Sep 3, 2009

ఎన్నో పాఠాలు - మరెన్నో గుణపాఠాలు

ప్రతీమనిషి, తనజీవత ప్రయాణంలో ఎన్నో తప్పులు చేస్తాడు. కొన్ని అవసరంకోసం, కొన్ని అవకాశంకోసం, కొన్ని తెలియక కొన్ని తెలిసి. చేసినతప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా తననితాను ఒక మార్గంలో పెట్టోగలిగనవాడు గొప్పవ్యక్తి.
డా॥ రాజశేఖర్ రెడ్డి ఇకలేరు అని తెలిసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు లిప్తపాటు ఉబికాయ్. నాలుగురోజుల క్రితందాకా నాకు ఆయనంటే మహా ఇష్టం. అది వంతెన కూలినట్టు కూలిండానికి కారణం - మతప్రాతిపదికన రిజర్వేషన్స్ అని దళితక్రిస్టియన్లను యస్.సి లో చేర్చాలన్నప్పుడు. ఇందులో ఆయనకి ఒరిగేది కేవలం ఓట్లే.
ఏమైనా, కొన్ని కొన్ని తెలుసుకోవాలంటే యూనివర్సిటీలకో లేక లైబ్రరీలకో వెళ్ళి గంటలు గంటలు రోజులు రోజులు సమచ్చరాలు శ్రమపడేకన్నా మన కళ్ళముందు తిరుగుతున్న నడుస్తున్న జనాలనుండి సమాజంనుండీ నేర్చుకోవచ్చు. అందుకే మనం సంఘజీవులం.
రాజశేఖర్ రెడ్డి నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ధైర్యం
చెయ్యదల్చుకున్నది చేసేయ్యటం
మొండితనం
పట్టుదల
దీక్ష
అన్నిటికన్నా ముఖ్యమైనది - రెస్పానిబిలిటీ. నే ఛాలెంజ్ చేస్తా, ఏ రాజకీయనాయకుడైనా, ఓడినా గెలిచినా నాదే బాధ్యత అనగలడా? బెట్. ఈయన అన్నాడు. ఒక్కడు, ఒక్కడు కూడా కాంగ్రేస్ కి ఎలక్షన్ క్యాంపేయిన్ చేయలేదు, కేవలం రెడ్డే చేసాడు. కాంగ్రేశ్ అంటే రెడ్డే అనేలా నిలబడ్డాడు. కాదంటారా?


ప్రతీమనిషిలో చెడు ఉంటుంది, మంఛీ ఉంటుందీ. చెడుని వదిలేయండీ, మంచిని గ్రహించండి.

ఇదో గుణపాఠం కావాలి రాజకీయనాయకులకు - ఎన్ని వేషాలు వేసినా, ఎంత సంపాదించినా, చివరకి మిగిలేది చేసిన మంచి మాత్రమే. యాభైవేల కోట్లు సంపాదించినా, శుద్ధ దండగ. పైకి పట్టుకెళ్ళలేరు. కాబట్టి కనీసం ఇకనైనా ప్రజలకు అంకితం కండి.

ఇకనైనా పాలనా యంత్రాంగం గట్టి పాఠాలు నేర్చుకోవాలి. సి.యం లాంటి వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు తీస్కోవాల్సిన జాగ్రత్తలు, ముందుగుగానే రాబోయే రిస్క్స్ ని ఎసెస్ చేయగల మేనేజ్మెంట్ని దత్తత తీస్కోవాలి.

ఇక -
ఇప్పుడేంటి?
కాంగ్రేస్ కి ఇది ఘోరమైన దెబ్బ. మన రాష్ట్రానికి కూడా. 2004 వరకూ, కాంగ్రేస్ లో ప్రతీ చెంచా నాయకుడే. అలాంటి, నెత్తిన పావలా పెట్టినా పదిపైసలక్కూడా ఎవడూ కొనని పార్టీని, భుజానేస్కుని, గెలిపించి, చెంచాలన్నిట్నీ వంచేసి ఇరగ్గొట్టి కరిగించేసి, అన్నిటా తానై, అన్నీ తానై వొంటిచేత్తో రెడ్డి నడిపించాడు. 2009 ఎన్నికల్లో కూడా అదే పున్రావృతం అయ్యింది. రెడ్డితప్ప మరే గొంతుకా కనీసం వినపళ్ళేదు. చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయ్. ఇంకోవైపు రెసిషన్. ఇలాంటి పరీస్థితుల్లో ఇలా జరగటం పెనుతుపానులో చుక్కాణి లేని నావలా అయ్యింది.

