May 26, 2010

ఒక్కోసారి

ఒక్కోసారి ఒంటరితనం
అవసరం

ఒక్కోసారి ఒంటరితనం
అదృష్టం

ఒక్కోసారి ఒంటరితనం
తనకి తాను విధించుకున్న శిక్ష

ఒక్కోసారి ఒంటరితనం
విధి విధించే శిక్ష

ఒక్కోసారి ఒంటరితనం
శాపం

మౌనంగా శిక్షని అనుభవించు, నీ వాళ్ళకి ఆ ఛాయలను తెలియనీయకు.

May 24, 2010

తెర వెనుక కథలు కొన్ని

నేనీ ఊరు వచ్చిన కొత్తల్లో, వచ్చిన మరుసటివారాంతానికి గుడికెళ్ళా. వారాంతంకావటంతో మధ్యాహ్నం కాస్త రద్దీ తక్కువగా ఉంటం వల్ల, శ్రీ శ్రీనివాసాచార్యులవారితో సంభాషించా. మనకి, ఎవరైన పొరపాటున చేయెత్తితే చాలు కదా, మట్టాటమే. మాటలమధ్యలో అబ్బాయి ఇలా సుదర్శన యజ్ఞం చేయనున్నాం. నువ్వూ పాల్గొను అన్నారు. దాందేముందీ అన్నాను. అలాక్కాదు అబ్బాయీ, నువ్వూ ఓ ఋత్విక్కులా పాల్గొనాలీ అన్నారు. సరే అన్నాను.
ఈ క్రతువుకి సరిగ్గా నెలముందర నుండి మెయిల్స్ రావటం మొదలైంది. శుక్రవారం సాయంత్రం గుళ్ళో పలానా పాఠం ఉంది తప్పక రావలెను అని. మనం వెళ్ళాలేకపొయ్యాం. అలా జరిగాక, చివరి వారం మాత్రం వెళ్ళా. పంచ సూక్తాలు నేర్పించారు అప్పటికే. శాంతిమంత్రాలు అయ్యాయి. ఉపనిషత్తులు అయ్యాయి. మనం చివరి వరుసలోజేరి మొత్తానికి కొన్ని కొన్ని పట్టగలిగాం. మరే, పల్నాడుకదా మరి.
ఇక ఫ్లిప్ సైడ్ అనగా నాణేనికి రెండోవైపు. కొందరు ఆడవాళ్ళు, గుడిమొత్తం ముగ్గులు పెట్టారు. చక్కగా రంగులతో ఆ రంగవల్లుల్ని అలంకరించారు.
చివరిరోజు మినహాయించి, మిగిలిన తొమ్మిదిరోజులూ, ఋత్విక్కులకే కాకుండా, ప్రేక్షకవీక్షకులందరికీ ఉచితంగా భోజనప్రసాదాదులు అందించారు. సామాన్యమా? రోజుకి కనీసం ముఫైమంది ఋత్విక్కులుంటే, చూడవిచ్చేచిన వారు కనీసం వందమంది. హీనపక్షం రోజుకి రెండువందల మందికి ఉచితంగా అన్నపానీయాలు. ఆదివారం వేంచేసిన జనప్రభంజనం రెండువేలపైమాటే. అంతమందికి భోజనం అందించటం ఒక ఎత్తు. ఆకార్యక్రమాన్ని మేనేజ్ చేయటం ఒక ఎత్తు.

మొట్టమొదటి రోజున విపరీతమైన గాలి. ఎలారా బాబూ అనుకున్నామా. మొత్తానికి పట్టలు పట్టుకుని నిల్చుని కానిచ్చామా. రెండోరోజుకల్లా ఓ మినీ డేరా వేయించారు.
హోమం ఆసాంతం దానిపై ఓకన్ను వేసి ఉంచాలా?
ఇక, ఇవి చూడండి
మొన్నటిపోస్టులో చెప్పినట్టు 100అడుగులు x 100 అడుగులు డేరా వేయటం అంటే మాటలా? అమెరికాలో అంత పెద్ద డేరాలు లేవు. రెంటిని కలిపి వేయించారు. దానికి ఒకతను లీడ్ తీస్కుని, నాలుగు చోట్ల తిరిగి మాంచి కోట్ తెచ్చి, ఓకే చేసి వేయించటం సామాన్యమా?
సరే డేరా వేసినా. రెంటిని కలపటంవల్ల, మధ్యలో జాయింటువద్ద నీరు లోనికి కారుతుందా? అందుకని అక్కడ, ఓ జాయింటు వేయించి, దానికి నీళ్ళు వెళ్ళే ఓ పైపు కట్టించి, ఎంతపెద్ద వాన్న పడ్డా ఆ ఔట్లెట్ ద్వారా నీళ్ళు చుక్క కిందపడకుండా పైపు మార్గం ద్వారా వెళ్ళే ఏర్పాటు చేసారు.
ఇక, పార్కింగ్ - మొత్తం మీద రెండువేల పైచిలుకు జనాలు వచ్చారు. ఎక్కడ పెట్టాలి కార్లు? ఎక్కడో ఓ బళ్ళోనో పార్కులోనో పార్కింగు ఏర్పాటు చేసి బస్సు షెటిల్ పెట్టించారు.
తర్వాత - ఒకతను, దేశం నుండి మల్లెపూలు పంపించాడు. నమ్మగలరా? నీట్ గా ప్యాక్ చేసి పాడు కాకుండా, మల్లెలు పంపించాడు.

మరి ౧౦౮ మంది ఋత్విక్కులండీ. అందరికీ పసుపు పంచెలు పసుపు ఉత్తరీయాలు. వాటిని ఒకతను స్పాన్సర్ చేసాడు.
౧౦౮ ఋత్విక్కులకి నూతన యజ్ఞోపవీతాలు. ఒకతను తెప్పించాడు.

