మొన్నటి వారాంతం సంగీత విభావరిలో సునీత, కొన్ని పాతవి కొన్ని కొత్తవి పాడుతూ, మధ్యలో సరే ఇప్పుడు ఓ కమ్మని కీర్తన పాదుకుందామా అంది, స్టేజివద్ద గుమిగూడిన చిన్నచితక పిల్లలవైపు చూస్తూ..
ఓ అమ్మాయి, బహుశా ఆరేడేళ్ళు ఉంటాయేమో...
ఓ!! భలె భలె!! ఐతే *బంగారు కోడిపెట్ట* కీర్తన పాడు సునీతా అని అరిచింది.
Sep 30, 2009
Sep 28, 2009
అప్పుడే సమచ్చరం అయ్యిందేం!!
http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_10.html
పోయినేడాది, ఇదే రోజున, అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి, శ్రవణా నక్షత్రంలో ఈ పిల్ల పుట్టింది. అనఘ అని పేరు పెట్టాం. అనఘ అనగా అనగనగా, దత్తాత్రేయస్వామి వారి సతి, మరియూ *సిన్లెస్* అని అర్ధం. అప్పుడే సంవత్సరం అయింది.
అన్న అన్నా అంటోంది. ఒరేయ్ ఒరేయ్ అంటోంది. బుడిబుడి అడుగులు వేస్తోంది. మమ్మల్ని ఆనందసాగరంలో ముంచెస్తోంది.
విజయదశమి, మాకు జంట ధమాక. అమ్మవారు సకల గుణాలనూ హరించిన వేళ, విజయకేళ!! మరియూ పిల్లపుట్టినరోజు వేడుక.
ఈరోజు పూజలు పునఃస్కారాలు మరియూ పుట్టినరోజు సంబరాలతో తేలియాడుతాం మేము. మీరూ ఈ విజయదశమి అమ్మవారిని పూజించి ఆనందంతోపాటు అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ విజయదుర్గ కృపకు పాతృలౌవ్వాలనీ కోరుకుంటాం -
భాస్కర్, హరిత, సూర్య మరియూ అనఘ.
ఇక మా ఊళ్ళో ఓ పడుచుంది, పాట అంటే ఇష్టమన్నది. నిజం!!
నిన్న మా ఊళ్ళో సునీత, శ్రీకృష్ణల బృందం వారి సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి నేనూ ఓ కార్యకర్తను, స్పాన్సర్ని కూడా.
ఆ వివరాలు -
ఆల్బనీలోని హిందూ దేవాలయం వారి హిందూ కల్చెరల్ సెంటర్ నందు, ఆల్బనీ తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో నిన్న (సెప్టెంబర్ 27) శ్రీమతి సునీత గారి "సంగీత విభావరి" వీక్షకులకు సంగీత విందునందించింది.
మహార్ణవమి మధ్యానం 2 గంటలకు మొదలైన కార్యక్రమం 3.30 గంటలపాటు ఆధ్యంతం ఉర్రూతలూగించింది. కేరింతలు కొట్టించింది. పిన్నలనుండి పెద్దలవరకూ అందరిచేతా నాట్యం చేయించింది. కార్యక్రమానికి వేంచేసిన దాదాపు 400 మంది సునీత శ్రీకృష్ణల గానాంమృతపు జడివానలో తడిసిముద్దైయ్యారు.
గణేశస్తుతి తో మొదలైన కార్యక్రమం, సునీత పాడిన సోలోలనుండి, శ్రీకృష్ణతో కలిపిన యుగళాగీతాలు, ఆపాత మధురాలు, కొత్తసింగారాలతో కలిసి, ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో నుండి తకిటతధిమి తకిటతధిమి థిల్లానా లను తాకుతూ,
సిరిసిరిమువ్వ లోని ఘుమ్మంది నాదం నుండి సిరివెన్నెలలోని విధాత తలపున వరకూ, నేటి యమదొంగ నుండి జల్సా, మగధీర చిరుతల నుండి గోదావరి, ఆనంద్ ల వరకూ ప్రేక్షకులకు వీనులకు విందు చేసింది.
http://albanyandhra.com/

Labels:
అనఘ,
జ్ఞాపకాల దొంతర,
నిజ ప్రదర్శనలు,
పాటలు,
పిల్లకాయలు
Sep 23, 2009
చదువు శక్తిని బయటకి లాగుద్ది
Education unlocks potential - Obama.
