Feb 15, 2011

సీతపై టపాలు కట్టుట ఇకనైనా నిలిపివేయుడి!

పతివ్రత అంటే ఏమిటి ? ఆ పదానికి అర్ధం ఎక్కడైనా ఉందా ? మీరు ఏ నిఘంటువులలోనయినా చూసారా ? నేను చూడలేదు కానీ విన్నాను.
పతీవ్రత అంటే తెలియకుండానే సీత పతీవ్రతా అని ఒకసారి, నేనూ పతీవ్రతనే అని మరోసారి ఎలా స్టేట్మెంట్లించ్చిందామె?

ఇక్కడ కొందరు చెప్పిన దానిని బట్టి తెలిసినదేమంటే పతిని నమ్ముకోవడం, పతిని ఆరాధించడం, పతియే ప్రత్యక్షదైవం అని భావించడం, పతిని జతగాడుగా చూడడం అనేవి నాకు బాగా నచ్చాయి, బాగుంది. మరి సీత ప్రతివ్రతా ? పతిని నమ్మిందా ? ఆరాధించిందా ? ప్రత్యక్ష దైవం అనుకుందా ? పతిని జతగాడుగా అనుకుందా ? వీటన్నిటికీ మీ సమాధానం అవును అయితే మరి ఎందుకు అడవులకు పంపాడు రాముడు అన్నది నా ప్రశ్న ?
మరి కాదూ అంటే?
భార్య పతివ్రత అయితే ముందుగా భర్తకి తెలియాలి ఆ తర్వాతనే ఇతరులకి తెలుస్తుంది.
ఇతరులు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటిటా?. ఇదే భావదారిద్ర్యం. నీకోసం నువ్వు బతకవయ్యా బాబూ. మరొకరికి నువ్వు "నేను మంచోణ్ణే" అని చూపించుకోవాల్సిన అవసరం ఏంటీ?
ఇతరులు విమర్శించారని భార్యని అడవులకి పంపినవాడు రాముడు. అపుడు ఎవరికి విలువ ఇచ్చాడు రాముడు? భార్యకా ? ప్రజలకా ? పతిని సతి నమ్ముకుంటే చాలా ? పతి సతిని నమ్మనవసరం లేదా ? పతినే ప్రత్యక్షదైవంగా, జతగాడుగా భావించి, పతిని నమ్ముకున్న సీతకు మిగిలిందేమిటి? చివరికి  పతిత అన్న ముద్ర మాత్రమే !!
ఓహో! పతిత అనే బిరుదు ఎవరిచ్చారబ్బా? నువ్వా?
కాబట్టి దీన్నిబట్టి ఏం అర్థం అయ్యిందయ్యా అంటే, పతిని నమ్ముకోకూడదు. పక్కింటోణ్ణో ఎదురింటోణ్ణో నమ్ముకోవాల.
ఇలాఉంది మన కాలం.
మొన్నీమధ్య శరత్ కాలం అనే బ్లాగులో ఒకతను ఇలా రాసాడు.

@శరత్ గారు,
చాలా కాలం క్రిందట మీ మిని మీల్సో , టిఫిన్లో టపాలో రాస్తే నేను విసుక్కుని ఇటు రావడం మానేసినట్టు గుర్తు.
*వివాహేతర సంబంధాలు ఎల్లవేళలా తప్పు కావని నా అభిప్రాయం. కొన్నిసార్లు అవి అవసరాలు.* కానీ అవసరానికి అత్యాశకి తేడా వుంటుంది. మీది కడుపు నిండినా తనివి తీరని ఆశ అనుకున్నాను.
ఇలా ఉన్నాయి మన విలువలు. వివాహేతర సంబంధాలు ఎల్లవేళలా తప్పు కాదట. పిచిచ్చివాళ్ళారా. పెళ్ళి చేసుకుని వివాహ బంధానికి విలువ ఇస్తూ ఇంట్లో కూర్చుని మగ్గిపోతున్నారా? పాపం. చట్టాలను మార్చాలి. అవసరాలను చట్టాలు గుర్తించాలి. వాటికి విలువనివ్వాలి. విలువలను వలువల్లా మార్చి, రీతిరివాజులను వివస్త్రలను చేసి, అభ్యుదయపు బాటలో ఊరేగించాలి.