స్రుక్కులు స్రువాలు - ఒక్కో ఋత్విక్కుకు రెండు కావాల్సొస్తాయి. స్రుక్కులు స్రువాల షేపు శాస్త్రోక్తంగా ఐతే ఒకటి గుండ్రంగా చిప్పగంటెలాగా ఉంటే ఇంకోటి నక్షత్రాకారంలో ఉండాలి. అవి ౨౧౬ చేయించాలంటే? వెళ్ళి హోం డిపో లోనో అడిగితే వాడు ఆస్థులు అమ్ముకురండీ అన్నాట్ట. మరెలా? వాల్మార్ట్లో చెక్క చెంచాలు చూసారట. శ్రీ శ్రీనివాసాచార్యులవారు అవి పనికిరావు కానీ ప్రత్యామ్న్యాయం లేదు కాబట్టి తప్పదు అని ఒప్పేస్కున్నారట. సరే, అంతవరకూ బానే ఉంది. మరి 216 కావాలా? వాల్మార్ట్ వాడు, సాధారణంగా మేము నెలకి ఓ పది అమ్ముతామేమో. మీకు ఇన్ని ఎందుకూ అని అడిగాట్ట. మొత్తానికి ఒక వాల్మార్టులో ఊడ్చారు. పది దొరికాయి. చుట్టుపక్కల వాల్మార్టుల్లో ఊడ్చారు ఇంకో ఇరవై దొరికాయి. అదేపనిగా వందమైళ్ళ రేడియస్సులో సాధ్యమైనన్ని వాల్మార్టులను జల్లెడపట్టి తెస్తే కొందరు అర్కానస్ దాకా వెళ్ళి మొత్తానికి సాధించుకొచ్చారట.
యజ్ఞకుండం - దెంతోచేసారూ? అల్యూమినియం ట్రేలో ఇసుకబోసి, నాలుగు ఇటుకరాళ్ళి పెట్టారు. అరె, ఏముందీ అనుకుంటున్నారా? ప్రతీ ఇటుకకూ పసుపు పూసారు. ఏముందీ అంటారా? ప్రతీ ఇటుకపై ముగ్గు వేసారండీ. ప్రతీ యజ్ఞకుండమ్లో సూర్యుని ప్రతిమనుంచారు. దానిపై కూడా ముగ్గు వేసారు. 108 కుండాలు. 4 ఇటుకలు ఒక్కో కుండానికి. 432 ఇటుకలకు పసుపు పూసి ముగ్గులేసి!!! ఒక్కో ట్రేని మూడు ఇటుకలపై పెట్టాం. 108 స్థానాల్లో మూడు మూడు ఇటుకలు అమర్చటం.
ఇక యజ్ఞకుండం ట్రేపై, నాలుగు మూలలా నాలుగు కొబ్బరి చిప్పలు. కుండంలో ఓ కొబ్బరి చిప్ప, అందులో కర్పూరం బిళ్ళ. మిగతా నాలుగింటిలో ఒకదాన్లో ఓ నాంణెం, ఇంకోదాంట్లో ఖర్జూరం, ఇంకోదాంట్లో వక్కలు. ఇంకోదాంట్లో మరింకేదో. మొత్తానికి ఐదు చిప్పలు * ౧౦౮ 540 చిప్పలు. ఏంచెసారో తెలుసా. ఒకతను అక్కడ ఇక్కడా వెతికి ఆర్డర్ ఇచ్చాట్ట. ఒకతను దేశీ కొట్లు తిరిగి పట్టుకొచ్చాట్ట.
ఇక ౧౦౮ కుండాలలో అగ్నికార్యం చెయ్యాలంటే, ఎన్ని సమిధలు కావాలి, అదీ రెండున్నర గంటల కార్యక్రమం. పొగ రాకుండా మళ్ళీ రా చేయకుండా, అలా అగ్ని నిలవాలంటే ఎంత ఎండువై ఉండాలి? అంత చిన్న అగ్నికుడంలో పట్టాలంటే ఎంతచిన్న చిన్న సమిధలై ఉండాలి? ముఖ్యంగా ఎన్ని డబ్బాల నెయ్యి కావాలంటారూ? అదీ దేశవాళీ శుద్ధ ఆర్ఘ్యం. స్థానిక కాస్ట్కో వాడివద్ద మన శుద్ధ నెయ్యి దొరుకుతుందట. వెళ్ళారు, అయ్యా ఓ నాలుగు డబ్బాలు. ఇంతనెయ్యి మీకెందుకూ అన్నాట్ట. మాకు నలభై డబ్బాలు కావాలంటే గుచ్చి గుచ్చి అడిగాట్ట. మొత్తానికి వాడికి అర్ధమైయ్యెలా చెప్పేసరికి పిలకలో ప్రాణం గోచీలోకొచ్చిందట.
మరి యజమానులకి ఒక కలశం, ఋత్విక్కుకో కలసం. ౨౧౬. వాటిల్లో ఋత్విక్కులకిచ్చేవి ఓ పళ్ళెంపై పెట్టి దారంతో చుట్టి ఇవ్వాలి. ౧౦౮ చెంబులకు దారం ఎవరు చుట్టారూ? పళ్ళెంపై పెట్టి నూలు చుట్టటం. యజమానులకి కొత్త కలశం. ౧౦౮ కొత్త రాగి చెంబులు.
ఇక అలంకరణ, గుళ్ళోకి వచ్చే దారిలో ఒకతను ప్లై ఉడ్ ని నెమళ్ళ ఆకారంలో కట్ చేస్తే, ఇంకొకరు చక్కగా నెమళ్ళు వేసి రంగులద్దారు.
లోపల గుడిలో ఎంత అలంకరణ. ప్రధాన మంటపం వద్ద, వేంకటేశ్వరస్వామి ఆకారం కట్ చేస్తే, చేతులు తిరిగిన ఆర్టిస్టు పైంటువేసి, రంగులద్ది నిలబెట్టారు.
ఇంతకీ ఆవేళ జరిగిన సమావేసం ఏంటంటే, ఇలా కష్టపడిన అందరినీ పేరుపేరునా ప్రశంసించటం. పేరుపేరునా వారు చేసిన సేవలకు వారిని అభినందించడం. ఈలాంటి క్రతువులు, అదీ గుళ్ళో చేసేప్పుడు, ఓ సమూహం పడే శ్రమ, వారి వెనుక నిల్చునే వ్యక్తులు, వారిని ప్రభావితం చేసే వ్యక్తులు, వారికి ఉత్సాహం కలిగించే శక్తులు ఇత్యాది వాటిని గుర్తించి ప్రశంసించటం సామాన్యం కాదు.
నాకు అత్యంత అత్భుతం అనిపించిన ఓ మాట -
భర్తలు రోజూ ఈ పనుల్లో పడి ఏ రెండింటికో మూడింటికో ఇంటికొస్తుంటే, భార్యలు సహకరించడం ఒక ఎత్తు. వాళ్ళూ ప్రతీ పనిలో ప్రతీ బాటలో తమవంతు సహాయాన్ని అందించటం ఒక ఎత్తు. అందరూ నిల్చుని మరీ భార్యామతల్లులకు జేజెలు పలకటం నాకు బగా నచ్చింది.
అలాగే పిల్లలు కూడా వారి మానాన వాడు ఆడుకుంటూ ఎక్కడా సహనానికి పరీక్షపెట్టలేదు. అదీ చెప్పికు తీరాల్సిన విషయమే.
అలానే ఇంత పెద్ద పదిరోజుల కార్యక్రమాన్ని ఒక్కచేత్తో అనుసంధానం చేసిన పూజారయ్యగారు కూడా గ్రేట్. వారికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం అందరం.
సేవకుల్లా నిలిచిన చిన్న పెద్దా పిల్ల పుడకా అందరినీ అభినందించాం.
అతి పిన్న సేవకుడు, పిల్లాడికి పన్నెండేళ్ళుంటాయేమో. బురదలో పడి, వానని లెక్క చేయకుండా, ఎంతలా పని చేసాడంటే అసమాన్యమైన సేవ చేసాడు. ఆ పిల్లాణ్ణి పిలిచిమరీ మెచ్చుకోలు అందజేసి నాలుగు వీరతాళ్ళు వేసాం అందరి హర్షాతిరేకాల మధ్యన.
అలా ఈ క్రతువుని విజయవంతం చేసిన ప్రతీ ప్రాణినీ మెచ్చుకున్నాం.
చివరగా, ప్రతీరోజూ కొలువుకెళ్తూ, సాయంత్రమవ్వగానే గుడికెళ్ళొ ఏదోక పనిని శిరస్సుపైకెత్తుకుని, విజయవంతంగా పూర్తిచేసి, ఎప్పుడూ కంప్యూటర్ పరిభాషనే జీవిన విధానంలా మరల్చుకుని తిరిగే జీవితంలో పంచసూక్తాలు రుద్రం మూల మంత్రాలు ఉపనిషత్తులు ఇత్యాది నేర్చుకునేందుకు ఉత్సుకత చూపి, పట్టుదలగా నేర్చుకుని, కనీసం పుస్తకం చూసైనా తప్పుల్లేకుండా చదవగలిగే స్థాయికి చేరుకుని, ఈ పదిరోజుల కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా విజయవంతం చెసిన నూటాఎనమండుగ్గురు ఋత్విక్కులు - హేట్సాఫ్.
వారికి ఇలా చేయగలిగేందుకు ఓర్పుతో నేర్పరితనంతో బాధ్యతగా తగు శిక్షణ ఇచ్చిన గురువర్యులు శ్రీ శ్రీనివాసాచార్యులు గారికీ హేట్సాఫ్.
నిస్వార్ధంగా చేసిన ఈ పనికి అందరకీ ఒక్కో సుదర్శన చక్రం వేసిన రాగి రక్షారేకుని ఇచ్చారు.
స్వంత డబ్బా కొంత మరి ఉండొద్దా -
నేను ఈ పదిరోజుల క్రతువుకి దాదాపు ప్రతీరోజూ వెళ్ళా. ఒక రోజు తుపాను హెచ్చరిక వల్ల వెళ్ళలెక పొయ్య. ఇంకోరోజు తీవ్రమైన తలనొప్పి వల్ల వెళ్ళలేక పొయ్యా.
పనికి వెళ్తూ, ఐదుకల్లా ఇంటికి వచ్చి, ఆరుకి మొదలయ్యే కార్యక్రమానికి అరవైమైళ్ళ దూరం ప్రయాణించి అందుకోవటం, కార్యక్రమం మొత్తం అయ్యాక ప్రసాదాలందుకుని, భుజించి, ఏ తొమ్మిదిన్నరకో పదికో తిరిగి రోడ్డున పడితే ఏ పదకుండింటికో ఇంటికిజేరి, ఆ రోజున తీసిన ఛాయాచిత్రాలతో ఓ టపా రాసి, భార్యాబిడ్లకు కాల్ చేసి కన్న తల్లిని ఓ మారు పలకరించి మంచంఎక్కేప్పటికి ఏపదకుండుంన్నరో.
ఐతే, ఏరోజూ నేను అలసిపొయ్యాను అనే భావం రాలేదు నాకు. అది కేవలం ఆ దేవుడి దయే అని నా అభిప్రాయం.