ఏమైనా - రెడ్డి ఆత్మ శాంతి పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం.

[ప్రతీ ప్రాజెక్టుకీ, ప్రతీ రోడ్డుకీ ప్రతీ పెన్నుకీ కలానికీ కాయితకానికీ రాజీవ్ అనే పేరుపెట్టిన రెడ్డి, పాపం రాజీవ్లా అర్ధాంతరంగా, రాజీవ్లా గుర్తుపట్టాలేనట్టుగా శరీరాన్ని విడవటం కేవలం యాధృచ్చికం]

9 comments:

  1. అన్నిటికన్నా ముఖ్యమైనది - రెస్పానిబిలిటీ. నే ఛాలెంజ్ చేస్తా, ఏ రాజకీయనాయకుడైనా, ఓడినా గెలిచినా నాదే బాధ్యత అనగలడా? బెట్. ఈయన అన్నాడు. ఒక్కడు, ఒక్కడు కూడా కాంగ్రేస్ కి ఎలక్షన్ క్యాంపేయిన్ చేయలేదు, కేవలం రెడ్డే చేసాడు. కాంగ్రేశ్ అంటే రెడ్డే అనేలా నిలబడ్డాడు. కాదంటారా?
    idi 100% correct

    ReplyDelete
  2. భాస్కర్ గారు చెప్పినదానితో ౧౦౦% ఎకిభావిస్తున్నా. రిజర్వేషన్ల విషయం లో నేను ఎప్పుడు వ్యతిరేకినే..(ప్రతిభకు గొడ్డలిపెట్టు ఈ రిజర్వేషన్లు).

    నా అనుభవం లో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా వైయస్ దగ్గర నాకు నచ్చే గుణం - నమ్మిన వారిని, సహాయం చేసిన వారిని ఎప్పుడు గుర్తు పెట్టుకొని తనకు దొరికిన అవకాశంతో వారికీ సహాయం చేయటం. దీని వల్లనే ఆయనకు చాల మంది అభిమానులు ఏర్పడ్డారు.

    భాస్కర్ గారు అన్నట్టు యాధృచ్చికంగా ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.

    ReplyDelete
  3. రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

    ReplyDelete
  4. రాజకీయం బాలన్సు తప్పుతుంది అన్నా.

    ReplyDelete
  5. ప్రతి వాక్యం, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకున్న తీరుతో సహా 100% ఏకీభవించాల్సిందిగా ఉంది. ఆయన స్థాయి రెండో నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ కి గట్టి దెబ్బే!

    సి.యం లాంటి వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు తీస్కోవాల్సిన జాగ్రత్తలు, ముందుగుగానే రాబోయే రిస్క్స్ ని ఎసెస్ చేయగల మేనేజ్మెంట్ని దత్తత తీస్కోవాలి. ఈ మాట మరో ఆక్సిడెంట్ జరిగినపుడు మాత్రమే ప్రభుత్వానికి గుర్తొస్తుంది. (ఇప్పటికి పరిస్థితి చేయిఎలాగూ దాటింది కాబట్టి)

    "ధైర్యం
    చెయ్యదల్చుకున్నది చేసేయ్యటం
    మొండితనం
    పట్టుదల
    దీక్ష
    అన్నిటికన్నా ముఖ్యమైనది - రెస్పానిబిలిటీ" అవును, ఇన్ని లక్షణాలు, అందునా రాజకీయ నాకుడిని ఉండటం అరుదే!

    ఒంటి చేత్తో కాంగ్రెస్ ని నడిపించిన ధీరుడు. నిన్న ఒక మీడియా ఛానెల్లో చెప్పినట్లు ఆయన మొత్తంగా "ఒక ధీర జ్ఞాపకం"!

    ReplyDelete
  6. ప్చ్--ఎందుకో ఇది ఇలా జరిగుండకూడదు అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

    ReplyDelete
  7. ఆయన వ్యక్తిత్వం గురించి చక్కగా చెప్పారు.
    ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.
    మీ ఊహ కరక్టే అయ్యిందండి..కానీ అలా ఎందుకు వెతకలేకపోయారో అధికారులు మరి..ఆశ్చర్యం!

    ReplyDelete