అయ్యో సిన్నా
తప్పురా నాన్నా
అట్టా గుండెలమీనకి తెచ్చుకోకురా నాన్నా
ఇనీ ఇన్నట్టు
సూసీ సూడనట్టు
ఆడీ ఆడనట్టు
ఒదిలెయ్యాల
జాగరత్తరా నాన్నా
అసలే నిన్నగాక మొన్ననే పుట్టిన లేగదూడవిరా నాన్నా
అయ్యో ఎట్టా తట్టుకుంటవో ఏందోరా సోఁవి
నీకు తెల్వదల్లే ఉంది
ఇట్టాంటోళ్ళు నరాల్లోకి అబ్యుదయాన్ని ఎక్కిత్తార్రా నాన్నా
ఇట్టాంటోళ్ళు కళ్ళకి నల్లగుడ్డ సుట్టి ఇదే ప్రపన్చఁ అని సూపిత్తార్రా
సీకటితో నిండుకున్న అబ్యుదయం ఎందుకురా సోఁవి
ద్వేషంతో ఊగిసలాడే ఉద్వేగం ఎందుకురా కన్నా
కపటపు సైన్సుకబుర్లు నీకెందుకురా నాన్నా
లోయల్లోకి లాకెళ్ళే (అ)మానవత్వం నెత్తికెత్తుకోకురా సిన్నా
గుడిసేటి గుణం నీక్కాదురా కన్నా
సిన్న గుండెకాయ ఎట్టా తట్టుకునిద్దీరా నాన్నా
ఎక్కువ కష్టపెట్టుకోమాకమ్మా సిన్నోడా
ఆళ్ళంతేరా
కులం కుపాంట్లో అభ్యుదయ గొట్టంపెట్టి ఊది
నివురుని కళ్ళంతా గుప్పిత్తార్రా
నిప్పు రాజేసి ఆళ్ళు సలిమంటేస్కుంటార్రా నాన్నా
మతం సెంచాతో విషం కిరసనాయలు పోస్తరురా సిన్నా
సిన్నోడా
నిప్పు
రగుల్కుంటుంది
ఎట్టా ఓర్సుకుంటావో
జాగ్రత్తరా కన్నా
నిన్ను నమ్ముకుని నోవోళ్ళు నావోళ్ళు సమాజవ్, దేశం ఉందిరా
కళ్ళల్లో ఆశల ఒత్తులేస్కుని
నీబాటకి వెలుగునిస్తున్నార్రా నీ ప్రజలు
మద్దిన ఈ మంటలు
అంటుకుని నిన్ను ఏరే తీరాలకు ఎత్తుకెళ్తే
ఈ ఆశలు మూగబోతైరా కన్నా
ఈ జీవుల జీవితాలు మసకబారుతై
వద్దునాన్నా
పట్టించుకోకు
వద్దేవద్దు
Subscribe to:
Post Comments (Atom)
కేక చపట్లు ఈలల్లు.....
ReplyDeletehmm..
ReplyDeleteమతం సెంచాతో విషం కిరసనాయలు పోస్తరురా సిన్నా
ReplyDeleteసిన్నోడా
నిప్పు
రగుల్కుంటుంది
ఎట్టా ఓర్సుకుంటావో
"కపటపు సైన్సుకబుర్లు నీకెందుకురా నాన్నా"..............ఈ ముక్క వచ్చేవరకు విషయమేమిటో అర్థం కాలేదు....భలే రాసారు
ReplyDeleteఆలోచింపజేసేదిగా ఉంది...,ఎవరిని ఉద్దేశించి రాసారో తెలియడంలేదు
ReplyDelete