Sep 26, 2008

అంతిరించిపోతున్న కొన్ని ఆటలు

ఒకానొక కాలంలో ఆడపిల్లలూ ఈడపిల్లలు, అంటే అబ్బాయిలూ ఈ ఆటలాడేవాళ్ళు:
బిళ్ళంగోడు/గూటి బిళ్ళ
కబడ్డి
ఖోఖో
బాడ్మెంటెన్
వాలీబాల్
అంజనం
పెద్ద అంజనం
అష్టా చెమ్మ
గిల్లాలు
వంగుళ్ళు దూకుళ్ళు
బెచ్చాలు
ఓకులు
గోలీలు
కోతికొమ్మచ్చి
నాలుగు స్థంభాలాట
ఉడుం
వీధీ వీధీ గుమ్మడిపండు
కాళ్ళాగజ్జాకంకాళమ్మ
పుల్లాట
పులి మేక
రాముడు సీత
దీనిపేరు నాకు తెలియదు. ఒకడు చేతులు పైకెత్తి ఒక కర్రని రెండుచేతుల్తో పట్టుకుంటాడు. దాన్ని ఇంకొకడు ఇంకో కర్రతో తియ్యాలి.
గుడుగుడు గుంజం
అందరూ గుండ్రంగా కూర్చుని ఉంటే ఒకడు వాళ్ళ వెనక పరిగెత్తుతూ ఖర్చీఫ్ వేస్తాడు. అదేదో ఆట.
నేల బండా
ఏడుపెంకులాట

ఇప్పుడు ఒకటే ఆట - క్రికెట్టు. లేకపోతే కంప్యూటరు ఆటలు.
పైన పేర్కొన్న ఆటలన్ని కనుమఱుగైపోతున్నాయి..
కొత్త నీరొచ్చి పాతనీరుని ఆక్రమించేస్తుంది, సృష్టి సహజం. కాని ఆ పాతవాటి విలువ కొత్తతరానికి తెలిపేదెలా?

22 comments:

  1. chala atalu gurthu chesaru....
    ippudu adalanna adalemu...busy lifes kada

    ReplyDelete
  2. గిల్లాలు అనే మాట విని ఒక శతాబ్దమైనట్టుంది!చాలా మందికి వీటిని అచ్చంగాయలు అని చెప్తే గాని అర్థం కాదు.

    మీరు చెప్పిన ఆటల్లో మేము 1,2,3,5,7,9,10,13,19,ఆటలు ఆడేవాళ్ళం. ఇందుకో కొన్ని ఆటల్లో మనం మరీ వీర ఫేమస్సు!

    ReplyDelete
  3. కొత్త తరానికి తెలపాలంటే మన బ్లాగరులందరూ కలిసి ఉద్యానవనానికి చేరి అక్కడ ఉన్న కొద్ది మంది పిల్లలను కూడా కలుపుకొని మనమే ఆడితే సరిపోతుంది. ఈమధ్య ఒకసారి నేను, నా స్నేహితులు కొద్ది మంది కలిసి ఉద్యనవనానికి వెళ్ళి ఇలాగే చేసాం. అక్కడ ఉన్న పిల్లలందరూ మిగతా ఆటలు మానేసి మాతో కలిసిపోయారు. నిజానికి పిల్లలే కాదు పెద్దలు కూడా మాతో కలిసిపోయారు. అక్కడ 5 సం|| నుండి 60 సం|| ల వయస్సున్న వాళ్ళు కూడా వయోబేధం లేకుండా మాతో కలిసి ఆడారు. అక్కడ మేము ఆడింది మీరు చెప్పిన వాటిలో 3 ఆటలు మాత్రమే.
    అవి 1. అందరూ గుండ్రంగా కూర్చుని ఉంటే ఒకడు వాళ్ళ వెనక పరిగెత్తుతూ ఖర్చీఫ్ వేసే ఆట
    2. పులి మేక
    3. అక్కడ వున్న వాళ్ళని కొన్ని జట్లు గా విభజించి, అన్ని జట్లకూ కలిపి ఒక నాయకుడిని నియమించి, ఆ నాయకుడు ఏది అడిగితే అది తెచ్చే ఆట అన్నమాట. ఏ జట్టు ముందు తెస్తుందో ఆ జట్టుకు పాయింట్లు. చివరగా ఎక్కువ పాయింట్లు వున్న జట్టు విజేతన్నమాట. దీనినే ఆంగ్లములో 'Queen of Sheeba' అంటారనుకుంటా.

