Feb 28, 2011

రెండు దశాబ్దాల్లో 2 శాతం తగ్గిన వ్యవసాయ భూమి

రెండు దశాబ్దాల్లో 2 శాతం తగ్గిన వ్యవసాయ భూమి
కేంద్ర మంత్రి పవార్‌ వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ ఒక చేదువాస్తవాన్ని వెల్లడించింది. దేశంలోని వ్యవసాయ భూమి రెండు దశాబ్దాల్లో రెండు శాతం మేర కుంచించుకుపోయిందని తెలిపింది. 1988-89లో 185.142 మిలియన్‌ హెక్టార్లుగా ఉన్న వ్యవసాయ భూమి 2008-09 నాటికి 182.385 మిలియన్‌ హెక్టార్లకు తగ్గిందని పేర్కొంది. అంటే 2.757 మిలియన్‌ హెక్టార్లు క్షీణించింది. ఎకరాల్లో చెబితే.. ఇది 68,12,695 ఎకరాలు. అర్థగణాంక సంచాలక కార్యాలయం నివేదికను ఉటంకిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో వ్యవసాయ భూమి ఏటా తగ్గుతూ వచ్చిందన్నారు. అయితే ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ప్రభావం చూపలేదని చెప్పారు. 1988-99, 2008-09 మధ్య ఉత్పత్తి దాదాపు 38 శాతం పెరిగిందన్నారు. భూమి రాష్ట్రాల పరిధిలోని అంశమని, సేద్యయోగ్య భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడాన్ని నివారించేందుకు తగిన విధానాన్ని రూపొందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని పవార్‌ స్పష్టం చేశారు.
================================================================
మరో రెండు దశాబ్దాలలో జఱుగబోయేది అలోచించండి. తొంభైలనుండి భూ దందాకి తెఱలేచింది. రెండువేలకల్లా ఓ భయంకఱ రూపం దాల్చింది. ప్రొపోర్షనేట్ గా చూస్తే, సేద్యపు భూమి తగ్గుదల శాతం పైన ఉటంకించిన రెండు దశాబ్దాలలో, చివరి దశాబ్దంలో బాగా జఱిగుంటుంది. అది ఇప్పుడే వికృత రూపం దాల్చింది. పోను పోనూ అది పెను భూతంగా మారిపోతుంది.
దాంతో, నిత్యావసర కూరలు, పప్పు ధాన్యాల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. కారణం? ప్రతీ పట్టణం చుట్టూ ఉన్న సేద్యపు భూమి కుచించుకుపోవటం, ఇళ్ళ కట్టడాలకి, నిత్యావసరాలకీ నీళ్ళు అటువైపు వెళ్ళటం, పచ్చదనం కనుమరుగు కావటం, పండిన పంట రవాణా ఖర్చులు పెరగటం, కొత్త కొత్త చీడాపీడా రావటం, ఉన్నచీడాపీడా తక్కువ వైశాల్యంలో కాన్సన్ట్రేట్ అవ్వటం. అంతేకాదు, డైయరీ అంటే పాల ఉత్పాదన కూడా తగ్గుతుంది చూస్తూ ఉండండి. మరోకోణం - నిత్యావసర పంటలు పక్కనపెట్టి కమర్షియల్ క్రాప్ వైపుగా వెళ్తున్నారు మన రైతులు. పొగాకు ఇత్యాదివి మరియూ బయో ఇంధనం. అంతేకాదు, పండించే పంటలో ముఫై ఐదు శాతం లైవ్‌స్టాక్ అంటే మాంచాన్నిచ్చే జంతువులకే పోతోంది.

మరో హరిత విప్లవం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని శాస్త్రవేత్తల సూచన ఒకవైపు, తగ్గిపోతున్న సేద్యపు భూమి మరోవైపు.
new-green-revolution-illustration.jpg

[చిత్రం నేషనల్ జియోగ్రాఫిచ్ నుండి]
ఐతే, హరిత విప్లవం వాటర్ టేబుల్ని డిస్ట్రబ్ చేస్తుందనేది ఒకవైపు, తిండి గింజల కొఱత మరోవైపు. మరోకోణం, ఫర్టిలైజర్స్. తక్కువ వైశాల్యంలో ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడితే, నీళ్ళు కలుషితం అవ్వటమే కాకుండా, ప్రాణాంతకంగా మారిపోతున్నదనేది సత్యం.
అంతేకాదు, అవేనీళ్ళు ఆవులకు గేదెలకు మేత. వాటిపాలల్లోకూడా ఫర్టిలైజర్స్ ట్రేసెస్.
ఈ ఆర్టికల్ చదవండి ఇంటరెస్టు ఉంటే -
http://ngm.nationalgeographic.com/2009/06/cheap-food/bourne-text

3 comments:

  1. పంటలు పండించే భూముల్లో రొయ్యలగుంటలైపోయినవి ఈలెక్కల్లో కనిపించవు.ఆలెక్కన పరిస్థితి ఇంకాదారుణం. జీవనవిధానంలో ఎథిక్స్ పాటించకపోవడమే దీనికి కారణం

    ReplyDelete
  2. మీరెప్పుడైనా నాసా రిపోర్ట్స్ చూసారా? ఫ్యూచర్ లో వివిధ సంఘాల/కమ్యూనిటీస్/రాష్ట్రాల/దేశాల మధ్య వాటర్ వార్స్ ఎలా జరుగుతాయనేది. నేనప్పుడెప్పుడో చూస్తే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇప్పటికే మన సిటీస్ లో వాటర్ ఎంత కష్టమో తెలిసిందే కదా. మొన్న మా నాన్న వాళ్ళొచ్చినప్పుడు తెలిసింది నాకు, మా ఊళ్ళో కూడా తాగే నీళ్ళు కొనుక్కుంటున్నారంట, పొద్దున్నే పాల లాగే నీళ్ళు కూడా తెచ్చిస్తున్నరంట ఇంటికి.

    మన పిల్లలు 9బిలియన్ పాపులేషన్ లో బతకాలి.

    వీటిల్లో ఐడియాలజీలేం లేవు, ప్యూర్ లెక్కలు మాత్రమే.

    ఎందుకులే కడుపు చించుకోవటం ఇప్పుడు. మనిషి ఎప్పుడూ చిన్న పిల్లాడే, నేర్చుకోవటం ఎప్పుడూ జీవితకాలం లేటే.

    ReplyDelete
  3. ఈ పరిస్థితి ఇప్పటికే కనిపిస్తూ ఉంది.మా చిన్నప్పుడు మా చిన్నపల్లెలోనే వందల్లో పశువులుండేవి,నేడు పదుల సంఖ్యలోకి చేరాయి.అన్ని పల్లెల్లోనూ ఇదే పరిస్థితి.

    ReplyDelete