Feb 7, 2011

అవార్డులు

నిన్న సోనీ గాడు యాభైఆరొవ ఫిల్మ్‌ఫేర్ అవార్డు ప్రథానోత్సవాన్ని ప్రసారం చేసాడు. రెడ్ కార్పెట్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. షారుఖ్‌ఖాన్ వచ్చాడు తెరమీదకి, అమితాబచ్చనుకు నలభైయేళ్ళ సినీ యువకునిగా పురస్కరించారు. యష్ ఛోప్రా పురస్కారాన్ని అందించాడు.
1969 లో సినిమాల్లోకి వచ్చాట్ట పద్మవిభూషణ్ అమితాబచ్చన్. కభీ కభీ మేరే దిల్ మే అనే పాట వస్తుండాగా అబితాబ్ వేదికని చేరుకున్నారు, యష్ ఛోప్రా అవార్డ్ ఇస్తే వినమ్రతతో స్వీకరించాడు అబితాబ్. శ్రీ మన్నా డే జీవితకాల పురస్కారాన్ని స్వీకరించారు. ఓ మేరి జొహర జబీ తుఝే మాలూం నహి, యే దోస్తీ హం నహీ ఛోడేంగే లాంటి పాటలను ఒకసారి గుర్తుచేసారు.
మిగతా పురస్కారాలను పక్కనపెట్టి, ఇవి చూద్దాం -
మమతా శర్మ అనే గాయకకి "మున్నీ బదనాం హుయీ" అనే పాటని ఆలపించినందుకు అత్యుత్తమ నేపథ్య గాయని అవార్డు ప్రకటించారు.
వారేవా! అసలు ఈ పాట పాట్టం ఎంత కష్టం. ఎన్ని స్వరాలు సంగతులు, మరెన్నో గమకాలు. ప్రత్యేకంగా మున్నీ జందూ బాం హుయి, డార్లింగ్ తేరే లియే అన్న పంక్తి, తెరమీద నృత్యకారిణి యొక్క వైవిద్య భరితమైన హావ భావప్రకటన, నేపథ్యగాయకి సుస్వరమాధుర్యం. కళ్ళారా చూసి చెవులారా విని ఆనందించ వలసిందేగానీ, చెప్పనలవి కాదు. ఆమె, తన ప్రియుని కొరకు జందూ బాం అయ్యిందట. అంతటితో ఊర్కోలేదు, భావప్రకటనలో  పిఱ్ఱని రుద్దుకుంటుంది జందూబాంతో. చిన్నప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలలో జందూ బాం ప్రకటన వినేవాణ్ణి. "జందూ బాం జందూ బాం నొప్పి హరించే బాం" అని. ప్రియుని కొఱకు జందూ బాం అవ్వటమేంటో, అయినా, ఏ తలకో వెన్నుకో జందూబాం పూస్కుంటే బాగుంటుంది గానీ పిఱ్ఱకి పూస్కుంటే ఏమౌతుందో నాకర్థం కాలేదు. ఆ నృత్యభంగిమని అల్లిన కూర్చిన నృత్యకారిణి/ణులు ఫరాఖాన్ లేదా/మరియూ గీతా కపూర్‌కే తెలియాలి.
ఇక అత్యుత్తమ నేపథ్యగాయకునిగా రాహత్ ఫతే ఆలీ ఖాన్ ఇష్కియా అనే చిత్రం కొఱకు ఆలపించిన "దిల్ తో బచ్చా హై జి" అనే పాటకు అందుకున్నారు. రాహత్ ఈ కార్యక్రమానికి రాలేకపోతే, విశాల్ భరద్వాజ్ అందుకున్నాడు.
విశాల్ భరద్వాజ్ ఇష్కియా అనే చిత్రానికి రచయిత, నిర్మాత, మరియూ సంగీత దర్శకుడు.
ఈ మధ్య కొత్త యంపిత్రీలను దింపినప్పుడు ఈ పాటని కూడా దింపాను. మొన్న డ్రైవ్ లో విన్నా ఈ పాటని. ఈ పాటను రాసిన కవికి, అత్యుత్తమ గీత రచనా పురస్కారం దక్కింది. అతనెవరో కాదు, గుల్జార్.
ఈ పాట విన్నప్పుడు పాటలోని మాధుర్యం ఎంత తియ్యగా ఉందో సంగీతం కూడ అంతే తియ్యగా ఉందనిపించింది. విశాల్ భరద్వాజ్ కి ఓ మారు జైహో.
గుల్జార్+భరద్వాజ్ కాంబినేషన్ అత్భుతంగా ఉంటుంది.
ఇలాంటి పాటలు తెలుగులో రావట్లేదని బాధేసింది కూడా.

http://www.youtube.com/watch?v=F90BfpaKGB4

ఒక ముసలోడు ప్రేమకో పడితే ఏమౌతుందో అనేదే ఈ పాట.

