టూకీగా నిన్న మొన్నటి ఈనాడు పత్రికవారి వార్తా నివేదిక ఇదీ -
టంగుటూరికి ఘనంగా నివాళులు అర్పించిన రోశయ్య
హైదరాబాద్: టంగుటూరి ప్రకాశం పంతులు 139వ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రోశయ్య ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ బండ కార్తీకరెడ్డి పాల్గొని టంగుటూరికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఘనంగా నివాళులు అర్పించటం అంటే ఏంటో నాకర్థం కాల్యా. ఘనంగా అంటే ఘనపదార్థంగా మారి నివాళులు అరిపించారనా? పాత్రికేయులకే తెలియాలి ఘనంగా నివాళులుర్పించటం అంటే ఏంటో.
వ్యభిచార గృహంపై దాడి... సహాయనటి అరెస్టు
హైదరాబాద్: కుందన్‌బాగ్‌లోని ఓ వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సినీ సహాయనటి సైరాభాను, ఉజ్బెకిస్థాన్ యువతి సహా మరో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఉజ్బెకిస్థాన్ యువతి సబీనాగా గుర్తించారు. సహాయనటీమణులు జ్యోతిలక్ష్మి, నీలమణి కూడా అరెస్టయినవారిలో ఉన్నారు.
అబ్బా ఛా!! ఏకే ఖాన్ భయ్యా, లెక్కలు కుదర్లేదా ఏందీ?
చైనాలో ఆర్థిక నేరాలకు మరణ శిక్ష రద్దు!
బీజింగ్: ఏటా అత్యధిక సంఖ్యలో మరణ శిక్షలు అమలు చేసే కమ్యూనిస్టు చైనా ఇక వీటి సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. మరణ దండన వేసే నేరాల జాబితాలోంచి కొన్నింటిని తొలగించనుంది. ఇకపై ఆర్థిక నేరాలకు పాల్పడే వారికి దీనిని విధించకూడదని నిర్ణయించింది.
ఇక రాయపాటి సోదరులు హేప్పీగా చైనా వెళ్ళవచ్చు.
డ్రగ్స్ వ్యాపారంలో సినీనటులు!
నైజీరియన్లతో నేరుగా ఒప్పందాలు
దక్షిణాఫ్రికా, ముంబయి నుంచి దిగుమతి
డబ్బు కోసం పబ్బుల్లో ప్రత్యేక పార్టీలు
హైదరాబాద్‌లో ఏటా రూ.500 కోట్ల వ్యాపారం
హైదరాబాద్, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాల వ్యవహారం హైదరాబాద్‌లో ప్రకంపనలను సృష్టిస్తోంది. ప్రముఖ హీరోలు, హీరోయిన్లు మాదక ద్రవ్యాల వినియోగదారుల జాబితాలో ఉన్నారని స్వయంగా నగర పోలీసు కమిషనర్ ఏకేఖాన్ వెల్లడించిన గంటల్లోనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హీరోలు, హీరోయిన్లు మత్తుమందులను వాడడమేకాదు.. ఏకంగా వాటి వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఒక ప్రముఖ నటుడు, అవకాశాలు తగ్గిపోయిన మరో హీరో మాదకద్రవ్యాల వ్యాపారులుగా మారినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
డ్రగ్సే ఎందుకు?
సినీపరిశ్రమలో హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల వరకూ వారిదొక ప్రత్యేక ప్రపంచం. గ్లామర్, ప్రజాదరణకు పర్యాయపదంగా మారిన ఈ రంగంలో చాలామంది విలువలకు కట్టుబడి ఉన్నా.. యువతరంలో దాదాపు 70% మంది రాత్రుళ్లు పబ్బులకు వెళ్తున్నారు. మరింత మత్తు, కిక్కు కోసం మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు. ముంబయి, చెన్నై నుంచి వచ్చిన మోడళ్లతో మేమూ తక్కువ కాదని నిరూపించుకునేందుకు వీటిని వినియోగిస్తున్నారు.
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేమీ కొత్త విషయం కాదే. డ్రగ్స్ ప్రపంచంలోకి నిన్ననో లేక మొన్ననో రాలేదే. లేక హైద్‌లో డ్రగ్స్ వాడుక క్కూడా కొత్తేమీ కాదే. మరి ఇప్పుడేందబ్బా?
కొన్నిసార్లు కేప్‌టౌన్, డర్బన్‌ల నుంచి నేరుగా ముంబయికి గోప్యంగా దిగుమతి అవుతున్నాయిట.
మరి పోలీసులు దాంట్లో చేతులుపెట్టి హ్యాప్పీగా అందినంత తింటే రేపొద్దున కిళ్ళీషాపుల్లో బాహ్యాటంగానే అమ్ముతారు. ఇక దీనివెనుక చాలా మందే ఉన్నారట. అందరు డబ్బున్న మారాజులట. పలుకుబడి ఉన్నవారట. అందుకే పోలీసులు వెనుకంజ వెస్తున్నారట.
