Aug 25, 2010

అట్టా గుండెలమీనకి తెచ్చుకోకురా నాన్నా

అయ్యో సిన్నా
తప్పురా నాన్నా
అట్టా గుండెలమీనకి తెచ్చుకోకురా నాన్నా
ఇనీ ఇన్నట్టు
సూసీ సూడనట్టు
ఆడీ ఆడనట్టు
ఒదిలెయ్యాల
జాగరత్తరా నాన్నా
అసలే నిన్నగాక మొన్ననే పుట్టిన లేగదూడవిరా నాన్నా
అయ్యో ఎట్టా తట్టుకుంటవో ఏందోరా సోఁవి
నీకు తెల్వదల్లే ఉంది
ఇట్టాంటోళ్ళు నరాల్లోకి అబ్యుదయాన్ని ఎక్కిత్తార్రా నాన్నా
ఇట్టాంటోళ్ళు కళ్ళకి నల్లగుడ్డ సుట్టి ఇదే ప్రపన్చఁ అని సూపిత్తార్రా
సీకటితో నిండుకున్న అబ్యుదయం ఎందుకురా సోఁవి
ద్వేషంతో ఊగిసలాడే ఉద్వేగం ఎందుకురా కన్నా
కపటపు సైన్సుకబుర్లు నీకెందుకురా నాన్నా
లోయల్లోకి లాకెళ్ళే (అ)మానవత్వం నెత్తికెత్తుకోకురా సిన్నా
గుడిసేటి గుణం నీక్కాదురా కన్నా
సిన్న గుండెకాయ ఎట్టా తట్టుకునిద్దీరా నాన్నా
ఎక్కువ కష్టపెట్టుకోమాకమ్మా సిన్నోడా
ఆళ్ళంతేరా
కులం కుపాంట్లో అభ్యుదయ గొట్టంపెట్టి ఊది
నివురుని కళ్ళంతా గుప్పిత్తార్రా
నిప్పు రాజేసి ఆళ్ళు సలిమంటేస్కుంటార్రా నాన్నా
మతం సెంచాతో విషం కిరసనాయలు పోస్తరురా సిన్నా
సిన్నోడా
నిప్పు
రగుల్కుంటుంది
ఎట్టా ఓర్సుకుంటావో
జాగ్రత్తరా కన్నా
నిన్ను నమ్ముకుని నోవోళ్ళు నావోళ్ళు సమాజవ్, దేశం ఉందిరా
కళ్ళల్లో ఆశల ఒత్తులేస్కుని
నీబాటకి వెలుగునిస్తున్నార్రా నీ ప్రజలు
మద్దిన ఈ మంటలు
అంటుకుని నిన్ను ఏరే తీరాలకు ఎత్తుకెళ్తే
ఈ ఆశలు మూగబోతైరా కన్నా
ఈ జీవుల జీవితాలు మసకబారుతై
వద్దునాన్నా
పట్టించుకోకు
వద్దేవద్దు

5 comments:

  1. కేక చపట్లు ఈలల్లు.....

    ReplyDelete
  2. మతం సెంచాతో విషం కిరసనాయలు పోస్తరురా సిన్నా
    సిన్నోడా
    నిప్పు
    రగుల్కుంటుంది
    ఎట్టా ఓర్సుకుంటావో

    ReplyDelete
  3. "కపటపు సైన్సుకబుర్లు నీకెందుకురా నాన్నా"..............ఈ ముక్క వచ్చేవరకు విషయమేమిటో అర్థం కాలేదు....భలే రాసారు

    ReplyDelete
  4. ఆలోచింపజేసేదిగా ఉంది...,ఎవరిని ఉద్దేశించి రాసారో తెలియడంలేదు

    ReplyDelete