నిన్న, పెసినెంటు మాఊరొచ్చాడని చెప్పాకదా. ఆయన తన ప్రసంగంలో పైమాటలు చెప్పాడు.
ఔను నిజమే. చదువు పొటెన్షీల్ ని బయటకు తెచ్చుద్ది. ఐతే, అది సరైన విద్యావిధానంతో మాత్రమే సాధ్యం. జ్ఞానాన్ని ఇవ్వలేని చదువు వ్యర్ధం.
నాకు గుర్తుకొస్తున్నాయి, ఆరోజులు గుర్తుకొస్తున్నాయి...చక్రాలు చక్రాలు...
ఆరోజుల్లో, నేను స్థానిక రాయపాటి వెంకట రంగారావు మరియూ జాగర్లమూడి చంద్రమౌళి కాలేజి ఆప్ వింజనీరింగు [అ.క.అ RVR & JC College of Engineering] లో సదివే రోజుల్లో, మా కాలేజిఓళ్ళు పదేళ్ళ సరిత్రకి అద్దంగా ఓ పెద్ద బిల్డింగు కట్టి *డెసీనియల్ బిల్డింగ్* అని నామకరణం జేసి, దాన్ని ఓపెనింగుకి పెదానమంత్రి గారిని పిల్చారు.
టట్టడాయ్, పెదానమంత్రి ఎవురు ఎవురు ఎవురు!! ఎవురు ఎవురు ఎవురు!!! అని అలోచిస్తున్నరా? ಹರದನಹಳ್ಳಿ ದೊಡ್ಡೇಗೌಡ ದೇವೇಗೌಡ, హరిదనహళ్ళి దొడ్డగౌడ దేవెగౌడ.
ఇంకేముంది. హడావిడి. బ్యారికేడ్లు, అవీఇవి, *బ్లీచింగుపౌడర్లు* కుమ్మేసారు మొత్తం.
హెలీకాప్టరు రానేవచ్చింది.
ధడ్ ధడ్ ధడ్ మని దిగింది. కమేండోలు, బ్లాక్ క్యాట్లు తెల్ల క్యాట్లు...నింగికెగసిన దుమ్ము, నా కళ్ళల్లో నీళ్ళంటే నమ్ము [ఆ దుమ్ము వల్ల].
ఎవురెవరు దిగిన్రుమియా అంటే
ಹರದನಹಳ್ಳಿ ದೊಡ್ಡೇಗೌಡ ದೇವೇಗೌಡ, హరిదనహళ్ళి దొడ్డగౌడ దేవెగౌడ, శ్రీమతి శారద [సినీనటి అప్పటి తె.దె.పా తెనాలి సిట్టీంగు యమ్మ.పియ్య [యం.పి] ఇంకా ఎవురో ఉన్నరయ్యా, గుర్తొస్తల్లే.
సరే వచ్చారు. మొదటగా సినీనటి, యం.పి ఊర్వశి శారద గారు మాట్టాట్టం మొదలెట్టారు. మరి వేదిక మీద సానామంది పెద్దలు కొలువుతీరారు. ఆమేదో సినీమాటిగ్గా వాగేస్తోంది.
ముందుకూర్చున్న కొందరు కుఱ్ఱాళ్ళు ఆమెవైపు ఆశగా సూత్తన్నారు. నాలాంటి ఎనకబెంచి కుఱ్ఱాళ్ళు సూడాల్సింది సూసేసారు.
అదేమరి, అలా అడక్కూడదు. ఏంజూసాం?
సెప్తాగా -
ಹರದನಹಳ್ಳಿ ದೊಡ್ಡೇಗೌಡ ದೇವೇಗೌಡ, హరిదనహళ్ళి దొడ్డగౌడ దేవెగౌడ, సమయం దొరికిందికదా అని గురకతీసున్నడు.