ఇది తప్పకుండా చెప్పాల్సిన మాటలు -
౧. నాలుగోరోజు, సోమవారం - ఆవేళ మహా మృత్యంజయ హోమం. వాన. హోమం మొదలు పెట్టాం వాన పెరిగింది. అందరం భక్తి శ్రద్ధలతో ఎంతో డెడికేషన్తో మృత్యంజయ మంత్రం, రుద్రం పఠిస్తుంటే వాన ఎక్కువైంది. పూర్ణాహుతి అయ్యింది, వాన మాయం.
౨. శనివారం అర్ధరాత్రి వరకూ కుఱిసిన వాన, ఆదివారం పొద్దునకల్లా మటుమాయం.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ।
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ [శుక్లయజుర్వేదం]

శన్నో మిత్ర(శ్) శం వరుణః । శన్నో భవత్-వర్యమా । శన్న ఇంద్రో బృహస్పతిః ।
శన్నో విష్ణురు-రుక్రమః । నమో బ్రహ్మణే । నమస్తే వాయో । త్వమేవ(ప్)
ప్రత్యక్షం బ్రహ్మాసి । త్వమేవ(ప్) ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి । ఋతం
వదిష్యామి । సత్యం వదిష్యామి । తన్మా-మవతు । తద్-వక్తార-మవతు । అవతు మాం
। అవతు వక్తారం ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

సహనా వవతు । సహనౌ భునక్తు । సహ వీర్యఙ్ కరవా-వహై । తేజస్వి-నావ-ధీత-మస్తు-
మావిద్-విషావహై ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ [కృష్ణ యజుర్వేదం]

ఓం ఆప్యాయన్తు మమాఙ్గాని వాక్ప్రాణశ్చక్షుః
శ్రోత్రమథో బలమిన్ద్రియాణి చ సర్వాణి।
సర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ।
నిరాకరోదనికారణమస్త్వనికారణం మేऽస్తు।
తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే
మయి సన్తు తే మయి సన్తు॥

ఓం శాంతిః శాంతిః శాంతిః॥ [సామవేదం]

ఓం వాజ్ మే మనసి ప్రతిష్టితా।
మనోమే వాచి ప్రతిష్ఠితా ఆవిరావీర్మ ఏధి ।
వేదస్య మ ఆణీస్థః శ్రుతం మే మా ప్రహాసీః ।
అనేనా ధీతేనా హొరత్రాస్సందథామి । అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి ।
తన్మామవతు । తద్వక్తార మవతు అవతుమామ్ అవతు వక్తారమ్ ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః॥ [ఋగ్వేదం]

ఓం భద్రం కర్ణేభిః శ్రుణు యామదేవాః భద్రం పశ్వేమక్షభిర్యజత్రాః।
స్టిరై రంగై స్తుష్టువాగ్\ం సస్తమాభిః వ్యశేమ దేవహితం యదాయః ॥
స్వస్తి న ఇంద్రో వృద్ద శ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః।
స్వస్తి నస్తా న క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్ దధాతు ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః॥ [అధర్వణ వేదం]

May 21, 2010

ఈ విషయాలు చెప్పకుండా పూర్తైనట్టు కాదు

నిన్నటి నా టపాలో యజ్ఞం పూర్తైంది అని రాసాను. కానీ ఈ విషయాలు చెప్పకుండా పూర్తైనట్టు కాదు.
పూర్ణాహుతి అయ్యింది, నైవేద్యాది కార్యక్రమాలు అయ్యాయి. యజమానులు ఋత్విక్కులని వీడి, అయ్యవార్ల దర్శనం చేస్కుని యజ్ఞశాలనుండి నిష్క్రమించారు. భక్తజన సందోహం అయ్యవార్ల దర్శనం చేస్కున్నారు. ఇక మిగిలింది ఋత్వికులు. మేంకూడా అయ్యవార్ని దర్శనం చేస్కున్నాం. అయ్యిందా. అప్పుడు, మరి యజ్ఞశాలనుండి అయ్యవార్లను ఆలయ పునఃప్రవేశం గావింపవలె కదా?
From 2010-05-17

From 2010-05-17

From 2010-05-17

అది చేసాం. ఆలయ పునఃప్రవేశం గావించిన పిమ్మట, ఆలయ అర్చకులు, అయ్యవార్లకు ఉపచారాలు చేసి, ఇక అప్పుడు ఋత్విక్కులందరికీ ఈ కార్యక్రమం ఘనంగా జరిపినందుకు ఆశీర్వచనవాక్కులు పలికారు.

ఈ కార్యక్రమం ఇటు నడుస్తూఉండగా, అక్కడి యజ్ఞశాలలో, సర్దేపనిలో సేవకులు మునిగిపోయి మొత్తం శుభ్రంగా సర్దేసేసి, శుభ్రంచేసేసారు.

అటుపై, మా అందరికీ భోజనాలు ఏర్పాటైంది.
వెళ్ళాం. తిన్నాం. అయ్యా ఋత్విక్కులారా, కొద్దిగ సేపు విశ్రాంతి తీస్కోండీ. అందరం ఓ సారి సమావేశమై ఓసారి మాట్టాడుకుందాం అని చెప్పారు.

ఎవరెవరు ఏం చెప్పారూ? ఏంటా కబుర్లు...తర్వాతి టపాలో చెప్తా. ఒకసారి చెప్పేది కాదు....

