May 1, 2020

ఈనాడు పేపర్ - ఇక లైఫ్ టైం బ్యాన్


ఈనాడు చదవటం మానేశాను. అప్పుడప్పుడూ చూస్తుంటాను. కొన్ని కారణాలున్నాయి. ఒక వార్త సాక్షిలో ఎలా రాస్తాడు అదే వార్తని ఈనాడు ఎలా రాస్తాడు అని ఒక కోణం.
అనేక సందర్భాలల్లో రెండూ ఆపోజిట్ గారాస్తాయి. అంతకన్నా నేనేం ఆశించటం లేదు కూడా.
ఈనాడు తెదేపా భజన, చంద్రబాబుని నెత్తిన మొయ్యటం కూడా ఓ పెద్ద విషయం కాదు.
కానీ అప్పుడప్పుడూ శృతి మించి రాగాన పడుతుంటుంది పల్లకీ మోత.
అసహ్యం కలుగు తుంటుంది. అసహనానికి గురిచేస్తుంటుంది.

జర్నలిజం విలువలు అని దంచికొడతారు వేదికల మీద. ఇంటికెళ్ళి పల్లకీల మోత సేవ చేస్తుంటారు.

ఋషికపూర్ కాలం చేశాడు.
ఎవరెవరు సంతాపం తెలియజేశారో ఈనాడు లిస్ట్ వేశాడు
మొదట - ప్రధాని నరేంద్ర మోడి అన్నాడు.
రెండోది - తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నాడు

ఆ విండోని క్లోజ్ చేశాను.
ఈనాడుని నేను ఎందుకు చదవాలీ? జవాబు దొరకలేదు.

23 comments:

  1. మంచి పనండి....దగ్గరగా అరవై ఏళ్ళకితం అంటించుకున్న పేపర్ చదివే అలవాటు, నలభై ఏళ్ళుగా ఈనాడు చదివే దురలవాటు వదిలించుకున్నా. అమ్మయ్య పీడా వదిలింది.

    ReplyDelete
  2. బాబు ఉవాచ. బాబు ఇలా చెప్పారు. బాబు అలా చేశారు. బాబు బంగారం. బాబు అంగారం. బాబు చెప్పిందే వేదం. బాబు భజనే మాకు మోదం. బాబు లేకుంటే ఖేదం. బాబు పేరు భజ భజ. బాబు నామం జప జప.

    ఇదీ పాతకరత్న చిడతం భొట్లు పచ్చ మీడియాకు నిత్య కృత్యం.

    Someone coined the word presstitutes.

    ReplyDelete
  3. ఈనాడు పేపరోడు ఈ-నాయుడు అని పేరు మార్చుకుంటే సరిపోద్ది!

    ReplyDelete
  4. ఈనాడుని చదవటం మానేసారు. మరి ఆ రెండవ పత్రిక సాక్షిని చదవటం మానలేదు. అది మీ దృక్కోణంలో నిష్పాక్షికంగా వ్రాస్తున్నదిగా అంచనా అన్నమాట. విశ్వనాథ వారు ఎప్పుడో చెప్పారు. అందరూ అక్షరాలు నేర్చుకున్నా అంతా చదువరులు కారని. చదివే వాళ్ళు ఆ వ్రాస్తున్న వాడి భావాలు తమకు నచ్చుబాటుగా ఉన్నాయా లేవా అని అంచనా వేసేందుకే చదువుతున్నారని ఆయన చెప్పారు. అక్షర సత్యం.

    ReplyDelete
    Replies
    1. నేను ఈనాడు చదవకపోవటాన్నో లేక సాక్షి పత్రికని చదవటాన్నో తప్పు పట్టాల్సిన పనిలేదండి. అలా తప్పు పట్టటం - విషయాన్ని దారి మళ్ళించటం. నా వ్యసనం నాది. నాకో పేపర్ కావాలి.
      సాక్షి ఉదయం లాంటి పేపర్లు ఎందుకు ఉద్భవించాయీ? ఈనాడు వార్తలకి వ్యతిరేకిస్తూ వచ్చే ఏ పత్రికనైన నేను ఆహ్వానిస్తాను అని చెప్పటానికి ఏమాత్రమూ సందేహం లేదు.

      నేను ఈనాడుకి వ్యతిరేకిని.
      నేను బాబుకి వ్యతిరేకిని.

      Delete
    2. ఒక్క హిందీ సినిమా కూడా చూసి ఉండని, పొరబాటున చూసినా అందులో ఒక్క మాట కూడా అర్ధం చేసుకోలేనోడు ప్రముఖ హిందీ నటుడు చనిపోతే ప్రకటన ఇవ్వడం ఎంత ప్రధాన వార్త!

      You are missing good comedy.

