Oct 20, 2010

గొడుగు

నాన్నా ఆపిల్లాడు చూడు చక్కగా గొడుగేస్కొచ్చాడు. నాకూ అలాంటిది కావాల్నాన్నా అన్నాడు సూర్య నాతో. వద్దురా నాన్నా కంట్లో గుచ్చుకోవచ్చు లేక పొడుచుకోవచ్చు. వద్దమ్మా. ఇదే బాగుంది అని వాడేస్కున్న పాంచోని పొగిడాను. అబ్బా కాదునాన్నా. గొడుగైతే ముడుచుకోవచ్చు, బ్యాగ్గులో పెట్టుకోవచ్చు, అవసరం వచ్చినప్పుడు తీయవచ్చు అంటూ గొడుగు గొప్పతనాలను ఏకరువు పెట్టటం మొదలెట్టాడు. ఇంతలో బస్సు వచ్చింది. నాన్నా గొడుగు సాయంత్రం వచ్చేప్పుడు తీస్కురా అంటూ బస్సెక్కాడు.
ఆవేళ సాయంత్రం మా కార్యాలయం వద్దనున్న వాల్గ్రీన్స్‌కి వెళ్ళా పిల్లల గొడుగులేమన్నా ఉన్నాయా అని. లేవండీ అన్నాడు కొట్టువాడు. సరేనని ఇంటికి ఫోనుకొట్టి గొడుగులు దొరకలేదని చెప్పి కారు తీసి రొడ్డెక్కాను. ఇంటిదాకా వెళ్ళంగనే టర్గెట్‌లో ఓసారి చూద్దాం అనిపించింది. కారుని అటుతిప్పాను. సన్నగా తుప్పర పడుతోంది. టార్గెట్‌కి వెళ్ళాను. లోపలి ఓ సహాయక యువతిని అడిగేను పిల్లకాల గొడుగు కావాలి అని. పిల్లల డిపార్ట్మెంట్ వైపుకి వెళ్ళి చూస్కోండి అంది ఆ వైపుకి చుపుతూ. అక్కడకెళ్ళి చూస్తే ఒకేఒక రకం పిల్లల గొడుగు ఉంది. దానిపై ఏదో చిన్న డిజైను. పిల్లల గొడుగు డిజన్ పిల్లలకు ఏమాత్రం హాని కలిగించకుండా, పిల్లలు ఈజీగా తెరిచి ముడిచేలా ఉంటాయిని ఆ గొడుగు చూసాక అర్థం అయ్యింది. సరేనని అది తీస్కుని, మరి పిల్లాడికి ఏమన్నా కొంటే చంటిదానికి కొనకుండా ఎలా బుంగమూతి పెట్టుకోదూ అని బెత్తెడుజుట్టికి అరడజను సైడుపిన్నులు కొనుక్కెళ్ళా.
సన్నటి తుప్పర ఇంకా పడుతూనే ఉంది. ఇంటికెళ్ళగానే ఏంటీ ఇంత ఆలశ్యం అన్నాడు పిల్లాడు. ఏ లే లా లీ అంది అమ్మాయి. వానగా ఉందిగా అని సైలెంటుగా లోపలికెళ్ళాను. ఆపీస్ సంచి కిందపెట్టి బూట్లిప్పి, చీకట్లో తలుపు దగ్గరే దాచిపెట్తిన గొడుగు నెమ్మదిగా కాలివెనకుపెట్టుకుని వెళ్ళాను హాల్లోకి. ఠకా మని తీసి సూర్యా ఇదిగోరా అని ఇచ్చాను. మరి నాకో అని చూసిన పిల్లకి పిలక బ్యాండ్లు ఇచ్చాను.
పిల్ల అపురూపంగా చూస్కుంది. ప్యాకెట్టు ఊడదీసి బెత్తెడు జుట్టుకు నాలుగు రబ్బరు బ్యాండ్లి పెట్టుకోటానికి వాళ్ళమ్మదగ్గరకి పరుగెత్తింది.
పిల్లాడు గొడుగు చేతుల్లోకి గర్వంగా తీస్కున్నాడు. నాకళ్ళలోకి చూసాడు. నాకేనా ఇదీ అన్నట్టుగా అనిపించాయా కళ్ళు. నీకే అన్నట్టు నేనూ చూసాను. అమ్మా అమ్మా నాన్న గొడూగు తెచ్చాడని వాళ్ళమ్మకి చూపించాడు. చెల్లెమ్మా గొడుగు అని చుపించాడు. నాన్నా బాగుంది అని నాదగ్గరకొచ్చి గొడుగు టెక్నికాలిటీస్ గురించి కొంచెం ప్రోబ్ చేసాడు. ఇక దాన్ని తెరిచి మూసి తెరిచి మూసి అడుతున్నాడు.
పిల్లకి రబ్బరు బ్యాండ్లు బోరుకుట్టాయి ఈ మధ్యలో. అన్న సంబరం పిల్లకి ఎట్రాక్టివ్‌గా అనిపించింది. లాక్కోటానికి పరుగెత్తింది. షరమాములే ఇద్దరూ లాక్కుని పీక్కుని గోలగోల చెసారు. నే మధ్యలో కల్పించుకుని గొడుగుని ముడిచేసి పైన పెట్టాను.
మఱ్ఱోజు పొద్దున్నే గొడుగేస్కుని వెళ్తాం అనుకున్నాడు పిల్లాడు.
తెల్లవారింది.
వానవెరిసింది.
ఎండగా ఉంది.
గొడుగు తీస్కెళ్ళనా సాయంత్రం వానపడొచ్చేమో అన్నాడు. వద్దులేరా అన్నాము.
సాయంత్రం అయ్యింది. వానలేదు.
మఱ్ఱోజు పొద్దున్నే గొడుగేస్కెళ్ళనా అన్నాడు. వానలేదుగా అని చెప్పాం.
అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. పొద్దున్నే వాన పట్టంలేదు. వాడికేమో వానలో గొడుగేస్కుని వెళ్ళాలని కోరిక. మొన్నీమధ్య పొద్దున్నే పొగమంచుగా ఉంటె ఐతే గొడుగేసుకుని వెళ్ళొచ్చా అన్నాడు ఆత్రంగా.
అలా అటక మీదనే ఉంది గొడుగు వాడికేసి చూస్తూ!