May 19, 2010

శ్రీ మహా సుదర్శన యజ్ఞం సుసంపన్నం

మొన్నటి ఆదివారంతో [మే పదహారో తారీఖు] శ్రీ మహా సుదర్శన యజ్ఞం సుసంపన్నం అయ్యింది. ఓ మహా క్రతువు విజయవంతంగా ముగిసింది.
చివరి రెండురోజుల స్థూలావిష్కరణగావిస్తున్నా.
శనివారం అనగా మే పదిహెనోతారీఖు - అయ్యవారికి రథోత్సవం మరియూ వసంతోత్సవం ఆనందోత్సాహాలతో జరిపాం.
పూపల్లకిలో అయ్యవార్లను ఊరేగిస్తూ
From 2010-05-17

రథారోహణ గావించి,
From 2010-05-17
ఋత్విక్కుల మంత్ర పఠనంతో భక్తజనుల హర్షోల్లాసాల మధ్య ఊరి[గుడి] నాలుగు చెఱుగులాదిప్పి,
From 2010-05-17
ఓ చోట వసంతోత్సవంజఱుపుటకు దింపి, అయ్యవార్లకు రంగులు జల్లుతుండగా భక్తజనులు ఆనందోస్తాహాలతో రంగులు పులుముకుంటుండగా, ఉత్తరాదివారు కొందరు చేవాయిద్యాలందుకుని వాయిస్తుండగా జనులు ఆ వాయిద్యాలహోరుకు తగినట్టుగా నాట్యంచేయ ప్రారంభించారు. ఒకరికొకరు రంగులు పులుముకున్నారు. అంతలో
From 2010-05-17
ఋత్విక్కులు రుద్రం, పంచసూక్తాలు, ఉపనిషత్తులూ ఉఛ్ఛరిస్తుండగా అయ్యవార్లకు
From 2010-05-17
అభిషేకం గావించి, తిరిగి రాథారోహణగావించి, తిరిగి ఆలయమార్గముపట్టి, భక్తి శ్రద్ధలతో అయ్యవార్లను ఆలయ పునఃప్రవేశంగావించి
From 2010-05-17
సంపన్నం చేసాం.
అత్భుతాలు - ఒకటా రెండా. ఎన్నని చెప్పనూ. మచ్చుకి కొన్ని
౧. అప్పటిదాకా పడిన వాన, పల్లకీ ఆలయంలోనుండి బయటకు రాంగనే తగ్గింది. రథ కదలికతో ఆగిపోయింది.
౨. కొందరు ఔత్సాహికులు పల్లకీని పూమాలలతో అలంకరించారు.
౩. రథం అలా వెళ్తుంటే, ఓ ఔత్సాహికుడు హెలీకాప్టర్లోంచి రథంపై పూలవాన కురిపించాడు.

అయ్యా!! మర్రోజే ఆదివారం. మహాయజ్ఞం. నూటా ఎనమండుగ్గురు ఋత్విక్కులు, నూటా ఎనమండుగ్గురు యజమానులు. వార్తా పత్రికల వార్తాహరులు, ఎలక్ట్రానిక్ మాధ్యమాహరులు, ఆఊరి మేయరు, సెనేటరు ఇత్యాది రాజకీయ గణ తాకిడి, ఈ మహాక్రతువుని వీక్షంపగోరి వచ్చే భక్తజన సందోహం, ఇంత మంది మాత్రమే వస్తారు అనే లెక్కా పత్రం వేయగలమా? మరి వచ్చేవారి వాహనాల విడిది, వి.ఐ.పిలకు విడిది, ఋత్విక్కులకు విడిది, అంత సులభమా ఇలాంటివాటిని అమర్చటం? వచ్చెవారికి అన్నపానీయాలు, పిల్లల గోలలు...
యాజమాన్యం ముందుగానే ఊహించి, యోచించి, సకలఏర్పాట్లుగావించారు.
శనివారం మధ్యాహ్న భోజనాలు అవ్వగానే ఏర్పాట్లకి నడుంబిగించాం. అతిపెద్ద సమస్య కళ్ళముందే తెరలుతెరలుగా ఆటలాడుతూ దోబూచులాడుతూ భయపెట్టింది. అదే వాతావరణం. వరుణుడు దోబూచులాట్టం మొదలుపెట్టాడు. ఒక్కోసారి తేలిగ్గా జల్లు కురిపించాడు. ఒక్కోసారు ఘాట్టిగా మొట్టాడు. జరిగేది యజ్ఞకార్యం. వాన ప్రతిబంధకమే. ఎందుకంటే యజ్ఞకుండాలు ఏర్పాటు చెయ్యాలా? ఋత్విక్కులు కూర్చోవాలా? యజమానులు కూర్చోవాలా? నుల్చుని చెయ్యటానికి ఇది వంటకాదు కదా!! శనివారం మధ్యాహ్నానికల్లా వంద అడుగుల లోతునా వందడుగుల వెడల్పున ఓ పెద్ద డేరా లేచింది. వాన పోతని ఆపగలిగింది. మరి ఇరతరత్రాలలో పడిన వాన నీటి ప్రవాహాన్ని ఎలా అడ్డుకుంటాం? డేరా తడికెల గోడలకు కిందనుండి పట్టలు బయటకి పోనిచ్చి వాటిపై ఇసుక బస్తాలు అడ్డంపెట్టి అతి కష్టంతో మొత్తానికి వాననీటిని నిలువరించారు.
ఇక డేరాలోపలి ప్రహసనం - ఆదివారం పొద్దున్నే ఆరున్నరకల్లా కార్యక్రమం మొదలు. ప్రధాన హోమకుండం. దానికి ఇరువైపుల ఆరు ముఖ్య హోమకుండాలు. అయ్యవార్లను కొలువుచేసే వేదిక. ఇవి కాక నూటా ఎనమండుగ్గురు ఋత్విక్కులకు హోమకుండాలు. ఎన్ని ఇటుకలు కావాలీ? ఎలా అమర్చాలి? కొలతతో గీతలు గీసారు. అడ్డగీతలు నిలువు గీతలు గీసారు. టేపు తెచ్చారు. చతురస్రాలు గీసారు. ప్రతీ చతురస్రంలో యజ్ఞకుండం ఏర్పాటుచెయ్యల్ని ప్రతిపాదించారు.
ఇక ప్రతీ కుండంవద్ద యజమానికి కావల్సిన వస్తువులను ఓ ట్రేలో పెట్టించారు. ఋత్విక్కుకు కావాల్సిన వస్తువులన్నీ ఒక ట్రేలో పెట్టించారు. అనగా యజ్ఞసామాగ్రి, సమిధలు, కర్పూరం, అగ్గిపెట్టె, నెయ్యి, కలశం, ఇత్యాదివి. పులు, పండ్లు, పసుపు, కుంకుమ, గంధం లాంటివి. నీళ్ళు, గ్లాసులు లాంటివి. పసుపు కుంకుమ గంధం చిన్ని చిన్ని మూతల్లో అమర్చారు. అలానే రోజ్ వాటరు. ఒక బొట్టు అంటే ఒక బొట్టు, కాదు మూడున్నర బొట్లు అంటే అంతే పరిమాణంలో ఆ చిన్ని చిన్ని మూతల్లో చక్కగా అమర్చారు. ఆచమనం చేసినాక చేయి తుడుచుకోటానికి పేపరు టవల్ తో సహా.
ఇంతలో ఆలయ ప్రధానార్చకులు ప్రోక్షణ కార్యక్రమాన్ని గావించారు. అటుపిమ్మట పాదరక్షలతో ప్రవేశం లేదు.
౧౦౮ యజ్ఞకుండాలు తెచ్చిపెట్టాం. వీటిని తెచ్చేప్పుడూ, అమర్చేప్పుడూ పారాయణం చేయాలని సూచించటంతో, సుదర్శన మూల మంత్రం జపిస్తూ యజ్ఞకుండాలను అమర్చాం. ౧౦౮ పీటలు ఋత్విక్కులకు, ౧౦౮ * ౨ పీటలు యజమానికి ఒకటి అతనికి ఒకటి అతని సహధర్మచారిణికి. ౧౦౮ మంది ఋత్విక్కులకు శుక్రవారమే దీక్షావస్త్రాలు అందించారు, అనగా పసుపు బట్టలు, నూతన యజ్ఞోపవీతాలు అందించారు. దీక్ష కూడా ఇచ్చారు. మరి యజ్ఞకార్యక్రమానికి ఆచమనం చేస్కోటానికి కొత్తవి ఉద్ధరిణె, పంచపాత్ర ఇత్యాదివి అమర్చారు.
అలానే స్రుక్కులు, స్రువాలు, ఒక్కో ఋత్విక్కుకి ఒక స్రుక్కు ఒక స్రువం. ఇలా అమర్చి, అటు ఇటు కుర్చీలు అమర్చి ఒకట రెండా? ఎన్ని అమరాలి, ఎంత శ్రమ? ఎంత ఓపిక? ఎంత ప్రి ప్లాన్? ఎంత అలోచనా? మరియూ ఎంత అనుసంధానం? అంతే కాక సూక్ష్మ వివరాలను సైతం దృష్టిలో ఉంచుకుని చేయాలి. అంటే, ఋత్విక్కులందరూ తూర్పువైపుకే ముఖంపెట్టి కూర్చోవాలి, ఇత్యాదివి, చక్కగా సిద్ధం చేసారు.