పాపం శారదాదేవి వాగేసి మంచీళ్ళు తాగటానికని బాయ్ అని సెప్పేసింది. ఇంకెవరో అందుకున్నారు. వాళ్ళు మైకుమీన మామీన పగతీర్చుకున్నారు. ఇలా అందరూ అయిపోతున్నారు. ఆయన గురక ఎక్కువైంది. అందరూ అయిపొయ్యారు. మరి దొరగార్ని ఎవురు లేపాల?
కొంటెకుఱ్ఱకారు ఊర్కుంటరానే, సప్పట్లు నాలుగంతలు పీకవతలేస్తే, పాపం దెబ్బకి దడ్సుకుని లేచికూకున్నాడు దొర.
ఏదో సెప్పాడు. అర్ధంకాలే. ఇప్పటికీ ఏంజెప్పాడో అర్ధంకాలే, మద్దెన ఓ పెద్దగా ఆవులు మేకలు [ అనగా ఆవులింతలు] ఇచ్చి, ఆ ఓపెనింగు స్పిచ్చి నొక్కెసి హెలీకాప్టర్ ఎక్కేసి దొబ్బెసాడు.
సరే ఇక ఇప్పటికి వస్తే -
నిన్నటి పెసినెంటుగారి ప్రసంగం -
President Obama’s address text:
Thank you, Jill. Dr. Jill Biden has been a teacher for almost three decades and she’s spent most of that time in community colleges. She understands, as you do, the power of these institutions to prepare students for 21st century jobs, and to prepare America for a 21st century global economy. That’s what’s happening right here at Hudson Valley Community College. This is a place where anyone with the desire to take their career to a new level or start a new career altogether has the opportunity to pursue that dream. This is a place where people of all ages and backgrounds – even in the face of obstacles, even in the face of very difficult personal challenges – can take a chance on a brighter future for themselves and their families.
I know that here in Troy, you want and need that chance after so many years of hard times. Communities like this one were once the heart of America’s manufacturing strength. But over the last few decades, you’ve borne the brunt of a changing economy which has seen many manufacturing plants close in the face of global competition. So while all of America has been gripped by the current economic crisis, folks in Troy and upstate New York have been dealing with what amounts to a permanent recession for years: an economic downturn that has driven more and more young people from their hometowns.
I also know that while many have come here promising better news, that news has been hard to come by, despite the determined efforts of the leaders who are here today and many who are not. Part of the reason is that while the people of this city work hard to meet their responsibilities, some in Washington haven’t always lived up to theirs. For too long, as old divisions and special interests reigned, Washington has shown neither the inclination nor the ability to tackle our toughest challenges. Meanwhile, businesses were saddled with ever-rising health care costs and the economy was weakened by an ever-growing dependence on foreign oil; our investments in cutting-edge research declined and our schools fell short; growth focused on short-term gains and fueled by debt and reckless risk led to cycles of precipitous booms and painful busts.
మిగతాది మాఊరి వార్తాపుత్రిక సమించండి పత్రికలో సదూకోండేం!! టైంస్ యూనియన్ వార్తాపత్రిక

Sep 21, 2009
ఎట్టెట్టా!!
పెదానమంత్రి మనూరొత్తన్నాడంటే -
బ్యారికేడ్లు
మైకులు
పాటలు
బిర్యాని
సారాయి
లారీలు
ట్రాకటేర్లు
పందిళ్ళు
తాటాకుల చప్పుళ్ళు
సర్విబాదులు
తాడిచెట్లమానులు
రంగురంగుల త్రికోణాకార కాయితకాలు
నులక తాళ్ళు
గుండిగలకొద్ది ఉడకబెట్టే మైదా
వాల్పోస్టర్లు
పెద్దపోస్టర్లు
నిలువెత్తు బొమ్మలు
గులాబీదండలు
కొండకచ్చో పాలాభిషేకాలు
గోడలనిండా రాతలు
ఆవులు బఱ్ఱెలనిండా గీతలు
హెలీకాప్టర్ ధనధనలు
పోలీసుల పహారాలు
సెక్కింగులు
ట్రాపిక్కు జాములు
ఓ!! ప్రతీ స్థానిక నాయకుడి బలిమి ప్రదర్శన
నిరసన ప్రదర్శనలు
అలిగేవాళ్ళు
బుజ్జగించేవాళ్ళు
.....ఉఫ్!!!