ఇలా ఉన్నారు మన జనాలు. రాముడు సీతని అడవికి పంపిస్తే ఏవిట్టా? రామాయణాన్ని రాసిన వారికి మీకున్నంత తెలివి లేక ఏడ్చిందనుకున్నారా?

చచ్చిన తరువాత వచ్చిన పతివ్రత బిరుదులూ, కళ్యాణాలూ, ఆదర్శ దాంపత్య మన్న ఆదర్శాలూ ఏం చేసుకుంటుంది సీత?
బ్రతికి సాధించలేనిది చచ్చి సాధించేదేమిటి ? బ్రతికి ఉన్నపుడు ఈసడించిన వాళ్ళు చచ్చాక ఆర్భాటంగా దినం చేస్తే చచ్చిన వాళ్ళు వచ్చి చూస్తారా? బ్రతికి ఉన్నవాళ్ళమీద రాళ్ళు వేసేవాళ్ళు సీత చస్తే గానీ నిజం తెలుసుకోరా?
రేపొద్దున మీరు చస్తేగానీ జనాలకి నిజం తెలియదు. సీత చస్తే గానీ నిజం ఏం తెలిసిందబ్బా? నా మట్టి బుఱ్ఱకు అర్థం కాలేదు.
అపుడొచ్చిన ప్రతివ్రతా సర్టిఫికెట్ ఏ షోకేస్ లో పెట్టుకోవాలి ? ఎవరు పెట్టుకోవాలి ? 
రేపొద్దున్న తమరు చస్తే, మీ రేపటి తరాలకు ఒక్కో తరానికి ఒక్కోటి చొప్పున పటం కట్టి మరీ పంచుతారు జనాలు.

అయ్యా నేను కోరుకునేది ఒక్కటే. మీకు నాతో సమస్య ఐతే నా మీద టపా రాయి. సీత మీద పిచ్చి రాతలు ఎందుకూ? అదీ ఒకదానికొకటి సంబంధం లేకుండా? పై ప్రశ్నలవల్ల తమరి ప్రశ్నించే తత్వం మాట అటుంచి ఈవిట్రా ఈ చికాకు ప్రశ్నలు అని అనిపించటమే కాకుండా కోపానికు కూడా తావిస్తున్నాయి.

మీకు నిజంగానే సీతా చరిత్ర మీద అనుమానాలు సందేహాలూ ఉంటే మీరు ఏ పుస్తకాలు చదువుతున్నారో ఏఏ పేజీలలో ఏఏ ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయో ఆయా పేజీలను ఉటంకిస్తూ టపా వేయండి. మీ జ్ఞానికి దాసోహమౌతాం.


సీతని రావణుడు ఎన్ని సార్లు చెరిచాడూ?
సీతలాగా ఉండే ప్రయత్నం చేస్తున్నా!

పై రెండు స్టేట్మెంట్లను కలిపి చూస్తే ఏవిటి అర్థం అవుతున్నదీ?

మీరు రావణుణ్ణి కోరుకుంటున్నారని. రావణుడికోసం ఎదురు చూస్తున్నారాని.

మానసికంగా ఎదగటం అనేది వయసుతో పాటు రావాలి. దాన్నే పరిణితి అంటారు. ఆ పరిణితిని పొందలేని నాడు, స్థితికి తగ్గ ప్రశ్నలు పరిశోధనలు టపాలు కట్టుకోవాలి. తనకి అందని తగని విషయాన్ని సత్-బుద్ధితోనైనా ముట్టుకుంటే విషం అవుతుందే తప్ప మంచిని పెంచదు.

సత్‌చింతన సత్‌బుద్ధి వలన, సత్‌బుద్ధి సత్‌సాంగత్యం వలన మరియూ సత్‌సంఘం వలన ప్రాప్తిస్తుంది.

