Aug 27, 2011

అవినీతి నిర్మూలనకు దృఢమైన రాజకీయ సంకల్పం - రాహుల్‌గాంధీ

ఈసీ తరహాలో లోక్‌పాల్‌
అవినీతి నిర్మూలనకు రాజ్యాంగబద్ద వ్యవస్థ
రాహుల్‌ గాంధీ సూచన
ఒక్క లోక్‌పాల్‌తో అవినీతి పోదని స్పష్టీకరణ
వ్యక్తుల డిమాండ్లు
ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరచకూడదని వ్యాఖ్య
లోక్‌సభలో ప్రసంగం
లోక్‌పాల్‌ చట్టం ఒక్కటే దేశంలో అవినీతిని నిర్మూలించలేదని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు దృఢమైన రాజకీయ సంకల్పం, పటిష్ఠమైన రాజ్యాంగ వ్యవస్థ ఉండాలని అన్నారు. అన్నా హజారే దీక్ష నేపథ్యంలో రాహుల్‌ తొలిసారిగా లోక్‌పాల్‌పై నోరు విప్పారు.
-ఈనాడు
మరి ప్రధని ఏం పేర్కున్నారూ? వారు *పార్కున్నారా?*
కానీ, మన్మోహన్ని చూస్తే జాలిగా ఉంది. సదరు పేర్కొనటాలు *ఎసాసినేషన్* కన్నా ఏం తక్కువ కాదు.
ఇప్పటికైనా అమ్మగారి ఉప్పు తింటం ఆపి, ఆరడుగుల గొయ్యి తొవ్వుకోటం బెటరు మన్మోహన్, పాపం మన్నుమోహన్!!

కాంగ్రేసు పార్టీలో ఇది కొత్తగాకపోయినా, మరీ ఇంత ఎసాసినేషనుకి పాల్పడతారని ఉంహించినా, ఇంత తొందరగా అని ఊహించలేదు. ఇహ ఇప్పుడు ఏదోక ఉప్పుతిన్న గొఱ్ఱెని బలిస్తే, జనాల్లో సానుభూతి ఉప్పెనలా పొంగి, పొర్లి, అట్టడుక్కి దిగజారిపోయిన కాంగ్రేస్ ప్రాణం మళ్ళీ పైకిలేచొచ్చి, జవజీవాలు ఎడాపెడా నింపేస్కుని వచ్చే ఎన్నికల్లో జనగొఱ్ఱెలచేత పట్టంగట్టిచ్చుకుని శ్రీ విరాట్ రాజాధిరాజ రాజ మార్తాండ శ్రీశ్రీశ్రీ రెవరెండ్ రాహులు గాంధీ నెత్తిన కిరీటాన్ని పెట్టించే దురాలోచనకి మౌనసాక్షిలా కుక్షిలా గొఱ్ఱెలా చూస్తూ ఉండిపోతాను. అంతకన్నా ఏం చేయగలం?
అవినీతి నిర్మూలనకు దృఢమైన రాజకీయ సంకల్పం ఉండాలని ఎంతచక్కగా చెపుతున్నాడో చూసి తరించండయ్యా!!
వచ్చే ఎన్నికల్లో నేను కాంగ్రేసుకి వోటు వెయ్యబోతున్నాను..

Aug 24, 2011

వాషింగుటన్ను దగ్గర్లో భూకంపం

అమెరికా రాజధాని వాషింగుటన్ను దగ్గర్లో, వర్జినియా రాష్ట్రంలో, రిచిమండుకి అతి దగ్గర్లో భూమి కంపించింది. ఛార్లెట్స్‌విల్ (అనుకుంటా) ఎపిసెంటర్. రిచర్డ్ స్కేలుపై ౫.౯ తీవ్రతగా నమోదైంది.
ఆల్బనీలోని మిత్రులకు ఫోన్ చేసి అడిగాను. ఏంటి మాష్టారూ అని, నేను కూర్చున్న కుర్చి రెండు సార్లు కంపించింది భాస్కర్ అన్నారాయన. భూకంపం వచ్చిన ఎపిసెంటరునుండి ఆల్బనీ కనీసం నాలుగొందల యాభై మైళ్ళు ఉంటుంది.