Oct 18, 2010

చండీ హోమం

శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మా దేశ దేవాళయంలో శ్రీ చక్ర విధానేన అష్టోత్తర లక్ష కుంకుమార్చన జరిగింది.
మొన్నటి శుక్రవారం చండీ హోమం అత్భుతంగా జరిగింది.

యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై ౧౪ నమస్తస్యై ౧౫ నమస్తస్యై నమో నమః || ౫\.౧౬||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే
స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై ౧౭ నమస్తస్యై ౧౮ నమస్తస్యై నమో నమః || ౫\.౧౯||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౦ నమస్తస్యై ౨౧ నమస్తస్యై నమో నమః || ౫\.౨౨||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౩ నమస్తస్యై ౨౪ నమస్తస్యై నమో నమః || ౫\.౨౫||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౬ నమస్తస్యై ౨౭ నమస్తస్యై నమో నమః || ౫\.౨౮||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు చ్ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౯ నమస్తస్యై ౩౦ నమస్తస్యై నమో నమః || ౫\.౩౧||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౨ నమస్తస్యై ౩౩ నమస్తస్యై నమో నమః || ౫\.౩౪||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౫ నమస్తస్యై ౩౬ నమస్తస్యై నమో నమః || ౫\.౩౭||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు క్శాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౮ నమస్తస్యై ౩౯ నమస్తస్యై నమో నమః || ౫\.౪౦||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౧ నమస్తస్యై ౪౨ నమస్తస్యై నమో నమః || ౫\.౪౩||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౪ నమస్తస్యై ౪౫ నమస్తస్యై నమో నమః || ౫\.౪౬||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౭ నమస్తస్యై ౪౮ నమస్తస్యై నమో నమః || ౫\.౪౯||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౦ నమస్తస్యై ౫౧ నమస్తస్యై నమో నమః || ౫\.౫౨||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౩ నమస్తస్యై ౫౪ నమస్తస్యై నమో నమః || ౫\.౫౫||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు లక్శ్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౬ నమస్తస్యై ౫౭ నమస్తస్యై నమో నమః || ౫\.౫౮||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౯ నమస్తస్యై ౬౦ నమస్తస్యై నమో నమః || ౫\.౬౧||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౨ నమస్తస్యై ౬౩ నమస్తస్యై నమో నమః || ౫\.౬౪||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౫ నమస్తస్యై ౬౬ నమస్తస్యై నమో నమః || ౫\.౬౭||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౮ నమస్తస్యై ౬౯ నమస్తస్యై నమో నమః || ౫\.౭౦||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౭౧ నమస్తస్యై ౭౨ నమస్తస్యై నమో నమః || ౫\.౭౩||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౭౪ నమస్తస్యై ౭౫ నమస్తస్యై నమో నమః || ౫\.౭౬||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

ఇన్ద్రియాణామధిష్ఠాత్రీ భుతానాఞ్చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వ్యాప్తిదేవ్యై నమో నమః || ౫\.౭౭||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

చితిరూపేణ యా కృత్స్నమేతద్‌ వ్యాప్య స్థితా జగత్‌ |
నమస్తస్యై ౭౮ నమస్తస్యై ౭౯ నమస్తస్యై నమో నమః || ౫\.౮౦||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

