http://weekend-politician.blogspot.com/2011/02/chetans-fight.html
మన వ్యవస్థలో ఇన్ని లోపాలున్నాయి నిజమే. కానీ ఇన్ని లోపాలతో అందరూ ఇంత పోరాటం చెయ్యాలా? కొంతవరకైనా న్యాయం పొందడానికి అందరూ చేతన్ లా పోరాటం చెయ్యాలంటే జరిగే పనేనా? వ్యవస్థ అన్యాయంగా ఉందని, తలొంచుకోవడమో, అడ్డదారులు తొక్కడమో లాంటి బలహీనతలకి మనం లొంగితే ఈ వ్యవస్థ బాగు పడే అవకాశం అసలేమాత్రం ఉండదు. చేతన్ లా కొంతమందైనా పోరాటం చేస్తే వ్యవస్థ మారి తీరుతుంది. అంతేకాదు ఈ అనుభంతో, భవిష్యత్తులో ఎవరైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తే, ఆప్రయత్నాన్ని అర్థం చేసుకొని సరిగ్గా అంచనా వెయ్యగలిగిన చేతన్ లాంటి ఒక పౌరుడు ఈ దేశానికి దొరికడం శుభ సూచికం. వచ్చే వందేళ్ళలో మనం నిర్మించబోయే నవీన భారతావనికి ఇలాంటివాళ్ళే పునాది రాళ్ళు. చేతన్ కథలో అసలు విలను ఎవరూ? పోలీసు వ్యవస్తా? చట్టవ్యవస్తా? లేక డబ్బా?
నాకైతే మూడూ కాదు అనిపిస్తుంది. మరి తప్పు ఎవరిదీ? పోలీసుకి తప్పుని తప్పులా పట్టుకునే పరికరాలనూ, పోలీసుకు వచ్చే కాల్స్‌ని రికార్డు చేసే పరికరాలనూ, పోలీసుకు ఆడిటింగ్ అనే ఓ ప్రక్రియలోకి తీసుకువచ్చే ఓ వ్యవస్తనూ ప్రభుత్వం చేకూర్చలేక పోతోంది. సో అసలు తప్పు ప్రభుత్వానిది.
పైన మీరు చెప్పిన కథలోని లోపం - యాక్సిడెంటు ఐంది. అవ్వగానే సంఘటనా స్థలం నుండి క్షతగాత్రులను జనాలే తలా ఓ చెయ్యి వేసి తీసారు. అక్కడకి పోలీసు వచ్చాడా? రాలేదా? క్షతగాత్రులను ఎలా ఆసుపత్రికి తరలించారూ? ఎవరు తరలించారూ? సంఘటనా స్థలం నుండి క్షతగాత్రులను తీసుకెళ్ళిన తర్వాత అక్కడేమి జరిగిందీ?
కేసుకి ఇవి ముఖ్యం. ఇవి లేకుండా చేతన్ కింది కోర్టులో గెలిచాడంటే అతని అదృష్టం.
ఇక మీరు లేవనెత్తిన ప్రశ్నలు
ఇన్ని లోపాలతో అందరూ ఇంత పోరాటం చెయ్యాలా?
చెయ్యాలి మరి. చేయకుండా ఉండాలంటే వ్యవస్థలో ఏం మార్పులు కావాలో ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు ఓట్లడగటానికి వచ్చినప్పుడు వారికి సలహా ఇవ్వాలి. ప్రజాప్రతినుధుల దృష్టికి జనావసరాలను తీసుకెళ్ళగలగాలి. వాటిని అమలు పరిచేందుకు హామీలు పొందగలగాలి. హామీలు అమలుపరచకపోతే పోరాడే దిశగా వెళ్ళాలి.
కొంతవరకైనా న్యాయం పొందడానికి అందరూ చేతన్ లా పోరాటం చెయ్యాలంటే జరిగే పనేనా?
కాదు. అందుకే వ్యవస్త ఇలా అయ్యింది.
వ్యవస్థ అన్యాయంగా ఉందని, తలొంచుకోవడమో, అడ్డదారులు తొక్కడమో లాంటి బలహీనతలకి మనం లొంగితే!!
మి క్వరిదొ అమిగో! ఎన్నో శతాబ్దంలో ఉన్నావ్? లొంగి అఱవైఏళ్ళు దాటింది.
చేతన్ లా కొంతమందైనా పోరాటం చేస్తే వ్యవస్థ మారి తీరుతుంది.
చేతన్ పోరాటానికీ వ్యవస్త మారటానికీ సంబంధం లేదబ్బా.