వర్జీనియా/వాషింగుటన్ను/మేరీలాండ్/నార్త్ కారొలీనా ఇత్యాది రాష్ట్రాల్లో ఉన్న జనాలు సేఫ్ గా ఉండాలనీ, ముందు జాగ్రత్తలు తీస్కోవాలనీ కోరుకుంటున్నాను. అలానే, తమతమ అనుభవాలను పంచుకోవాలనీ కోరుకుంటున్నాను.

Aug 23, 2011

సెక్యులర్ నిరాహారదీక్షలు - అన్‌సెక్యులర్ ఎటెన్షన్ సీకర్లు

టైమ్స్ వారి వార్తా కాలంలో ప్రముఖ సెక్యులర్ వాది అరుంధరి రాయ్ ఇలా వాక్రుచ్చారు -
ఎవరీ అన్నా హజరే? రైతుల ఆత్మహత్యలు గురించి కిమ్మనలేదే?
రాజ్ థాకరే *మరాఠీ మానుస్* నినాదానికి సపోర్టు ఇచ్చాడే!
"Who is he really, this new saint, this Voice of the People? Oddly enough we've heard him say nothing about things of urgent concern. Nothing about the farmer's suicides in his neighbourhood, or about Operation Greyhound further away. He doesn't seem to have a view about the government's plans to deploy the Indian Army in the forests of Central India."

నిజమేనమ్మా!! మరి తమరు మాట్లాడారా? అని నేను అడగనులేగానీ,
అవినీతిపై పోరాటం చేటానికీ, సెక్యులరిజానికీ బట్టనెత్తికీ మోకాలుకీ ఏటీ సంబంధం?
రకరాల మనుషులు రకరకాల పోరాటాలు సేస్తుంటారు. తవరూ చేస్తున్నారు, జమ్మూకాశ్మీరులో హరియత్ నేతలకు సపోర్టునిస్తూ. తమరు హాయిగా ఇంట్లో పాలు కాచుకుని టీ పెట్టుకు తాగటం ఉత్తమం. ఎందుకీ ఎదవ *గుర్తింపుకోసం పాకులాటలు*? చెప్పండీ?

తమరు కొల్లేరు సరస్సు ఆక్రమణలపై పోరాడారా?
తమరు వరకట్న చావులపై పోరాడారా?
తమరు రోడ్డు ప్రమాదలపై పోరాడారా?
అన్నా హజారే సమాజానికి కాస్తో కూస్తూ ఉపయోగపడే పోరాటమైనా చేస్తున్నాడు. తమరు ఏంచేస్తున్నారూ?
మిషనరీలకి అమ్ముడుపోయి జేఋలు నింపుకుంటూ మదమెక్కి మెంతులు తింటూ నోటికొచ్చినట్టు వాగటం పోరాటానికి రిక్వజైట్ అనుకుంటున్నారా?

నిన్న ఎవడో అన్నా హజారేది హిందుత్వ పోరాటం అన్నాడు. వాడొక ప్రొఫెసర్ అట.
ఇవ్వాళ్ళ అరుంధతీ రాయ్

తరిమికొట్టండ్రా కొడుకుల్ని ఈ కూతుళ్ళనీ ఏటీ ఆలోచించేది....యాక్ థూ బతుకులు. థూ!

http://timesofindia.indiatimes.com/india/Anna-Hazare-is-not-secular-Arundhati-Roy/articleshow/9700692.cms

If anna is not a secular person then Arundhati is not a human being అని ఎవడో భలే అన్నాడు