      Delete
    3. మీరు చిరంజీవి గారి గురించి ఇలా అనటం భావ్యం కాదు జై గారూ. నాకూ హిందీ మాట్లాడటం రాదు. ఐనా నేనే బోలెడన్ని హిందీ సినీమాలు హాయిగా చూసాను, చూస్తున్నాను. సినీరంగంలో దశాబ్దులుగా ఉన్న వ్యక్తి గురించి మీరు అలా ఎలా అనగలరు? వ్యంగ్యాన్ని కీ హద్దుంటుందండీ.

      Delete
    4. జై గారు,
      పైన మీ కామెంట్లోనే బోల్డంత “comedy” ఉన్నదిగా. లేకపోతే ఏమిటండీ, హిందీ రాని (మీ అభిప్రాయంలో) చంద్రబాబు నాయుడు గారు ఒక హిందీనటుడి మరణం పట్ల ప్రకటన ఇవ్వడం మీకు హాస్యాస్పదంగా తోచిందా? మీ వెటకారం మరీ ఎక్కువవలా?

      మీ భావం ... హిందీ రాని వాళ్ళు హిందీ ప్రముఖుల మరణం గురించి కూడా మాట్లాడకూడదు అనా? మీ లాజిక్కే గనక పొడిగిస్తే ... “ఒక్క” క్రికెట్ మ్యాచ్ “కూడా” చూడనివారు ఎవరైనా క్రికెట్ ప్రముఖుడు మరణిస్తే సంతాపం ప్రకటించకూడదన్నమాట? లేదా టెన్నిస్, లేదా బాడ్మింటన్, లేదా మరో క్రీడ. “ఒక్క” డాన్స్ ప్రదర్శన “కూడా” ఏనాడూ చూడనివారు నృత్యకళాకారుల మరణం గురించి మాట్లాడ కూడదన్నమాట? బాగుందండీ బాగుంది.

      మీకు తెలియదేమో, హిందీ సినిమాలను ఆంధ్ర రాష్ట్రంలో బాగానే ఆదరిస్తారు. కాబట్టి హిందీ సినిమాల గురించి మాట్లాడే హక్కు ఆంధ్రేతరులకు మాత్రమే ఉందని మీరు నమ్ముతుంటే .. అది మీ అమాయకత్వం.

      అయినా చంద్రబాబు గారు ఏనాడూ హిందీ సినిమాలు చూడలేదని, వారికి హిందీ భాష అర్ఖం అవదనీ మీరెలా నిశ్చయించేశారు? మీరెప్పుడన్నా వారితో హిందీలో మాట్లాడడానికి స్వయంగా ప్రయత్నించారా? వారితో కలిసి సినిమాలు చూస్తూ సన్నిహితంగా మెలిగారా? ఏమో, హైదరాబాదు వచ్చిన తర్వాత నేర్చుకున్నారేమో, మీకేం తెలుసు?

      అయ్యా, మీకు నచ్చినా నచ్చకపోయినా / ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు గారు ఒక సీనియర్ నాయకుడు. ఏ రంగంలోని ప్రముఖులు మరణించినా సంతాప ప్రకటన చెయ్యడం నాయకులకు విధాయకమే, అందులో అంత బుగ్గలు నొక్కుకోవాల్సినది ఏమీ లేదు.

      చంద్రబాబు గారు అంటే మీకెంత ద్వేషమైనప్పటికీ పైన మీరు చేసిన కామెంట్ carrying it too far అనాలి.

      (నేను “పచ్చ” కులానికి చెందినవాడను కాను. మీ కామెంటే హాస్యాస్పదంగా ఉందని తెలియజేయడమే నా ఈ స్పందన యొక్క ఉద్దేశం)

      Delete
    5. శ్యామలీయం మాస్టారూ, చిరంజీవి (చెర్రీ కూడా) హిందీలో కూడా చేసారు.
      వారికి అమితాబ్ గారితో సైతం మంచి స్నేహం ఉండడమూ తెలిసిందే. ఆయన్ను నేనేమీ అనలేదు.

      విన్నకోట వారూ, ఆంధ్రోళ్లకు హిందీ రాదని నేను అనలేదు. తమకు హిందీ రాదని చెప్పుకోవడం ఫ్యాషన్ హైదరాబాదులో ఉండే ఆంధ్రులకు ఉన్నంతగా అక్కడే ఉండిపోయిన వారికి లేదు.

      చంద్రబాబుకు హిందీ రాదన్నది జగత్విదిత సత్యం. ఎన్నికల ప్రచారంలో బుల్బుల్ విగ్గు బాబు ప్రయత్నించి బోల్తా కొట్టినా పెద్దాయన కనీసం ప్రయత్నించనూ లేదు. నాంపల్లి రోడ్డు షోలో "ఉర్దూమే బోలో" నినాదాలు మార్మోగినా బెల్లం కొట్టిన రాయొలె ఉన్నాడు తప్ప "మిత్రో" అనడానికి నోరు పెగల్లేదు.