అంతేకాదు ఈ అనుభంతో, భవిష్యత్తులో ఎవరైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తే, ఆప్రయత్నాన్ని అర్థం చేసుకొని సరిగ్గా అంచనా వెయ్యగలిగిన చేతన్ లాంటి ఒక పౌరుడు ఈ దేశానికి దొరికడం శుభ సూచికం.
మీ కథనంలో లాస్ట్ పేరా ఇలా చెప్పింది
>>అనుకున్నట్టుగానే అవతలి వాళ్ళు హై కోర్టుకి అప్పీలు చేశారు. ఏదో ఒక రోజు, అలసిపోరా వీళ్ళు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈ మొత్తం కథలో, అద్భుతమైన మంచి జరిగింది ఇక్కడే. హైకోర్టు మళ్ళీ కేసుని సాగదీయకుండా, వెంటనే సగం పరిహారం చెల్లించి కేసు కొనసాగించుకోమ్మని రూలింగ్ ఇచ్చింది. సగం పరిహారం కోర్టు ద్వారా చెల్లించ బడింది.<<
ఈ అనుభవంతో భవిష్యత్తులో ఎవరైనా పోలీసులు..............హైకోర్టు పోలీసు వ్యవస్తను తప్పుపడుతూ ఏమన్నా తీర్పునిచ్చిందా? లేదుకదా. మరి ఒక సామాన్య కక్షిదారు కేసు గెలిచినంత మాత్రాన చట్ట న్యాయ వ్యవస్తలో మార్పులు వచ్చే పనైతే ఇప్పటికి కొన్ని లక్షల కేసులకు తీర్పులు వచ్చాయి. ఎన్ని కేసులు న్యాయచట్టవ్యవస్తలోని లోపాలను ఎత్తి చూపగలిగాయీ? ఎన్ని సందర్భాల్లో ఆ ఎత్తిచూపులపై నిజ నిద్ధారణజరిగి ఎమెండ్మెంట్ జరిగిందీ?
Subscribe to:
Post Comments (Atom)
>> చేతన్ కథలో అసలు విలను ఎవరూ? పోలీసు వ్యవస్తా? చట్టవ్యవస్తా? లేక డబ్బా? నాకైతే మూడూ కాదు అనిపిస్తుంది. మరి తప్పు ఎవరిదీ?
ReplyDeleteతప్పు ఎవరిదీ? విలనెవరూ అనేదానికంటే, వ్యవస్థ సామాన్యుడికి ఎంత కష్టంగా ఉంది అనేది ముఖ్యమైన విషయం. వ్యవస్థని మరింత దిగజార్చకుండా న్యాయం పొందడానికి ఎంతకష్టపడటానికైనా తయారయిన వ్యక్తులు వ్యవస్థని బాగు చేసినట్టే అనేది నావాదన.
>>పోలీసుకి తప్పుని తప్పులా పట్టుకునే పరికరాలనూ, పోలీసుకు వచ్చే కాల్స్‌ని రికార్డు చేసే పరికరాలనూ, పోలీసుకు ఆడిటింగ్ అనే ఓ ప్రక్రియలోకి తీసుకువచ్చే ఓ వ్యవస్తనూ ప్రభుత్వం చేకూర్చలేక పోతోంది. సో అసలు తప్పు ప్రభుత్వానిది.
ప్రభుత్వాల తప్పుల్లేవని కాదు. ఉన్న వ్యవస్థని ఎంతబాగా ఉపయోగించుకుంటున్నాం? దాన్ని ఇంకొంచెం బాగు చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు సృష్టిస్తున్నాం అనేది ముఖ్యమైన విషయం. సాంకేతిక పరికరాలు అవసరమే. కానీ అదే మూలకారణం కాదు.
వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో, ఆలోపభూయిష్టమైన పద్దతుల్లోనే ప్రయత్నించి వ్యవస్థని మరింతగా ఈ విషవలయంలోకి తెలిసో, తెలియకో, గత్యంతరం లేకో నెట్టేసే చాలా మందితో పోలిస్తే చేతన్ లాంటి పోరాటాలు చాలా ఆశాజనకంగా కనిపిస్తాయి.
>>అక్కడకి పోలీసు వచ్చాడా? రాలేదా? క్షతగాత్రులను ఎలా ఆసుపత్రికి తరలించారూ? ఎవరు తరలించారూ? సంఘటనా స్థలం నుండి క్షతగాత్రులను తీసుకెళ్ళిన తర్వాత అక్కడేమి జరిగిందీ?