Aug 18, 2011

టూటా టూటా ఏక్ పరిందా ఐసే టూటా

టూటా టూటా ఏక్ పరిందా ఐసే టూటా

ఈ పాటతోనే నేను కైలాశ్ ఖెర్ అభిమానినయ్యాను.
ఈ పాట వ్రాసింది శేఖర్ [విశాల్-శేఖర్ ద్వయం లోని శేఖర్, సంగీతం అందించిందీ వీళ్ళే]
అత్భుతమైన పాట.
నిరాశానిస్పృహల నడుమ కొట్టుకులాడుతున్నవాడికి, ఏవైనాకానీ, రేపంటూ వస్తుంది అంటూ ఆశావహ ధృకపథాన్ని అందిస్తుంది ఈ సాహిత్యం

ఎవరో ఒక బ్లాగర్ ఈ పాటకి ఆంగ్లార్థం వ్రాసుకొచ్చాడు.

Toota toota ek parinda aise toota (टूटा टूटा एक परिंदा ऐसे टूटा)

Eng: A Fairy (bird) was broken as such

Ke phir jud naa paaya (के फिर जुड़ ना पाया)

Eng: That he couldn't be fixed again

Loota loota kisne usko aise loota (लूटा लूटा किसने उसको ऐसे लूटा)

Eng: Somebody stole from his as such

Ke phir ud naa paaya (के फिर उड़ ना पाया)

Eng: That he couldn't fly again

O o o o

Girta hua woh asmaan se (गिरता हुआ वोह आस्मां से)

Eng: Falling from the sky

Aakar gira zameen par (आकर गिरा ज़मीन पर)

Eng: He hit the ground

Khwabon mein phir bhi badal hi the (ख्वाबों में फिर भी बदल ही थे)

Eng: Still, In his dreams were the clouds

Woh kehta raha magar (वोह कहता रहा मगर)

Eng: But he kept on saying (reciting)

Reff:

Ke allah ke bande hasde allah ke bande (के अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: That Man of God keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever it is (happens), tomorrow it (chance) will come again

Allah ke bande hasde allah ke bande (अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: Man of God keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever happens, tomorrow chance will come again

Kho ke aapne par hi to usne tha ud naa sikha (खो के आपने पर ही तो उसने था उड़ ना सिखा)

Eng: Only after losing his wings did he learned to fly

Kho ke aapne par hi to o o o (खो के आपने पर ही तो o o o)

Eng: Only after losing his wings

Kho ke aapne par hi to usne tha ud naa sikha (खो के आपने पर ही तो उसने था उड़ ना सिखा)

Eng: Only after losing his wings did he learned to fly

Gham ko aapne saath mein lele dard bhi tere kaam aayega (ग़म को आपने साथ में लेले दर्द भी तेरे काम आएगा)

Eng: Take your sorrows with you, for the pain will also be of use to you

Reff:

Allah ke bande hasde allah ke bande (अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: Man of God keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever it is (happens), tomorrow it (chance) will come again

Allah ke bande hasde allah ke bande (अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: Man of God, keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever happens, tomorrow chance will come again

Tukde tudke ho gaya tha har sapna jab woh toota (टुकड़े टुकड़े हो गया था हर सपना जब वोह टूटा)

Eng: (all of) His dreams were shattered when he fell (apart)

Tukde tudke ho gaya tha aa aaa aa (टुकड़े टुकड़े हो गया था)

Eng: Shattered to pieces

Tukde tudke ho gaya tha har sapna jab woh toota (टुकड़े टुकड़े हो गया था हर सपना जब वोह टूटा)

Eng: all of his dreams were shattered when he fell (apart)

Bhikre tukdon mein allah ki marzi ka manzar paayega (भिकरे टुकड़ों में अल्लाह की मर्ज़ी का मंज़र पायेगा)

Eng: In those broken pieces is (he will find) God's wish (aim/will)

Reff:

Allah ke bande hasde allah ke bande (अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: Man of God, keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever happens, tomorrow chance will come again

Allah ke bande hasde allah ke bande (अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: Man of God, keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever happens, tomorrow chance will come again