ఇకనైనా సీతపై టాపాలు ఆపి తమరి మానసిక/భావ వైశాల్యాన్ని పెంచుకోండి.
పోరాటాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, విజయాలు, ఓటములు ఇవన్నీ జీవనంలో భాగాలు. మీరు వీటిని నడపాలి, అవి మిమ్ములను నడపకూడదు.

జనాల మనోభావాలతో ఆడుకోవలదు. ప్రశ్నించే తత్వం మీకే కాదు, అందరికీ ఉంది. ప్రపంచంలో మీరొక్కరే కాదు ఆలోచించగలిగిన వాళ్ళు. ప్రతీవాడికీ ఆలోచనా శక్తి పటిమా ఉంటాయని గమనించండి.

సీతపై నాలుగు టపాలు రాసినంత మాత్రాన మీరు అపర అవతార మూర్తికాలేరు.

అయ్యా, ఈ సిరీస్‌లో ఇదే నా చిరాకరి టపా. ఇకపై ఆమె సీతపై మరెన్ని దాడులు జరిపినా నేనైతే ఇక స్పందించను. నా ఈ స్పందనకు కారణం, నా ఐతిహాసం, నా లెగసీపై ఆమె జరుపజూచిన గుడ్డి/అజ్ఞాన/క్షణికావేశ దాడి. ఎవరిపైననో కసిపెంచుకుని ఏడ్వలేక మద్దెలపై పడిన చందాన, ఏడువేల సంవత్సరాల క్రిందటి ఓ స్త్రీ, తన మనోబలం చేత, తను నమ్మిన సిద్ధాంతాలకు తను నమ్ముకున్న సిద్ధాంతాలకు కాలాన్ని ఎదురొడ్డి కట్టుబడి దేవతైన ఓ హైందవ వీరపత్ని గురించి ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఏ మాత్రం చరిత్ర తెలియకుండా క్షణికావేశంలో చెప్పుడుమాటలు నమ్మి, ఉమ్మజూసిన నేనలా ఓర్వవలే. నేనూ హైందవవీరుడనే కదా. నా ఐతిహాసము శతృవునకు రొమ్ముజూపనే చెప్పినదే. నా సంపదపై దాడిజరుగ ధైర్యముతో ఎదుర్కొనమనే చెప్పినదే. నే ఎందుకు, నాకెందుకులేమ్మని కూర్చొనవలే?
అందుకే నా మాటని విన్నవించాను. నా ధృక్కోణాన్ని నా టపాలద్వారా తేటతెల్లముగా వివరించాను.
ఇంకనూ వినని ఎడల, సీతమ్మవారినే ప్రార్థించెదను, ఓ తల్లీ, బిడ్డలను కనుటయే నీ వంతు, వారి వారి బుద్ధి వారి కర్మననుసరించియే ఉండును. ఐనననూ నీ ప్రయత్నమున, నీ బిడ్డను సరియైన మార్గమున నడిపించు భారము నీదియే అని విన్నవింతును.

సర్వేజనాః శుఖీనౌ భవంతు.
జై హింద్.

22 comments:

 1. "సీతలా ఉండాలని ప్రయత్నిస్తున్నా."

  అందుకేనేమో రాముడిని ప్రతి పోస్ట్'లో తెగనాడుతోంది. అసలు సీత ఎలా ఉందో తెలిస్తే, తెలుసుకుంటే అలా ఉండటానికి ప్రయత్నించవచ్చు. ఎలా ఉండాలో తెలీకుండానే నేనలా నేనలా ఉంటా అని గెంతితే కాళ్ళ నెప్పులు తప్ప ఇంకేం మిగలవని పాపం ఎప్పుడు తెలుసుకుంటుందో.

  ReplyDelete
 2. $భాస్కరరామరాజు గారు
  చాలా చక్కగా చెప్పారు. టపావెనక మీ బాధ, ఆవేదన అణువణువునా అర్థం అవుతుంది.

  #ఇలా ఉన్నాయి మన విలువలు..
  అవి పిల్లకాకి వలువలు మాత్రమే లెండి, అందరివి అలా కాకూడదుa!