ఆ వివరాలన్నీ రాయడం నేను ఈ కధలో ఎంచుకున్న మౌలిక మైన అంశానికి అవసరం లేదు కాబట్టి రాయలేదు. ఆవివరాలతోనే చేతన్ కేసు గెలిచాడు అదృష్టం వల్ల కాదండీ. ఇక్కడ విషయం ఏంటంటే అన్ని వివరాలూ ఉండి కూడా ఎంత కష్టపడాల్సి వస్తోంది అని. అయినా అడ్డదారులు తొక్కడమో మౌనంగా భరించడమో చెయ్యలేదు అనేది.
భాస్కర్ రామరాజు గారు,
ReplyDeleteI have addressed only part of your questions. Lets get clear on these so that out discussion on the rest of the questions can be more fruitful.
I think, being on the same page on the basic idea first makes it simple and accurate when we discuss the other things. Hope you will agree with me.
వారాంతపు రాజకీయవేత్త గారూ
ReplyDeleteమీతీ నేను విబేధించలేదు. ఐతే, చేతన్‌లాగా పోరాడినంత మాత్రాన న్యాయ చట్ట వ్యవస్తల్లో మార్పు రాకపోవచ్చని నా ఊహని చెప్పాను.
ఐతే, నా లాస్ట్ పాయింటు పై మీ స్పందన చెప్పలేదు.
చేతన్ విషయంలో హైకోర్టు పోలీసు వ్యవస్తకి కానీ చట్ట వ్యవస్తకు కానీ ఎలాంటి సూచనలిచ్చిందీ?
ఇక పోలీసు వ్యవస్తలో టెక్నాలజీ ముఖ్య భూమిక పోషిస్తుంది. కనీసం పోలీసు తప్పు చేయకుండా అతన్ని కట్టడి చేస్తుంది. ఇందులో సందేహాలేమన్నా ఉంటే సోదాహరణంగా వివరించే సంఘటనలు కోకొల్లలు.
సంఘటనా స్థలంలో పోలీసుల ఇన్వాల్వ్‌మెంట్ అతి కీలకం. సగం కేసులు కొట్టివేయబడేది ఇందుకే. సాక్షాలు మారిపోటానికీ టాంపర్ అవటానికీ ఆస్కారం ఎక్కువ.
భాస్కర్ రామరాజు గారు,
ReplyDeleteఅయ్యో.. మీరు విభేదించినా నాకు సంతోషమేనండీ. అవును మీరన్నట్టు చేతన్ లా పోరాటం మాత్రమే సరిపోదు. వ్యవస్థలోనూ, విధానాల్లోను కావల్సిన మార్పులు రావడం చాలా అవసరం. కాకపోతే నేననేదల్లా, చేతన్ లాంటి పోరాటం ఎక్కుమంది చెయ్యడం మొదలు పెడితే మీరన్న మార్పులు త్వరగా రావడానికి వీలవుతుందుందని. విధానాలు, వ్యవస్థ ఎలా ఉన్నా వీలయినంతవరకూ మంచిపద్దతుల్లో వ్యవస్థతో పని చేయించడం అనే అలవాటు మనలో లేనప్పుడు, సాంకేతిక పరికరాలూ, పకడ్బందీ విధానాలూ ఉన్నా ప్రయోజనం ఉండదు అనేది నా విశ్లేషణ.
ఈ కేసులో కోర్టు ఇంతవరకైతే వ్యవస్థకి ఎలాంటి సూచనలూ ఇవ్వలేదు. బహుశా ఇవ్వక పోవచ్చుకూడా. ఎందుకంటే కేసులో వ్యవస్థ మీద ఫిర్యాదులు లేవు. సు మోటో గా అలాంటి సూచనలు ఈ కేసు సందర్భంలో కోర్టు చెయ్యక పోవచ్చు. ఇటువంటి వాటి ద్వారా ప్రజల అనుభవాలనీ, అభిప్రాయాలనీ, వ్యవస్థ పనితీరునీ గమనించి చెయ్య వలసిన మార్పుల గురించి అలోచించడం రాజకీయ నాయకుల పని. వాళ్ళతో ఆ పని చేయించాలంటే, ఈ విషయాల ప్రాముఖ్యత మీద ప్రజల్లో అవగాహన పెంచాలి.
In simple, when the police declined to register the complaint, chetan took the pains to go to higher officials and got the case registered. If 10 people on each day do the same thing.. the police and higher officials will automatically know that oh.. we got get it properly in the first place. At present people like Chetan are not many. Many people might try to pay some money to make the police get the case registered. I am not finding fault with them I can understand their predicament. But the result is, it corrupts the system even more.