Oct 14, 2010

శ్రీ గాయత్రి రామాయణం

అయ్యా! ఓ సందేహం -
శ్రీ వాల్మీకి రామాయణం విన్నాను. ఎప్పుడో చదివా౨ను.
శ్రీ గాయత్రీ రామాయణం అని నిన్న ఎక్కడో చూసా౨ను. ఇదేవిటీ? దీని కథ ఏవిటీ? గాయత్రీ రామాయణం వాల్మీకి రామాయణం రెండూ ఒహటేనా? వేరేవేరేనా?
http://www.telugubhakti.com/telugupages/Vishnu/SreeRama/GayatriRamayan1.htm

gaytriramayan13.gif

Oct 13, 2010

డిష్కావ్

షూయా నాది లే
వాడు లేవలా
షూయా నాదీ నాదీ నాదీ లేలేలే
వాడు లేవలా
బండోడా లే..౫౪౬#&%$‌&‌&*&(‌$&$%‌%$@%@#$%‌#‌&#%&%*$%%# లేలేలే
వాడు లేవలా
ఒక్కటేసింది
ముఖంమీద అచ్చుపడింది
దెబ్బకి లేచి పక్కకొచ్చి ఏడుపు లంకించుకున్నాడు

అయ్యా ఇదీ సినిమా రోజూ ప్రతీరోజు. లాగులాట పీకులాత. వాడేంతీస్కుంటే పిల్లకి అదేకావాలి. పిల్ల ఏం తీస్కుంటే వాడికి అదేకావాలి. కొట్టుకుంటున్నారు. రక్కుకుంటున్నారు.

టెరిబుల్ టూస్ అంటే ఏంటో అనుకుంటున్యారా? ఇదే. మరి వాడికి టెరిబుల్ టూస్ కాదుగా? అవున్నిజమే. కానీ, అక్కడ ఎవురూ? సూర్య. ఆడెప్పుడూ అంతే. టెర్రిఫిక్...................

Oct 12, 2010

72 మేళకర్త రాగాలు - శ్రీ నూకల చిన సత్యనారాయణ

మేళకర్త రాగాలు అంటే ఏంటో నాకు తెలియదు. నాకు సంగీతం రాదు. నిన్న ఎక్కడో ఈ లింకు తగిలింది. సంగీతాభిమానులకు ఉపయోగపడుతుందని ఇక్కడ పెడుతున్నాను. ఈ యం.పి.౩ లను దింపుకుని విన్నాక మహదానందం వేసింది.

Oct 11, 2010

శుద్ధ నెయ్యి

చాలా మంది అమ్మో నెయ్యి అంటుంటారు. మరి ఆరోజుల్లో నెయ్యి లేకుండ అన్నం తినేవాళ్ళుకాదు జనాలు. మరి వారికేమీ కాలేదుగా? అవును. కారణం - తిన్న తిండికి సరిపడా వ్యాయామం చేసేవాళ్ళు అప్పటిజనాలు. ప్రత్యేకించి వ్యాయామం చేయకపోయినా ఆరోజుల్లో జనాలని ఏదోక శారీరక శ్రమ ఉండేది. కాబట్టి తిన్నది అరిగేది. ఈరోజు రేపట్లో శారీరక శ్రమ లేదు. దాంతో నెయ్యేకాదు ఏమి తిన్నా డేంజరే, అంతేకా కొన్ని భ్రమలు, మరికొన్ని అపోహల్తో భయం భయంగా తింటున్నారు. ఐతే ఈనాటి భయాల్లో కొన్ని అపోహలు, కొన్ని నిజాలు, కొన్ని కేవలం అభూత కల్పనలు అని గమనించాలి.

నెయ్యి వేరే డాల్డా వేరే మరియూ వనస్పతి వేరే అని గుర్తించలి.

నెయ్యి అమ్మో అంటున్న జనాలు ఫ్యాషన్ గా మా౨క్ డోనాల్డ్స్ కో వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్/చికెన్ నగ్గెట్స్ లేక కె.యఫ్.సి కి వెళ్ళి ఫ్రైడ్ చికెన్ లేక ఏహోటలుకో వెళ్ళి మైసూరు బోడానో తింటారు కిం అనకుండా.
మ్యాక్ లాంటి రెస్టారెంట్లలో వాడే నూనెలు ఎంత డేంజరసో తెలుసా? ఎంతసేపు మరుగుతుంటాయో తెలుసా? ఇంకో విషయం నూనెని ఎక్కువసార్లు వాడేందుకు వాటిల్లో పంది లేక జంతుల కొవ్వులను కలుపుతారు. అవి నూనె యొక్క లైఫ్ ని పెంచుతాయి. ఐతే అవి వాటిల్లో వేయించిన పదార్థాలకు సాచురేటెడ్ కొవ్వుని దండిగా అంటిస్తాయి.
French fries can contain a large amount of fat from frying. Some researchers have suggested that the high temperatures used for frying such dishes may have results harmful to health (see acrylamides). In the United States about ¼ of vegetables consumed are prepared as French fries and are proposed to contribute to widespread obesity. Frying French fries in beef tallow, lard, or other animal fats adds saturated fat to the diet. Replacing animal fats with tropical oils such as palm oil simply substitutes one saturated fat for another. Replacing animal fats with partially hydrogenated oil reduces cholesterol but adds trans fat, which has been shown to both raise LDL cholesterol and lower HDL cholesterol. Canola oil could also be used, but beef lard is generally more popular, especially amongst fast food outlets that use communal oil baths. Many restaurants now advertise their use of unsaturated oils. Five Guys, for example, advertises their fries are prepared in peanut oil.