  #సీతని రావణుడు ఎన్ని సార్లు చెరిచాడూ?
  సీతలాగా ఉండే ప్రయత్నం చేస్తున్నా!

  నిజమే! శూర్ఫణకతత్వం పెరిగి రావణులకై ఎదురుచూస్తున్న అసంధిగ్ధ యుగమిది.

  #జనాల మనోభావాలతో ఆడుకోవలదు.

  మంచిగా చెప్పారు. కొన్ని జీవాలకి ఇజాలని, వాదాలని పిచ్చి పేర్లుమీదుగా ఇతరుల మనోభావాలని అసంగతంగా ప్రశ్నించడం అలవాటయింది.

  #ప్రశ్నించే తత్వం మీకే కాదు, అందరికీ ఉంది. ప్రపంచంలో మీరొక్కరే కాదు ఆలోచించగలిగిన వాళ్ళు. ప్రతీవాడికీ ఆలోచనా శక్తి పటిమా ఉంటాయని గమనించండి.


  కొందరు "పెసినంచడం" అనేది అదో జనమ హక్కు అనుకు౦టున్న్నారు. కానీ అదే సమయంలో ఆ పక్కన మీరు చెప్పిన ఆలోచనావిధానాన్ని పాటించకపోతే మందబుద్దులవుతామని తెలుసుకుంటే మంచిది.

  #మీకు నాతో సమస్య ఐతే నా మీద టపా రాయి. సీత మీద పిచ్చి రాతలు ఎందుకూ?..ఎవరిపైననో కసిపెంచుకుని ఏడ్వలేక మద్దెలపై పడిన చందాన..

  మరీ ఇంత పచ్చిగా "విలువలను" స్వార్థానికి వాడుకోవడం మొదటిసారి చూస్తున్నా!

  ReplyDelete
 3. 'రక్తచరిత్ర' భాష నచ్చకపోయినా, ఒకోసారి ఇలాంటివాళ్ళ విషయంలో అదే తగిన సమాధానం అనిపించేలా చేస్తారు... ప్చ్..
  రాజేష్, పదే పదే అవేమాటలు కోట్ చేయడం ఆపేయండి, ప్లీజ్. ఆమెకు ఆసక్తి వున్న అంశం ఎంచుకుంది, ఈ చిచ్చుబుడ్డి మొహానికి రావణుడొస్తాడా ఏమి? ఏ మారీచుడి మేనల్లుడో, సుబాహుడి బామ్మర్దో వచ్చినా గొప్పే.

  ReplyDelete
 4. బాగా రాసారు భాస్కర్ గారు !
  పద్మ గారు :)

  ReplyDelete
 5. మీ ఆవేదన అర్ధవంతమైనది భాస్కర్.

  అసలేమనాలో అర్ధం కావట్లా నాకు. ఆ క్యాండిడేటు ఒక్క క్యాండిడేటు కాదబ్బా. ఈసార్రాసిన టపా వేరే వాళ్ళు రాసారు. తెరవెనక మనుషులెవరో నాకు తెలీదు కానీ, ఈ బ్లాగులోకపు పెద్దల, మేధావుల పాదముద్రలు స్పష్టంగా కనబడుతున్నాయి.

  ఆంగ్లంలో ఓ సామెతుంది. స్టార్వ్ ద బీస్ట్ అని. అదే మందు.

  ReplyDelete
 6. =============================================
  ఈ చిచ్చుబుడ్డి మొహానికి రావణుడొస్తాడా ఏమి? ఏ మారీచుడి మేనల్లుడో, సుబాహుడి బామ్మర్దో వచ్చినా గొప్పే.

  =============================================

  Hillarious :-)

  ReplyDelete
 7. #రాజేష్, పదే పదే అవేమాటలు కోట్ చేయడం ఆపేయండి..

  వా...SNKR గోరు :(. నేనేటి సేయను? రావణుడంటే సెరిచేవాడని ఆయమ్మ తీర్మాన౦ జేసి, నాకు రావణుడు కావాలి అంటుంది. పైన భాస్కర్ గారు పెట్టిన రె౦డు ముక్కలు సదవండి.యేతంటారు?