ఇయ్యాల మా ఊరికి అమెరికా ప్రెసిడెంటు పుల్లయ్య అదేనయ్యా, బారక్ ఒబామా వస్తండు
హడ్సన్ వ్యాలీ కమ్యూనిటీ కాలేజి లో ఏదో ఓపెనింగు
అయ్యాక
ఏయండి వాడి చిప్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఓపెనెంగు
ఎక్కడా ఆ ఊసేలేదు
బ్యారికేడ్లు లేవు
పోలీసుల బూట్ల చప్పుడు లేదు
మందు లేదు లేరీల్లేవు ట్రాక్టర్లమీన జనాల్ని తోలించండంలేదు
చివరాకరికి బిర్యానీపొట్లాకూడా లేవు
జెండా రెపరెపల్లేవు
కాయితకాల కట్టింగుల్లేవ్
నిలువెత్తు బొమ్మలేవు
ఆటికి దండల్లేవు
అలిగే వాళ్ళు అలుగుతున్నారు
ఏడ్చేవాళ్ళూ ఏడుత్తున్నారు
నవ్వేవాళ్ళు హెపీస్ గా నవ్వుకుంటన్నారు..
మనలాటి జనం ఇలా బ్లాగుల్రాస్కున్టన్నారు
అదీ కధ
ఇప్పుడే అందిన వార్త -
హడ్సన్ వ్యాలీ కం। కా॥ లో ఇచ్చే స్పీచ్ అందరికీ కాదని, కేవలం ఆహ్వానితులకి మాత్రమే అని విశ్వసనీయవర్గాల భోగట్టా.
కొందరు కుళ్ళేవాళ్ళు ఇలా కుళ్ళుతున్నారనిన్నిన్నిన్ని కూడా భోగట్టా *ఆహ్వానాలను* ఈబే లో పెద్ద మొత్తాలకు అమ్ముతున్నారటటట.
పెసిడేంటుని *యూ ఈడియట్* అనేసి పేరు ప్రఖ్యాతులు పొందగోరేవాళ్ళు కూడా ముసుగులో ఉన్నారని జనాలు జుట్లలో పేలు పీక్కుంటూన్నారు [చెవులు కొరుక్కోటం రోటీను, మనం ఎప్పటిలాగే రొటీనుకి భిన్నంగా].

ఊదర,
కవిత,
కాలచ్చేపం బఠాణీలు,
నా దృష్టిలో,
పచ్చిమం,
రాజకీయం
Sep 17, 2009
ఏడ్చే మనసులు
పరీస్థితుల సంకెళ్ళు
నడకలునేర్చిన కాళ్ళు
అక్కరకురాని వాళ్ళు
కళ్ళల్లో నీళ్ళు
కాదని దూరంలాక్కెళ్ళే రోడ్లు
పాడైపోయిన గూళ్ళు
ఎండిపోతున్న చిగుళ్ళు
ఒంటరైపోతున్న బతుకులు
నవ్వుకుంటున్న స్వార్ధం
బిక్కచచ్చిపోతున్న అభిమానం
ఇదేనా జీవితానికి అర్ధం?
ఇది అర్ధంచేస్కోలేని మన బతుకులు వ్యర్ధం!!

Sep 7, 2009
బడిబాగోతం - 200వ పోస్టు
ఆరోజుల్లో బళ్ళోజేరడం అంటే, ఎళ్ళటవ్, జేరడం అంతే. ఒకటో కలాసు అంటే ఓ పలక, ఓ బలం, ఓ జోలెసంచి గుడ్డదే. నెత్తికి నాలుకిలోల ఆవుదం. బుగ్గలమీన పౌడ్రి. కాళ్ళకి సిల్పర్లు. [అనవర్గారూ - ఈ వర్ణనతో ఓ బొమ్మ, ప్లీజూ]
ఇక రెండో మూడో కలాసుకొస్తే, లెపాక్షి నోటుబుక్కు. ఒకటో రెండో. అంతే. నాలుక్కో ఐదుకో నాలుగు నోటుబుక్కులు.