శుద్ధ నెయ్యి, ఇంట్లో చేసుకున్నది ఆరోగ్యానికి మంచిది. నెయ్యిలో యాంటై ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెయ్యి యల్.డి.యల్ ని తగ్గిస్తుంది.
    *  Ghee, otherwise known as clarified butter, is a healthy cooking oil due to its content of essential fatty acids which are an essential part of our diets. It is rich in easy-to-digest short chain fatty acids and vitamins A, D, E & K. It also contains 3% linoleic acid which has anti-oxidant properties.
    * Ghee has a high smoke point which makes it great for cooking. It also means that it does not produce damaging free radicals.
    * Ghee is suitable for people who are sensitive to lactose as the heating procedure used to clarify the butter removes the lactose content.
    * Use ghee as a delicious oil for cooking or stir into rice and vegetables for a nourishing flavoursome taste.
అంతేకాదు నెయ్యిలో తొందరగా జీర్ణమయ్యే కొవ్వులు ఉంటాయట -
Ghee's chemistry holds the secret to its health benefits. Humans need both saturated and unsaturated fats as part of a healthy diet. Ghee is made from a combination of saturated and unsaturated fats. It is about 65% saturated fat and 25% monounsaturated fat with about 5% polyunsaturated fat content. Its saturated fat is primarily (89%) made from the easy-to-digest short chain fatty acids and it contains 3% linoleic acid which has anti-oxidant properties. It also contains the fat soluble vitamins Vitamin A, D, E and K.

http://www.physicalnutrition.net/ghee-benefits.htm

కాబట్టి అవసరాన్ని బట్టి వాట్టం, ఎంతతినాలో తెలుసుకుని తినటం, ఎక్కడ ఆపాలో తెలుసుకోవటం ముఖ్యం.

Oct 10, 2010

సినిమా మళ్ళి మొదలైంది

సినిమా మళ్ళి మొదలైంది మాకు.
అదేనండీ, అనఘ టెరిబుల్ టూస్ లోకి వచ్చింది. వాడితో మొదటి సినిమా, మస్తుగా నడిచింది. మూడొందలరవై రోజుల బొమ్మ. సూపర్ ఇట్టైంది.
ఇక ఇప్పుడు ఈ అమ్మగారు ఏమేంజేస్తరో సూడాలె.
From Drop Box

అమ్మగారికి పుట్టిన్రోజు శుభాకాంక్షలు

ఏప్పీ బర్త్‌డే అనఘ అని రాయమంటే కేకుజేసిన తెల్ల పిల్ల స్పెల్లింగు తప్పు రాసింది.

Oct 7, 2010

సూరిగాడి ఆలోచన

From 10-7-2010

ఎలా ఏసాడో తెలియదు...ఇట్టాతే ఫొటోతీస్తా అన్నా..
ఉండు అని లైక్ డిస్ అని రాసాడు. ఎలానో తెలుసా
ఎల్ ఐ క్ అనుకుంటు, ద్ ద్ ఐ స్ అన్నాడు
this అనేది వాడికింకా తెలియలా.

ఏమైనా వాడి బుఱ్ఱ అప్పుడప్పుడు ఇలా ఝలకులిస్తోంది.