Toota toota ek parinda aise toota (टूटा टूटा एक परिंदा ऐसे टूटा)

Eng: A Fairy was broken as such

Ke phir jud naa paaya (के फिर जुड़ ना पाया)

Eng: That he couldn't be fixed again

Loota loota kisne usko aise loota (लूटा लूटा किसने उसको ऐसे लूटा)

Eng: Somebody stole from his as such

Ke phir ud naa paaya (के फिर उड़ ना पाया)

Eng: That he couldn't fly again

Girta hua woh asmaan se (गिरता हुआ वोह आस्मां से)

Eng: Falling from the sky

Aakar gira zameen par (आकर गिरा ज़मीन पर)

Eng: He hit the ground

Khwabon mein phir bhi badal hi the (ख्वाबों में फिर भी बदल ही थे)

Eng: Still, In his dreams were the clouds

Woh kehta raha magar (वोह कहता रहा मगर)

Eng: But he kept on saying (reciting)

Reff:

Ke allah ke bande hasde allah ke bande (के अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: That Man of God, keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever it is (happens), tomorrow it (chance) will come again

Allah ke bande hasde allah ke bande (अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: Man of God, keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever happens, tomorrow chance will come again

Allah ke bande hasde allah ke bande (अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: Man of God, keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever happens, tomorrow chance will come again

Allah ke bande hasde allah ke bande (अल्लाह के बन्दे हसदे अल्लाह के बन्दे)

Eng: Man of God, keep smiling oh Man of God

Allah ke bande hasde jo bhi ho kal phir aayega (अल्लाह के बन्दे हसदे जो भी हो कल फिर आएगा)

Eng: Man of God keep smiling, whatever happens, tomorrow chance will come again

సదరు బ్లాగు http://chaotic-psycosis.blogspot.com/2010/12/man-of-god.html

Aug 17, 2011

హత్యకు గురైన శ్లేషా మసూద్

సహ కార్యకర్త దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లో పట్టపగలే ఘాతుకం
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో సమాచార హక్కు కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆమె పేరు శేష్లామసూద్‌. మంగళవారం ఉదయం 11 గంటలకు సొంత ఇంటిముందే కారులో కూర్చున్న ఆమెను దుండగుడు ఒకరు కాల్చి చంపాడు. శేష్లామసూద్‌ కొంతకాలంగా సమాచారహక్కు చట్టంపై విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతోపాటు ఆ చట్టం ఆధారంగా పలు సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని పలు అభయారణ్యాల్లో పులులు భారీగా మృత్యువాత పడుతుండడం, అడవుల పరిరక్షణ తదితర అంశాలపై ఆమె చురుగ్గా స్పందించేవారు. ఇటీవలే అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే దీక్షకు మద్దతుగా తాను కూడా నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఆమెను కాల్చి చంపడానికి దారితీసిన కారణాలేంటో ప్రస్తుతానికి తెలియరాలేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు
సహ? ఏంటో ఈనాడుకి రోజురోజుకీ మతిపోతున్నట్టుంది.
మొన్న
లోకాయుక్త కుమారుడు అమెరికాలో మృతి అని ఓ వార్త
వార్తలోకి వెళ్తే, రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ ఆనందరెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి(35) గురువారం అమెరికాలో మృతి చెందారు.

ఏవిటీ వార్తాహరుల విధానం? లోకాయుక్త కుమారుడు ఏవిటీ?
సహ ఏవిటీ?

సమాచార హక్కు కార్యకర్త దారుణ హత్యను నేను ఖండిస్తున్నాను. ప్రభుత్వం అసలు పని చెస్తోందా? అవినీతిపై పోరాడేవారిని బోనులో పెట్టే కేంద్రప్రభుత్వం, మరోవైపు చట్టాలకోసం పోరాడేవారిని కాల్చేస్తుంటే కిమ్మనకుండా కూర్చునే రాష్ట్ర ప్రభుత్వాలు. వెరసి ప్రజాస్వామ్యం. మీరు ఓట్లేసి గెలిపించిందేగా అని దబాయింపు ఆపై.