    నిజం చెప్పొద్దూ. అంతమందితో కలిసి ఆ ఆటలు ఆడుతుంటే వచ్చే ఆనందం క్రికెట్లో ఆరు బంతులకు ఆరు "ఆర్లు" కొట్టినా రాదు.

    ఒకవేళ మీకిది కష్టమనిపిస్తే ఎలాగూ వుందిగా "జావా". అన్నిటినీ "వీడెయో గేము" లు చేసేస్తే సరి.

    ReplyDelete
  4. @శ్రెయస్:
    మీది గుంటూరా?
    :( బిజీలైఫ్...TrU. But I spend a lot of time with my 3yr old son to play with him.
    @సుజాత గారు: గోలీలు కూడా ఆడేవాళ్ళా...:):)
    మాకు ఆటాలంటే ఇవే. నాకు క్రికెట్ అన్నేది ఒక ఆట అని పదోతరగతిలో తెల్సింది.
    @నాగప్రసాద్ గారు: నిజమే. విదేశాలల్లో మనోళ్ళు ఎక్కువమంది ఉన్నదెగ్గర మీరన్నట్టు వీలవుతుందేమో కాని, అన్నీ వేళలా వీలుపడకపోవొచ్చు. కాని చాలా బాగా చెప్పారు.
    ఇంకో భయానక నిజం ఏంటంటే ఈ రోజున రియల్ భూతం యొక్క మాయాజాలం వల్ల పార్కు అనే మాటేడిక్షనరీలోంచి తొలగించేసారు దాదాపు.
    రోడ్డు మీద వచ్చే పోయే ట్రాఫిక్కు, ఇంట్లో స్థలం లేదు. అపార్టుమెంట్లు, రద్దీ, రణగొణధ్వని. ఎంత అమెరికా ని తిట్టుకున్నా ఇక్కడ కాస్త పార్కులు, ఇంట్లో వెనక కాస్త లాన్ అవి ఇవి వసతులు, మిస్సింగు ఏంటంటే "మన".

    మీ వ్యాఖ్యలకి నా థాంక్స్..

    ReplyDelete
  5. మరికొన్ని ఆటలు

    1. పలక మీద సినిమా పేరు పూర్తిగా రాయకుండా ఖాళీలు వదిలి వాటిని పూర్తి చేయడం. ( రా _ _ _ _ _డ _ _ . దీన్ని పూరిస్తే రాముడే రావణుడైతే అన్నమాట)
    2. ఏడుపెంకులాట లాగానే, పిచ్చిబంతి. దొరికినోణ్ణి దొరికినట్టు బంతి తో కొట్టడం. ఇంకొకటి కూడా ఉండెది , దాన్ని "కింగ్" అనో ఎదో అంటారు రూల్స్ గుర్తు లేవు.
    3. కేరం బోర్డు. ( ఇప్పుడూ ఉందనుకోండి ఇది, వేసవిలొ మమ్మల్ని ఎండలో ఆడుకోనీకుండా ఇంటిపట్టున ఉండటానికి మా నాన్న వేసిన most successful ప్లాన్)
    4. ఇంకొక ఆట. పేరు ఖూనీ చెస్తున్ననేమో, సుబ్జా - విండో అని. కళ్ళుమూసుకొని యాభై లెక్కపెట్టే లోపు మిగతా అందరూ దాక్కొవాలి . లెక్కపెట్టినోడు వాళ్ళని కనుక్కొవాలి. కరెంటు పోగానే పొలో మంటూ అందరం పిల్లలం వీధిలో గుమిగూడే వాళ్ళం. కరెంటు పొయినప్పుడు ఈ ఆట మజాయే వేరు. మనిషి కనపడ్డా ఆ చిమ్మ చీకటి లో గుర్తు పట్టడం కష్టం. ( మీరన్న పులి-మేక ఇదేనా?)

    మీ టపా బాల్యాన్ని మళ్ళా గుర్తుచేసిందండి. థేంక్యు

    ReplyDelete
    Replies
    1. సర్ మీరన్న 4వ ఆటని దోంగ పోళిసు గా ఆడాము.

      Delete
  6. భలే గుర్తు చేసారు భాస్కర్.

    ReplyDelete
  7. భాస్కర్ గారు, నిజంగానే గోలీలు ఆడేదాన్ని తెలుసా! అన్నయ్య, అన్నయ్య స్నేహితులతో కలిసి మరియు ఇంటిదగ్గర పిల్లలతో కలిసి! మా ఇంట్లో ఆచారాలు ఎక్కువే గానీ ఇటువంటి వాటిల్లో ఆంక్షలు ఏమీ ఉండేవి కావు. నేలా బండా మిట్ట మధ్యాన్నాలు గానీ వెన్నెల రాత్రులు గానీ ఆడాలి.