Oct 6, 2010

ఏడుపుల సంత

పోయినేడాది అనుకుంటా, జీ టీవీలో సరెగమప లిటిల్ ఛాంప్స్ ఛాలెంజ్ వచ్చింది. దాంట్లో అభిగ్యాన్ దాస్ అని ఒకడు పాల్గొన్నాడు. ఆ పిల్లాడి తల్లితండ్రులు బలే విచిత్రంగా అనిపించారు. ఆమాటకొస్తే ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతీ ఒక్క పిల్ల/పిల్లాడి తల్లితండ్రులూ అలానే అనిపించారనుకోండి. ఇక ఈ పిల్లాడు, అంతకు ముందే సరెగమప బాంగ్ల లో గెలిచి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాడు. వీడు మొత్తానికి పై దాకా వచ్చి ఆరోవాడిగా నిలిచాడనుకోండి. వాడి తల్లి తండ్రులకి తపన తగ్గలా. ఈ పిల్లాడికి మల్లే వాడి తమ్ముడు శ్యామంతన్ దాస్ని లైంలైట్లోకి తెచ్చి వండివారిద్దామనుకున్నారు. స్టార్ టీవీ వాడి ఛోటే ఉస్తాద్ అనే కార్యక్రమంలోకి తెచ్చారు వాడ్ని. మొట్టమొదటి ఎపిసోడ్ లో శ్యామంతన్ దాస్ పాడినాక వాడి తల్లితండ్రుల్ని అడిగారు ఎలా పాడేడు మీ అబ్బాయి అని. సోను నిగం మరియూ రాహత్ ఫతే ఆలీ ఖాన్ జడ్జీలు. అభిగ్యాన్ దాస్ పాల్గొన్నప్పుడు సోను నిగం జడ్జ్ ఆ ప్రోగ్రాంలో. అభిగ్యాన్ తల్లితండ్రులతో కనీసం పది ఎపిసోడ్ల ఇంటరేక్షన్ ఉండింది. ఇప్పుడు, ఎలా పాడేడు మీవాడు అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంది మా వాడు ఇలా స్టేజీఎక్కి పాట్టం అని కంటినీరు పెట్టుకు చెప్పారు. జడ్జీలు జాలిగా చూసారు. ఎవరూ ఏం మాట్లాళ్ళేదు. మీరు పలానా అని. సరే అది బిజినెస్ అని కనీస వీక్షకుడికి అర్ధం అయ్యింది. నాకైతే ఏంటీ గోల అనిపించింది.
చక్కగా చదుకుంటూ ఆడుకుంటూ పాడుకునే పిల్లల్ని ఇలా దేశస్థాయి స్టేజీమీదకి లాక్కొచ్చి, ఏం సాధిద్దామనీ అనిపించింది.
సరే అదోఎత్తైతే -
పై ప్రోగ్రాముల్లాంటి వాటికి జరిగే ఆడిషన్స్. వార్నాయనో కోపంతో భగ భగ లాడాను.
పదిహేనేళ్ళ లోపు పిల్లలు పాట్టానికొచ్చి, సరిగ్గా పాళ్ళేక, లేక సెలక్షన్ కమిటీ బిజినెస్ రూల్స్ ఫెయిల్ అయి బయటకొచ్చి, వెక్కి వెక్కి ఏడవటం. ఏట్రా అంటే మానాన్న అమ్మాల కన్న కలలను వమ్ము చేసానని ఒకడు. మా నాన్నాఅమ్మా ల కోరిక తీర్చలేపోయా అని ఇంకొకడు. ఇలా.
ఏం నాన్నా అమ్మలు వీళ్ళూ? నాకర్థంకాలా.
ఏందుకీ గుర్తింపు కోసం పాకులాట?
ఎందుకీ పరుగు?
ఏం సాధిద్దామనీ?

ఇలా తమ పిల్లలను వేధిస్తున్న తల్లితండ్రులపై ఎవ్వరూ ఏ రకంగానూ చర్య తీస్కోకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
ఇక పెద్ద పిల్లలను తీస్కుంటే [అప్పర్ టీనేజ్ లేక అడల్ట్స్] - ఇలాంటి రియాలిటీ షోలలో వచ్చే పెద్ద పిల్లకాయలు కూడా భోరున ఏడవటం నాకు ఆశ్చర్యంగానే కాదు అసహ్యంగా కూడా ఉంది.
ప్రతీ చిన్నవాటికి భోరున ఏడవటం అనేది బహుశా సింపతీకోసం అయిఉండొచ్చు, కానీ దానికీ మరో కోణం ఉందా అనిపించింది.
నా చిన్న తనంలో మానాయన ఎంత ఛండాశాసనుడైనా నాకొక మిత్రుడిలా ఉండేవాడు. అన్చెప్పి ప్రతీ అడ్డమైన ఆలోచన్నీ పంచుకునే వాణ్ణి కాకపోయినా, మానాయన అనే ఓ భావన ఉండేది మనస్సులో. అలానే ఆయనకూడా తనకి ఉన్న చిన్న ప్రపంచంలో కుటుంబానికీ, కుటుంబ అవసరాలకీ వీటికే తన జీవితాన్ని ధారపోసాడు. దానివల్ల ఓ ఫ్యామిలీ, బాండేజ్ గట్రా, ఏర్పడ్డాయి. ఇలాంటివాటి వల్ల ఓ సెక్యూర్ ఫీలింగ్ కలిగినట్టే అని అప్పట్లో అర్థంకాకపోయినా ఇప్పుడు తెలుస్తోంది. అంతేకాక అప్పటి సామాజిక ఆర్ధిక పరీస్థితులు కూడా మరీ ఇప్పటంతటి హైప్ తో కూడుకున్నవి కావు. అందువల్ల *ఓ గుర్తింపు* అని వెంపర్లాడేవాళ్ళు కాదు జనాలు. ఒకవేళ వెంపర్లాడినా ఉట్టికెగరినిచ్చేవాళ్ళే కానీ ఆకాశానికి ఎగరనిచ్చేవాళ్ళు కాదు, అలా ఎగరాల్సిన అవసరం కూడా లేదు ఆ నాడు. దాంతో, మానసికంగా గట్టిగా అయినట్టే అని ఇప్పుడర్ధం అవుతోంది నాకు. నా చిన్నప్పుడు తాలూకా స్థాయి కాదు మా ఊరి స్థాయిలో జరిగిన పోటీలే అతితక్కువ. అవీ స్పోర్ట్స్ లో మాత్రమే లేక క్విజ్లో లేక వకృత్వ పోటీలో. అవీ పది పన్నెండేళ్ళ లోపునవారికి కాదు. కొంచెం పెద్ద పిల్లలకే. తొమ్మిదో పదో చదివేవాళ్ళకి. నాకు గుర్తుండి, మా బళ్ళో జిల్లాస్థాయి ఆటల పోటీలు, అంతర్జిల్లా ఆటల పోటీలు జరిగాయి. కడప జిల్లానుండి ఓ టీం హాకీ ఆడారు గుంటూరు జిల్లా తో.