దానికి మళ్ళీ పోరాటాలు ప్రజాస్వామ్య విధానాల్లోనే చేయాలని ప్రభుత్వాల ఉక్కుపాదం. కాల్చేవారు దోపిడీదారులు ప్రజాస్వామ్య విధానంలోనే ప్రాణాలను హరిస్తున్నారుగా అని వదిలేస్తారేమో?

కాంగ్రేస్ ప్రభుత్వం చేస్తోంది తప్పా?

సెక్షన్ ౧౪౪, ౧౫౧, ౧౫౫ సిఆర్పిసి...

చట్ట ప్రకారం అన్నా హజారే తలపెట్టింది తప్పా?
నిరాహారదీక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయొచ్చా?
బ్లాక్మైల్ చేస్తున్నట్టు కాదా?
కాంగ్రేస్ ప్రభుత్వం అన్నా హజారేని అరెస్టు చేయటం తప్పా?
ఇప్పుడు కాంగ్రేస్ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్స్ ఏంటీ?

సైఫుద్దిన్ సోజ్ వాదన ఏంతంటే - ప్రజాస్వామ్యంలో, ప్రజలే ఎన్నుకుంటున్నప్పుడు, డెమొక్రటిక్ ప్రాసెస్ ద్వారా చట్టాలను చేయలనీ, డెమొక్రాటిక్ వేలో వాటిని సాధించుకోవాలనీ అంటాడు.

భలే చెప్పాడు పెద్దమనిషి. ఇప్పటికి ఇది రెండోసారి కాంగ్రేస్ ప్రభుత్వం ఇలా చట్టాన్నీ డెమొక్రసీనీ పరిరక్షించేందుకు ముందడుగు వేసి పోరాటకర్తలను జైల్లోకి తోయటం. మొన్న బాబా రాందేవ్ సంఘటన. ఇప్పుడు అన్నా హజారే.
రెండు సంఘటనల్లో కామన్గా కనిపించేది, కాంగ్రేస్ ప్రభుత్వ వెన్నెముకలేని తత్వం. అది -
బాబా రాందేవ్ అక్రమంగా సంపాదించాడు అంటూ లీగల్ ప్రాసెస్ లేవతీయటం.
ఇప్పుడు అన్నా హజారే లంచగొండి, రెండు లచ్చలు ఖర్చుపెట్టుకున్నాడు పుట్టిన్రోజుకి అని.

ఐతే! బాబా రాందేవ్ విషయంలో ఏం జరిగిందో అప్డేట్ ఎక్కడా లేడు? ఎందుకూ?
సరే ఇవన్నీ పక్కనపెట్టి ప్రస్తుతంలోకి వస్తే -

సైఫుద్దిన్ సోజ్ పొద్దున్నే కామ్గ్రేసు తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇలా -
డెమొక్రటిక్ ప్రాసెస్ ద్వారా చట్టాలను తెచ్చుకోవాలి పోరాడాలన్నప్పుడు, మమతా బెనర్జీ ఆరోజున నిరాహారదీక్ష చేస్తుంటే అరెస్టు ఎందుకు చేయలేదూ?
ఆ సంఘటన స్వతంత్రానికి పూర్వం జరగలేదే? నిన్నకాక మొన్ననేగా జరిగిందీ?

కాంగ్రేస్ ఇప్పుడు మీట్ అవబోతోందట.
అమ్మ లేదు కాబట్టి పాపం మన్మోహన్ సింగు గార్కి ఊపిరి ఆడక వాడిపేరేందివయ్యా? హా!! రాహుల్ గాంధీకి కాల్ చేసాట్టా ఏం చేద్దాం ఆని?
ఆడు ఇటలీకి కాల్ చేసి కనుక్కుని చెప్తా అనుంటాడు, ఎదవ.