    చిన్నప్పుడు బెచ్చాలు, గోలీలకు టోర్నమెంట్స్ ఉంటే బాగుండని కోరుకునే వాళ్ళం! స్కూల్లో వాలీ బాల్, కాలేజీలో కారెంస్ ఆడేవాళ్ళం, టోర్నమెంట్స్ కి కూడా!

    క్రికెట్ చూస్తాను, కానీ మధ్య మధ్యలో అనవసరంగా నవ్వొస్తుంది(ఇదొక ఆటా? అని)

    దసరాకి మా వూరెళుతున్నా! నాతో గోలీ కాయలాడిన మగ పిల్లకాయలందరూ(ఇప్పుడు వాళ్ళక్కూడా పిల్ల కాయలుండి ఉంటారు) ఏం చేస్తున్నారో చూడాలి.(ఆడితే బాగోదింక

    ReplyDelete
  8. బలే గుర్తుచేసారు.ఇప్పుడు పల్లెల్లో పిల్లలు కూడా ఈఆటలేవీ అడటం లేదు.
    ఇంకో అటుంది "వెన్నెల పూవుల గిలగిచ్చ" అని వెన్నెల్లో అడుకోవాలి. పరిగెట్టేవాల్ల నీడ దొంగ థొక్కలి.
    ఇంకా ఒక కాలితో కుంటుతూ అందరిని ముటుకోవాలి అది కుంటాటా .
    చింతపిక్కలతో ఇతే లెక్కలేనన్ని ఆటలు. ఇవన్ని కుడా పైసా ఖర్చు లేని ఆటలు .
    సుజాత గారిలగే నేనుకుడా మగపిల్లలితో గోలిలు గుటిబిల్ల ఆడేదాన్ని. అప్పుడు అందరు నన్ను రౌడీ రంగమ్మ అనేవాళ్ళు.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. లలిత గారు,
    భలే గుర్తు చేసారు మంచి మంచి ఆటలు. వెన్నెల్లో కుంటాట(మేము కుందుళ్ళాట అంటాము) భలేగా ఉంటుంది కదూ!

    అలాగే రాముడు-సీత ఆట లో రాముడు స్లిప్పు నాకొస్తే సీతను కనుక్కోవడం లో ఎప్పుడూ ఫస్టే! 1000 పాయింట్లూ నాకే!

    ReplyDelete
  11. సుంకోజి దేవేంద్ర ని యువ కథా రచయిత, పట్నంలో పెరుగుతున్న తన కూతురికి తను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో మన మంచి ఆటలు అని ఒక చిన్న పుస్తకం రాశాడు. విశాలాంద్హ్ర వాళ్ళు ప్రచురించారు. తిరపతి చిత్తూరు మాండలికంలో ఉంటుంది. ఇతర ప్రాంతాల వాళ్ళకి ముందు కొంచెం కష్టంగా అనిపించొచ్చు గానీ, ఆ మాత్రం కష్టపడితే కొన్ని భలే భలే ఆటలు పరిచయ మవుతాయి.

    ReplyDelete
  12. పిచ్చి బంతిలో అస్సలు రూల్సు ఉండేవి కాదు. బంతి దొరికినవాడూ దొరికినట్టు ఇంకోడీ వీపు చిట్లేంత గట్టిగా గురి పెట్టి విసరడమే. మేం ఆడే చోట అటూ ఇటూ మురిక్ఖాలవలో ఉండి, బంతి తరచూ దాంట్లో పడుతూ ఉండేది. తత్ఫలితంగా తెల్ల చొక్కాలమీద నల్ల ముద్దర్లు తేలేవి. అంచేత దీన్ని మేం ముద్దుగా ముద్దర బాల్ అని పిల్చుకునే వాళ్ళం.
    కింగ్ లో ఒకడు కింగ్ ఉంటాడు (వీడు ఇతర ఆటల్లో దొంగ లాంటి వాడు.) బాల్ విసిరి వీపు మీద కొట్టడం ద్వారా మిగతా వారందర్నీ ఔట్ చెయ్యాలి. మోకాలి కింద కొట్ట కోడదు అని ఏదో రూల్సు ఉంటాయి. అలాగే తప్పించుకునే వాళ్ళు కూడా బాల్ ని ముట్టుకో కూడదు.
    మొన్నీమధ్య ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తే అక్కడ రెండాటలు ఆడించారు. కొందరు ఒక పేద్ద వృత్తంగా నించుంటే మిగతా వాళ్ళంతా మధ్యలో ఉంటారు. వాలీబాల్ని విసిరి లోపల ఉన్నవాళ్ళ మోకాలి కింద మాత్రమే తగిలేలా చేసి వాళ్ళని ఔట్ చెయ్యాలి. లోపల ఉన్నవారి సంఖ్య తగ్గిన కొద్దీ ఉత్సుకత భలే పెరుగుతుంది.
    రెండోది, అందరూ గుంపుగా ఒక వృత్తంలో ఉండాలి. వాలీబాల్ని పైకి విసిరేస్తారు. ఇక ఆ బాల్ కింద పడకుండా వంద దెబ్బల దాకా గాలిలో ఉండేట్టు కొడుతూ ఉండాలి.