అయ్యా!! మరుసటి రోజు అనగా ఆదివారం రానే వచ్చింది. ఆదిత్యుడు మబ్బుల్లో చిక్కుకుని తన తొలికిరణాలను బయల్పరచలేదు. ఇంతలో అలారాలు మోగుతున్నాయి ఒక్కొక్కరివి. తొలి కోళ్ళు కూయటం మొదలెట్టాయి. హడావిడి కువకువ మొదలైంది అందరిలో. గుళ్ళోనే కునుకులు తీసిన ప్రాణాలు ఒక్కొక్కటీ లేచి కాలకృత్యాలతో స్నానాదులు ముగించి తమకిచ్చిన దీక్షావస్త్రధారణ కావించి గుళ్ళోకి జొరబడ్డాయి. బయటనుండి వచ్చే ఋత్విక్కులు చక్కగా పసుప్పచ్చని పంచెలు చుట్టుకుని చేరుకున్నారు. కళకళ్ళాడుతూ కనిపించింది ఆలయమంతా.
From 2010-05-17

ఇక కార్యక్రమం మొదలైంది. పంచసూక్త పారాయణతో సుదర్శన భగవానుని యజ్ఞశాలా ప్రవేశం గావించాం. అయ్యవార్లను వారికై అలంకరించిన ప్రత్యేక వేదికపై అలంకరించాం. యజ్ఞశాల శుద్ధి గావించి, దేవతాస్థాన పూజ చేసాం.
ఏఏ ఋత్విక్కు ఏఏ స్థానంలో కూర్చోవాలో, ఏఏ యజమాని ఎక్కడెక్కడ కూర్చోవాలో వాళ్ళ వాళ్ళా పేర్లతో సహా నెంబర్లు వేసి ఉంచారు ముందే. పీటలపై అంటించారు. ఋత్విక్కులు వారివారి స్థానాల్లో ఆశీనులైయ్యారు. తమకిచ్చిన సామగ్రిని ఒకమారు సరిచూసుకుని సిద్ధమయ్యారు. యజ్ఞశాల శుద్ధి గావించి, దేవతాస్థాన పూజ చేసాం. ఇక యజమానుల రాక మొదలయ్యింది. వారి వారి కేటాయింపబడ్డ స్థానలకు చేరుకుని, భర్త, భర్తకు శాస్త్రోక్తంగా ఎడమవైపున భార్యా పీటలపై కూర్చున్నారు.
సంకల్పం చెప్పించాం. విశ్వక్సేన, గణేశ, మహా సుదర్శన కలశ స్థాపన గావించాం.
ఆలయ ప్రధానార్చకులైన శ్రీ శ్రీనివాసాచార్యులవారు, అష్టబలి గావించేందుకు ఎనిమిది దిక్కులకూ వెళ్ళి, ప్రతీ దిక్కు అధిపతిని ప్రార్ధించి, అయ్యా మీమీ గణాలను ఇక్కడకు పంపండీ, మా ఈ సుదర్శన మహా యజ్ఞ కార్యాన్ని సదా రక్షించండీ అని ప్రార్ధించి, అష్టదిక్బంధనం చేసారు. అష్టబలి, యాగస్థలం చుట్టు ఎనిమిది దిక్కులనూ దారంతో బంధించటంద్వారా సుసంపన్నం అయ్యింది. ఈ బంధం కార్యక్రమాంతంలో మాత్రమే తీస్తాం. ఈదిక్బంధం చేసాక ఇక ఏప్రాణీ అనగా యజమాని గానీ ఋత్విక్కుగానీ యజమానులుగానీ, ప్రేక్షకవీక్షకులు గానీ యజ్ఞశాలలోకి ప్రవేశింపజాలరు మరియూ యజ్ఞశాలను వీడజాలరు.
అటుపిమ్మట పుణ్యహవచనం, యజ్ఞకుండ శుద్ధి గావించి, అగ్ని ప్రతిష్ఠాపన గావించాం. ౧౦౮ సార్లు శ్రీ మహా సుదర్శన మూలమంత్రాన్ని పఠిస్తూ హోమ కార్యం చేసాం.
From 2010-05-17

ఇంతలో రాజకీయ వర్గాగమనం ఆరంభమైంది. కేన్సాసు నగర మేయరు, సెనేటరు ఇత్యాది రాజకీయ నయకవినాయక గణం వేంచేసి తమతమ ప్రసంగాలను అందరిముందర ఆవిష్కరించారు.
From 2010-05-17
వారి ఘోష అయ్యాక పూర్ణాహుతి గావించి, లఘు ఆరాధన చేసి, మహా నైవేద్యాది విన్యోగాలు చేసి, హారతులిచ్చి, యజమానిలకు ప్రసాదాది బహుమతులిచ్చి ఆ యజ్ఞనారాయణుడికి మనసారా నమస్కారాలు దెల్పుకుని కోరికలు మనసునందే దెల్పుకుని యజ్ఞ కార్యాన్ని సంపూర్ణం గావించాం.

నా అనుభవాలు, నా అనుభూతులూ, తెరవెనుక కథలు సవివరంగా మరో టపాలో రాస్తాను.

May 15, 2010

అష్టలక్ష్మి హోమం

ఇవాళ అష్టలక్ష్మీ హోమం చేసాం.

ఓం మహాలక్ష్మ్యేచవిద్మహే విష్ణుపత్నైచ ధీమహి తన్నోలక్ష్మీ:ప్రచోదయాత్.

May 14, 2010

బ్లాగ్ ప్రయాణంలో ఇంకో మైలు రాయి

ఇది నా 300 వ టపా.
ఇన్ని రాయగలిగానా?
నన్నాదరించిన జనులందిరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరియూ నమస్సుమాంజలులు.

ఇవ్వాళ్ళ శ్రీ సాయినాధునికి మనస్సుపెట్టి శ్రద్ధా భక్తుల్తో హోమం చేసాం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్ కి జై

May 12, 2010

ఆంజనేయాయ విద్మహే

ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్
అయ్యా!! అదీ సంగతి.
ఇప్పుడే మహదానందంగా ఆ శ్రీసీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయులవారి హోమం చేసి, ఇంటికి చేరా.

