Aug 27, 2010

రిక్రూట్‌మెంట్ ప్రాసెస్

ప్రైవేటు ఇండస్ట్రీలో కులాల కుమ్ములాటంటయ్యా
అవును
నేను ఇంటర్వ్యూ చేసేప్పుడు *బాడీ లేంగ్వేజ్* చూస్తా. చేయి భుజంకన్నా పైకి ఎత్తితే కమ్మ అని, కుడు చూపుడువేలు టింగ్ టాంగ్ అంటే రెడ్డి అని, ముక్కు ఎడమవైపుకి తిప్పు కుడికి కన్ను చూస్తే బేపనోళ్ళు అని నాకు బాగా తెలుసు. కొందరు ఉత్తి పుణ్యానికి ఏడుస్తుంటారు, పక్కనోళ్ళపై పడి, లేక సేతకాక, అట్టాంటోళ్ళు వేరే కులపోళ్ళని నాకు తెలుసు. ముందుగా కార్పోరేట్ ట్రైనింగులో బాగా నేర్పిస్తారు ఇవన్నీ. బాడీలేంగ్వేజ్ మీద రీసెర్చ్ చేసి ఓ ఆట ఆడిన పంతుళ్ళు కొందర్ని రిక్రూట్ చేస్కుంటారు. వారికి ఇదేపని. సెమినార్స్ పెట్టి, ఎవరెవరి బాడీలేంగ్వేజ్ ఏంటి ఏకరువు పెట్టటమే వారి ముఖ్య ఉద్యోగం.
ఇక దళితులు లేక వుత్తులు మత్తులు లోనికి రాకుండా హెచ్‌ఆర్లు ముందుగానే ఫిల్టర్ చేస్తారు రెజూమేలను బయోడేటాలను. దానికీ వారికి ముందుగానే ట్రైనింగు ఉంటుంది. ప్రత్యేకంగా హెచ్‌ఆర్ లను హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక వారం ఉండేట్టు చేస్తారు. తెలుగు వారి ఇంటిపేర్లను బట్టి వెంటనే క్యాండిడేటు కులం ఏది అని టకా మని చెప్పేల చేస్తారు. దానికోసం సెన్సెస్ చారి సహాయం తీస్కుంటారు. ఇంటిపేర్ల ట్రెండ్స్ ఎలా ఉంటాయి. ఏఏ ఊళ్ళలో ఏఏకులపు వాళ్ళు ఉంటారు ఇలా. అలానే తమిళంవాళ్ళ ఇంటిపేర్ల ట్రెండ్ పై ప్రత్యేకమైన కోర్స్ ఉంటుందట.
ఐతేపాపం ఒక్కోసారి తెలియక తప్పులు చేస్తుంటారట. ఉదాహరణకి
మా పెద్దమ్మా వాళ్ళా ఇంటిపేరు మందపాటి. మా పాపారావు ఇంటిపేరూ మందపాటి.
మా మాతామహుల ఇంటిపేరు రావెల, ఇంకెందుకులే గాని. ఇలా ఊళ్ళపేర్లు ఇంటిపేర్లుగా ఉన్నవారిని ఎలా ఫిల్టర్ చెయ్యాలో పాపం అర్థం కావట్లేదట చాలా మందికి.
అలానే తమిళవాళ్ళైతే రామరాజు గోపరాజు ఇలా ఉండవుగా వారి ఇంటిపేర్లు. తండ్రిపేరు కొడుక్కి సర్నేం అవుతుంది. మరి ఎలా నేర్పిస్తున్నారోగాని మొత్తానికి కేవలం బ్రాహ్మణికల్ ఏటిట్యూడ్ ఉన్నవారినే తీస్కుంటున్నారట.
కేవలం అయ్యంగార్స్‌ని మాత్రమే తీస్కోవాలని చూస్తారట తమిళనాటనుండి. అయ్యర్స్ అలుగుతున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

దానిక్కూడా ఓ స్క్రీన్ టెస్టులు ఉన్నాయట. రాత పరీక్షలన్నమాట. బ్రాహ్మణికల్ ఏటిట్యూడ్‌ని పరీక్షిస్తారట.


కాబట్టి అదయ్యా సంగతి. దేశంలో ఇంతటి భావ దారిద్ర్యం ఉంది. ఎట్లా? ఎలాంటి మహానుహావులు మనల్ని కాపాడగలుగుతారూ? మీకేమైనా ఐడియా ఉంటే కాస చెప్పరూ?

13 comments:

 1. చాల విషయాలు చెప్పారు. బాగా రెఅసెఅర్చ చేసరనమాట ప్రజలు.

  ReplyDelete
 2. భాస్కరన్నా .. నువ్వు సూపర్ అన్నా

  ReplyDelete
 3. @KumarN ఇది నిజమని నమ్మాలి మరి. HCU లో ఈ బ్లాగర్ లాంటి వాళ్లు ఈ విషయం మీద ట్రైనింగ్ తీసుకొంటూ ఉంటె కిటికీ లో నుండి తొంగి చూసి కావాలంటే ఒట్టు పెట్టి చెప్పేవాళ్లు, దాని మీద టపాలు వేసే వాళ్లు, అది నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు మరి :)) మీరు చదవలేదా!!?

  ReplyDelete
 4. శేషుకుమార్ ఇంగువ - ధన్యవాదాలు
  మంచు భయ్యా :):)
  కృష్ణప్రియ గారూ - నమస్తే. మీక్కూడా ఓ రెండు స్మైలీలు
  హరే :):)
  నాగార్జున - ధన్యవాదః
  కుమార్‌ఎన్ - ఏటి బ్రదర్ మీరు. మీకు తెలియకనే అడుగుతున్యారా?
  కృష్ణ భయ్యా - నాలాంటివారు ట్రైనింగు తీస్కుంటుంటే కిటికీలోంచి తొంగిచూసే వాళ్ళు చాలామందే ఉన్నారు :):)

  ReplyDelete
 5. అసలు భయం లేకుండా పోతుంది మీకు ఉండండి రెండు , మోడో , నాలుగో అబ్బ ఎన్నో కొన్ని కేసులు వేస్తే గాని లాభం లేదు .

  ReplyDelete
 6. ఓహ్..ఇదేదో "జరిగిన కథ" చదవకుండా సీరియల్ మొదలెట్టినట్లున్నాను నేను.
  అదేదో చదివే వస్తాన్లెండి, ఈ మధ్య కాలంలో కొంత మంది చెయ్యి తిరిగిన రచయితల సీరియల్స్ చదవటం మానేసే సరికనుకుంటా, తొందరగా మీర్రాసింది సరిగ్గా అర్ధం కాక ఆశ్చర్యం వేసింది.

  ReplyDelete
 7. ఈ కులగజ్జిగాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చే మానసిక వైద్యశాలల అవసరం చాలాఉంది .కాస్త ఎన్నారైలే పూనుకోవాలి ఈపనికి

  ReplyDelete