అన్నా హజారేని అరెస్టు చేయటం మీరు సమర్థిస్తారా?
ఇప్పుడు కాంగ్రేస్ ప్రభుత్వానికి కిం కర్తవ్యం?

రండి లైవ్ బ్లాగ్ చేద్దం!!
ప్లీజ్ పోస్ట్ అప్డేట్స్. దేశంలో ఉన్నవారు అప్డేట్స్ పోస్ట్ చేయ ప్రార్థన

Aug 15, 2011

భారతమాతకు జై *జైలు*

భారతమాతకు జై *జైలు*
బంగరు భవితకు జై *జైలు*

రాజకీయనాయకులకు జో *హారు* లు
వాళ్ళ ఆస్తులకు దాసోహాలు

పోయినోళ్ళంతా గోడమీద పటాలు
గొఱ్ఱెల మంద జనాలు నోరులేని చిత్రపటాలు

రోజుకో స్కాముల చరిత్రలు
కోట్లకుకోట్లుతో నిండుతున్న భోషాణాలు

నిద్రలేస్తే బందుల భవితవ్యాలు
సగటుమనిషి ఆకలి చావులు

రోజురోజుకూ పెరుగుతున్న వైషమ్యాలు
ఎడతెగని రక్తపు ధారలు

అబలపై పెరుగుతున్న అత్యాచారాలు
సూట్కేసుల్లో తేలుతున్న శవాలు

భారతమాతకు జై *జైలు*
బంగరు భవితకు జై *జైలు*

ఒక్కసారి ఈ వాక్యాలను కూడా గుర్తు చేస్కుందాం ఆన్ ది ఫ్లిప్ సైడ్ -
ऐ मेरे वतन् के लोगो।
तुम खूब लगा लो नारा।
ये शुभदिन है हम सबका।
लहरा लो तिरंगा प्यारा पर|
मत भूलो सीमा पर।
वीरों ने है प्राण गँवाए।
कुछ याद उन्हें भी कर लो।
जो लौट के घर न आए।
ऐ मेरे वतन के लोगो।
ज़रा आँख में भरलो पानी।
जो शहीद हुए हैं उनकी।
ज़रा याद करो क़ुरबानी।

Aug 11, 2011

యాన్డ్రాయిడ్ లో తెలుగు డబ్బాల్లా కనిపిస్తోందా?

నాదగ్గర డ్రాయిడ్ ఎక్స్ టు ఉంది. నా బ్లాగు తెరిస్తే డబ్బాలు డబ్బాల్లా రెండర్ అవుతుంది తెలుగు ఖతి. దీనెంకయ్య ఎట్రా బాబూ అనుకుని ఆడా ఈడా ఎతుకతనే ఉన్యా.
యాడా ఏదీ దొరకలా. ఇందాక యాణ్ణో గెలుకుతా ఉంటే ఓ తీగ నా మౌజు కాలికి రగిలింది. ఏందిరా అబ్బియ్యా అనిజూస్తే ఇదీ కత -
ఒపెరా మిని అంట దించుకో
ఒపెర మిని తెరువు
అడ్రస్సు బారు, మందుకొట్టే కాదులేప్పా, అడ్రస్సు బారులో opera:config అనంటా కొట్టు.
కిందకంటబో
Use bitmap fonts for complex scripts
అని ఉండిద్ది. ఉంటంఉంటం no అనుండిద్ది. దాన్ని yes కు మార్చి, save కొట్టు.
అడ్రస్సు బారులో బ్లాగు ఓపెన్ కొట్టు.....
టట్టడాయ్
అదన్నమాట
ఇంటికెళ్ళినాక స్క్రీన్ షాట్ పెడతాలేబ్బా......
ఇంక ఎంజా మాడు ఏంది గుడ్లప్పగించి సూస్తా

అప్డేట్ -
ఒపెరాలో బ్లాగ్

ఫైర్ఫాక్స్ ఆన్ డ్రాయిడ్, ఈనాడు మొబైల్ -

బాగుంది. వావ్ కేక.
ఐతే ఫైఫాక్స్ బ్లాగ్ తుస్సుమంది -

ఈనాడు ఒపేరాలో ఫ్లాప్

Aug 10, 2011

రాకాసి బల్లులు

మా సూరిగాడిచేత ఇదిగో రాకాసి బల్లులు వేయించాను. ఆటిని అట్టే కాయితకం మీద కట్టేసి ఉంచాను. ఎవరైన నాతో పెట్టుకుంటే, ఆటిని వదుల్తా, వచ్చి తినేస్తాయ్.