హ్మ్!! మొన్నామధ్య, ఇలియట్ స్పిట్జర్ అని ఓ పెద్దాయన, న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ గా చేసేవాడు. చట్టప్రకారం తప్పులు చెసినవారిపై కఠినంగా ప్రవర్తించాడు. అతను గవర్నర్ గిరీ చేపట్టకమునుపు ఎటార్నీ జెనరల్‌గా ఎనిమిదేళ్ళు గడగడ లాడించాడు. కానీ చివరికి వ్యభిచార నేరంలో ఇరుక్కున్నాడు. పోలీసులు అతనెవరైనా, లెక్క చేయకుండా తమపని తాము చెసారు.
అదీ తేడా.
ఇప్పుడేముంది, ఆ సదరు డ్రగ్స్ సూత్రధారి ఒకవేళ చిక్కేపరీస్థితే వస్తే, ఎవర్నో ఇరికించి వారికి డబ్బో దస్కమో ఇచ్చి హ్యాపీగా మళ్ళీ తన బిగినెస్సు కొనసాగిస్తాడు.
చట్టం డబ్బున్నోడికి చుట్టం. అతను చెప్పినట్టే నడుస్తుంది చట్టం. న్యాయం చట్టానికి తలవంచక తప్పదు.
ఐతే సమస్యేంటంటే ఈ సోకాల్డ్ న్యాయపరంగా నేరస్తులు [చట్టపరంగా కాదు], టీవీలో పొద్దస్తమానం కనిపిస్తారు. స్వాతంత్రదినోత్సవంలో కూడా వీరిదే అప్పర్ హ్యాండ్. వీరే గ్రాండ్ మార్షల్స్, వీరే శుభాకాంక్షలు చెప్పేది. ఏంటీ దుఃస్తితి? ఏంబావుకోవాలని ఈ టీవీవాళ్ళ ఆరాటం? వీళ్ళా సమాజాన్ని ఉద్ధరించే యుగపురుషులు? వీరా నేటి యువతకి ఐడిల్స్?
సినీ పరిశ్రమను టార్గెట్ చేయలేదు: ఏకేఖాన్ హైదరాబాద్, న్యూస్‌టుడే: సినీ పరిశ్రమ మొత్తాన్ని టార్గెట్ చేసుకుని పథకం ప్రకారం తాము దాడులు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఏకేఖాన్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. సినిమా తారలంటే తమకు వ్యక్తిగత కక్ష లేదన్నారు. అన్ని రంగాల్లో మంచీ చెడూ ఉన్నట్టే సినిమారంగంలోనూ ఉన్నారని, నేరాలకు పాల్పడుతున్న వారిపైనే దృష్టి సారించామని చెప్పారు. వ్యభిచార నేరం కింద అరెస్టయిన జ్యోతి, సైరాబానులను తాము ట్రాప్ చేయలేదని, వారు నేరం చేస్తున్నట్లు అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని వివరించారు. మాదకద్రవ్యాల విక్రయంపై 4 కేసులు నమోదు చేశామని, వాటిని త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు సీసీఎస్‌కు బదిలీ చేస్తున్నామని ఖాన్ చెప్పారు. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వినియోగం అనూహ్యంగా పెరిగినందువల్లే కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. కొందరు సినీ నటులతో పాటు పారిశ్రామిక, ఇతర రంగాలకు చెందినవారు ఎక్కువగా వీటిని వినియోగిస్తూ కొత్తవారికి అలవాటు చేస్తున్నందుకే దాడులు తీవ్రతరం చేశామన్నారు.
సినీమ తారలంటే ఖాన్ గారికి ప్రత్యెక కక్షలేదట. ఇప్పటికి ఎన్నిసార్లు ఎందరు చిన్నాపెద్దా సినీతారలను వ్యభిచారం నేరం క్రింద అరెస్టు చేసారోగాని, వాళ్ళందరూ హ్యాప్పీగా బయటకొచ్చి మళ్ళీ నటిస్తున్నారు, నటన ముసుగులో ఏంమేంచేస్తున్నరో పైవాడికెరుక.
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వినియోగం అనూహ్యంగా పెరిగినందువల్లే కఠినంగా వ్యవహరిస్తున్నారట, అనూహ్యంగా కాకుండా కొంచెం పెరిగిఉంటే పెద్ద పట్టించుకునే వారే కాదట.
Subscribe to:
Post Comments (Atom)
తంబీ, నీకూ నాకూ సామాన్య జనాలకి అర్ధంకాని ఇసయాలు శానా ఉండైలే. ఆటిల్లో పత్రికల పరిభాష కూడా ఓటి! లైట్ తీస్కో!:)
ReplyDelete