తర్వాతర్వాత నోటూబుక్కులు పెరిగిపొయ్యి ఒక్కో సబ్జెక్టుకి ఒక్కోటి. మరి లెక్కలు గట్రా సేసోటానికి పొడుగు నోటుబొక్కు. యాణ్ణుంచీ? కుట్టుకోడమే.
ఠావులు తెచ్చుకుని, పెద్ద సూత్తో [కొందరు టంకంతో], టయందారం పెట్టి కుట్టుకునేవాళ్ళం. భలే ఉండేయి ఆ నోటుబొక్కులు. సిరిగిపొయ్యేవి కావు. కొన్నికొన్ని సార్లు ఠావులు సింపి సగం నోటుబొక్కులు కుట్టుకునేవాళ్ళం. ఎలా, రెండుమూడు ఠావుల తీస్కుని మద్దన దారంపెట్టి సింపేసి కుట్టుకునే వాళ్ళం
ఇక అట్టలు. సోవియట్ భూమి పుస్తకాలు తెచ్చుకుని, పిన్నులు పికేసి, అట్టలేస్కునే వాళ్ళం. మమూలట్ట, దొంగట్ట. దొంగట్టేస్తే సెక్కుసెదిరేది కాదు సమచ్చరం మొత్తం. అట్టానే ప్రంట్ లైన్ మద్దెన మూడు పేజీలు, సివరి రెండుపేజీలి భలే గట్టిగుండేవి.
ఏందయ్యా ఈ ఉపోద్ఘాతం అంటే, సూరిగాడు బళ్ళో పడ్డాడు. బడి దారిన పడ్డాడు. ప్రి-కె అంట, కె-ఫోర్ అంట. పొద్దున్నే 8.10 కి దింపాల్నంట. 11.30 కి ఇంటికెత్తుకెళ్ళొచ్చంట. పోయినేడాది జేర్చాం కే-త్రీలో. అమ్మవస్తే వెళ్తా లెకపోతే ఎళ్ళ అన్నాడు. ఓ రోజు దింపేసి ఆళ్ళ అమ్మ దాక్కుంది ఏంజేస్తాడో చూద్దాం అని. అంతే లంకించుకున్నాడు. గో ఎవే, ఐ వాంట్ మై మాం, లెట్ మి గో హోం, ఆల్ బై మైసెల్ఫ్ అని అందర్నీ తోసేసి నెట్టేసి గందరగోళం చేసాడు. ఈసారి, పపం వాళ్ళ అమ్మ బాగనే ట్రైనింగ్ ఇచ్చింది నెల ముందునుండి. పాటీ ట్రైనింగ్ అయ్యాడు. వాడికి వాడే బ్రష్ చేస్కుంటున్నాడు. అన్నీ *ఆల్ బై మైసెల్ఫ్* అనే ట్యాగ్ పెట్టేస్కుంటాడు. ఈ మద్దన స్నానం కూడా ఆడే. జలకాలాటలు. రోజుకి నాలుగుసార్లు. తొట్టిస్నానం కూడా చేస్తున్నాడు.
మొట్టమొదటిరోజు, ఏంచేస్తాడో నాయనా అని గుండెలు దడదడలాడతా ఎళ్ళినా. మొత్తానికి, పాతికమంది పిల్లకాయలు. పారెనర్స్ మాత్రం నలుగురున్నారు. నిగతా అంతా మనోళ్ళే. సగం తెలుగే అనుకుంటా. ఆణ్ణి దింపి ఓ ఐదునిమిషాలున్నా. కొంతమంది లంకించుకున్నారు. ఏదుపులు, శోకాలు. మనోడుమాత్రం గుంభనంగా కూకున్నాడు. అరేయ్, ఎళ్తన్నా, అనిసెప్పా. ఓకే, నో ప్రాబ్లం, టెన్షన్ పడకూ అని చెప్పాడు. 11.30 వచ్చా. ఏట్రా అన్నా. నేను ఏడ్వలేదు, నేను గుడ్బాయ్, నాకు మిస్ ఓబులేసు [ఏదోపేరు నాకు నోరు తిరగటల్లా] స్టికర్లు రెండు ఇచ్చింది అని పొంగిపొర్లి కిందపడి దొర్లాడు. ఇప్పటికి మూడ్రోజులు అయ్యింది. నాలుగు స్టిక్కర్లు అందుకున్నాడు, అంటించుకున్నాడు.