May 11, 2010

అయ్యా!!సోమవారం, మహా మృత్యుంజయ హోమం

హోరున వాన.
కొలువు నుండి ఇంటికి జేరా.
ఐదైంది సమయం.
ఆరింటికి హోమ కార్యక్రమం మొదలౌతుంది.
ఈ వానలో వెళ్దామా వద్దా అనుకున్నా.
హే పదా అని లేచా
ఒక తొక్కుడు తొక్కా కారుని.
ఆరుంబావుకి గుళ్ళో ఉన్నా.
ఇవాళ్ళ మహదానందంగా ఉంది నాకు.
రుద్రంతో, మృత్యుంజయ మంత్రం చదువుతూ హోమంచేసాం.
అక్కడా హోరున వాన.
చలి
చొక్కాల్లేవు
తడి
ఇవన్నీ గమనించే స్థితిలో ఉన్నామా?


చాలా తృప్తిగా ఉందీవేళ.

నమో రుద్రేభ్యో యేపృథివ్యాం యే”అంతరిక్షే యేదివి యేషా మన్నం వాతో వర్షమిషవస్-తేభ్యో దశ-ప్రాచీర్ దశ-దక్షిణా దశ-ప్రతీచీర్ దశోదీచీర్ దశోర్ధ్వాస్ తేభ్యో నమస్తే నో మృడయంతు తేయం ద్విష్మో యశ్చ నో ద్వేష్టితం వో జమ్భే దధామి || ౧౧.౧౧||

త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వా రుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతా”త్(\) || ౧||

May 9, 2010

అమ్మా!!!

महे: उस को नहीं देखा हमने कभी
पर इसकी ज़रूरत क्या होगी
दोनो: ऐ माँ, ऐ माँ तेरी सूरत से अलग
भगवान की सूरत क्या होगी, क्या होगी
उस को नहीं देखा हमने कभी...

मन: इनसान तो क्या देवता भी
आँचल में पले तेरे
है स्वर्ग इसी दुनिया में
कदमों के तले तेरे
ममता ही लुटाये जिसके नयन, हो...
दोनो: ममता ही लुटाये जिसके नयन
ऐसी कोई मूरत क्या होगी
ऐ माँ, ऐ माँ तेरी...

महे: क्यों धूप जलाये दुखों की
क्यों ग़म की घटा बरसे
ये हाथ दुआओं वाले
रहते हैं सदा सर पे
तू है तो अंधेरे पथ में हमें, हो...
दोनो: तू है तो अंधेरे पथ में हमें
सूरज की ज़रूरत क्या होगी
ऐ माँ, ऐ माँ तेरी...

दोनो: कहते हैं तेरी शान में जो
कोई ऊँचे बोल नहीं
भगवान के पास भी माता
तेरे प्यार का मोल नहीं
हम तो यही जाने तुझसे बड़ी, हो...
हम तो यही जाने तुझसे बड़ी
संसार की दौलत क्या होगी
ऐ माँ, ऐ माँ तेरी...




ఈపాటని తెలుగీకరిద్దాం అనుకున్నా, నావల్లకాలేదు.

రుద్రహోమం

ఈరోజు రుద్రహోమం మరియూ నవగ్రహ హోమం శ్రవణానందంగా, కన్నులపండుగ్గా అయ్యింది. భక్తి శ్రద్ధలతో పాల్గొన్నాను.

May 8, 2010

ముఫై మైళ్ళ వేగంతో గాలి వీస్తున్నా

ముఫై మైళ్ళ వేగంతో గాలి వీస్తున్నా
సంకల్పం ఆగుతుందా?
ఈరోజు గణపతి హోమం పూర్తైంది విజయవంతంగా.
గాలి హోమంకి ఆటంకలిగించకుండా రెండు గంటలపాటు, చలిలో, టార్పాలిన్ పట్ట ఆసాంతం అడ్డుపెట్టి నిల్చున్నాం అందరం.


ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణమ్‌ ..
రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్‌ ..
రక్తం లంబొదరం శూర్పకర్ణకం రక్తవాససమ్‌ ..
రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్‌ ..
భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్‌ ..
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతెః పురుషాత్పరమ్‌ ..
ఎవం ధ్యాయతి యొ నిత్యం స యొగీ యొగినాం వరః

ఏకదంతాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్

May 6, 2010

రాజన్ నాగేంద్ర


రెండు వారాల క్రితం, ఈనాడు టీవీలో పాడుతా తీయగా కార్యక్రమానికి రాజన్ ముఖ్యఅతిధిగా ఓ రెండు ఎపిసోళ్ళు ప్రసారం అయ్యయి. రెండో ఎపిసోడ్లో పార్టిసిపెంట్స్ పాడిన కొన్ని పాటలు ఇవి -

చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై
పోయి..కడలిగా పొంగు..

నీ ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...

నదివి
నీవు..కడలి నేను..
మరచిపోబోకుమా
..మమత నీవే సుమా...!


చినుకులా
రాలి..నదులుగా సాగి..
వరదలై
పోయి..కడలిగా పొంగు..
నీ
ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...!


ఆకులు రాలే వేసవి గాలి.. నా ప్రేమ నిట్టూర్పులే...
కుంకుమ
పూసే వేకువ నీవై.. తేవాలి ఓదార్పులే...
ప్రేమలు
కోరే జన్మలోనే నే వేచి ఉంటానులే...
జన్మలు
తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే.. వెల్లువౌతానులే...!

హిమములా
రాలి.. సుమముల పూసి...
ఋతు
వులై నవ్వి.. మధువులై పొంగి...
నీ
ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...
శిశిరమైనా
.. శిథిలమైనా.. విడిచిపోబోకుమా.. విరహమైపోకుమా...!


తొలకరి
కోసం తొడిమను నేనై.. అల్లాడుతున్నానులే...
పులకరమూదే
పువ్వుల కోసం.. వేసారుతున్నానులే...
నింగికి
నెల అంటిసలాడే.. ఆ పొద్దు రావాలిలే...
పున్నమి
నేడై.. రేపటి నీడై.. ఆ ముద్దు తీరాలిలే.. తీరాలు చేరాలిలే...
!

మౌనమై
వెలసి.. గానమై పిలిచి...
కలలతో
అలసి.. గగనమై ఎగసి...
ప్రేమ.. నా ప్రేమ.. తారాడే మన ప్రేమ...
భువనమైనా
.. గగనమైనా.. ప్రేమమయమే సుమా.. ప్రేమ మనమే సుమా...!


చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై
పోయి..కడలిగా పొంగు..
నీ
ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...
నదివి
నీవు..కడలి నేను..

మరచిపోబోకుమా..మమత నీవే సుమా...!


-----------------------------------------------------
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులలో నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మోజులలో నీ విరజాజులై

మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలె
ఈ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

హాహా....హాహా.......ఆ.......
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా..
అందిన పొందులోనె అందలేని విందులీయవె

కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా


-------------------------------
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల
చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

ఊపిరి తగిలిన వేళ నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
చూపులు రగిలిన వేళ
ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున

వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా

ఎదలో అందం ఎదుట
ఎదుటే వలచిన వనిత
నీ రాకతో
నా తోటలో
వెలసే వన దేవతా
కదిలే అందం కవితా
అది కౌగిలికొస్తే యువతా

నవతా... నవ్య మమత ఆ ఆ
వీణ వేణువైన ||

తనువు తహతహలాడాల
చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
-----------------------
మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాల దశ దిషాంతాల సుమ సుగంధాల బ్రహ్మార నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

జాబిలి కన్నా నా చెలి మిన్నా పులకింతలకే పూచిన పొన్నా

కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చెరగలనో
మనసున మామతై కడతేరగలనూ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ
తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమనీ
కలిసే దాకా అనుకోలేదు తీయని స్నేహమనీ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
సంసారం సంగీతం


అంతక ముందు ఎపిసోడు, ఈ ఎపిసోడు రెంటిలో, పంతులమ్మ అనే సినిమానుండి రెండు పాటలు వచ్చాయి ముందుకి.
ఎడారిలో కోయిలా
మానసవీణా మధుగీతం

పంతులమ్మ సినిమాకి దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు.

