Apr 21, 2011

ఎన్ని కత్తులు ఎన్ని మెడలు

పాఠశాలలో టీచర్‌ హత్య
విశాఖపట్నం జిల్లాలో దారుణం
విద్యార్థుల ఎదుటే ప్రేమోన్మాది ఘాతుకం
అరకులోయ - న్యూస్‌టుడే
విశాఖపట్నం జిల్లా అరకులోయ మండలం ఆర్‌.డుంబ్రిగుడ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లొక్కోయి సుందరమ్మ(27) బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. మధ్యాహ్నం ఆమె పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలసి భోజనం చేస్తుండగా కొర్రా గ్రామానికి చెందిన తాంగుల సుబ్బారావు(29) కత్తితో ఆమె మెడ కోసి హత్య చేశాడు. సుందరమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.


ఎన్ని కత్తులు
ఎన్ని మెడలు
ఎన్ని ప్రభుత్వాలు
ఎన్ని కోర్టులు
ఎన్ని చట్టాలు
ఎన్ని అడ్వకేటు గుమ్మాలు
ఎన్ని పోలీసు ఠాణాలు
ఎన్ని పోలీసు టోపీలు
రాలిపోతున్న మగువ ప్రాణాలు

ఆపలేవా ఈ ఘోరకలులు

3 comments:

 1. ఇవ్వాళ ఉదయం వైజాగులోనే ఈ విషయం గురించిన ఒక చిన్నపాటి చర్చలో పాల్గొన్నాను భాస్కర్,అందరూ జర్నలిస్టులే.చర్చలసారం చెప్పను,చెప్పలేను కానీ వాకవుట్ చేసా.నీ ఊహ కు వదిలేస్తున్నా లోపల యేం జరిగుంటుందో

  ReplyDelete
 2. కలి అని కాదండి , అన్ని రోజుల్లోనూ ఇలాంటివి జరుగుతాయి. కానీ పాపాల్ని, పాపాత్ముల్ని వెనకేసుకొచ్చేవాళ్ళే ఎక్కువ కావటం దురదృష్టం.

  ReplyDelete
 3. హ్మ్......
  ఇది చదవుతుంటే 'గురు బ్రహ్మ గురుః విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ' , ' యత్ర నార్యస్తు పూజ్యతే.....' మాటలు దైవాజ్ఞగా భావించిన భూమి ఇదేనా అని అనుమానం వస్తుంది...

  ReplyDelete