మూడ్రోజులకే తెలుగు మారింది. మేము ఇంటికాడ తెలుగే అని నిక్కొవక్కాణిస్తున్నాం.
ఇదీ సూరిగాడి బడిబాగోతం
200 వ పోష్టు సందర్భంగా నా 10k నడక, అంకితమిస్తున్నా
Name: iMapMyRun Sep 6, 2009 11:02 PM
Type: Regular Walk
Date: 09/06/2009
Start: 21:14:52
End: 23:00:54
Time Taken: 01:46:02
Workout Route: iMapMyRun Sep 6, 2009 11:02 PM
Total Distance: 6.38 mi.
Workout Stats
Pace: 16:36 (avg)
Speed: 3.61 (mi/hr) (avg)
http://www.mapmyfitness.com/view_workout?w=590125229256021045

Sep 5, 2009
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
తల్లి తండ్రులతర్వాత గురువే ప్రత్యక్ష దైవం.
"ప్రిన్సిపాలు కుక్కలా తిరుగుతున్నాడు" అనే సంస్కృతినుంచి మళ్ళీ గురువుని పూజించే రోజులు రావాలని ఆశిస్తూ, ప్రపంచెమ్లో ఉన్న ఉపాధ్యాయులందిరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న.
నాకు ఈరొజున నా నాలుగు వేళ్ళు నోట్టోకి వెళ్ళేందుకు సరిపడా జ్ఙానాన్ని ప్రసాదించిన అందరు గురువులను(కూ), నా తండ్రీ, గురువు ఐన మా నాన్న(కి) ఒక్కసారి తల్చుకుంటు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

Sep 4, 2009
నే ఊహించింది కరెక్టే అన్నమాట
మొన్నటి నా పోస్టు వై.యస్.ఆర్ మిస్సింగ్, ఆతర్వాత ఏంటీ? లో
నా కామెంట్లు -
బాస్కర్ రామరాజు said...
ఏవరేజిన గంటకి 100 మైళ్ళచొప్పున హెలీకాప్టర్ వెళ్తే, వై.యస్.ఆర్ 8.35 కి బయలుదేరితే, 9.12 కి కర్నూల్ కి దగ్గర్లో కనెక్స్తన్ తెగిపోతే, కర్నూల్, శ్రీశైలం మరియూ మాల్యాల/ఆత్మకూరు దరిదాపుల్లో ఎక్కడో ల్యండ్ అయి ఉండాలి. ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఐతే, ఆ ప్రాంతం అంతా రాయి, కొండలమయం కాబట్టి ల్యాండింగ్ అంత స్మూత్ కాదు అని నాకనిపిస్తోంది. తక్కువ ఎత్తులో ఒకవేళ ప్రాణాలు కాపాడుకోటం కోశం దూకినా, ఒక దరికి చేరటం అంత ఈజీకాదేమో అనిపిస్తోంది. కారణం, ఆ కొండలు క్లిఫ్స్ లాగా ఎరోజ్షన్స్ కి గురైనట్టుగా ఉంటాయ్. స్లిప్ ఐతే పది ఇరవై లేక అంతకన్నా ఎక్కువ అడుగుల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది.
......................
భాస్కర్ రామరాజు said...
చదువరి గారూ!!
రేపటికి అనగా 3 september పొద్దునకల్లా ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా?
నాకెందుకో రాంగ్ ప్లేస్ లో వెతుకుతున్నారేమో అనిపిస్తోంది.
కర్నూల్ శ్రీశైలం ల మధ్య వెతుకుతున్నారు. కర్నూల్ నుండి ఆత్మకూరు కు ఒక గీతగీస్తే పైన ఉండేది శ్రీశైలం అడవులు గట్రా. ఇవి వందకిలోమీటర్ల రెంజి హై. నుండి.
