Mar 16, 2011

సైకిలు

నిన్న సాయంత్రం ఇంటికిబోంగనే, నాన్నా ఇట్స్ వార్మ్, పార్కుకి వెళ్దాంనాన్నా అని ఎంటబట్టం మొదలెట్టాడు సూరిగాడు. ఆణ్ణిజూస్కుని పిల్లా కాంతా కాంతా నాన్నా కాంతా కెళ్దామా అని మొదలెట్టింది. కాంతా అంటే ఉయ్యాల అని అనఘా పురాణంలో రాసుంది. సరే నువ్వు తీస్కెళ్ళూ ఎనకమాలే నేనూ వస్తా అని హోం డిపార్టుమెంటుకి ఆర్డరేసి నేను కాపీలు టిపినీలు లాగించటం మొదలెట్టా.
కట్ చేస్తే, నేను పారుకెళ్ళటం, హోం మినిస్ట్రీ ఇంటికి వెళ్ళటం అక్కడ మనం కాపలా కాయటం మొదలెట్టటం ఇట్టే జరిగిపొయ్యాయి. పరుగెత్తారు లగెత్తారు జారుడుబల్ల జారా౨రు అరుస్తున్నారు గెంతుతున్నారు వంగుంటున్నారు దూకుతున్నారు ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు నవ్వే వాళ్ళు నవ్వుతున్నారు. ఇలా ఓ అరగంటా గడవంగనే అనఘ మొదలెట్టింది అమ్మేది ఇంటికి పదా అమ్మేది ఇంటికి పదా అని. ఓరేయ్ సూరిగా అమ్మగారిని ఇంట్లో దింపి రెంచీ తీస్కొస్తా ఉండూ అన్నా. రెంచీ దేనికీ అన్నాడు. నీకు నట్టు లూజైందిగా బిగిస్తా అనబోయి అదేరా సైకిలుకి ట్రైనింగ్ వీల్స్ ఉన్నాయిగా పీకేస్తాను. ట్రైనింగ్ వీల్స్ లేకుండా నేర్పిస్తారా అన్నాను.
కట్ చేస్తే, ట్రైనింగ్ వీల్స్ తీసేసాను. ఇక ఎక్కరా అన్నాను
ఎక్కాడు

బాబోయ్ పడతా
లేదురా నాన్నా పట్టుకున్నాగా
లేదు పుట్ దెం బా౨క్
మొదటిసారి అంతేరా కష్టంగానే ఉంటుంది
యూ ఆర్ సో మీన్ ఐ కెనాట్
అరేయ్ వాణ్ణి చూడు నీకన్నా చిన్నోడు తొక్కట్లేదా
[ఎనకపట్టుకున్నా అటు ఇటు రెండుసార్లు ప్రయత్నాలు అయ్యాయి]
నో ఐకెనాట్
నాన్నా లేదురా నేర్చుకోరా
ఐతే ఒక వీల్ పెట్టు ట్రై చేస్తా
సరే
[ఒకటి పెట్టా వీల్, ఒక రౌండు వెళ్ళాడు వీల్ ఉన్నవైపుకి ఒంగుతూ. తిరిగొచ్చేప్పుడు సైడ్ వాక్ స్లాంట్ గా ఉంటుందిగా పట్టం మొదలెట్టాడు, సైకిల్ అక్కడే పడేసి వచ్చాడూ బుంగ మూతి పెట్టుకుని]
నో ఐ కెనాట్ డూ ఇట్
నాన్నా నేర్చుకోవాలమ్మా అప్పుడే వచ్చేది
నాకు రావట్లేదు నాకొద్దు
అలాకాదురా నే పట్టుకుంటాగా
నో ఐ వాంట్ నీ గార్డ్స్, ఎల్బో గార్డ్స్ హెల్మెట్. దే ప్రొటెక్ట్ మి
ఒరేయ్ ఇప్పటికిప్పుడు ఎలారా
అవి తెస్తే నేర్చుకుంటా

కట్ చేస్తే,
ఇంటికెళ్ళి వాణ్ణీ వాడి సైకిల్ ని ఇంట్లో కుదేసి వాల్మార్ట్కెళ్ళి తెచ్చానబ్బా సెట్టు. హెల్మెట్, బైస్కిల్ గ్లౌవ్స్, మోకాలికి గార్డులు మోసేతికి గార్డులు.
రాత్రంతా అవి పెట్టుకూర్చున్నాడు పడుకోబొయ్యేదాకా
ఇయ్యాల సాయంత్రం ఆ రెండో వీల్ తీసి అవతలేసి తొక్కించాల.