      ఈ-నాయుడు పేపరోడికి మోడీ అర్పించిన నివాళితోపాటు అంతే ప్రాముఖ్యంగా చంద్రాలు సారు కోటు ఇవ్వడం జోకులా అనిపించడం లేదంటే మీ ఇష్టం. జగన్ గారితో మీకు & రామోజీ తాతకు ఎంత ద్వేషమున్నా, ప్రధాని తరువాతి పేరు ఆయనదే రావాలి.

      (మీరు ఏ కులమో కానీ రామోజీ తాత మాత్రం అసమదీయుడే. అందుకే ఈ పల్లకీ మోత)

      Delete
    6. పచ్చ బృందానికి ఇంకా బాబు ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారు కాబట్టి అతని స్పందన ముందుగా ఇవ్వాలి అంతే. కోడెల జయంతి అని పచ్చ బృందాలు చేసిన వైనం చూస్తే ఎన్ఠీఆర్ ఆత్మా లాగా కోడెల ఆత్మా కూడా క్షోభించి ఉంటుంది అనిపిస్తుంది.

      Delete
    7. పచ్చకామెర్ల యెల్లో ఫీవర్ బాచీ కళ్ళకి డ్రామా రావు లేదా నారా బాబు ఇద్దరూ ఎవర్గ్రీన్. ఎంత జనం ఛీకొట్టినా పచ్చకల్లజోడు ఇపితే కదా భక్తజనానికి నిజం తెలిసేది. ఫర్నిచర్ దొంగ అత్తానులో ముక్కే.

      Delete
    8. వెన్నుపోటు పొడిచి చంపేసి ఆనక జయంతులు వర్ధంతులు చేస్తారు ఏమి బతుకులు మీవి థూ.

      Delete
  5. కులగజ్జి పత్రిక అంటే ఈనాడే

    ReplyDelete
  6. మీడియా అంటే అసహ్యం కలిగేలా చేసిన చేస్తున్న అంధ కోతి , ఈ నాయుడు రెండు దుష్ట గ్రహాలు, వాటికి తోడుగా ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం మీడియాను కలుషితం చేశాయి.

    ReplyDelete
  7. చంద్రాలు సారుకు బెంగుళూరు హైదరాబాదు తేడా తెలువదు పాపం!

    "This is how Dr. Vijaysree was welcomed when she came back home after serving Covid patients for 2 weeks at Bengaluru and not Hyderabad as I had *incorrectly tweeted* earlier"

    https://twitter.com/ncbn/status/1256557839780204548

    ఇసొంటివి మొదటిసారి కాదు. అప్పుడెప్పుడో ఇంకెక్కడో జరిగిన గొడవల పిక్చర్లు ట్విట్టరులో పెట్టిన ఘనుడు ఇతడు.

    ReplyDelete
  8. ఈనాడు, హైదరాబాద్‌: కరోనాపై వ్యాక్సిన్‌ లేదా ఔషధాన్ని కనుగొనేవరకు ప్రజలు వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు

    NDTV:The time has come to re-open Delhi. We will have to be ready to live with coronavirus," declared the Chief Minister at a press conference.

    జగన్ ఇదే మాట చెబితే పచ్చ అంధ కోతులు విషం కక్కాయి. ఇప్పుడు పచ్చ డ్రైనేజీ గొట్టాలలో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

    ReplyDelete
    Replies
    1. ఎలక్కాయలు రోజుకెన్నెన్నో.. కొత్త పిట్టకథలతో, తొత్తుపలుకులతో మళ్ళీ మొదలు

      Delete
  9. రామోజీ తాతా, ఏమిటీ నిర్వాకం?

    మంచాల శ్రీనివాస రావు గారి కథనం:

    https://muchata.com/eenadu-copied-cartoons-of-others/

    ReplyDelete
    Replies
    1. తాత పేపర్లో ఒరిజినల్ తక్కువే. ఇంకో విషయం ఏమిటంటే తెలుగు తెలుగు అని గోల చేసే తాత పేపర్లో అది పెట్టిన కాన్నుంచి తెలుగు సాహిత్యానికి ఒక్క పేజీ కూడా లేదు. అదే ఇతర పత్రిక లలో వారానికి ఒక్కరోజు తెలుగు సాహిత్యం పేజీ ఉంటుంది.

      తాతా నీకు నమస్తే.

      Delete
  10. there is something called positive criticism and negative criticism.

    Positive criticism should lead to constructive thinking (thats the minimum hope)

    ReplyDelete