కింద (గీతకి కిందవైపు) నందికొట్కూర్ నుండి నంద్యాల వైపుగా ఏమైనా గాలిస్తున్నారా?
...................
భాస్కర్ రామరాజు said...
కారణం ఏంటంటే
కొందరు 9:12 కి రాడార్ లోంచి మాయం అన్నారు. అది వంద కిలోమీటర్ల రేంజి.
కొందరు 9:35 కి అన్నారు. అది నూట అరవై కిలోమీటర్ల రేంజి అయ్యింది.
..........
హైద్ నుండి వంద కిలోమీటర్ల రేంజ్ అంటే శ్రీశైలం
హైద్ నుండి 160 కిలోమీటర్ల రేంజ్ అంటా ఇంకా కిందకి.
నేనూహించిందే కరెక్టు అయ్యింది.
పావురాళ్ళగుట్ట అనేది ఆత్మకూరుకన్నా కిందకి ఉంది. వెలుగోడు ప్రాజక్టుకి దగ్గర్లో.
సరే!! పెద్దలకి నాదొక ప్రశ్న.
ఇది కొంచెం తిక్కగా ఉండొచ్చు, కానీ ఉత్సుకతతో అడుగుతున్నా.
ప్రయాణించే ప్రతీవారి జాతకాల్లో ఏదోక కామన్ పాయంట్, అన్నీ కలిపితే ఒకే సరళరేఖపైకి వస్తాయా? లేకపోతే ఇలా ఎలా జరుగుతుంది?

Sep 3, 2009
ఎన్నో పాఠాలు - మరెన్నో గుణపాఠాలు
ప్రతీమనిషి, తనజీవత ప్రయాణంలో ఎన్నో తప్పులు చేస్తాడు. కొన్ని అవసరంకోసం, కొన్ని అవకాశంకోసం, కొన్ని తెలియక కొన్ని తెలిసి. చేసినతప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా తననితాను ఒక మార్గంలో పెట్టోగలిగనవాడు గొప్పవ్యక్తి.
డా॥ రాజశేఖర్ రెడ్డి ఇకలేరు అని తెలిసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు లిప్తపాటు ఉబికాయ్. నాలుగురోజుల క్రితందాకా నాకు ఆయనంటే మహా ఇష్టం. అది వంతెన కూలినట్టు కూలిండానికి కారణం - మతప్రాతిపదికన రిజర్వేషన్స్ అని దళితక్రిస్టియన్లను యస్.సి లో చేర్చాలన్నప్పుడు. ఇందులో ఆయనకి ఒరిగేది కేవలం ఓట్లే.
ఏమైనా, కొన్ని కొన్ని తెలుసుకోవాలంటే యూనివర్సిటీలకో లేక లైబ్రరీలకో వెళ్ళి గంటలు గంటలు రోజులు రోజులు సమచ్చరాలు శ్రమపడేకన్నా మన కళ్ళముందు తిరుగుతున్న నడుస్తున్న జనాలనుండి సమాజంనుండీ నేర్చుకోవచ్చు. అందుకే మనం సంఘజీవులం.
రాజశేఖర్ రెడ్డి నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ధైర్యం
చెయ్యదల్చుకున్నది చేసేయ్యటం
మొండితనం
పట్టుదల
దీక్ష
అన్నిటికన్నా ముఖ్యమైనది - రెస్పానిబిలిటీ. నే ఛాలెంజ్ చేస్తా, ఏ రాజకీయనాయకుడైనా, ఓడినా గెలిచినా నాదే బాధ్యత అనగలడా? బెట్. ఈయన అన్నాడు. ఒక్కడు, ఒక్కడు కూడా కాంగ్రేస్ కి ఎలక్షన్ క్యాంపేయిన్ చేయలేదు, కేవలం రెడ్డే చేసాడు. కాంగ్రేశ్ అంటే రెడ్డే అనేలా నిలబడ్డాడు. కాదంటారా?
ప్రతీమనిషిలో చెడు ఉంటుంది, మంఛీ ఉంటుందీ. చెడుని వదిలేయండీ, మంచిని గ్రహించండి.