14 comments:

 1. :)) LOL :))
  భలే రాసారు.. మొత్తమీద అసాధ్యుడే :)) ఎన్టీ? హెల్మెట్, బైస్కిల్ గ్లౌవ్స్, మోకాలికి, మోసేతికి గార్డులా.. :))

  ReplyDelete
 2. సూరి బాబు కేక..
  ఈ పోస్ట్ చదివాక నాకెందుకో సచిన్ గుర్తొస్తున్నాడు :)

  ReplyDelete
 3. భాస్కర్ గారు నాకెందుకో కానీ ఈ పోస్ట్ చాల చాల నచేసింది (మీరు చెప్పిన స్టైల్ వల్లనేమో ,పిల్లల అమాయకత్వం వల్లన్నో ,అనఘ అనే పేరు నాకు ఇష్టం అవ్వడం వల్లనో ,నేను సైకిల్ నేర్చుకునేప్పుడు మా నాన్న పడ్డ ఇబ్బందులు గుర్తుకురావడం వల్లనో !!)..అప్పట్నుంచి ఒక 10 సార్లు చదివి ఉంటా ఇదే పోస్ట్ ని :) :)

  ReplyDelete
 4. చాలా చిమ్పుల్గా భలే గమ్మత్తుగా రాసారు. నేనూ ఇది పన్నెండో సారి సదవడ౦ :))
  నవ్వడమే నవ్వడం. ఇంతగా నవ్వించినా మీ సూరికి చాకీలు.బిచికీలు.. అమెరికా ఒచ్చినప్పుడు పట్టుకొస్తా :))

  ReplyDelete
 5. భలే నచ్చేసాయి.... మీ బుజ్జిగాడి మాటలు మీ పోస్ట్ బాగుంది

  ReplyDelete
 6. వెల్కం టు కుటుంబరావ్ లైఫ్

  ReplyDelete
 7. రెండో వీల్ ఒక 2 ఇంచెస్ మీదకి పెట్టండి, పూర్తిగా తీసేయకుండా. అలా అయితే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. మా పాపకి అలాగే చేసారు, తను కూడా ఇలాగె భయపడేది.
  ఏంటో, నాకు మా తమ్ముడు లూనా నేర్పించింది గుర్తుకు తెచ్చారు. :-))

  ReplyDelete
 8. మొదట తెలియలేదు, పెద్ద వాడిని కష్ట పెట్టాను. అసలు training wheels లేకుండా నేర్పించాను.ఐనా ఒక రోజులో నేర్చేసుకున్నాడు.ఇప్పుడు తల్చుకుంటే ఒకింత వాడి గురించి గర్వ పడ్డా, నేను నిదానించి ఉండాల్సింది అనిపిస్తుంది.
  రెండో వాడు ఒక ఏడాది అంతా నాలుగు చక్రాలతో నడిపాక రెండో ఏడాది చక్రాలు తీసేసి ఇట్టే నేర్చేసుకున్నాడు. నిజానికి నాకు భయమేసింది కానీ, ఇంకో చిన్న పిల్లాడు వాడి భాషలో వాడికి ఏం చెయ్యాలో చెప్పాడు. అంతే!

  ReplyDelete
 9. >>వెల్కం టు కుటుంబరావ్ లైఫ్

  LOL.... :) :)

  ReplyDelete
 10. ..... కాంతా అంటే ఉయ్యాల అని అనఘా పురాణంలో రాసుంది. ...
  ===========================================

  ;-)