జాగ్రత్త.

Aug 9, 2011

తండ్రి జాడ కోసం కుమార్తెల వేడుకోలు

తండ్రి జాడ కోసం కుమార్తెల వేడుకోలు
తూప్రాన్‌, న్యూస్‌టుడే: 'ఎందుకు నాన్నా ఇలా చేశావు..? తెలంగాణ అందరికి కావాలె.. కానీ నువ్వు మాకు కావాలె.. ఎట్లాగైన నువ్వు రావాలి.. మరణ లేఖ రాశావని.. తిరిగి రానన్నావని వింటుంటే బాధేస్తుంది..' తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ప్రాణత్యాగం చేసుకుంటానని, ఇంటి నుంచి వెళ్లిపోయిన మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొనింటి రమేశ్‌ కుమార్తెలు సోనీ (15), సంఘవి (12) వేడుకోలు ఇది. వచ్చే నెల 1వ తేదీలోగా తెలంగాణ ఇవ్వాలని కోరుతూ రమేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మేరకు నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి బస్టాండ్‌లో శనివారం లేఖ వదిలారు. ఆదివారం ఆ లేఖ పోలీసులకు అందింది. అదే రోజు రాత్రి తూప్రాన్‌లో గాలించినా వివరాలు లభ్యం కాలేదు. సోమవారం పాఠశాలలు తెరిచాక విషయం బయటకొచ్చింది. రమేశ్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. మెదక్‌ ఎంపీ విజయశాంతి ఫోన్లో మాట్లాడారు. రమేశ్‌ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి ఫోన్‌ చేశారు. కుమార్తెలతో మాట్లాడారు. ఎక్కడున్నారోఅడుగుతుండగానే కట్‌ చేశారు. సిగ్నల్స్‌ ఆధారంగా యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్నట్లు తెలిసి బంధువులు వెదికారు. దొరకలేదు.

తెలంగాణ రాష్ట్రం తెలంగాణ జనాలకు ఎమ్తో అవసరం. తెలంగాణ ఇవ్వాల్సిందే. తెలంగాణ రావాల్సిందే. కానీ తెలంగాణ రావాలంటే ఇదికాదు పోరాడే విధానం. ఇంకా ఎందరు తండ్రులను బలిస్తారో అటు ప్రభుత్వం వారూ ఇటు కేసీఆరు. పోరాడండి, ప్రాణాలు తీయకండి. ఆ బలిపశువుకి పెండ్లై ఉండచ్చు, పిల్లలుండచ్చు, నువ్వు వెళ్ళి ఓ పాలి చూసొచ్చి, విజయశాంతి ఫోన్లో మాట్టాడినంత మాత్రాన వీళ్ళ జీవితాలు తెల్లారవు. తెలంగాణ తెస్తాం లేకుంటే ప్రాణాలు ఇస్తాం అంటూ రెచ్చగొట్టటాన్ని అటు ప్రభుత్వం గానీ ఇటు చట్టసభలు గానీ న్యాయాస్థానాలు గానీ ఇంతవరకూ తప్పుబట్టకుండా జనాల మానాన ఆత్మహత్యలు చేస్కుంటుంటే నడీనడుమ మనకెందుకనీ, రెచ్చగొట్టేటోడు మన కేసీఆరేగా సాయంత్రం ఐతే అందరికీ  సుక్క పోపిస్తడు, మనోడేలే అని ఒదిలేయటం అచేతన వ్యవస్థకి సంకేతం, మన దురదృష్టం