  #ఏ మారీచుడి మేనల్లుడో, సుబాహుడి బామ్మర్దో వచ్చినా గొప్పే
  :)) ఏదో పెద్దదానికి లగాయిత్తేస్తే సిన్నదన్నా రాకపోద్దని కదా! ఇంతకీ ఈ మా.మే, సు.బా లుకి సెరచడంలో అనుభవమెంత?

  ReplyDelete
 8. $SNKR గోరు

  అన్నట్లు AVS గారు టంపెంటైన్స్ దినం మీద చక్కగా రాసారు. మీరక్కడ కనబళ్ళేదే? కింద గొలుసట్టుకుని వెళ్ళండి.
  http://avsfilm.blogspot.com/2011/02/blog-post_14.html

  ReplyDelete
 9. Bhaskar garu

  You have tried your level best to give the message. I can feel your frustration. I am not a blogger but as a frequent blog reader it is very disgusting to see all this.
  It is very nasty to drag the family and the religious characters into picture. Hope there will be an end to it soon.
  padmavalli

  ReplyDelete
 10. రాజేష్
  ఏవియస్ లాంటి సినిమా మనిషి ప్రేమ వేలంటైన్ లాంటి వాటి గూర్చి మాట్లాట్టం దయ్యాలు వేదం వల్లించిన చందంలా ఉంది.
  సినిమాలే ప్రేమ ఇత్యాది వాటిని పెంచి పోషిస్తున్నది.
  కాదంటావా?

  ReplyDelete
 11. $భాస్కర్ గారు

  #ఏవియస్ లాంటి సినిమా మనిషి..
  వృత్తి, ప్రవ్రుత్తి అంటారు కదండీ! సినిమా ఆయన వృత్తి, జీవనాధారం అయింది. ప్రవ్రుత్తి చెడును చెండాడం. ఎంత సినిమావారైనా కొన్ని అవాంచిత సామాజిక రుగ్మతల దాడిని చూస్తూ తన ప్రవ్రుత్తిని చంపుకుంటూ బతగగలడా? సరే నలుగురికి చెబితే వినేవాల్లెరి? కనీసం ఈ విధంగా రాసినా చదివి, అర్థం చేసుకున్నవాడు బాగుపడతాడు. సరే, అలా రాసినందుకు మనం ఆయన్ని గాల్లోకి ఎత్తకపోయినా అలాంటివి చదివిన వారిలో ఆ భావాలు ప్రవర్థమానం అవ్వాలని కోరుకుందా౦. అట్లే పెద్దవారిగా వారిని అలాంటివి మరిన్ని వ్రాయమని ప్రోత్సహిద్దాం. ఏమంటారు?

  #సినిమాలే ప్రేమ..పోషిస్తున్నది..కాదంటావా?
  అస్సలు కాదన్ను! తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ప్రేమ పేరుతొ విచ్చలవిడితనాన్ని, విశృంఖలస్వైర విరహ కల్పనలతో వయసుడిగిన ముదిమి రచనలు/సినిమాలు వయసుకొస్తున్న వారిని ఏది ఒప్పో తప్పో నిర్ణయించుకునే విచక్షణాదికారాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి!

  ReplyDelete
 12. /అన్నట్లు AVS గారు టంపెంటైన్స్ దినం మీద చక్కగా రాసారు. మీరక్కడ కనబళ్ళేదే? కింద గొలుసట్టుకుని వెళ్ళండి. /

  చూశాను రాజేష్.
  "క్షాత్రమున్న అందరూ క్షత్రియులే" అన్నట్లు, వాలమున్న ప్రతి ఒక్కరు వాలంటేయులే, అంటాను. వాలంటేయుల సరదాగా దినం పెట్టుకుంటామంటున్నారు, పెట్టుకోనీ ..
  వాలంటేయుడంటే హనుమంతుల వారే అని కూడా మా పక్కింటి అమ్మాయి నా పీక నొక్కి వక్కాణించాక, ఒప్పుకోక తప్పలేదు. :P :))

  ReplyDelete
 13. @ భాస్కర రామ రాజు
  నా అభిప్రాయం పై నీ ఆలోచనలు అవసరమా? నీకు నాకు ఉత్తర దక్షిణ దృవాలంత భేధం వుంది. నా ప్రస్తావన / నా అభిప్రాయాల మీద చర్చ తొలిగించగలవు.