  ReplyDelete
 11. హహహ!ఇవే మరి పేరెంటింగ్ బ్లూస్ అంటె!యెంజాయ్!మీరు చాలా చాలా మంచివారు భాస్కర్, హోము డిపార్ట్మెంటుకు పని పెట్టలేదు.మేము ఇవన్నీ దాటేసాము. ఇప్పుడు సరదాగానే ఉంది గాని అదే మా ఇంట్లో ఐతే ఇలాంటి పనులు ఈ సీజనులొ వెంటపడి పోరితే వచ్చే సీజనుక్కానీ మొదలుపెట్టరు. ఎలాగో ఆ సైకిళ్ళూ , స్కేటింగులూ. స్విమ్మింగులూ ఐపోయాయి. ఒక్క చిన్నదానికి స్విమ్మింగ్ మాత్రం బాకీ ఉంది.పెద్దామెకి నేర్పేటప్పుడు అమెరికా కొత్త .గార్డుల సంగతి తెలీదు. కమ్యూనిటీ తారురోడ్లమీద దాని మోచేతులు చిట్లాక చూసి నొప్పికి అదేడ్చి దాన్ని చూచి నేనేడ్చి మావారు ఆఫీసులో ఈ కధ వల్లెవేస్తే మాకంటే ముందు అక్కడ పిల్లలని పెంచినవాళ్ళు ఇచ్చిన సలహాతో గార్డ్స్ తెచ్చాము. ఆతరువాత ఒక్క గంటలో ట్రైనీ వీల్స్ వదిలేసింది.ఇవన్నీ గుర్తు తెచ్చారు భాస్కర్ గారు.Edit9:36 pm

  ReplyDelete
 12. మరి రెండో వీల్ కూడా తీసేసాకా ఏం జరిగిందో రాయాలి. ఈ టపా చదివి నేను మొహం మీద గుండ్రాలు తిప్పేసుకున్నా...నే సైకిల్ నేర్చుకున్నప్పుడు 8th or 9th క్లాస్ చదువుతున్నా. అదేంటో నేనెప్పుడూ ఒక్కసారి కూడా క్రింద పడలా. కానీ నాకు అడ్డం వచ్చిన వారందరు పడిపోయేవారు పాపం. ఒక కారైతే గోడనే గుద్దేసుకుంది. అందుకే జనాల మీద దయ తల్చి బండి నేర్చుకోవటం మానేసా...:)

  ReplyDelete
 13. హహహ్హ మోచేతికి మోకాలికి గ్లోవ్స్ అడిగాడా...బలేవాడే :)
  రెండు రోజులు పోతే సైకిల్ లో సరదా తెలిసాక అవి తీసి పారేస్తాడులెండి

  ReplyDelete
 14. సంతోష్, రాజేష్ - సింపుల్గా రాయటం .. ఇంతక ముందు ఇలాంటివి చాలారాసానబ్బా
  హరే - సచిన్ గుర్తుకొస్తున్నాడా? లేక సచిన్ ఫెరారీనా?
  కుమార్ - అన్నాయ్. నిజమే. కుటుంబరావు లైఫ్. ఇన్ఫ్రెంట్ క్రొకొడైల్ ఫెస్టివల్
  సుమలత గారు - ధన్యవాదలు
  లలిత గోదావరి గారూ - అదొక చిన్న ట్రిగ్గర్ అండి అంతే. ఒక్కసారి అది సరిగ్గా తగిలితే చాలు, ఇట్టే పట్టేస్తారు.
  పద్మవల్లి గారూ - ఈరోజు అలా ప్రయత్నిస్తాము. రెండు ఇంచిలు పైకి పెట్టి. చూద్దాం.
  నాగ్ - నవ్వవోయ్ నవ్వు. మావాడిచేత ఇంకో పుస్తకం చదివించి వినిపిస్తా. దెబ్బకి కళ్ళు బైర్లు కమ్ముతాయ్.
  శ్రీరాం - :)
  సునీత గారూ - హ్మ్! రోడ్డుమీద నేర్పాలి. ఔనండీ, మనది అసలే గుంటూరు. ఈ గార్డులు గట్రా మనకేం తెలుసూ? కిందపడాల లేవాల మళ్ళా తొక్కాల మళ్ళా పడాల. మోకాళ్ళు మోచ్చిప్పలు ఎన్నిసార్లు పగిల్నియో.
  తృష్ణమ్మ - రెండో వీల్ ఉన్నప్పుడే బోలెడు కథలు ఉన్నాయి రాయటనికి. తప్పకుండా రాస్తాను. మనం పడకుండా ఎదుటోళ్ళని పడేయటం కేక.
  సౌమ్య - ఔను. ఆ మజా తెలిస్తే వాడే తీసేస్తాడు.

  ReplyDelete