    ReplyDelete
  13. @ఉమాశంకర్ గారు: థాంక్సులు
    @వేణు: :) నాగులేర్లో ఎప్పుడైనా ఈతకొట్టావా?
    @సుజాత గారు: వెన్నెల్లో నాలుగుస్థంభాలాట కూడా బానే ఉంటుంది. మేము వెన్నెల్లో ఎక్కువ ఉడుం ఆడేవాళ్ళం. ఉడుం = ఐ స్పై
    @లలితాజీ మీకుకూడా. కుందుళ్ళాట అదిరిపోయ్యేది. జణాలుఎక్కువుంటే కుదలేక సచ్చే వాళ్ళాం.
    @కొత్తపాళీ అన్నగారు: ఈసారి దేశంవెళ్ళినప్పుడు ఇత్తాంటి పుస్తకాలు, జనాలనోటనుంచి కొన్ని సేకరించాలి.
    పిచ్చి బంతిని పిచ్చి పిచ్చి గా ఆడేవాళ్ళం. ఈపులు మంటెక్కి కోవాల. అది కధ :):)

    అన్నిటికన్న ఇంటరెష్టింగు ఆట, గోల గోల ఆటా - ఏడుపెంకులాట. దానిమజానే వేరు. దానికీ పెద్ద పెట్టుబడి అవసరంలేదు. ఒక బంతి, 7 పెంకులు. ఎంతమందైనా ఆడొచ్చు. ఈసారి ఇక్కడి మన పిల్లలకి దీన్ని ఎక్కించాలి. మన పిల్లలు "నింటిండో" మాయలో పడిపోతున్నారు.
    ఐసు పుల్లల్తో పుల్లాట ఆడేవాళ్ళం. చాలా తెలివితో ఆడాలి అది. ఒక్కో ఆట గురించి నా బ్లాగులో పెడతా, మీ అందరి సహాయ సహకారాలతో...

    ఈ ఆటలు మన తెలివితేటల్ని పెంచేవిగా కూడా ఉండేవి. ఫిజికల్ యాక్టివిటీతోపాటు బుద్ధిని కూడా పెంచుతాయి ఇవి. మరి ఇప్పటిపిల్లలు ఇవి దేనికి ఆడటంలేదు? మనమే వీళ్ళకి వీటిని దూరం చేస్తున్నామా?

    ReplyDelete
  14. చిన్నప్పటి ఆటలను గుర్తు చేసారు ధన్యవాదాలు. మేము ఇంకా చాలానే ఆడే వాళ్ళం, బండ-నేల, కలర్ కలర్ వాట్ కలర్, జంటలాట, నాలుగురాళ్ళాట, వర్షాకాలంలో ఇనుప రాడ్ నెలకు కొట్టుకుంటూ వెళ్ళే ఆట, దాగుడుమాతలు, వీరీవీరీ గుమ్మడిపండు, అవుట్ చేయడం అని పరిగెడుతుంటే తాకే ఆట, రెండు జట్లు ఎదురెదురుగా కూర్చుంటారు, ఒక్కొక్కరికి ఒక నంబర్ ఉంటుంది,ఒక నెంబర్ పిలిస్తే రెండు జట్లలో ఉన్న ఆ నెంబర్ వాళ్ళు పరిగెత్తుకొచ్చి మధ్యలో ఉన్న కర్చీఫ్ ను ఎవరు తీసుకెళితే (అవతలి వారు తీసుకెళ్ళే వారిని తాకకుండా ఉంటే ) వారు గెలిచినట్టు, ఇంకా ఖోఖో, కబడ్డి గురించి చెప్పనవసరం లేదు. కొత్తపాళిగారు చెప్పిన వాలీబాల్ ఆట కూడా చాలా ఆడేవాళ్ళం.

