లొంగిపోతున్న అబలలు
పేట్రేగిపోతున్న మగ మృగాలు
తమపని తాము చేసుకు వెళ్ళే గ్యాడ్జెట్లు (ఎలక్ట్రానిక్ పరికరాలు)
వీడియోలతో బెదిరించే రాక్షసులు
కోరినప్పుడల్లా కోరిక తీర్చమనే ద్రోహులు
ఉఫున పోయే ప్రాణాలు
మౌనంవహించే చట్టాలు
ఇదేనా నా భారతం?
నాది కర్మ భూమని చెప్పగలనా ఇక?
నాది పుణ్యభూమని చాటాగలనా ఇక?
నాది వేదాలకు పుట్టినిల్లని చెప్పుకోగలనా ఇక?
నా గుండెమీద చేయివేసుకు నిద్రపోగలనా ఇక?
ఫ్లిప్ సైడ్-
ఇలాంటి వార్తలు అలా వస్తాయ్
ఇలా సదూతాం
వార్తాపత్రికని మడుస్తాం
కాయితకాల బీరువాలోకి చేరుస్తాం
ఏమీ ఎరగనట్టు మర్రోజులోకి జారుకుంటాం
మళ్ళీ వార్తాపత్రిక వస్తుంది
కొత్త డేటుతో
కొత్త వార్తతో
మళ్ళీ నరాలు పోటెత్తుతాయ్
మానవాత్వాన్ని ప్రశ్నిస్తాయ్
గోడలు కదలిక లేకుండా ఆ అరుపుల్ని మింగుతాయ్
మళ్ళీ వార్తాపత్రిక వస్తుంది
కొత్త డేటుతో
కొత్త వార్తతో
పాత వార్తకి పొడిగింపు ఊసూ ఉండదెక్కడా
కొత్త డేటులో
మన మనసులో.........................................
నిజమే :-(
ReplyDeleteSo true..
ReplyDeleteSad but true..
ReplyDeleteఏమిటి ఘోరం? - హత్యనా లేక సూట్ కేసులో ప్యాకింగ్ చేయడమా?
ReplyDeleteఇది వరలో ఒకామె హైద్రాబాద్లో ముక్కలు చేసి వంటింట్లో ఫ్రిజ్ లో చక్కగా సర్దేసింది. అదీ అలాంటిదే.
ఇంతకు మునుపు ట్రంకుపెట్టెల్లో పెట్టి రైళ్ళలో పెట్టి వెళ్ళేవారు ఇప్పుడు సూట్‍కేసుల్లో బస్టాండ్‍లలో అంతే తేడా.హమారా భారత్ మహాన్.
ReplyDelete