువ్వు విమర్శిస్తావో ద్వేషిస్తావో హత్య చేసి జైలుకి వెళ్తావో అది నీ ఇష్టం."పచ్చ భూతాలకు చెప్పుతో కొట్టినట్టు అయింది. ఇంకా ఎన్ని పచ్చ కోవర్తులు ఉన్నాయో తెలియదు. థూ మీ బతుకులు చెడ." తరహా స్థాయి తక్కువ భాష వాడుతున్నది నువ్వు.ఒకసారి కాదు పద్ధతి ప్రకారం మర్యాదగా చెప్పినా వినకుండా పదే పదే రెచ్చిపోతున్నది నువ్వు.పైన నన్ను తప్పు పడుతున్నావు."పచ్చ భూతాలకు","పచ్చ కోవర్తులు" - ఇలా నీ కసి చూపిస్తూ రాజకీయ విమర్శలకు వ్యక్తిగత దూషణలకు తేడా తెలియని నీవు మాకు "హీరోలను రాజకీయ నాయకులను అభిమానిస్తాము. నచ్చకపోతే తిడతాము. అది బ్లాగర్ల వ్యక్తిగత ద్వేషం స్థాయికి ఎందుకు వెళ్ళాలి." అని నీతులు చెబుతున్నవు. చంద్రబాబుని నువ్వు ఎన్నైనా తిట్టుకో!కానీ, "హీరోలను రాజకీయ నాయకులను అభిమాని స్తాము. నచ్చకపోతే తిడతాము. అది బ్లాగర్ల వ్యక్తిగత ద్వేషం స్థాయికి ఎందుకు వెళ్ళాలి." ఆనెది నీకు వర్తింపజేసుకుంటే బాగుంటుంది, కదా! చంద్రబాబును విమర్శించడంతో ఆగకుండా సమర్ధించేవాళ్ళ్ళని కూడా చీ చా ధూ అని అంటున్నది నువ్వా మేమా?నువ్వు చీ చా ధూ అంటే పడి వూరుకోవటానికి మేము నీ బానిసలం కాదే!మాలో తప్పుంటే పట్టుకో, మాది ఒప్పయితే మెచ్చుకో - మమ్మల్ని చీ చా ధూ అనడానికి నువ్వెవడివిరా గూట్లే!

      నీ దగ్గిర పాయింటు ఉంటే చెప్పు,లేదంటే సైలేంట్ అయిపో - అంతేగానీ చీ చా ధూ అనడం యేంటి"

      అసలు సభ్యతా సంస్కారాలు లేనిదీ నేర్చుకోవాల్సిందీ నువ్వు!
      నాకు నీతులు చెప్పే అర్హత నీకు లేదు - నువ్వు మర్యాద ఇస్తే నేనూ మర్యాద ఇస్తా.నువ్వు చీ చా ధూ అంటే నేనూ చీ చా ధూ అంటా!

      బస్తీ మే సవాల్!

      Delete
    4. Why are you haunting GKK? You want to haunt to challenge - you can. thats between you and GKK. Why are you spamming other blogs with such shit challenge? is your comment relevant to the post? is your comment adding anything to the post? next time - your comments will be moderated and sent to spam.

      Delete
    5. This is not a shit challenge. Do you think ssnaatana dharmam told him to spread lies and demean others like "chee Chaa, dhoo!"

      How do you lift Hinduism with such idiots like GKK, who do not know the basics of polity and economy.

      What is the problem of Hindus to get united and be strong, just tell me as you are all worrying about it?

      Delete
    6. so Hindus are weakening because of GKK? Am I worried about the future of hinduism?
      Sanatana dharma told GKK? you mean called him on phone?

      You better cheer up - ask these questions in your blog.
      My question is - why to spam in others blogs.

      For that fact - I am not worried about hinduism. I am not thinking that GKK is the god's voice.
      I dont even believe that you can lift the hinduism.

      Delete
  3. "పులీస్ వాలోంనె సంతోంకో భీడ్ కో సీంపాఁ. క్యా ఉన్‌పర్ రాజనీతిక్ దబావ్ థా?"
    "సంతోఁ కె శరీర్ పర్ గెరువా కపడే థే, ఇసీలియే ఉన్‌కీ హత్యా కీ గయీ?"
    "ఇంసాఫ్ కె సవాల్ పర్ అపరాధియోంకా ధర్మ్ క్యోం మతారహా హై మహారాష్ట్ర సర్కార్?"
    "సోనియా గంధీ సే సవాల్ పూఛ్‌నా అపరాధ్ కబ్‌సే హో గయా?"
    "సోనియాగాంధీ! దో సంతోఁ కో మార్ డాలా ఆప్ కి పోలీస్ నే ఆప్‌కో యే సాంప్రదాయక్ ఘటనా క్యోం నహీ కహా థా?"
    lets discuss on these questions too

    ReplyDelete
  4. ప్రస్తుతం జూబిలీహిల్సులో తల దాచుకున్న చంద్రాలు సారు ఆర్నాబు గోస్వామి మీద దాడి ఘోరమంటూ తీవ్రంగా ఖండించాడు. అక్కడే సమీపంలో తన చిన్నింట్లో బతుకీడుస్తున్న అతగాడి అనుంగు సహచరుడు రవ్వంత రెడ్డి సోనియా గాంధీనే అంటావా అంటూ ఆర్నాబుపై నిప్పులు చెరిగాడు. రామోజీ తాత & రాధాకృష్ణ బాబాయి ఈ రెండు వార్తలను ప్రముఖంగా ప్రచా(సా)రం చేసి భక్తజనులను తరింపజేసారు.

    రెండు వైపులా మనోడే ఆడాలన్న ఆత్రానికి ఇటీవలి కాలంలో ఇదే మాంచి ఉదాహరణ.

    ReplyDelete
    Replies
    1. నిమ్మగడ్డ అండ్ బాచ్చి.. గురించి, బోకుజ్యోతిలో చూశారా? చెంద్రబాబుకూడా అంతగా తపనపడడేమో.

      Delete
    2. అంధకోతి షరా మామూలే లెండి. తెలుగు సినీమహిళలంటే అత్యంత గౌరవం ప్రదర్శించే సాంబడు పడే ఆపసోపాలు బడే బాగున్నాయి.

      మన బ్లాగులలో సైతం కొందరు "రైతులు" కుళ్ళు ఆపుకోలేక యమ కుమిలిపోతున్నారు పాపం.

      Delete
  5. ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవడయ్యా అంటే మా గొట్టాలుగాడే! ఎందుకంటే ఏ వార్త చదివినా వాడికి గుర్తొచ్చేది తనకి ఇష్టంలేని నాయకుడే.

    ReplyDelete
  6. People like Arnabh are the reason why you had written this post about our Telugu media : http://ramakantharao.blogspot.com/2020/04/blog-post_66.html


    Kamra did what Arnabh does in his news studio. Arnabh is a psycho and a demagogue. All he cares about is his TRP and his popularity no matter the bloodshed on the streets.

    ReplyDelete
    Replies
    1. Why to say Arnab? Every journalist is doing the same. Every news channel is doing the same.

      It is the news media which is psychic. Better not to talk about telugu media. telugu media wants to have TRP by spreading fake news.

      Delete