ఈ సినిమలో పాటలన్నీ హిట్ అనుకుంటా. పై రెండు, మూడోపాట నాకు అత్యంత ఇష్టమైన పాట.
సిరిమల్లె నీవే

విరిజల్లు కావే
వరదల్లె రావే
వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే
ఎదమీటి పోవే

ఎక్కడన్నా దొరికితే చూడాలి ఈ సినిమా.

ఇంతవరకూ బాగనే ఉంది కానీ, ఈ క్రింది కధ చదివాక, మనసు వికలమైంది.
రాజన్ నాగేంద్ర, వీరిద్దరూ సోదరులు.
దాదాము మూడొందల డెబ్భై సినిమలకు సంగీతం అందించారు.
వీరిద్దరీ మరియూ డా॥ రాజకుమార్ ల కాంబినేషన్లో అనెక హిట్ సినిమాలు వచ్చాయి.
నాగేంద్ర చనిపోయిన సంఘటన వివరాలు ఇవీ -
ఎవరిసినిమలకైతే సంగీతం అందించారో, ఆయన [డా।। రాజకుమార్] కిడ్నాప్ అయినప్పుడు జరిగిన బందులో నాగేంద్రకి ఆహారం అందలేదట.
సోదరుడు రాజన్ మోసం చేసాట్ట.
చనిపోయే నాటికి Rs 141 ఉన్నాయట ఆయన అకౌంటులో.

Nagendra's death

Nagendra, who gave Kannada cinema some of its most memorable hits, died in Bowring hospital at Bangalore on November 4th 2000. The man who, with brother Rajan, gave us flowing, rich scores, died a near pauper, with a bank balance of Rs 141 (a little more than three dollars). Their songs get the maximum requests on All India Radio, bringing in more royalties for recording companies than other composers.

Nagendra was admitted to Bowring Hospital for treatment of hernia three months ago. He later developed complications because of his high blood pressure and diabetes. His wife, carrying lunch for him when he was recuperating, couldn't reach the hospital because of the September 28 bundh prompted by Rajkumar's kidnapping. His condition got worse and he suffered a stroke.

For someone who had composed hit music for 335 films, Nagendra was in deep financial distress. He reportedly told his wife that he preferred a general ward, and that she should not seek help from the government. Hai Bangalore, the mass circulation Kannada tabloid, alleged in an article two weeks ago that Rajan had cheated the fiercely self-respecting Nagendra of his share of whatever money they had earned together.

Some composers, playback singers and live band singers who make a living by singing Rajan-Nagendra songs visited him in hospital, but there were no signs that anyone had given him any money.

Nagendra leaves his wife, his mother and a 12-year-old son. When a reporter met her at hospital, she is quoted to have said that Rajan had always handled all the finances and cheated her husband of his fair share.


వాన-(క)నీళ్ళు

మబ్బులున్నంత సేపే వాన
కష్టాలున్నంతసేపే కన్నీళ్ళు
కలకాలం వానపడదు
కన్నీళ్ళు కలకాలం ఉండవు
మబ్బులు విడిపోతే/వెళ్ళిపోతే నిర్మలమైన ఆకాశం
కష్టాలు తీరిపోతే ఆనందకరమైన జివితం
మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి మబ్బులు
మళ్ళీమళ్ళీ వస్తుంటాయి కష్టాలు
అదే జీవితం

May 5, 2010

ప్రాణ్యములు/మాంసకృత్తులు/ప్రొటీనులు

శరీరంలోని ప్రతీ కణం మాంసకృత్తుల మీద ఆధారపడుతుంది. మాంసకృత్తులు కండరాలకు, ప్రతీ అంగానికి గ్లాండ్స్ కు అన్నీటికీ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. శారీరక నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకి.

తెవికిలో ఇలా ఉంది -

మనం తినే ఆహారంలో ప్రాణ్యములు ముఖ్యంగా ఉండవలసిన పోషక పదార్ధాలు. నాణ్యతని బట్టి ఈ ప్రాణ్యములని రెండు వర్గాలుగా విడగొడతారు. ప్రధమ శ్రేణి ప్రాణ్యాలు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, మొదలైన జంతు సంబంధమైన వనరులనుండి లభిస్తాయి. వీటిని ప్రధమ శ్రేణి అని ఎందుకు అన్నారంటే వీటన్నిటిలోనూ అత్యవసర నవామ్లాలు (essential amino acids) తప్పకుండా ఉంటాయి. మాంసాహారులు ఏ ఒక్క మాంసం తిన్నా అది సంపూర్ణ ఆహారంగా చెలామణీ అయిపోతుంది. ద్వితీయ శ్రేణి ప్రాణ్యాలు పప్పులు, కాయగూరలు, మొదలైన వాటిలో దొరికేవి. వీటిలో, ఏ ఒక్క దాంట్లోనూ, అత్యవసర నవామ్లాలు అన్నీ లభించవు. కనుక శాకాహారులు నాలుగు రకాల వస్తువులు ఒకే భోజనంలో తింటే తప్ప నవామ్లాలన్నీ సరఫరా కావు. పక్కా శాకాహారులు (pure vegetarians or vegans) - అంటే జంతు సంతతికి చెందిన పాలు, వగైరాలు కూడ ముట్టని వారు - పోషణ విషయంలో అప్రమత్తత తో ఉండాలి. పప్పు, అందులో నెయ్యి, కూర, పచ్చడి, పులుసు, పాలు, పెరుగు, మజ్జిగ మొదలయిన హంగులన్నీ ఉంటే కాని శాకాహారం సంపూర్ణం కాదు.

మనం మాంసం తిన్నా, పప్పు, అన్నం తిన్నా అవి తిన్నగా రక్తంలో ప్రవేశించవు. మనం తిన్న పోషక పదార్ధాలలో ఉన్న సారాన్ని గ్రహించి, దాన్ని ముడి పదార్ధంగా వాడి శరీరం తనకి కావలసిన ప్రాణ్యములని తనే తయారు చేసికొంటుంది. చాలా వరకు సూక్ష్మజీవులు, మొక్కలు అన్ని నవామ్లాలని తయారుచేసుకోగలవు. కాని జంతువులు మాత్రం వీటిలో కొన్నింటిని ఆహారం ద్వారా తీసుకోవలసి ఉంటుంది. ఈ అత్యవసర నవామ్లాలు కొన్నింటిని, అవసరం వెంబడి, తినే ఆహారంతో తప్పకుండా తీసుకోవాలి.