ఇదో గుణపాఠం కావాలి రాజకీయనాయకులకు - ఎన్ని వేషాలు వేసినా, ఎంత సంపాదించినా, చివరకి మిగిలేది చేసిన మంచి మాత్రమే. యాభైవేల కోట్లు సంపాదించినా, శుద్ధ దండగ. పైకి పట్టుకెళ్ళలేరు. కాబట్టి కనీసం ఇకనైనా ప్రజలకు అంకితం కండి.
ఇకనైనా పాలనా యంత్రాంగం గట్టి పాఠాలు నేర్చుకోవాలి. సి.యం లాంటి వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు తీస్కోవాల్సిన జాగ్రత్తలు, ముందుగుగానే రాబోయే రిస్క్స్ ని ఎసెస్ చేయగల మేనేజ్మెంట్ని దత్తత తీస్కోవాలి.
ఇక -
ఇప్పుడేంటి?
కాంగ్రేస్ కి ఇది ఘోరమైన దెబ్బ. మన రాష్ట్రానికి కూడా. 2004 వరకూ, కాంగ్రేస్ లో ప్రతీ చెంచా నాయకుడే. అలాంటి, నెత్తిన పావలా పెట్టినా పదిపైసలక్కూడా ఎవడూ కొనని పార్టీని, భుజానేస్కుని, గెలిపించి, చెంచాలన్నిట్నీ వంచేసి ఇరగ్గొట్టి కరిగించేసి, అన్నిటా తానై, అన్నీ తానై వొంటిచేత్తో రెడ్డి నడిపించాడు. 2009 ఎన్నికల్లో కూడా అదే పున్రావృతం అయ్యింది. రెడ్డితప్ప మరే గొంతుకా కనీసం వినపళ్ళేదు. చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయ్. ఇంకోవైపు రెసిషన్. ఇలాంటి పరీస్థితుల్లో ఇలా జరగటం పెనుతుపానులో చుక్కాణి లేని నావలా అయ్యింది.
ఏమైనా - రెడ్డి ఆత్మ శాంతి పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం.
[ప్రతీ ప్రాజెక్టుకీ, ప్రతీ రోడ్డుకీ ప్రతీ పెన్నుకీ కలానికీ కాయితకానికీ రాజీవ్ అనే పేరుపెట్టిన రెడ్డి, పాపం రాజీవ్లా అర్ధాంతరంగా, రాజీవ్లా గుర్తుపట్టాలేనట్టుగా శరీరాన్ని విడవటం కేవలం యాధృచ్చికం]

Sep 2, 2009
వై.యస్.ఆర్ మిస్సింగ్, ఆతర్వాత ఏంటీ?
రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.యస్.రాజశెఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ చిత్తూరు వెళ్తూ మార్గమధ్యంలో గల్లంతయ్యింది. నల్లమల అడవుల మీదుగా వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
లేట్ చేసారు వార్త బయటికి రాకుండా, వాతావరణం అనుకూలంగా లేదు, ఒక వేళ నక్సలైట్లకి చిక్కి ఉండవచ్చు, లేక హెలీకాప్టర్ ఘోరప్రమాదానికి దారితీసి ఉండవచ్చు(శుభం పలుకుదాం, ఆయన ఏ ఆపదా కలుగకుండా బయటపడాలని కోరుకుందాం) బ్లా బ్లా బ్లా.
ఐతే, తర్వాత ఏంటీ?
ఒకవేళ అనుకోని ఘోరమే జరిగితే - తర్వాతి పరిణామాలు ఏంటీ?
తె.దె.పా సంస్థల మీద దాడులు జరగవచ్చు.
ఆర్టీసీ బస్సులు తత్క్షణమే డిపోల్లో నిలిపివేయటం మంచిది.
మత సంస్థలమీద కూడా దాడులు జరగవచ్చేమో.
ఈ సారి రంగా/రామారావ్/ లాంటి వాళ్ళు పోయినప్పడు జరిగిన దానికన్నా ఎక్కువ లూటిలు జరిగే ప్రమాదం ఉంది.
కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.

తాజా వార్తల స్రవంతి,
ప్రత్యక్ష బ్లాగింగు,
రాజకీయం
Subscribe to:
Posts (Atom)