Mar 17, 2011

మళ్ళీ సైకిలు

ఈ మధ్య సూరిగాడు బొమ్మలు బెరుకుతా ఉంటే నాకూ సేతులు దురబెట్టడం మొదలెట్టినై.
ఆడు కూకొని ఈ బొమ్మ సూసి
From surya_pencil
ఇట్టా గీస్తే
From surya_pencil

నేను కుర్సీలో కూకుని వరండాలో ఉన్న ఆడి పాత సైకిలుని ఇట్టా ఏసినా.
From surya_pencil

12 comments:

 1. :) అదీ అలా ఉండాలి పిల్లలంటే, తల్లి దండ్రులకి ఇన్స్పిరేషన్!
  చాలా బావున్నాయి మీ బొమ్మలు.

  ReplyDelete
 2. మొత్తంగా చూస్తే సూరి ది బాగుంది కానీ, ఇంకొంచెం ఆ పులి, దాని పిల్ల "తలల" దగ్గర శ్రద్ద వహించాలి, కాని వాడి వయసుకి ఇది చాలా ఎక్కువ. Great Job

  మరి నీ వయసుకి సైకిల్ బొమ్మకేమని చెప్పాలో తెలీట్లేదు సోదరా ;-), జస్ట్ కిడ్డింగ్, బానే వచ్చింది.

  ReplyDelete
 3. ఇప్పుడు మీకెందుకులే డ్రాయింగ్ :P
  సూరి కి నేర్పించండి మంచి క్లాస్ ఎదన్నా చూసి. తన డ్రాయింగ్లో texturing and structure బావున్నాయి :)

  ReplyDelete
 4. "సూరి " గారికి మంచి ప్రతిభ ఉందండోయ్!
  [రాజు గారి పెద్ద భార్య చాలా మంచిదట. :)]

  ReplyDelete
 5. రాజు గారి పెద్ద భార్య చాలా మంచిదట. :) Not the ultimate Truth. Both Father and Son are talented. :D

  ReplyDelete
 6. హహ్హహ్హ! స్మైలీ సరిగా పెట్టడం రాలేదా, నాకు?
  సరదాకన్నానండీ బాబూ! ఒక్క గీత కూడా గీయలేని వాళ్ళు కూడా ఉంటారుగా!
  ఏదో ప్రయత్నించారుగా, అయినా తమ సంతానం తమ కన్నా గొప్పవాళ్ళంటే ఎవరూ అలగరు సుజాతగారు, సునీతగారు!
  అదో ఓపెన్ సీక్రెట్టూ!

  ReplyDelete
 7. I love your cycle than suri's.
  some day I will achive like you.

  ReplyDelete
 8. సూర్య కి మంచి సెన్స్ ఉందండీ, stroaks బావున్నాయి. painTing నేర్పించండి.

  ReplyDelete
 9. లలిత గోదావరి గారూ - ధన్యవాదాలు. లెర్నింగ్ అనేది/ స్పూర్తి అనేది నిరంతర ప్రక్రియ మరియూ వీటికి వయోబేధాలు గట్రా లేవు కూడా.
  కుమార్ - నా సైకిలు ఒక యాబ్స్ట్రాక్ట్ స్కెచ్. వాడిది స్పాంటేనియస్ మరియూ పిల్లల వేళ్ళు క్విక్ గా ఉంటాయి సోదరా. మనవి స్టిఫ్ అయిపోయి ఉంటాయ్ ఈ సాఫ్ట్‌వేర్ యుగంలో. ఏవంటా?
  రాణీ గారూ - నమస్తే. సూరిగాడికి నేర్పిస్తానండీ. తప్పకుండా.
  మందాకిని - రాజుగారు మొదటిభార్య. కొట్టారు దెబ్బ. ఉండండుండి. నవ్విన నాపచేనునే పండిస్తా. ధన్యవాదాలు.
  సుజాత గారు - ధన్యవాదాలు. నాలోని కళని గుర్తించారు :)
  సునీతగారు - :):)
  అన్వర్ గారూ - నమస్తే! బహుకాల దర్శనం.
  >>I love your cycle than suri's.
  :) ధన్యవాదాలండీ.
  >>some day I will achive like you.
  మీకు పాదాభివందనం. నిండుకుండ తొణకదు. మీలాంటివారెప్పుడూ ఇలా నేలపైనే నడుస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటరు. మరోమారు మీకు హ్యాట్స్ ఆఫ్.
  సౌమ్య - తప్పక నేర్పుదాం. అన్వర్ గారున్నారుగా వారివద్ద శిష్యరికానికి ఎప్పుడో ఆర్జీ పెట్టుకున్నా.

  ReplyDelete
 10. లలితమ్మ లలిత గోదావరి అయ్యింది మీ పిలుపులో?

  ReplyDelete
 11. రామరాజు గారు, తమాషాకు కాదు సీరియస్గా, పిల్లలనే వాళ్ళు బొమ్మల్ని పట్టి పట్టి గీయాలి కాని సూరి చూడండి పేద్ద ప్రొఫెషనల్ పుడింగిలా సింగల్ స్ట్రోక్ లొ బొమ్మ లాగాడు, మీలొ ఇంకా బాల్యం వుంది కనకనే భద్రం గా బొమ్మ గీశారు, అచ్చం పిల్లల్లాగ, నాకు నచ్చిన మరొవిషయం చేప్పనా ఆ కుడి వైపు ఫెడల్ చూడండి ఎట్లా పర్స్పెక్టివ్ లొ వుందొ .. బొమ్మంటే ఇదే .

  ReplyDelete