  ReplyDelete
 14. రాజు గారు కేవ్వు కేక

  ReplyDelete
 15. @క్రిష్ణ,

  అక్కడ కమెంట్ పెట్టింది వేరెవరో. రాజుగారు దాని గురించి చర్చ చెయ్యలేదు కూడా. ఆ కమెంట్ మీకు ఇబ్బంది పెట్టినపుడు బ్లాగ్ ఓనర్‌ని తొలగించమని అడగొచ్చుగా ? లేకపోతే మీరు ఆ తానులోని ముక్కే అని నిరూపించదలచుకున్నారా ?

  ReplyDelete
 16. అరే రాజూ పనీపాటా లేని గాలోడికి మల్లే బ్లాగులంబడి తిరిగొచ్చావు, యే౦ నేర్చుకున్నావో చెప్పు?

  మరండీ,

  ౧. ఎలాగైతే తూర్పుధ్రువాన ఉన్న సూర్యున్ని పడమర ధ్రువం సాయ౦కాలమయ్యేసరికి పూర్తిగా ఆకర్షిస్తుందో అలాగే విజాతి ద్రువాల మద్య ఖే(భే)ద౦ ఉన్నాగానీ ఆట్టే ఆకర్షి౦చుకుంటాయి.

  ౨. మరే, ఆ.. మనకు నచ్చని వాటిమీద మన "సోలో"చనలు ఎలారాస్తామో అదేవిధంగా పక్కవాళ్ళు కూడా రాయెచ్చు అన్న ఇంగింతజ్ఞానం కలిగి ఉండాలి.

  ౩. మనోభావాలు ఏ ఒక్కరికో గుత్త కాదు, అందరికీ ఉంటాయి.

  అబ్బా.. అసలు సైతానుముక్క గుర్తుకు రావట్లేదండీ.. ఆ.. గురుతుకోచ్చే

  ౪. బాడీ గుళ్ళోన, బ్రెయిన్ చెప్పుల మీద అన్నట్లు మద్యలో వచ్చి సన్నాయినొక్కులు నొక్కుతూ పితూరిలు మాట్లాడే పేత్రీలు ఎవరు రాసిన దాంట్లో తప్పుందో తెలుసుకుని మాట్లాడితే మంచిది.


  అరే భలే చెప్పావు రాజు, దా.. ఇంద.. ఈ రోజు నీకు కంటిచూపుతో కామెంట్లెలా పెట్టాలో నేర్పిస్తా!.


  భాస్కర్ గారు, రాజు చెప్పినదానికి సున్నా వేస్తారో వంద వేస్తారో మీఇష్టం.

  ReplyDelete
 17. @బద్రి
  నన్ను ఇబ్బంది పెట్టింది రాజు గారి టపా కాదు. అందులో విషయమో కాదు. శరత్ గారి బ్లాగులో నేను రాసిన ఒక కామెంటు ని పూర్వాపరాలు లేకుండా ఇలా ఇక్కడ ప్రస్తుతించడం , నా భావజాలాన్ని ఉన్నదున్నట్టుగా కాకుండా, మరొలా చూపెడుతుంది అని నా ఉద్దేశ్యం.
  ఇక చర్చ అంటే ... నా వాఖ్యలని వక్ర బుద్ధి తో విమర్శిస్తున్నాను అనుకుంటూ నోరు పారెసుకుంటున్న కొన్ని జీవుల వాఖ్యల పై నా అభ్యంతరం. నా వాఖ్యలు తన బ్లాగులో అవసరం లేదు అని చెప్పిన భాస్కరరామరాజు , నా పై వాఖ్యలని తొలిగిస్తేనె ఉభయకుశలోపరి.

