నా మనసులో ఎన్నో కోఱికలు
మరెన్నో తపనలు
ఏవేవో వ్రాయాలని కలలు
ఎంతో వ్రాయాలని ఆశలు
కానీ కలం పెగలటంలేదు
కానీ కలం కదలటంలేదు
మాటలు చాలటంలేదు
పదాలు దొర్లటంలేదు
నాకలలు పండించుకోవాలంటే
ఎన్నో గ్రంధాలు చదవాలి
నా కలంలో కాలం ఇంకు నింపాలి
ఆ కలాన్ని కాలంతో నృత్యం చేయించాలి
ఆలోచనావేశాలను కాలచక్రంలో
వెనక్కి పయనింజేయాలి
ఆశలను చారిత్రాత్మక ఐతిహాసాలపై
విహరించజేయాలి
కానీ అందుకు సమయం లేదు
ఆ సౌకర్యమూ లేదు.
అక్కడున్నప్పుడు ఈ యావలేదు
ఇటొచ్చాక ఆ సంపదలేదు
Apr 15, 2011
Subscribe to:
Post Comments (Atom)
:-)
ReplyDeleteసౌకర్యం ఎందుకు లేదు? మనసుంటే మార్గం ఉంటుంది.
ఆపకండి, ఆ కోరికనీ, ఆవేశన్నీ..
భగవంతుడు మీకు కావల్సింది లభింపజేసు గాక!.
An unexamined life is not worth living అని ఓ ఆంగ్ల సామెత
భాస్కర్ అన్నా .. ఇది మనో వేదనా .. లేక ఒక కవిత అంతేనా :) చాలా బాగా రాసారు ..
ReplyDeleteనేను .. అందరిలాగా గొప్ప గొప్ప విషయాలు రాయలేను .. ఎందుకంటే నాకు విషయాల మీద అంత పట్టు లేదు ..
ఈ కవిత మీకు సంబందిచింది అయి ఉండదు .. నా లాంటి వాళ్ళకోసం రాసారు .. అంతే కదా :)
కానీ కలం కదలటంలేదు
ReplyDeleteకానీ అందుకు సమయం లేదు
ఈ రెండు ఒకసారి ఎలా సాధ్యం ? ;)
మీకు కాలం , కలం కదలక పోవటం ఎంటండి ఆశ్చర్యం గా మీరు ఆశుకవి !
సమయం లేంది గ్రంథ పరిశోధన/ సాహిత్యావలోకనం ఇత్యాదివి చేసేందుకు శ్రావ్యా
ReplyDeleteకుమార్న్ భాయ్ - మనసు ఉంది. మార్గం? అక్కణ్ణుండి కావాల్సిన బొక్కులు తెప్పించుకోవాల. కౌన్ భేజాగా శర్మాజీ?
కావ్యాజీ - ఇది మనోవేదనే కావ్యాజీ. నిస్సందేహంగా మనో-వేదనే. మీలాంటి వాళ్ళూ అయ్యా మేమూ ఆపాదించుకుంటాం అంటే, నిస్సంకోచంగా ఆపాదించేస్కోండి, ఐతే అన్నాయ్ మేమూ ఉన్నాం అని నాతో ఇప్పుడికడన్నట్లు అంటే, ఆహా అందరం అదే పడవలో ప్రయాణించేవారమే, నాబోంట్లు బోలెడుమందే అనేస్కుంటాను