ఇప్పుడు తల్లితండ్రులూ ఏడుస్తున్నారు ప్రతీదానికి, పిల్లలూ ఏడుస్తున్నారు ప్రతీ చిన్నదానికి. అలానే ఉన్నపళంగా ఆకాశానికి ఎగరాలనుకుంటున్నారు, ఎగరమంటున్నారు తల్లితండ్రులు, మా దగ్గరకు రండి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాం మేమే ఎగిరిస్తాం మీ పిల్లలను అంటున్నాయి టీవీ చానల్స్.
ఇది ఎంతవరకూ సమంజసం. ఒకటి నుండి పదో మెట్టుకి ఒకేసారి దూకించటం ఎంతవరకూ ఆరోగ్యకరం? సో కాల్డ్ మానవహక్కులు గట్రా వీటిని ఖండించవేం.

పోయినవారం ఈ శ్యామంతన్ దాస్ గాడు ఎలిమినేట్ అయ్యాడు. పీడా పోయింది. వాళ్ళ అమ్మ, ఆమె ముఖం చూస్తే నాకు వాంతి వచ్చింది. ఆమె ఒరేయ్ సన్నాసి నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదరా, రేపొద్దున్న నువ్వు లచ్చలకు లచ్చలు తెచ్చి కుమ్మరిస్తావని కలలు కన్నా కదరా ఎదవా అన్నట్టు ముఖంపెట్టి వలవలా ఏడ్చింది.

Oct 4, 2010

పిల్లల్లో ఆలోచనాత్మకత, సృజనాత్మకత, పరిశీలనాత్మకత

ఈనాటి చదువుల మీదా, విద్యా అవసరాల మీదా, విద్యా సంస్థల మీదా, విద్య తీరుతెన్నుల మీద ఇప్పటికే అనేకానేక గొంతులు అనేకానేక టపాలు చూసాం, చూస్తూనే ఉంటాం, చదూతూనే ఉంటాం. ఐతే, అవి మరుక్షణం మహా అయితే స్మృతిపథంలోకి వెళ్తాయి. అంతకన్నా పెద్ద జరిగేదేంలేదు. పిల్లల్లో ఆలోచనా స్పూర్తిని, పరిశీలనాత్మకత పెంపొందించాలంటే ఒక్క బడే సరిపోదు. పుస్తకాల్లో ఉన్న విజ్ఞానం మాత్రమే సరిపోదు. వారిలోకి ఎగబాకేలా వారి మనుస్సుకి హత్తుకునేలా, వారిని పరిశీలన పరిశోధన వైపుకి అడుగుడు వేయించేలా ఒక వేదిక కావాలి. ఆ వేదిక పిల్లలున్న సమాజానికి అనుసంధానంగా ఉండాలి. ఆ వేదిక పిల్లల్కు అనుదినం స్పూర్తిదాయకంగా ఉండలి. వారికి అతి చేరువగా ఉండాలి.

నిన్న పిల్లాజెల్లాలతో మా ఊరి లైబ్రరీకి వెళ్ళా. ఎప్పట్లానే రిటర్నింగు పుస్తకాలు ఇచ్చేసి, కొత్తవి తీస్కుందామని పిల్లల విభాగంవైపుకి అడుగులేసాం. దారిపొడవునా కొత్త కొత్త బొమ్మలు గట్రా పెట్టున్నాయి. హడావిడిగా ఉంది. చాలా మంది పిల్లలు, తల్లులూ వచ్చారు. అక్కడక్కడా బల్లలు వేసి ఉన్నాయి. ఏవేవో అమరుస్తున్నారు వాటిపై హడావిడిగా, పిల్లలు తీవ్రమైన ఏకాగ్రతతో. పిల్లల విభాగంలోకి వెళ్ళాం. అక్కడా అదే తంతు. తను సూరిగాణ్ణి వెంటబెట్టుకుని లెవల్ త్రీ రీడింగ్ పుస్తకాల అరలవైపుకి వెళ్ళింది. నేను పిల్లను తీస్కుని చేపెల పెట్టెవైపుకు వెళ్ళా. పిల్ల చేపలను జూసి కేరింతలు కొడుతోంది. నేను అటు పక్కగా వేసిన బల్ల దగ్గర జరుగుతున్న తంతుని గమనిస్తున్నా.