  ReplyDelete
 18. ప్రియమైన వైదిక మిత్రులారా! మీకందరికి నా సహస్రాభివందనాలు.
  రామాయణ మహాన్వేషణ సాగించడం అంటే ఇలా కాదనుకుంటాను. నా అజ్ఞానం అనండి ఇంకా ఏదైనా అనండి. రామాయణంలో ఏదో సందేహం వస్తే అనుకోకుండా ఇలా వచ్చాను. భారతీయ ఇతిహాసాలపై చర్చింపబూనడం మంచిదే, కానీ అది సత్సంగుల మధ్యన సాగితే ప్రమాదం కాదనుకుండటాను. ఈ మధ్యన సత్ సంగానికి అర్థం మారిపోయింది. మంచి వాళ్లతో కూడిన అని నాఅభిప్రాయం. రామాయణం కాలం నాడే అజ్ఞానులైన జనులు సీతమ్మవారిని అపార్థం చేసుకోగాలేనిది ఈనాటి వారు చేసుకోరా? వివాహేతర సంబంధాలు తప్పుకాదు?అత్యాశ పడుకుండా ఉంటే అవసరార్థం ఎంతమందితోనైనా వివాహేతర సంబంధం కొనసాగించవచ్చు అన్నది ఎవరో అది వారి విచక్షణకే వదిలిపెడదాం. మన దురదృష్టం ఏమిటంటే శీతల దేశాల పరిస్థితులు తెలియకుండా వారిని అనుసరించాలి అనుకోవడం. వారి సంస్కృతులను అలవరుచుకోవాలనుకోవడం. ఏది ఏమైనా ముర్ఖంగా వాదించే వారతో వాదనలు మానుకోవడం మంచింది. అలావారితో ఇలాంటి ఇతిహాసాలను చర్చించి ప్రయోజనం ఉండదు. సంభోగానికి జంతువులకు, మానుషులకు (అంటే మంచివారికి) ఉన్న తేడా గుర్తిస్తే ఇలాంటి ఆలోచనలు రావు.

  ReplyDelete
 19. ప్రియమైన వైదిక మిత్రులారా! మీకందరికి నా సహస్రాభివందనాలు.
  రామాయణ మహాన్వేషణ సాగించడం అంటే ఇలా కాదనుకుంటాను. నా అజ్ఞానం అనండి ఇంకా ఏదైనా అనండి. రామాయణంలో ఏదో సందేహం వస్తే అనుకోకుండా ఇలా వచ్చాను. భారతీయ ఇతిహాసాలపై చర్చింపబూనడం మంచిదే, కానీ అది సత్సంగుల మధ్యన సాగితే ప్రమాదం కాదనుకుండటాను. ఈ మధ్యన సత్ సంగానికి అర్థం మారిపోయింది. మంచి వాళ్లతో కూడిన అని నాఅభిప్రాయం. రామాయణం కాలం నాడే అజ్ఞానులైన జనులు సీతమ్మవారిని అపార్థం చేసుకోగాలేనిది ఈనాటి వారు చేసుకోరా? వివాహేతర సంబంధాలు తప్పుకాదు?అత్యాశ పడుకుండా ఉంటే అవసరార్థం ఎంతమందితోనైనా వివాహేతర సంబంధం కొనసాగించవచ్చు అన్నది ఎవరో అది వారి విచక్షణకే వదిలిపెడదాం. మన దురదృష్టం ఏమిటంటే శీతల దేశాల పరిస్థితులు తెలియకుండా వారిని అనుసరించాలి అనుకోవడం. వారి సంస్కృతులను అలవరుచుకోవాలనుకోవడం. ఏది ఏమైనా ముర్ఖంగా వాదించే వారతో వాదనలు మానుకోవడం మంచింది. అలావారితో ఇలాంటి ఇతిహాసాలను చర్చించి ప్రయోజనం ఉండదు. సంభోగానికి జంతువులకు, మానుషులకు (అంటే మంచివారికి) ఉన్న తేడా గుర్తిస్తే ఇలాంటి ఆలోచనలు రావు.

  ReplyDelete