మనిషి శరీరానికి 22 రకాల అమీనో ఆమ్లాల కలబోతతో తయ్యారైన ప్రొటీను అవసరమట.
రెండు రకాల అమీనో ఆంమ్లాలట - అవసరమైనవి, అవసరంలేనివి. అవసరమైనవి శరీరం తయ్యారు చేకోలేదట. వీటిని పౌష్టికాహారం ద్వారా పొందాల్సిందేనట. నాన్ ఎసన్షియల్ అమీనో ఆంమ్లాలు శరీరం తయ్యరు చేస్కుంటుందట.
ప్రొటీనుల్లో రెండు రకాలు -
పూర్తి ప్రొటీను అ.క.అ కంప్లీట్ ప్రొటీన్ - ఎసన్షియల్ అనగా అవసరమైన అమీనో ఆంమ్లాలు కలిగినవి. గుడ్లు, పాలు, చేపలు, మాంసం, ఇత్యాదివాటి నుండి పొందవచ్చు
అసంపూర్ణ ప్రొటీను - కావల్సిన అమీనో ఆంమ్లాలన్నీ లేనిది. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పులు లాంటివి.

ఇది గమనించండి - బరువు తగ్గే మార్గంలో ప్రొటీను ఎక్కువ కార్బ్ లో అని తింటుంటే అది మూత్రపిండాలపై తీవ్ర ప్రతాపం చూపుతుందట.

మంచి ప్రొటీన్ మూలాలు -
బందికానాలో పెరగని కోళ్ళు, వాటి గుడ్లు
హార్మోనులు గట్రా ఇవ్వకుండా, యాంటై బైయాటిక్స్ ఇవ్వకుండా, సాధారణ స్థితుల్లో గడ్డి గాదెం తింటూ పెరిగిన వాటినుండి వచ్చిన మాంసం
పాశ్చరైజ్ చేయని, ముడి పాల ఉత్పత్తులు
సముద్రంలో సహజమైన కండీషన్స్ లో పెరిగే, మెర్కురీ లేని చేపలు
మొలకెత్తిన విత్తనాలు
బీన్స్
ముడి ధాన్యాలు

మరి బ్యాడ్ ప్రొటీన్ అనగానేమీ?
వ్యవసాయాధారిత పారిశ్రమల ఉత్పత్తులు పై గుడ్ ప్రొటీన్ ని బ్యాడ్ ప్రొటీన్ గా మారుస్తాయి.

ఉదహరణ -
ఒక ఎకరాకి పది జీవాలని పెంచలైతే, వంద జీవాల్ని కట్టేసి హార్మోన్స్ ఇచ్చి, అసహజ పద్ధతుల ద్వరా ఉత్పత్తి చెసే మాంసాహారాలు తక్కువ క్వాలిటీ ప్రొటీనుతో ఉంటాయట

బంధికానాలో పెంచబడే కోళ్ళు, సహజసిద్ధమైన ఆహారం పెట్టకుండా పెంచినవి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పెంచితే అనారోగ్యాలతో ఉంటాయి అవి, కలుషిత ఆహారంగా మారతాయి.

మీరు చదివే ఉంటారు -
మ్యాక్ డోనాల్డ్స్, కేయఫ్సి లాంటి పెద్ద పెద్ద కంపెణీలు అత్యంత హేయమైన కండీషన్స్ లో మాంసాన్ని ఉత్పత్తి చెస్తాయి.

ఫాం రైజ్ద్ చేపలు అసహజ వతావరణంలో పెంచబడినవాటిల్లో ఒమెగా-3 ఎసన్షియల్ ఫ్యాటీ ఆంలం అతి తక్కువ లేక అస్సలు లేకపోవతం కూడా జరుగుతుందట

May 3, 2010

సమతౌల్యం

ఇందాక దేనికోసమో గెలుకుతుంటే కొన్ని అత్యంత ముఖ్యమైన సూత్రాలు వాక్యాలూ తగిలాయ్. పంచుకుందామని వాటి సారం ఇక్కడ పెడుతున్నా.

మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, తినే తిండిలో ప్రొటీన్ మాత్రమే ముఖ్యం అనుకుంటారు. మాంసాహారం తింటే, అందులో అంతా ప్రొటీనేకదా, కార్బ్స్ ఉండవు కదా, అందుకే అది బెస్ట్ అనుకుంటారు.

ఐతే, అది తప్పు. మనిషికి కావల్సింది కేవలం ప్రొటీనే కాదు, దాంతోపాటు కార్బోహైడ్రేటులు అనగా పిండిపదార్ధాలు కూడా అవసరం. లో కార్బ్ ఇజ్ నో గుడ్. ఓన్లీ ప్రొటీన్ నో గుడ్.

ప్రొటీన్లో కూడా గుడ్ ప్రొటీన్ బ్యాడ్ ప్రొటీన్ ఉంటుంది.
కార్బోహైడ్రేట్స్ లోకూడా గుడ్ కార్బ్స్ బ్యాడ్ కార్బ్స్ ఉంటాయి.
కొవ్వులో కూడా మంచివి చెడ్డవీ ఉంటాయి.

ఏది ఆరోగ్యకరమైన సమతౌల్యతా? అని అడగవచ్చు.
ప్రతీమనిషికీ ప్రొటీన్, కొవ్వు, పిండి పదార్ధాలు అత్యంత అవసరం. శరీరాన్నిబట్టి నిష్పత్తిలో తేడాలు ఉండవచ్చు. సాధారణంగా, సరాసరి, 40-30-30 అనేది రూలట.
అంటే మనం తినే ఆహారంలోంచి
40% శక్తి, అనగా కేలరీసు గుడ్ కార్బోహైడ్రేటులనుండి లభించాలి
30% ప్రొటీన్ నుండి.
30% కొవ్వు నుండి.
పిల్లలకి కొవ్వు ఎక్కువ అవసరం. వారి మెదడు పెరిగే వయసులో కొవ్వుల అవసరం ఉంటుంది. పిల్లలకి చిన్నప్పటినుండే లో ఫ్యాట్ అని ఇస్తే అది మెదడుపై ప్రభావం చుపే అవకాశాలు ఉన్నాయట.

వేగన్స్ - చాలామంది వేగన్స్ లో, విటమినుల లోపం, మినరల్స్ అనగా ధాతువుల లోపం లాంటివి ఉంటాయట. కారణం సంపూర్ణ ప్రొటీను తీసుకోకపోవటం అట. ఈ లోపల వల్ల ఆస్టెయోపొరోసిస్, అనీమియా లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయట. బి 12 విటమిను డెఫిసియన్సీ ఉండే అవకాశం కూడా ఉందట.

కాబట్టి చక్కటి ఆహార సమతౌల్యత అనేది చాలా ముఖ్యం

ప్రొటీన్ -
గుడ్ ఏది, బ్యాడ్ ఏది?
మాంసాహరమే శరణ్యమా ప్రోటీన్ పొందటానికి?
ఎలాంటి సమతౌల్యం పాటిస్తే సంపూర్ణ ప్రొటీన్ పొందవచ్చూ?
కార్బ్స్ -
గుడ్ కార్బ్స్ ఏవి, బ్యాడ్ కార్బ్స్ ఏవి?
కొవ్వు -
గుడ్ కొవ్వు బ్యాడ్ కొవ్వు ఏంటీ?

ఒక్కోసారి ఒక్కోటి!!

May 1, 2010

శ్రీ మహా సుదర్శన యజ్ఞం

కేన్సస్ లోని "కేన్సస్ హిందూ దేవాలయ సంఘం" వారు, మే 16, 2010 న శ్రీ మహా సుదర్శన యజ్ఞం చేయనున్నారు.



మే 7 నుండి కార్యక్రమాలు మొదలు. రోజువారీ కార్యక్రమాల వివరాలు ఇక్కడ చూడవచ్చు


పాల్గొనదలచిన వారు గుడి పాలకవర్గాన్ని సంప్రదించి వివరాలను పొందవచ్చును. గుడి వెబ్సైటు -
http://htccofkc.org