ऐसी उलझी नज़र उनसे हटती नहीं
दांत से रेशमी डोर कटती नहीं
उम्र कब की बरस के सफेद हो गयी
कारी बदरी जवानी की छट्टी नहीं
वल्ला ये धड़कन
बढने लगी है
चेहरे की रंगत
उड़ने लगी है
डर लगता है तनहा.. सोने में जी
दिल तो बच्चा है जी ....
थोडा कच्चा है जी
ऐसी उलझी नज़र उनसे हटती नहीं
दांत से रेशमी डोर कटती नहीं
उम्र कब की बरस के सफेद हो गयी
कारी बदरी जवानी की छट्टी नहीं
रा रा रा रा रा

किसको पता था पहलू में रखा
दिल ऐसा पाजी भी होगा
हम तो हमेशा समझते थे कोई
हम जैसा हाजी ही होगा
हाय जोर करें , कितना शोर करें
बेवाज़ा बातें पे ऐंवे गौर करें
दिलसा कोई कमीना नहीं
कोई तो रोके ,
कोई तो टोके,
इस उम्र में
अब खाओगे धोखे
डर लगता है इश्क करने में जी
दिल तो बच्चा है जी ....
दिल तो बच्चा है जी ....
दिल तो बच्चा है जी ....
थोडा कच्चा है जी

ऐसी उधासी बैठी है दिल पे
हसने से घबरा रहे हैं
सारी जवानी कतरा के काटी
पीरी में टकरा गए हैं
दिल धड़कता है तो
ऐसे लगता है वो
आ रहा है यहीं
देखता ही न हो
प्रेम की मारें कतार रे
तौबा ये लम्हे
कटते नहीं क्यूँ
आँखों से मेरी
हटते नहीं क्यूँ
डर लगता है मुझसे कहने में जी
दिल तो बच्चा है जी ....
दिल तो बच्चा है जी ....
थोडा कच्चा है जी
हाँ दिल तो है बच्चा जी
ఇక ఈ షారుఖ్‌ఖాన్ని ప్రతీ సినిమా పురస్కారానికీ ప్రత్యేకంగా పిలవటం ఎందుకో, అతను నటించిన ఏదోక సినిమా అత్యుత్తమ పురస్కారాన్ని గెలుచి తీరుతుంది కదా. ఆస్థాన సినీ కథానాయకునిగా నియమించుకుంటే పోలా. మై నేం ఈజ్ ఖాన్ అనే చిత్ర దర్శకుడికి అత్యుత్తమ దర్శకత్వ పురస్కారం దక్కింది, అతని పేరు కరణ్ జోహర్. హ్మ్.
అత్యుత్తమ చిత్రంగా దబాన్గ్ ఎంపికైంది.
దబాన్గ్ చిత్ర దర్శకుడు - అభినవ్ కశ్యప్. ఇతను అనురాగ్ కశ్యప్ సోదరుడట.

1 comment:

 1. హ్మ్మ్ నిజమే..
  గుల్జార్ కి award ఇచ్చి మంచి పని చేసారు..ఇంత వయసు మీదపడుతున్నా కూడా తన కలం లో ఉన్న పదును తగ్గలేదు `
  విద్యా బాలన్ కి,ఉడాన్ దర్శకుడి కి మాత్రమే కాస్త justify చేసారు ఈ మూడు అవార్డ్స్ మాత్రమే మాత్రమే చెప్పుకునేలా ఉన్నాయి అవి కూడా క్రిటిక్స్ అవార్డ్ ఇచ్చి
  పాపం స్టార్స్ ని ముందు కూర్చో బెట్టి పెద్దవాళ్ళనంతా ఆ వెనక్కి తోసేసారు
  ఇమ్రాన్ ranbir షో కాస్త బావుంది

  ReplyDelete