ఒక తల్లి, తన ఇద్దరు పిల్లలతో ఎదో సర్దుతూ సర్దిస్తోంది. ప్రజెంటేషన్ అట్టలు పెడుతున్నారు.
From library

పెద్దమ్మాయికి బహుశా ౧౨-౧౪ వయసు ఉండవచ్చు. చిన్నపిల్లకి ౧౦ అలా ఉండుండవచ్చు. నాలోని బ్లాగరు, సమాచార హరుడు ఊర్కోడుగా, వెళ్ళి గెలికా. యాండీ, ఏం జరిగుతోందిక్కడా అని. చిన్నపిల్ల అనర్గళంగా ఓ ఉపన్యాసం ఇచ్చింది. అర్థంకాలేదు.
From library
తల్లి వచ్చి చెప్పుకొచ్చింది. వాళ్ళది ఒక ఆర్గనైజేషన్ అట. దానిపేరు ఫోర్-ఎచ్ అట.

4-H Mission
4-H empowers youth to reach their full potential, working and learning in partnership with caring adults. 

4-H Vision
A world in which youth and adults learn, grow and work together as catalysts for positive change.

ఒక ఇదీ వాళ్ళ మోటో అట.

నాకర్థం అయ్యిందేంటంటే పిల్లల్లో ఆలోచనా శక్తిని జ్ఞాన్నీ పెంపొందించేట్లు చేయటం వీరి ముఖ్య ఉద్దేశం అని.

ఆ పిల్ల చక్కగా ఒక అట్టమీద ఎదో రాసుకొచ్చింది. ఎదోకటి. దాని గురించి చిన్నపిల్లలకు చెప్పటం. ఆ ఏదోకటి ఎలా? సమాజం, తను చూసేది, తను గమనించేది, ఏదోక సమాచారం. దాన్ని ఒక ప్రాజెక్టులాగా తీర్చిదిద్దగలిగేందుకు అవసరమైయ్యే శక్తి తల్లితండ్రులిస్తే, దాన్ని ముందుకుతీసుకెళ్ళే స్థోమతని ౪-ఎచ్ ఇస్తోంది. ఆ తల్లిని అడిగాను. మీరేమన్నా ఒక బడిని రిప్రజెంటు చేస్తున్నారా అని. లేదు అంది. మరి ఫండ్స్ ఎలా అన్నా? ౪-ఎచ్ ఇస్తుంది అంది. మరి ప్రాజెక్టులు ఎవరు ఇస్తారూ అన్నా. మీటింగ్స్ ఉంటాయట. ప్రతీ వారమో ఏదోకరోజున. ఇది జాతీయ స్థాయి ఆర్గనైజేషనట. లోకల్ విభాగం ఒక కౌంటీ స్థాయిలో ఉంటుందట. లోకల్గా మీటింగ్స్ జరుగుతాయట. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారట. అనేకానేక విభాగాల్లో పిల్లలకు స్పూర్తినిస్తారట. ఫటాగ్రఫి, రిసైక్లింగ్, ఫుడ్, న్యూట్రిషన్, సైన్స్, ఇలా ఏదైనా.

వాళ్ళ వెబ్సైట్లో వారి గురించిన ఒక చిన్న వాక్యం -

Preparing young people to make a positive impact in their communities and the world.

వారి వెబ్సైట్

http://www.4-h.org

ఆ బల్ల దగ్గరకి అనఘ వెళ్ళింది. తనకి క్రేయాన్స్, డిస్నీ ప్రిన్స్ ఇచ్చారు రంగులెయ్యమని. పిల్ల మహదానందంగా తీస్కుని కూర్చుంది.

From library

ఇక సూరిగాడు వచ్చాడు. ఆడికి టాయ్‌స్టోరి పజిల్ ఈస్ ఇచ్చి రంగులేసి పజిల్స్ పెట్టు అని చెప్పారు.

From library
అట్లా వాళ్ళు బల్ల తెరిచిన ఐదు నిమిషాల్లో పది-పదిహేనుమంది గుమిగూడారు.