    ReplyDelete
  15. భాస్కర్ గారు, ఒక్కొక్కరి బాల్యాలను తట్టి లేపేశారు పొండి!
    పిచ్చి బంతిలో తగిలిన దెబ్బకి కాలర్ బోన్ విరిగి(hair line fracture) డాక్టరు దర్శనం కూడా చేసుకున్నాను నేను. పిచ్చి బంతి రోజూ ఏడుపుల్తోనే ముగిసేది. ఆడపిల్లలనే chivalry లేకుండా చావగొట్టేసేవాళ్ళు వెధవలు! తల్చుకుంటే వీపు ఇప్పుడు మండి పోతుంది.

    ReplyDelete
  16. పిచ్చి బంతినే మా వూర్లో "వీపు చట్నీ" అనే వారు. సార్ధక నామం కదా!

    నేను ఈ టపా లో చెప్పిన అన్ని ఆటలు ఆడేసాను. అంజనం, పెద్ద అంజనం తప్ప. ఇవి ఎలా ఆడతారో తెలియదు. ఎవరైనా తెలిస్తే చెప్పండి.

    ReplyDelete
  17. ఇంకా "అప్పడప్పడ తాండ్ర" వదిలేసాలు గా మాస్టాలు
    అమ్మో మల్లి "ల" వచ్చేస్తుంది
    ఇంకా అందరూ కూర్చుంటే వెనకాల కర్చీఫ్ వేస్తారే ఆ ఆట పేరు
    "మా తాత ఉత్తరం" లేకుంటే "చాకిరేవు"
    ఇంకా జంటలాట ,కరెంటు -కూలింగ్(బొమ్మ- ప్రాణం ),దొంగ పోలీస్ ,తల్లి పిల్ల ,తొక్కుడు బిళ్ళ
    బోల్డన్ని ఆటలు వున్నాయి నేను అన్ని ఆడుకున్నా ఇంకా ఆడుకుంటున్నా
    హా అమ్మాయిలకి ఇష్టమయిన ఇంకో ఆటా వదిలేసా ఒప్పులకుప్ప వయ్యాలి భామా ;)

    ReplyDelete
  18. హా ఇంకా కొన్ని ఆటలు మలచి పోయా అందుకే మల్లి రాత్త్తున్న
    "ముక్కు గిల్లి పారి పో "
    ఈ ఆటలో రెండు జట్లు వుంటాయి
    ఒకళ్ళు పువ్వుల పేర్లు
    ఒకళ్ళు కాయల పేర్లు పెట్టుకుంటారు

    ఒక జట్టు లీడ్ వచ్చి రెండో జట్టులో ఒక మెంబెర్ కళ్లు మూసి వల్ల టీం మెంబెర్ ని పిలుస్తాడు
    ఎలా అంటే " చామంతి వచ్చి ముక్కు గిల్లి పారిపో "
    ఆ తర్వాత కళ్లు తెరిచేస్తారు అప్పుడు ఆ చామంతి ఎవరో కనుక్కోవాలి
    కనుక్కుంటే వాళ్ళు ఔట్ లేకుంటే వీళ్ళు ఔట్ కాని ముక్కు భలే గట్టిగా గిల్లుతారు"

    ఇంకోతేమో సబ్జా ఇన్ డోర్ ఇది కూడా బాగుంటుంది
    భలే భలే ఆటలు కదూ

    ReplyDelete
  19. బెచ్చాలు, వొంగుళ్ళు దూకుళ్ళు, చెమ్మ చెక్క, చింతపిక్కలాట, వామన గుంటలు ఇలా చాల ఆదేవాడిని. మల్లి అవన్నీ గుర్తుకోచ్చాయి.. అందరికీ న కృతజ్ఞ్యతలు.. మనకూడా ఈ అన్ని ఆటల్లో చిమ్పెసేవాళ్ళం

    ReplyDelete
  20. "చిన్న నాటి ఆటలు - జ్ఞాపకాల మూటలు" అనే పుస్తకము, 100 ఆటలతో ప్రచురించాము. చూశారా?
    ప్రతి ఆటకూ పూర్తి పేజ్ బొమ్మ, ఆ ఆట మూలంగా వచ్చే జీవన నైపుణ్యాలు ఆ పుస్తకములో పొందు పరిచాము.
    మన తెలుగు వారి ఆటలను ప్రపంచములో అందరికీ చెప్పాలనే ఉద్దేశముతో, ఆ పుస్తకము ప్రస్తుతము ఇంగ్లీష్ లోకి అనువాదము చేస్తున్నాము.

    http://bit.ly/20FxrpX

    ReplyDelete
    Replies
    1. ఈ పుస్తకము యిప్పుడు English లో కూడా దొరుకుతుంది. "Let's Play"

      Delete