చచ్చి సాధించేటిది ఏమీ లేదు

జై హింద్

Aug 5, 2011

సోనియాకు సర్జరీ

అమెరికాలోని క్యాన్సర్‌ ఆసుపత్రిలో?
నెల రోజులు అక్కడే విశ్రాంతి!
ఉన్నట్టుండి గురువారం ప్రకటన
వ్యాధి విషయంలో అంతా గోప్యం
పార్టీ పగ్గాలు రాహుల్‌ బృందానికి
కమిటీలో అంతా ఆమె సన్నిహితులే
మారుతున్న రాజకీయాలకు సంకేతం?
ఉదరకోశ సమస్యలకు గాను ఆమెకు సర్జరీ చేశారని పార్టీ వర్గాలు చెబుతుండగా మరోవైపు క్యాన్సర్‌ ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్టు వార్తలు వస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి రాజకీయాల్లో చురుకుగా ఎప్పుడు పాల్గొంటారన్నది చెప్పటం కష్టంగా తయారైంది.

అయ్యారే!! సోనియా గాంధీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకపోతే దేశ భవితవ్యం ఏంటి? మన్మోహన్ సింగ్ ఒక్కడే ఎలా రాణించగలడూ? ఏ నిర్ణయాన్నైనా ఎలా తీస్కోగలడూ? అసలు కాంగ్రేస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? పార్టీ పరమైన నిర్ణయాలు ఎవుళ్ళు తీస్కుంటారు? తెలంగాణ ఎవరిస్తారు? కేసీఆరుకి మూటలు ఎవరిస్తారు?
ఏంటో ఒక్క *(అ)భారతీయ మహిళ* అడ్దంపడితే చూడండి ఎన్ని ప్రశ్నలో.

నాకు దిగులుగా ఉంది
బాధగా ఉంది
అంతకన్నా భయంగా ఉంది
భవిష్యత్తు ప్రశ్నగా ఉంది
ఆమె కోలుకోవాలనీ
మరిన్ని డబ్బులు మూటగట్టుకోవాలనీ
దేశాన్ని *హస్త* గతం చేస్కోవాలనీ
ఆమె దేశానికి మరింత సేవ చేయాలనీ
అసలు ఆమే ప్రధాన మంత్రి అవ్వాలనీ
నా అభిలాష

Aug 3, 2011

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక

కధ
చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది.
http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81_%282006_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%29

అంటే అన్నావంటారు గాని!! స్పాయిలర్ అంటే చెరుపు అనా?
నా కారుకి వెనుక స్పాయిలర్ ఉంది. అంటే నాకారుకి వెనుక చెరుపు ఉందనా? బాబోయ్!! అదేదో ఓ నవల గుర్తుకొస్తున్నది. పేరు హ్యూమరాలజి. వ్రాసిన వారు శ్రీ యఱ్ఱంశెట్టి సాయి. అప్పట్లో తెలుగు పుస్తకాల్లోని గందరగోళ తెలుగుపై ఓ కథ ఈ హ్యూమరాలజి నవల్లో వ్రాసుకొచ్చారయన.
ఏరా బడికి ఎలా వెళ్తావూరా అంటే బస్సుని కరచుకుని అంటాడు ఆ కథలోని ఓ పిల్లాడు.
అలా ఉంది కథ

Spoiler is slang for any element of any summary or description of any piece of fiction that reveals any plot element which will give away the outcome of a dramatic episode within the work of fiction, or the conclusion of the entire work. It can also be used to refer to any piece of information regarding any part of a given media. Because enjoyment of fiction sometimes depends upon the dramatic tension and suspense which arises within it, the external revelation of such plot elements can "spoil" the enjoyment that some consumers of the narrative would otherwise have experienced.

A spoiler is a piece of information in an article about a narrative work (such as a book, feature film, television show or video game) that reveals plot events or twists, and thus may "spoil" the experience for any reader who learns details of the plot in this way rather than in the work itself.