నాకు ఎప్పటినుండో ఒక ఆలోచన బుఱ్ఱలో ఉంది. అఫ్‌కోర్స్ నిద్రావస్థలోకి వెళ్ళిందనుకోండి. అది, భారతావనిలో పిల్లలకి రిసైకిల్ అనేదానిపై అవగాహన రావాలి. దానికి సంబంధించిన స్పూర్తిని వారిలో కలుగజెయాలంటే వారినే ఇన్వాల్వ్ చేస్తూ ఒక కాం౨పైన్ తయ్యారు జేయాలి. పై పద్ధతి ద్వారా అది సాధ్యమే అనిపిస్తుంది. కానీ, ఇక్కడి పిల్లలకు గ్రంధాలయం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అక్కడి పిల్లలకు ఆఫ్ ది స్కూల్ లైఫ్ లేదు. ఒక మీటింగ్ ప్లేస్ లేదు. అథవా ఉన్న, వారి జీవితాల్లో బడి అయ్యాక ఉన్న సమయం ఎంత? బడికి వెళ్ళటం వచ్చి ఎల్.కే.జి నుంచే ఐ.ఐ.టి కోచింగులు, లేక హోంవర్కులు. తల్లితండ్రులు అనుకుంటే ఈ పరీస్థితిలో మార్పు తీసుకురాగలరు. పిల్లలకి ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వండి. వాళ్ళకి చుట్టుపక్కల ఏంజరుగుతుందో చూపండి. 

దారిపొడవునా ఉన్న, అక్కడక్కడా డిస్ప్లేలలో ఉన్న కొన్ని బొమ్మలను ఇక్కడ పెడుతున్నా

గెలికితే ఏటౌద్దీ?

ఓ ఇదేం పెద్ద ప్రశ్నకాదు. గిలికితే ఏటౌద్దీ? రెండు విధాలు -
తెలిసి గెలికవా?
తెలియక గెలికావా?
అబ్బే అట్టా కాదబ్బా, తెల్సీ తెలియకుండా కూడా గెలకచ్చూ అన్నాడంట నాబోటిగాడు.
ఏంకత అంటే, పోయినేడాది మాయమ్మకు ఓ ల్యాపీ అంపించా. ఎచ్.పి పవీలియన్, డివి-౭ సిరీస్. నాలుగు జిబి రా౨ము..గట్రా.
ఇంటరునెట్టుకి తగిలించింది మితృల సహాయంతో...మొదటినాల్రోజులు బెమ్మానంగా పని సేసింది. దెన్ స్టార్ట్స్ స్ట్రగుల్. ఏందివయ్యా అంటే క్రా౨ష్ అవుతున్నది పావుగంట-అఱగంట కాంగనే.
మొన్నీమద్దిన అన్నయ్య గుంటూరెళ్ళినప్పుడు కొత్తదెత్తుకెళ్ళి దాన్ని తెచ్చి నా సేతిలో పెట్టాడు.
అవున్రొరేయ్ ఎందుకు క్రాషౌతున్నదంటా అన్నాడు అన్న. ఏమోరా అన్నా. పంఖా పని సేస్తల్లేదేమో దుమ్మో మట్టో దారవో వడ్డం పడుండిద్దేమో సూద్దామా అన్నాడు జంకుతా. మనం బుస్సున పైకిలేసి, స్క్రూడ్రైవర్ పట్రా అన్నా. జంకుతా జంకుత తెచ్చాడు. లా౨ప్టాప్ సెడగొట్టం అనే ఓ బృహత్తర కార్యక్రమానికి తెరదీసాం. మొత్తానికి ఊడదీసాం. పంఖా పనిసేయట్లేదని అరదం అయింది. సరే బిగించేద్దాం పంఖా కొని తర్వాత ఏయొచ్చు అనుకున్నాం. తిరిగి పెడతా ఉంటే జిఫ్ కనెక్టర్ ఊడిపోయింది. హమ్మనీ ఎన్కమ్మ నుకున్నాం. ఆయాల బీరుకొట్టి తొంగున్నాం.

ఇది తెరతీయటం పేర్లుపట్టం పటుకే అని తెలియజేస్కుంటన్నా. ఇప్పుడు వసలు కతలోకొస్తే -
రెండువారాలక్రితం
శనోరం మద్దేనం
జిఫ్ కనెక్టర్ని సోల్డరింగ్ గన్ తో అంటిద్దాం అనుకున్నా. మళ్ళీ ల్యాపీని ఊడదీసా....సోల్డర్ సేయటానికి రాలా. మదర్బోర్డ్ పైన జిఫ్ కనెక్టర్ పెట్టడానికి టైనీటీనీగా ఉండి, నాకు రాలేదు. సరే బంకపెట్టి అతికిద్దాం అని ప్రయత్నించా. అహా!! అతుక్కుందిగానీ, కనెక్టివిటీ పోయింది.

ఇంతకీ జిఫ్ కనెక్టర్ అంటే ఏంటీ అంటారా?
ల్యాపీలో కీబోర్డ్, డిస్ప్లే, పవర్, ఇత్యాదివి మదర్బోర్డ్ కి కనెక్ట్ చేసే కార్డ్స్ కొన్నుంటాయి. నేచెప్పేది పవర్/ఆడియో కంట్రోల్స్ ని మదరబోర్డ్ కి కనెక్టు చేసే కనెక్టర్ గురించి. ఇది పోతే పవర్ రాదు.

http://en.wikipedia.org/wiki/Zero_Insertion_Force

అదీ కథ....